English | Telugu

ఏప్రిల్ 2న ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్!

బాహుబలి -ది బిగినింగ్, బాహుబలి- ది కంక్లూజన్ చిత్రాల తర్వాత ప్రభాస్ నటించిన సాహో రాదేశ్యామ్లు డిజాస్టర్ అయ్యాయి. అయినా కూడా ప్రభాస్ కు ఉన్న క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి ఆయన ప్రస్తుతం ప్రశాంత్ నీతో సలార్ చిత్రం చేస్తున్నారు. కే జి ఎఫ్ చాప్ట‌ర్ 1, చాప్టర్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. కాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఏప్రిల్ 2వ తేదీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ గా ప్రభాస్ కనిపించబోతున్నారు. పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆధ్యా అనే జర్నలిస్టుగా శృతిహాసన్ నటించినుండ‌గా కీలక పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. కేజిఎఫ్ నిర్మాణ సంస్థ అయిన హోం భలే ఫిలిమ్స్ 200 కోట్లకు పైగా బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీస్తోంది. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక ఇందులో య‌ష్ కూడా నటిస్తున్నాడని సమాచారం. రాఖీ బాయ్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నాడని టాక్ వ‌చ్చింది. య‌ష్ ఈ అతిథి పాత్ర‌కు గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చాడ‌ని స‌మాచారం. ప్రశాంత్ నీల్ అడిగిన వెంటనే య‌ష్ కాదనకుండా కాల్షీట్స్ ఇచ్చార‌ని సమాచారం.

అయితే అధికారికంగా ప్రకటన రాలేదు. ఇద్దరు పాన్ ఇండియా హీరోలు ఒకే సినిమాలో తెరపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో మూడు సినిమాలు చేస్తున్నాడు. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రాజెక్టు కే సినిమా సూపర్ హీరో కథాంశంతో రూపొందుతోంది. మారుతి తో రాజా డీలక్స్ చేస్తున్నారు. ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా జూన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.