English | Telugu
కొవిడ్ కేర్ సెంటర్‌కు అమితాబ్ రూ. 2 కోట్ల విరాళం!
Updated : May 10, 2021
ఢిల్లీలోని రాకాబ్ గంజ్ గురుద్వారాలోని శ్రీ గురు తేగ్ బహదూర్ కోవిడ్ కేర్ సెంటర్‌కు అమితాబ్ బచ్చన్ రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చారు. 300 పడకలతో కూడిన ఈ సదుపాయం ఈ రోజు (మే 10) ప్రారంభం కానున్నట్లు ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజిందర్ సింగ్ సిర్సా ప్రకటించారు. అమితాబ్ కంట్రిబ్యూషన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సిక్కులను లెజెండరీగా అమితాబ్ అభివర్ణించారు. కోవిడ్ కేర్ సెంటర్ కోసం ఆక్సిజన్ సిలిండర్లను కూడా ఆయన ఏర్పాటు చేశారు.
అకాలీదళ్ పార్టీ జాతీయ ప్రతినిధి కూడా అయిన మంజిందర్ సింగ్ సిర్సా సోషల్ మీడియాలో అమితాబ్ బచ్చన్ శ్రీ గురు తేగ్ బహదూర్ కోవిడ్ కేర్ ఫెసిలిటీకి రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు ప్రకటించారు. సిర్సా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో, "సిక్కులు లెజెండరీ, వారి సేవకు వందనం.. ఇవి అమితాబ్ బచ్చన్ శ్రీ గురు తేగ్ బహదూర్ కోవిడ్ కేర్ ఫెసిలిటీకి రూ. 2 కోట్లు అందించినప్పుడు చెప్పిన మాటలు. ఢిల్లీ ఆక్సిజన్ కోసం అల్లాడుతున్నప్పుడు, దాదాపు రోజూ ఈ ఫెసిలిటీ పురోగతి గురించి అమితాబ్ నాకు కాల్ చేసి ఆరా తీస్తూ వచ్చారు. అని రాశారు.
రాకాబ్ గంజ్ గురుద్వారాలో ఈ సౌకర్యం సోమవారం (మే 10) ప్రారంభమవుతోంది. ఇందులో 300 పడకలు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్, డాక్టర్లు, పారామెడిక్స్, అంబులెన్సులు ఉంటాయి. రోగులకు ఉచితంగా అన్ని సేవలు అందించబడతాయి.