కిరణ్ ఖేర్‌కు బ్లడ్ కేన్సర్!
దేశంలోని టాలెంటెడ్ యాక్ట్రెస్‌లలో ఒకరు, పొలిటీషియన్ అయిన కిరణ్ ఖేర్‌కు బ్లడ్ కేన్సర్‌గా నిర్ధారణ అయ్యింది. ఆమె సుప్రసిద్ధ నటుడు అనుపమ్ ఖేర్ సతీమణి. దేవదాస్, మై హూనా, దోస్తానా, రంగ్ దే బసంతి లాంటి సినిమాల్లో తన అసమాన నటనతో ఆమె ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేస్తూ వస్తున్నారు. ఆమెకు బ్లడ్ కేన్సర్ అనే విషయాన్ని అనుపమ్ ఖేర్ ఓ నోట్ ద్వారా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు.