English | Telugu

Vishnupriya elimination: దారుణంగా పడిపోయిన విష్ణుప్రియ ఓటింగ్.. ఈ వారం ఎలిమినేషన్ ఫిక్స్!

బిగ్ బాస్ సీజన్-8 లో పద్నాలుగో వారం అవినాష్ మినహా హౌస్ మేట్స్ అంతా నామినేషన్ లో ఉన్నారు. ఇక ఈ వారం ఓటింగ్ పోల్ లో ఎవరు ముందున్నారు.. ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారో ఓసారి చూసేద్దాం...

ఆల్రెడీ నిఖిల్, గౌతమ్, అవినాష్‌లు టాప్ 3లో ఉండగా.. ప్రేరణ, నబీల్, విష్ణు ప్రియ, రోహిణిలలో టాప్ 5కి వెళ్లడానికి ఇద్దరి మాత్రమే ఛాన్స్ ఉంది. అంటే ఈవారంలో ఒకరు.. మిడ్ వీక్‌లో మరొకరు ఎలిమినేట్ కాబోతున్నారు. కాబట్టి.. నబీల్, ప్రేరణ, విష్ణు ప్రియ, రోహిణి.. ఈ నలుగురిలో టాప్ 5కి అర్హత ఉన్న వాళ్లు ఎవరంటే.. మొన్నటి వరకూ అంటే ఫ్యామిలీ వీక్ వరకూ నబీల్ టాప్ 5కి అర్హుడు అనడం కాదు.. అతను విన్నర్ రేస్‌లోకి కూడా వచ్చాడు. గౌతమ్, నిఖిల్‌లతో పాటు నబీల్ పేరు కూడా వినిపించింది. కానీ.. ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ అయ్యిందో.. అప్పటి నుంచి నబీల్ గేమ్ దారుణంగా డ్రాప్ అయ్యింది.

అప్పటి వరకూ జెన్యూన్ అనిపించిన ఈ ఓరుగల్లు పిల్లగాడిలోని అసలు రంగు బయటపడింది. బ్యాక్ బిచ్చింగ్‌ ఎక్కువ అయిపోవడం.. కన్నడ బ్యాచ్‌కి కొమ్ముకాయడంతో పాటు.. టాస్క్‌లలో కూడా ప్రతిభ చూపించలేకపోయాడు. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. ఇక ప్రేరణ కూడా.. అప్పటి వరకూ ఆడపులిలా ఆడింది కానీ.. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్‌కి మెగా చీఫ్ అయ్యిందో.. సైకో ప్రేరణలా మారింది. ఊరికే నోరు పారేసుకోవడం.. నేను చెప్పిందే వినాలి.. పెట్టిందే తినాలి అన్నట్టుగా రూలింగ్ చేస్తూ మెగా ఛీప్‌గా అందరితోనూ ఛీ కొట్టించుకుంది.

రోహిణి ఆ విరిగిన కాలుతో శివంగిలా ఆడి గెలిచిన తీరుకి ఆడియన్స్ ఫిదా అయినట్టున్నారు. అందుకే ఓటింగ్ లో దూసుకెళ్తోంది. మొదటి మూడు స్థానాలలో నిఖిల్, గౌతమ్, నబీల్ ఉండగా నాల్లో స్థానంలో రోహిణి కొనసాగుతుంది. ఆ తర్వాత ప్రేరణ ఉండగా.. చిట్టచివరి స్థానంలో విష్ణుప్రియ ఉంది. ఈ లెక్కన ఈ వారం విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యేలా ఉంది. కానీ మన బిగ్ బాస్ మామ గురించి తెలిసిందేగా.. దత్తపుత్రిక విష్ణుప్రియని అంత ఈజీగా ఎలా వదులుకుంటాడు. విష్ణుప్రియ ఎలిమినేషన్ నుండి సేఫ్ అయితే ప్రేరణ బలి కావాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.