English | Telugu

Karthika Deepam2: కార్తిక్ కోసం ప్రేమగా వండిన దీప.. పరుగులు పెట్టించిన జ్యోత్స్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీకదీపం-2'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-223లో.. మీతో నేను గెలవలేకపోతున్నాను కార్తీక్ బాబు.. నేను ఆలోచించేది రెండు కుటుంబాలు కలవాలని. మీరు, మీ అమ్మగారు బాధపడకూడదని.. కానీ మీరు నా మాటే వినడం లేదని అని మనసులో అనుకుంటూ దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. అనసూయతో కలిసి కాంచన ప్లాన్ వేస్తుంది. దీప ఆలోచనలు వదిలేసి మామూలుగా అవ్వాలంటే వంట చేయించాలి.. కార్తీక్ ఇష్టాలు తెలుసుకునేలా చెయ్యాలని. అనుకున్నట్లే దీపను పిలిచి.. ఈరోజు కార్తీక్‌కి ఏమి ఇష్టమో అదే చెయ్.. వాడికి ఏమిష్టమో వాడినే అడిగి తెలుసుకోమని దీపకి చెప్తుంది కాంచన. దాంతో దీప కార్తీక్ గదికి వెళ్తుంది.