English | Telugu

Eto Vellipoyindhi Manasu : సీతాకాంత్ ప్లాన్ అదే.. కన్నకూతురిని మాణిక్యం కనిపెడతాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -366 లో......సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరికి వస్తాడు. ఎందుకు వచ్చారని రామలక్ష్మి అడుగుతుంది. రామ్ కి కొత్త టీచర్ ని అప్పాయింట్ చేస్తానన్నారు కదా అడగడానికి వచ్చానని సీతాకాంత్ అంటాడు. చేసానని రామలక్ష్మి చెప్తుంది. వారంలో లండన్ వెళ్ళిపోతామని ఫణీంద్ర అనగానే.. ఈ వారం రోజుల్లో రామలక్ష్మి తనంతట తానే బయటపడేలా చెయ్యాలని సీతాకాంత్ అనుకుంటాడు. రామలక్ష్మి బయటకు వెళ్తుంటే.. కార్ డ్రైవర్ లీవ్ లో ఉన్నాడని తెలుస్తుంది. మీరేం అనుకోనంటే మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తానని సీతాకాంత్ అంటాడు. మొదట రామలక్ష్మి రానని చెప్తుంది. ఆ తర్వాత సరేనంటుంది.

మరొకవైపు సుజాత దేవుడికి మొక్కుతుంటే.. ఎందుకు దేవుడిని మొక్కుతున్నావ్.. మన అమ్మాయిని మనకి దూరం చేశారు వాళ్ళు దేవుళ్ళా అని సుజాతపై మాణిక్యం కోప్పడతాడు. అప్పుడే ఒకతను వస్తాడు. మాణిక్యం డబ్బు ఇవ్వాలని వస్తాడు. సుజాత తన దగ్గరున్న డబ్బు ఇస్తుంది. అల్లుడు గారు వస్తానని చెప్పారు. ఆయన ముందు కొంచెం మర్యాదగా ఉండండి ఏమైనా అనుకుంటాడని సుజాత అంటుంది. మరోవైపు రామలక్ష్మి పని అయ్యేంత వరకు సీతాకాంత్ బయట వెయిట్ చేస్తాడు. మిమ్మల్ని మళ్ళీ తీసుకొని వెళ్తానని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి కార్ ఎక్కుతుంది. సీతాకాంత్ మాణిక్యం ఇంటి సైడ్ వెళ్తుంటే.. మీరు వెళ్లే రూట్ కరెక్టేనా అని రామలక్ష్మి అడుగుతుంది. ఎందుకు అలా అడుగుతున్నారు.. మీకు ఈ రూట్ తెలుసా అని సీతాకాంత్ అడుగగా.. తెలియదని రామలక్ష్మి అంటుంది.

సీతా గారు నన్ను బయటపడేలా చెయ్యడానికి ఇదంతా చేస్తున్నారు అసలు బయటపడొద్దని రామలక్ష్మి అనుకుంటుంది. రామలక్ష్మిని తీసుకొని మాణిక్యం ఇంటికి వస్తాడు సీతాకాంత్. మాణిక్యం, సుజాత ఇద్దరు రామలక్ష్మిని చూసి షాక్ అవుతారు. రామలక్ష్మి అంటూ మాట్లాడుతుంటే ఆంటీ, అంకుల్ అని రామలక్ష్మి పిలుస్తుంది. తను రామలక్ష్మి కాదు మైథిలి అని సీతాకాంత్ చెప్తాడు. అయినా వినకుండా తను నా కూతురు రామలక్ష్మి అని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.