English | Telugu

జయం మూవీ రియల్ జంట వీళ్ళు.. 

టాలీవుడ్ లో హీరో నితిన్ గురించి తెలియని వారు లేరు. జయం మూవీతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ సదా అన్న విషయం తెలుసు. కానీ అసలు హీరోయిన్ గా రష్మీ చేయాల్సి ఉంది అంటూ జయం మూవీ హీరో నితిన్ "అనగనగా ఈ ఉగాది" షోలో చెప్పేసరికి అందరూ అవాక్కయ్యారు. "రష్మీ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలి. నిజానికి నా ఫస్ట్ మూవీ జయంలో 90 పర్సెంట్ హీరోయిన్ ఆవిడే. లాస్ట్ మినిట్ వరకు తానే హీరోయిన్ గా చేసింది . కానీ లాస్ట్ మినిట్ లో ఎం జరిగిందో తెలీదు.

కానీ నా లైఫ్ లో ఒక అమ్మాయితో ఒక సీన్ ని రిహార్సల్ చేసింది మొదట రష్మీతోనే ..అందుకే నా లైఫ్ లో నేను ఎప్పుడూ మర్చిపోలేని అమ్మాయి రష్మీ " అని చెప్పాడు నితిన్. ఇంతలో హోస్ట్ నందు వచ్చి ఫైనల్ గా మంచి అమ్మాయిని సెలెక్ట్ చేశారు అంటూ చెప్పేసరికి రష్మీ ఏయ్ అంటూ నందు మీద అరిచింది. తర్వాత రష్మీ - నితిన్ ఒక కాస్టింగ్ కాల్ మీద టాస్క్ చేశారు. "ఏంటి నితిన్ గారు బ్రేకప్ అంటున్నారు. మీరు నన్ను అలా ఎలా మర్చిపోతారు." అని అడిగింది. "చాలా ఈజీగా మర్చిపోతాను" అని చెప్పాడు నితిన్. "మీరు మర్చిపోతే ఏంటి ..మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు" అని చెప్పింది. "కానీ నువ్వు అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా అస్సలు లేవు" అని చెప్పాడు. తర్వాత రష్మీ "నాలో ఊహలకు నాలో ఊసులకుక్" అనే సాంగ్ పాడి నితిన్ ని ఎంటర్టైన్ చేసింది. ఐతే రష్మీ జయం మూవీలో చేసి ఉంటె స్టార్ హీరోయిన్ అయ్యేది...కానీ ఏదేమైనా బుల్లితెర ఆమెకు బాగా కలిసొచ్చి స్టార్ యాంకర్ అయ్యింది .

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.