English | Telugu

నాగార్జున సర్ తో డేట్ కి వెళ్లాలని ఉంది..

ఇండస్ట్రీలో అవకాశం వస్తే ఏ హీరోతో డేట్ కి వెళ్తారు అన్న ప్రశ్నకు ప్రియాంక జైన్ చెప్పిన ఆన్సర్ వింటే నిజంగా షాక్ అవుతారు. ప్రియాంక జైన్ తో జరిగిన చిట్ చాట్ లో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది. "శివ్ తో నా పరిచయం మౌనరాగం సీరియల్ తో స్టార్ట్ అయ్యింది. లైఫ్ లాంగ్ మా ప్రయాణం కంటిన్యూ అవుతుంది అని అవ్వాలని ప్రే చేస్తున్నాను. వెబ్ సిరీస్, షోస్, సీరియల్స్ వీటిల్లో ఒకటి చేయడం మానేయమంటే ఏదీ మానేయలేను. బతకడం మానేయండి అంటే ఎలా...నేను ఏదీ మానేయలేను. వర్క్ ఈజ్ మై వర్షిప్. సీరియల్స్ నన్ను టాప్ లో నిలబెట్టాయి. సినిమా హీరోయిన్ అవ్వాలనే వచ్చాను కానీ ఇప్పటికే అందరి గుండెల్లోనూ ఉన్నాను కాబట్టి ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటున్నా.

ఫేవరేట్ వెకేషన్ అంటే పారిస్. మా అమ్మ బర్త్ డే నాకు స్పెషల్ డే. శివ్ ని చూస్తే ఆటోమేటిక్ గా నా ఫేస్ లో స్మైల్ వస్తుంది. నాకు నాగార్జున సర్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఈ విషయాన్నీ చెప్తూనే ఉంటాను. నాకే ఒకవేళ అవకాశం వస్తే నేను ఆయనతో కలిసి డిన్నర్ డేట్ కి వెళ్తాను. టాలీవుడ్, పప్పన్నం, ఇంట్లో ఉండడం అంటే ఇష్టం. ఇక ఎక్కువగా లవ్ స్టోరీస్ చూస్తాను. రెగ్యులర్ గా ట్రెడిషనల్ వేర్ ని ప్రిఫర్ చేస్తాను. అప్పుడప్పుడు వెస్ట్రన్ వేర్ వేస్తాను. లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అంటే బైక్స్ మీద వెళ్లడం ఇష్టం. కార్ లో సఫోకేషన్ గా ఉంటుంది. అలాగే ఏసీ కూడా పడదు. నా పార్టనర్ లో నాకు నచ్చేది డీసెన్సీ, ఇన్నోసెన్స్. నా పార్టనర్ కి తెలియకుండా డబ్బులు దాచి పెడుతూ ఉంటాను..ఇప్పటివరకు ఆయనకు ఈ విషయం తెలీదు. నిజం చెప్పాలి అంటే నన్ను శివ్ తప్ప ఎవరూ భరించలేరు." అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. ప్రియాంక రీసెంట్ గా డాన్స్ ఐకాన్ సీజన్ 2 కి మెంటార్ గా వెళ్ళింది ..అలాగే అన్ని షోస్ లో కూడా కనిపిస్తూనే ఉంది.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.