English | Telugu

ఫైబ్రాయిడ్స్ సమస్యని ఎదుర్కొన్నా యాంకర్ రష్మీ



రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే తన ఆరోగ్య పరిస్థితి చాలా దిగజారడంతో ఆమె ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఇక హాస్పిటల్ లో చేరాక అక్కడ వేసుకునే గౌన్ తోనే ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఆమె ఫాన్స్ అంతా కూడా చాలా బాధపడ్డారు. ఏమయ్యింది అంటూ మెసేజెస్ పెడుతుండేసరికి తన ఆవేదన మొత్తాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసుకుంది. జనవరి నుంచి తన హెల్త్ ఏమీ బాగోడం లేదని విపరీతమైన రక్త స్రావంతో బాధపడుతున్నానని చెప్పింది. ఒళ్ళు నొప్పులు పెరగడంతో పాటు ఆమె హిమోగ్లోబిన్ శాతం 9 కి పడిపోయిందని చెప్పింది.

సమస్య ఏంటి అనేది తనకు అర్థంకాక ముందు ఏ డాక్టర్ కి చూపించుకోవాలో తెలీలేదని అంది రష్మీ. మార్చ్ 29 వరకు ఎలాగోలా మేనేజ్ చేసిందట కానీ ఆ తర్వాత అస్సలు తన వాళ్ళ కాలేదని చెప్పింది. అప్పటికీ ఇచ్చిన కమిట్మెంట్స్ ని ఎలాగో పూర్తి చేసి ఏప్రిల్ 18 న హాస్పిటల్ లో చేరినట్లు చెప్పింది. ఐతే ఇప్పుడు ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది రష్మీ.. ఐతే ఇంకా రెండు మూడు వారాలు రెస్ట్ మూడ్ లో రెస్ట్ లో ఉండాలి అని చెప్పింది. ఐతే ఆపరేషన్ థియేటర్ కి వెళ్లే ముందు, వెళ్లి వచ్చాక కూడా పిక్స్ తీసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఐతే ఫైబ్రాయిడ్స్ ఉండడం వలన ఈ సమస్య ఎదుర్కొన్నానని ఐతే ఇప్పుడు వాటిని సక్సెస్ ఫుల్ గా డాక్టర్స్ తొలగించారని తన మెసేజ్ లో రాసుకొచ్చింది. ఐతే చాలామంది కూడా ఆమెకు మెసేజెస్ చేస్తున్నారు. నటి లైలా, టేస్టీ తేజ, ఖుష్బూ, జబర్దస్త్ తన్మయి, నైనికా, అశ్విని వంటి వాళ్లంతా గెట్ వెల్ సూన్, హ్యాపీ అండ్ స్పీడీ రికవరీ అంటున్నారు.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.