English | Telugu

రోహిణిని కాదని విష్ణుప్రియకే ఓటు.. బిగ్ బాస్ మ్యాజిక్ అంటే ఇదే!

సీజన్-8 లో ఓట్ అప్పీల్ లో భాగంగా మొదటి రోజు ప్రేరణ అర్హత సాధించగా, రెండో కంటెస్టెంట్ నబీల్ అయ్యాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఓట్ అప్పీల్ కోసం రెండు టాస్క్ లు జరిగాయి. మొదటిది రోహిణి గెలవగా.. రెండో టాస్క్ విష్ణుప్రియ గెలిచింది.

రెండవ ఓట్ అప్పీల్ కంటెండర్ అయ్యేందుకు అవకాశాన్ని కల్పిస్తూ ఇస్తున్న ఛాలెంజ్.. నిలబెట్టు పడగొట్టు.. ఈ ఛాలెంజ్‌లో భాగంగా పోటీదారులు ప్లాట్ ఫామ్ మీద ఉడెన్ బ్లాక్స్‌ని నిలబెట్టి వాటి చివర ఓట్ అప్పీల్ చేయడానికి అర్హత లేదనుకున్న సభ్యుని ఫొటోని పెట్టి కింద ఉన్న వేస్ట్ బాక్స్‌లో పడేయాల్సి ఉంటుంది.. చివరి వరకూ వేస్ట్ బాక్స్‌లో ఫొటో పడకుండా ఉన్న సభ్యులు ఓట్ అప్పీల్ చేసుకునే రెండో సభ్యుడు అవుతారు.. రోహిణి ఇప్పటికే ఓట్ అప్పీల్ చేసుకునేందుకు కంటెండర్ కావడంతో ఆమె సంచాలక్.. అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు.

ఇక బజర్ మోగగానే ఫస్ట్ విష్ణు ఫొటో పడేశాడు అవినాష్. ఆ తర్వాత అవినాష్ ఫొటోని ప్రేరణ పడేసింది. వెంటనే గౌతమ్‌ది నిఖిల్.. ప్రేరణది నబీల్.. నిఖిల్‌ది విష్ణు.. కూడా పడేశారు. చివరిగా నబీల్ ఫొటో మిగిలింది.. దీంతో విన్నర్ నబీల్ అంటూ రోహిణి చెప్పింది. కానీ ఇక్కడ బిగ్‌బాస్ కలుగజేసుకొని అందరు రూల్స్‌తో పాటు ఆడారా అంటూ అడిగాడు. అయితే ఇందులో రూల్స్ ప్రకారం నలుగురు ఫౌల్ గేమ్ ఆడారు. దీంతో అన్నీ ఆలోచించి విష్ణు ఫొటో చివరి వరకు ఉందంటూ విన్నర్‌ ని చేసింది రోహిణి. దత్తపుత్రిక అని విష్ణుప్రియని ఎందుకు అంటారో మరోసారి ఋజువు చేస్తూ బిగ్ బాస్ ఆట మధ్యలో కలుగచేసుకున్నాడు. ఇక గేమ్ లో నేనే రైట్ ఆడా.. నేనే రూల్స్ ఫాలో అయ్యానంటూ ప్రేరణ అంది. అంతేకాకుండా నీ గేమ్ నీకు లేదా అంటూ నబీల్‌ని రెచ్చగొట్టింది. దీంతో నబీల్‌కి చిరాకొచ్చి ఎందుకు కావాలని ట్రిగ్గర్ చేస్తావ్.. నేనేం చేసినా అంటూ నబీల్ అడిగాడు. అయినా సరే ప్రేరణ ఆపకుండా అలా వాదిస్తూనే ఉంది. దీంతో నీకు దండం పెడతా ఊకో ప్రేరణ అంటూ నబీల్ అన్నాడు. అప్పుడు కూడా నీకే పెట్టుకో దండం అంటూ ప్రేరణ అంది.

మొదటి టాస్కులో గెలిచి రోహిణి, రెండో టాస్కులో గెలిచి విష్ణు ఓట్ అప్పీల్ కంటెండర్లుగా నిలిచారు. కానీ రోహిణి- విష్ణుప్రియలలో ఒకరికి మాత్రమే ఓట్ అప్పీల్ చేసే అవకాశం ఉంది.. అది ఎవరో ఇంటి సభ్యులు నిర్ణయించండి.. అర్హత లేదు అన్నవాళ్లకి బ్యాడ్జ్ ఇవ్వండి.. ఎవరికి తక్కువ బ్యాడ్జెస్ వస్తాయో వాళ్లకి ఓట్ అప్పీల్ అవకాశం.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో విష్ణుప్రియ హౌస్‌మేట్స్ అందరిని రిక్వెస్ట్ చేసింది. ఇక ఈ ఓటింగ్‌లో కేవలం అవినాష్ తప్ప మిగిలిన వాళ్లంతా విష్ణుకే సపోర్ట్ చేశారు. దీంతో విష్ణు ఓట్ అప్పీల్ చేసేందుకు సెలక్ట్ అయింది.