బిగ్ బాస్ నన్ను రూమ్‌కి పిలిచాడు అంటూ గోల చేసిన కావ్య!
బిగ్ బాస్ సీజన్-8 ముగింపుకి వచ్చేసింది. ఇక ఈ సీజన్ ముగియడానికి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం హౌస్ లో అవినాష్ , నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ప్రభాకర్-ఆమని, అర్జున్ కళ్యాణ్-అనుమిత హౌస్ లోకి రాగా వారితో కలిసి హౌస్ మేట్స్ టాస్క్ లు ఆడారు. ప్రైజ్ మనీ పెరగవచ్చు, తగ్గవచ్చు అని , ట్విస్ట్ లు టర్న్ లు ఉంటాయని వీకెండ్ లో నాగార్జున చెప్పకనే చెప్పారు. ఇక నేటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది . ఇందులో బ్రహ్మముడి కావ్య బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది.