English | Telugu
కిరణ్ ఖేర్ మృతి వదంతులను ఖండించిన అనుపమ్ ఖేర్!
Updated : May 8, 2021
బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ మృతి చెందారంటూ సోషల్ మీడియాలో వదంతులు మొదలయ్యాయి. ఈ రూమర్స్‌కు చెక్ పెట్టడానికి ఆమె భర్త, సుప్రసిద్ధ నటుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలోకి వచ్చారు. శుక్రవారం కిరణ్ కన్నుమూసినట్లు వదంతులు వ్యాపించాయి. దాంతో అవి అబద్ధమని ప్రకటించడానికి అనుపమ్ ట్విట్టర్ సాయం తీసుకున్నారు. కిరణ్ ఖేర్ బాగానే ఉన్నారని చెప్పారు. అంతే కాదు, ఆమె కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క రెండవ డోస్‌ను కూడా తీసుకున్నట్లు ఆయన తెలియజేశారు. రెండు రోజుల క్రితం, ఇదే విధంగా లక్కీ అలీ మరణించినట్లు ప్రచారంలోకి రాగా, తాను బాగానే ఉన్నానని స్వయంగా ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది.
కిరణ్ బాగున్నారని అందరికీ తెలియజేస్తూ, ఇలాంటి నెగటివ్ న్యూస్‌ను వ్యాప్తి చేయవద్దని ప్రజలను అనుపమ్ అభ్యర్థించారు. ఆయన, “కిరణ్ ఆరోగ్య స్థితి గురించి వదంతులు వ్యాపిస్తున్నాయి. అదంతా అబద్ధం. ఆమె బాగానే ఉంది. వాస్తవానికి ఆమె ఈ మధ్యాహ్నం కొవిడ్ వాక్సిన్ రెండో డోస్ వేయించుకుంది. ఇలాంటి ప్రతికూల వార్తలను వ్యాప్తి చేయవద్దని ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదాలు. క్షేమంగా ఉండండి.” అని ట్వీట్ చేశారు.
అంతకు ముందు కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ వేయించుకున్నాక అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ సహా తన కుటుంబ సభ్యులతో కలిసి తీయించుకున్న పిక్చర్స్‌ను షేర్ చేసుకున్నారు.
కిరణ్ ఖేర్ మల్టిపుల్ మైలోమా అనే ఒక రకమైన రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఏప్రిల్‌లో ఆమెకు అది నిర్ధారణ అయ్యాక ఆ విషయాన్ని అనుపమ్ ఖేర్ తన కుమారుడు సికందర్‌తో కలిసి ఒక ప్రకటన విడుదల చేశారు. "కిరణ్‌కు మల్టిపుల్ మైలోమా అని నిర్ధారణ అయ్యిందని అందరికీ తెలియజేస్తున్నా. అది ఒక రకమైన బ్లడ్ కేన్సర్. ప్రస్తుతం ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఇదివరకటి కంటే మరింత బలంగా ఆమె దీని నుంచి బయటపడుతుందని మేం నమ్ముతున్నాం. గొప్ప డాక్టర్లు ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తుండటం మా అదృష్టం. ఆమె ఎప్పుడూ ఓ ఫైటర్‌గానే ఉంటూ వస్తోంది. దీనితో పోరాటంలో ఆమె అలాగే బయటపడుతుంది. ఆమె ఎంత మంచి హృదయం కలిగిన మనిషో, అనేకమంది వ్యక్తుల ప్రేమను ఆమె పొందడాన్ని బట్టి తెలుస్తోంది. మీ ప్రార్థనల్లో, మీ హృదయంలో ఆమెకు ప్రేమను పంపుతుండండి. ఆమె రికవరీ అయ్యే మార్గంలో ఉంది. మీ ప్రేమ, సపోర్ట్‌కు అందరికీ థాంక్స్." అని ఆయన అందులో రాసుకొచ్చారు.