English | Telugu

చెఫ్ సంజయ్ రాకతో హౌస్ లో పాజిటివ్ వైబ్స్.. ఫుడ్ గొప్పతనం ఇదే!

బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం ఓట్ అప్పీల్ చేసుకునేందుకు హౌస్‌మేట్స్‌కి టాస్కులు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న టాస్కుల్లో గెలిచి ప్రేరణ ఓట్ అప్పీల్ చేసుకుంది. ఇక ఈరోజు పెట్టిన టాస్కుల్లో నబీల్ అద్భుతంగా ఆడాడు. కానీ సంచాలక్‌గా ఉన్న ప్రేరణ కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లు నబీల్ ఆటలో మిస్టేక్స్ వెతుకుతూ తప్పించే ప్రయత్నం చేసింది. కానీ నబీల్‌కి రోహిణి, అవినాష్ సపోర్ట్ చేయడంతో ప్రేరణ ఇరుక్కుంది. ఇక తాను గెలిచినా ఇన్ని లాజిక్కులు మాట్లాడిన ప్రేరణను తర్వాతి టాస్కులో తోసిపారేశాడు నబీల్.

నేటి ఎపిసోడ్‌లో హౌస్‌లోకి చెఫ్ సంజయ్ తుమ్మా ఎంట్రీ ఇచ్చారు. పలు టీవీ ఛానల్స్, యూట్యూబ్‌లో కూడా ఆయన వంట ప్రోగ్రామ్స్ చేసి ఫేమస్ అయ్యారు. ఆయన్ను చూడగానే ఆహా ఈరోజు రుచిగా తినొచ్చు అంటూ తెగ గెంతులేశారు హౌస్‌మేట్స్. మంచి ఫుడ్ మీ చేత వండించాలని ఈరోజు వచ్చేశా అంటూ సంజయ్ చెప్పాడు. ఇక హౌస్‌మేట్స్‌తో వంట చేయిస్తూ ఫుడ్ గొప్పతనం గురించి సంజయ్ చెప్పారు. ప్రపంచంలో ఏ వస్తువయినా సరే మంటల్లో వేస్తే కాలిబూడిద అయిపోతుంది.. కానీ కేవలం బంగారం, ఆహారం మాత్రమే అద్భుతంగా బయటికొస్తుంది అంటూ చెప్పారు.

మొన్నటి ఎపిసోడ్‌లో గొడవపడిన నిఖిల్-గౌతమ్ ఇద్దరిని ఫుడ్‌తో కలిపేశారు సంజయ్. వీళ్ల మధ్య మొన్న రేగిన మంటను తియ్యగా చేసేద్దామంటూ గౌతమ్-నిఖిల్ చేత ఒకరికి ఒకరు తినిపించుకునేలా చేశారు సంజయ్. ఇక ఎవరికి మటన్ అంటే ఇష్టం అనగానే అవినాష్ పైకి లేచి నల్లి బొక్క, బీరు పక్కన ఉంటే ఆహా అంటూ డైలాగ్ కొట్టాడు. ఇక తర్వాత కంటెస్టెంట్లతో మాట్లాడుతూ ఫన్నీఫన్నీగా టేస్టీ ఫుడ్ చేయించి అందర్నీ సంతృప్తిగా తినేలా చేశారు సంజయ్. చెఫ్ సంజయ్ రాగానే హౌస్ లో పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఎందుకంటే అప్పటిదాకా గొడవపడ్డ నిఖిల్, గౌతమ్ లని తన వంటరుచితో కలిపేసాడు. నిన్నటి ఎపిసోడ్ లో ఇదే హైలైట్ గా నిలిచింది.