English | Telugu

చెఫ్ మంత్ర గ్రాండ్ ఫినాలే.. జీవన్ కి షాకిచ్చిన సుమ!

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఈ షోకి ఫైనల్ గా మూడు జోడీలు సెలక్ట్ అయ్యాయి. అమర్ దీప్ - అంబటి అర్జున్, యాదమ్మ రాజు - సుప్రీతా, ప్రష్షు - ధరణి. వీళ్ళ మూడు టీమ్స్ మధ్యనే పోటీ జరిగింది. పాపం వీళ్లందరి వంటలు స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి తినలేక జడ్జ్ అండ్ చెఫ్ జీవన్ అల్లాడిపోయాడు. ఇక ఫైనల్ ఎపిసోడ్ లో సుమ ఒక డైలాగ్ వేసింది..."ఈ సీజన్ ఎప్పుడు ఐపోతుందా ఎప్పుడు ఇంటికి వెళ్లిపోదామా అని వెయిట్ చేస్తున్నా" అంటూ జీవన్ అనేసరికి "ఈ సీజన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది కాబట్టి ఇంకో సీజన్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాం" అంది సుమ. దానికి జీవన్ భయపడిపోయి "ఇంకో సీజనా బాబోయ్" అన్నాడు. "ఐతే సరే మేము నెక్స్ట్ సీజన్ కి వేరే చెఫ్ ని వెతుక్కుంటాం" అనేసింది సుమ.

ఇందులో ఫైనల్స్ కి చేరుకున్న మూడు జోడీలకు ఇండియన్ థాలి వంటకాలు ప్రిపేర్ చేయాలంటూ టాస్క్ ఇచ్చారు. అందులో సాంబార్, దద్దోజనం మస్ట్ గా ఉండాలి అని చెప్పాడు జీవన్. ఇక వీళ్ళ వంటలు ఇలా కొనసాగుతూ ఉండగా మధ్యలో యాంకర్ రవి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరి మీద ఒక ఫస్ట్ ఎపిసోడ్ నుంచి జరిగిన హైలైట్స్ ని రాసుకొచ్చి చదివి వినిపించాడు. వీళ్ళ మూడు జోడీలు వంటలు చేస్తూ ఉంటే సమీరా భరద్వాజ్ దీపికాకు పాటలు నేర్పించడం వంటివి చేసింది. సుమ జీవన్ ని వెంటబెట్టుకుని తిరిగినట్టు దీపికా కూడా జీవన్ ని వెంటబెట్టుకుని తిరుగుతాను అనేసరికి జీవన్ సిగ్గుపడిపోయాడు. చెఫ్ మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలి అనిపిస్తోంది అంటూ సుమ సెటైర్ వేసింది. రవి ఐతే దీపికను పొగిడేసాడు. దీపికా ఉంటే కచ్చితంగా ఆ షో చూడాల్సిందే అది వంటైనా..డ్యాన్సయినా అన్నాడు. వెంటనే దీపికా ఊరుకోకుండా "ఫ్రెష్ గా చేసిన రసమలై మా రవి" అంటూ కితాబిచ్చింది.

ఐతే ఈ కుకింగ్ షోలో ఈ సీజన్ లో మాత్రం ఎన్ని జోడీలు వచ్చి వంట చేసినా కానీ హైలైట్ అయ్యింది జీవన్, సుమ ఆ తర్వాత దీపికా అంతే. ఫైనల్ గా మూడు జోడీలు వంటలు టేస్ట్ చేసాక అంబటి అర్జున్ - అమర్ దీప్ ని ఈ సీజన్ విన్నర్స్ గా ప్రకటించి, ట్రోఫీలు అందించారు. అలా ఈ సీజన్ ఇక్కడితో ఎండ్ ఐపోయింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.