English | Telugu
కుర్రాళ్లలా అండమాన్‌లో వృద్ధ తారల షికార్లు!
Updated : May 11, 2021
డెబ్బైలు, ఎనభైలలో ఉన్న వహీదా రెహ్మాన్, ఆశా పరేఖ్, హెలెన్ అండమాన్ ద్వీపంలో తమ యవ్వనాన్ని పునరుద్ధరిస్తున్నారు. కలిసి బీచ్‌లో కనిపించిన ఒక నెల తరువాత, వారు ఈసారి పడవ ప్రయాణానికి వెళ్లూ కనిపించారు. అండమాన్, నికోబార్ దీవుల్లో ఆ తారలు ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను బాలీవుడ్ ప్రొడ్యూసర్ తనూజ్ గార్గ్ షేర్ చేశారు. ఆ ఫొటోలను బట్టి చూస్తుంటే ఆ తారలు తమ జీవితాన్ని లేటు వయసులోనూ ఎలా ఆస్వాదిస్తున్నారో అర్థమవుతోంది.
తనూజ్ గార్గ్ షేర్ చేసిన పిక్స్‌లో ఆ ముగ్గురు పేరుపొందిన తారలు లైఫ్ జాకెట్లు ధరించి, బోట్ రైడింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు రిలాక్స్డ్గా కనిపిస్తున్నారు. ఒక ఫొటోలో వహీదా డ్రైవర్ సీట్లో కూర్చుని కనిపించారు. మరొక పిక్చర్లో వహీదా, ఆశా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఫోటోలను పంచుకుంటూ, వృద్ధాప్యంలో ఇలాంటి జ్ఞాపకాలు ఎంతో ఉల్లాసాన్నీ, ఉత్తేజాన్నీ ఇస్తాయని తనూజ్ రాశాడు. సినిమాల నుంచి దాదాపు రిటైర్ అయిన ఆ తారలు ఇలా జీవితాన్ని ఆస్వాదించడం ముచ్చటగా అనిపిస్తోందన్నాడు.
ఏప్రిల్‌లో కూడా అండమాన్‌లోని ఓ బీచ్‌లో వహీదా, హెలెన్, ఆశా సరదాగా గడుపుతూ కనిపించారు. దానికి సంబంధించిన పిక్చర్స్ ఆన్లైన్లో షికారు చేశాయి. అండమాన్‌కు వెళ్లేముందు ఆ ముగ్గురూ మాధురీ దీక్షిత్ డాన్స్ రియాలిటీ షో 'డాన్స్ దీవానే 3' హోలి స్పెషల్ ఎపిసోడ్‌కు గెస్ట్ జడ్జిలుగా హాజరయ్యారు. ఆ తారల అలనాటి ఐకనిక్ సాంగ్స్‌కు మాధురి డాన్స్ చేసింది.
స్వర్ణోత్సవ కాలంగా చెప్పబడే 1960, 70ల నాటి బాలీవుడ్ సినిమాల్లో హెలెన్, ఆశా పరేఖ్, వహీదా రెహమాన్ బ్రహ్మాండంగా రాణించారు. బాలీవుడ్‌లోకి వెళ్లేముందు వహీదా తెలుగు సినిమాల్లో నటించారు. చాలా కాలంగా వారు స్నేహితులు. పలు ఈవెంట్లకు, పార్టీలకు కలిసి వస్తుంటారు.