English | Telugu
కంగనకు కరోనా.. అతి ఒత్తిడితో వచ్చే స్మాల్-టైమ్ ఫ్లూ అంటూ వ్యాఖ్య!
Updated : May 8, 2021
కంగనా రనౌత్‌కు కోవిడ్-19 పాజిటివ్‌గా టెస్ట్‌లో నిర్ధారణ అయ్యింది. ఆమె తన తాజా ఆరోగ్య స్థితి గురించి తన అభిమానులకు, ఫాలోయర్స్‌కు ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తెలియజేసింది. ఆమె ట్విట్టర్ హ్యాండిల్ కొన్ని రోజుల క్రితం శాశ్వతంగా నిలిపివేయబడిన విషయం తెలిసిందే. యోగా భంగిమలో ఉన్న తన ఫొటోను షేర్ చేసుకుంటూ, ఆమె కోవిడ్ -19 అనేది అతి ఒత్తిడి వల్ల వచ్చిన ఒక చిన్న ఫ్లూ లాంటిదిగా పేర్కంటూ, దాన్ని తను పడగొట్టేస్తానని రాసింది.
కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో, "గత కొన్ని రోజులుగా నా కళ్లు మండుతున్నట్లుగా అనిపిస్తూ అలసటగా, బలహీనంగా ఫీలవుతూ వస్తున్నాను. హిమాచల్ వెళ్లాలని అనుకుంటూ నిన్న టెస్ట్ చేయించుకున్నాను. ఈ రోజు ఫలితం వచ్చింది. నేను కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది." అని రాసుకొచ్చింది.
ఆమె ఇంకా, "నేను స్వీయ క్వారంటైన్ విధించుకున్నాను., ఈ వైరస్ నా శరీరంలోకి ఎలా ప్రవేశించిందో తెలీదు. ఇప్పుడు నేను దానిని పడగొడతానని నాకు తెలుసు. ప్రజలు దయచేసి మీ శక్తిని మించి ఏదీ ఇవ్వకండి. మీరు భయపడితే అది మిమ్మల్ని మరింత భయపెడుతుంది. రండి ఈ కోవిడ్-19ను నాశనం చేద్దాం. ఇది ఎక్కువ ఒత్తిడి వల్ల వచ్చే చాలా తక్కువ సమయం ఉండే ఫ్లూ తప్ప, కొంత మంది ప్రజలను సైకిగ్‌గా మారుస్తున్నది తప్ప మరేమీ కాదు. హర్ హర్ మహాదేవ్ (sic).” అని రాసుకొచ్చింది.
మైక్రో బ్లాగింగ్ సైట్ మార్గదర్శకాలను ఉల్లంఘించే ట్వీట్లను పోస్ట్ చేసిన తరువాత కంగన ట్విట్టర్ హ్యాండిల్ శాశ్వతంగా నిలిపివేయబడింది. తన వరుస ట్వీట్లలో, మమతా బెనర్జీపై కంగన రనౌత్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది.