English | Telugu

Brahmamudi : కావ్యని సర్ ప్రైజ్ చేసిన రాజ్.. రుద్రాణి అతడిని చూస్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -707 లో.... కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. రాజ్ రావడం ముందే గమనించిన కావ్య.. అప్పు, అపర్ణల సాయంతో ఇంట్లో అందరిని డైవర్ట్ చేస్తుంది. ధాన్యలక్ష్మి, ఇందిరాదేవిని అపర్ణ గదిలోకి తీసుకొని వెళ్లి చీరలు నగలు అంటూ చూపిస్తుంది. రాహుల్, రుద్రాణిని అప్పు తీసుకొని వెళ్లి రాజ్ కేసు అంటూ చెప్పిందే చెప్తూ డైవర్ట్ చేస్తుంది.

రాజ్ లోపలికి రాకముందే రాజ్ ఎక్కడ తన ఫొటోస్ చూస్తాడోనని గోడ మీదున్న రాజ్ ఫొటోస్ తీస్తుంది కావ్య. రాజ్ లోపలికి రాగానే కావ్య టెన్షన్ పడుతుంది. రండి కిచెన్ చూద్దామని అంటుంది. అదేంటీ అలా కిచెన్ చూపిస్తాను అంటున్నారని అడుగుతాడు. రాజ్ ని తీసుకొని కావ్య కిచెన్ లోకి వెళ్తుంది. మీ వాళ్ళు అంత ఎక్కడ అని రాజ్ అడుగుతాడు. అందరు గుడికి వెళ్లారు.. వాళ్ళు రావడానికి గంట పైనే అవుతుందని కావ్య చెప్పగానే అయితే మనం బాగా మాట్లాడుకోవచ్చన్న మాట అని రాజ్ అంటాడు. ప్రకాష్ హాల్లో కి వస్తాడు. ఎక్కడ రాజ్ ని చూస్తాడో అని కావ్య స్ఫూన్ లు కింద పడేస్తుంది. రాజ్ కింద పడ్డ స్ఫూన్లు తీస్తుంటాడు. ప్రకాష్ కిచెన్ వంక చూసి వీళ్లంతా ఎక్కడ అని కావ్యకి సైగ చేస్తాడు. లోపల గదిలో అని కావ్య చెప్తుంది. ప్రకాష్ వెళ్ళిపోతాడు. రాజ్ స్ఫూన్లు తీసి పైకి లేస్తాడు.

ఆ తర్వాత నాకు అర్జెంట్ అంటు రాజ్ ఇబ్బంది పడుతుంటే కావ్య తన గదిలోకి తీసుకొని వెళ్తుంది. రాజ్ వాష్ రూమ్ వెళ్తాడు. హాల్లో ఎవరైనా ఉన్నారేమోనని కావ్య చూస్తుంది. అప్పుడే రాజ్ వచ్చి మీకు తీసుకొని వచ్చిన సర్ ప్రైజ్ ఎలా ఉంది అనగానే కావ్య ఓపెన్ చేసి చూసేసరికి చీర ఉంటుంది. అది చూసి కావ్య మురిసిపోతుంది. ఇక వెళ్ళండి అని రాజ్ తో కావ్య అంటుంది. రాజ్ కి ఇష్టం లేకున్నా అక్కడ నుండి బయల్దేరతాడు. అప్పుడే రుద్రాణి వాళ్ళు బయటకు వస్తారు. ఎక్కడ రాజ్ ని వాళ్ళు చూస్తారోనని కావ్య డోర్ వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.