English | Telugu
illu illalu pillalu : తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవాడివి నీకు పెళ్ళి రోజా.. ఊరి వాళ్ళంతా వస్తారా!
Updated : Nov 14, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Ilu illalu pillalu).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -2 లొ.....వేదవతి వాళ్ళ అమ్మ వేదవతి ఫోటో చూస్తుంటుంది. అప్పుడే భద్రవతి వస్తుంది.. ఫోటో లాక్కొని రామరాజుని పెళ్లి చేసుకోవడం వళ్లే నాన్న చనిపోయాడు.. నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నానని.. నువ్వు ఇంకా ఆ మనిషిని మర్చిపోలేదా అని కోప్పడుతుంది. భద్రవతి ఇంటికి ఎదరుగానే వేదవతి ఇల్లు ఉంటుంది.
వేదవతి ప్రొద్దున నిద్ర లేచి ఇంట్లో అందరిని లేపుతు నాన్న వచ్చే టైమ్ అయింది. త్వరగా లేవండి అంటు లేపుతుంది. వేదవతి, రామరాజులకి ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్లు ఉంటారు. వేదవతి మొదటి కొడుకు రెండవ కొడుకుని లేపి త్వరగా రెడీ అవ్వమని చెప్తుంది. చిన్నోడి దగ్గరికి వెళ్లేసరికి ఇంట్లో ఉండడు.. అయన వచ్చేసరికి ఇంట్లో లేకుంటే కోప్పడుతాడని అందరు భయపడతారు. మరొక వైపు రామరాజుకి రైస్ మిల్ ఉంటుంది. పని పూర్తి చేసుకుంటాడు. త్వరగా వెళ్ళాలి పిల్లల్ని చూసి టిఫిన్ చేసి వస్తానని రామరాజు అక్కడున్న అతనితో అంటాడు. పిల్లలు పెద్ద వారయ్యారు అయిన ఇప్పటికే కూడా క్రమశిక్షణలో ఉంచుతారని అతను అంటాడు. పిల్లలు తప్పు చేస్తే తల్లి, తండ్రినే అంటారు. అందుకే తప్పు చెయ్యకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలని అంటాడు. ఆ తర్వాత రామరాజు ఇంటికి వెళ్తాడు. చిన్నోడు లేడని తెలిసి కోపంగా ఉంటాడు.
మరొకవైపు చిన్నోడు.. రామరాజు వేదవతిల ఇరవై అయిదవ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్ కి ఫ్లెక్స్ రెడీ చేయిస్తు ఉంటాడు. వస్తుంటే భద్రవతి మేనకోడలు భద్రవతి బర్త్ డే కి కేక్ తీసుకొని వస్తుంది. కావాలనే తనని బయపెట్టిస్తాడు చిన్నోడు. ఆ తర్వాత రామరాజు ఫ్లెక్సీ చూసి ముందు అది పడెయ్.. ఈ పెళ్లి రోజు ఎప్పుడు చేసుకోలేదని కోప్పడతాడు. ఫ్లెక్సీ పడేయడంతో అది ఎదురుగా భద్రవతి కేక్ కట్ చేస్తుంటే అక్కడ పడుతుంది. దాంతో వాళ్ళు గొడవకి వస్తారు. రామరాజు ముందే ప్లెక్సీ కాల్చేస్తాడు. దాంతో సేనాపతి చొక్క పట్టుకుంటాడు రామరాజు. తిన్నింటికి ద్రోహం చేసే నువ్వు మాట్లాడుతున్నావా అని సేనాపతి అనగానే.. రామరాజు వదిలి పెడుతాడు. తరువాయి భాగంలో గ్రాండ్ గా పెళ్లి రోజు చేసుకోవాలని రామరాజు నిర్ణయం తీసుకుంటాడు. ఊళ్ళో వాళ్ళు వాళ్ళింటికి ఎవరు వెళ్లొద్దని సేనాపతితో భద్రవతి చెప్తుంది. ఊళ్ళో వాళ్ళు నా మాట వింటారు వస్తారని రామరాజు ఏర్పాటు చేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.