English | Telugu

Brahmamudi : పెద్దాయన మాటతో ఇంటికి రావడానికి ఒప్పుకున్న కావ్య.. రాజ్ చెంప చెల్ళుమనిపించిన సీతారామయ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -584 లో......కావ్య ఇంటికి వస్తుంది. మీరేం చేస్తున్నారు మావయ్య గారికి విడాకులు ఇవ్వడం ఏంటని అపర్ణపై కావ్య కోప్పడుతుంది. ఏంటి దబాయిస్తున్నావ్.. ఇంట్లో నుండి వెళ్ళమంటావా ఏంటని అపర్ణ అంటుంది. మిమ్మల్ని ఏంటి నన్ను కూడా వెళ్ళమంటుందని కనకం అంటుంది. అంత నేను చూసుకుంటానని అపర్ణ అంటుంది ఆ తర్వాత నా మెడకి చుట్టుకుంటే మాత్రం నీ సంగతి చెప్తానని కనకంతో కావ్య అంటుంది.

మరొకవైపు రాజ్ తన ఫ్యామిలీ ఫొటో చూస్తూ.. మా డాడీకి మమ్మీ విడాకులు ఇవ్వడానికి వీలు లేదని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత కావ్య పూజ చేసి అపర్ణ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. అప్పుడే రాజ్ ఇంటికి కోపంగా వస్తుంటాడు. నేను చేసిన ప్లాన్ కి రాజ్ చూడు ఎలా వస్తున్నాడోనని అపర్ణ అనగానే.. ఆవేశంతో వస్తున్నడని కావ్య అంటుంది. ఎందుకు వచ్చావని రాజ్ ని అపర్ణ అడుగుతుంది. ఎందుకు వచ్చానో నీకు తెలియదా అని రాజ్ అంటాడు. ఇవి నేను కావ్యకి ఇస్తున్న విడాకుల పత్రాలు అనగానే అందరు షాక్ అవుతారు. రాజ్ కావ్య గురించి తప్పు గా మాట్లాడుతుంటే.. రాజ్ పై అపర్ణ చెయ్ చేసుకోబోతుంది. కావ్యకి రాజ్ విడాకుల పత్రాలు ఇచ్చి నిర్ణయం తీసుకోమని చెప్తాడు. అప్పుడే సీతారామయ్య, ఇందిరాదేవి ఇద్దరు వస్తారు.

రాజ్ చెంప చెల్లుమనిపిస్తాడు సీతారామయ్య. నిర్ణయం తీసుకో అంటున్నావ్ ఎందుకు. మీ అమ్మ మీ కాపురం బాగుండాలని ఇక్కడికి వచ్చింది అయినా నీలో మార్పు రాలేదు.. ఎవరు ఏమన్నా సరే కావ్య దుగ్గిరాల ఇంటికి కోడలని రాజ్ ని తిట్టి పంపిస్తాడు సీతారామయ్య. ఆ తర్వాత కావ్యని ఇంటికి రమ్మని సీతారామయ్య అడుగుతాడు. వాడు చేసిన తప్పుకి నేను నీ కాళ్ళు పట్టుకొని అడుగుతానని సీతారామయ్య అనగానే అంత పెద్ద మాట అంటున్నారు.. మీరు ఆలా అనొద్దు నేను వస్తానని కావ్య అనగానే.. అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. సీతారామయ్యకి మూర్తి కృతజ్ఞతలు చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.