English | Telugu

కొట్టినా చెప్ప‌నంటున్న గౌత‌మ్ మీన‌న్‌!

అస‌లు ఆ మాటేంటి? ఎవ‌రు కొడతారు? ఎందుకు కొడ‌తారు? ఇంత‌కీ ఆయ‌న చెప్ప‌న‌నే విష‌యం ఏంటి? ఎందుకు అంత మొండి ప‌ట్టు? చెప్తే ఏమ‌వుతుంది? చెప్ప‌కుండా ఆయ‌న్ని ఆపుతున్న‌దెవ‌రు? ఒక్క హెడ్డింగ్ చూసే ఇన్ని విష‌యాలు ఆరా తీస్తే ఎలా? ఇక్క‌డ మ‌నం చెప్పుకోబోతున్న‌ది గౌత‌మ్ వాసుదేవ‌మీన‌న్ గురించి. ఆయ‌న న‌టిస్తున్న లియో సినిమా గురించి. ఇప్ప‌టికే మీకు సీన్ ఏంటో అర్థ‌మై ఉంటుందిగా!

విజ‌య్ హీరోగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా లియో. ఇటీవ‌ల ఈ చిత్రం షూటింగ్ క‌శ్మీర్‌లో జ‌రిగింది. మాస్ట‌ర్ మూవీ సూప‌ర్‌డూప‌ర్ స‌క్సెస్ కావ‌డం, రీసెంట్‌గా లోకేష్ తెర‌కెక్కించిన విక్ర‌మ్ బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో నేచుర‌ల్‌గానే లియో మీద ఎక్స్ పెక్టేష‌న్స్ పెరిగాయి. క‌శ్మీర్ షెడ్యూల్‌లో విజ‌య్‌తో పాటు త్రిష‌, మిస్కిన్‌, గౌత‌మ్ వాసుదేవ మీన‌న్‌, సంజ‌య్ ద‌త్‌, బాబు ఆంటోని కూడా పార్టిసిపేట్ చేశారు.

ఈ సినిమా షూటింగ్ సూప‌ర్ అంటూ మ‌న‌సులోని మాట చెప్పేశారు గౌత‌మ్ మీన‌న్‌. అంతే కాదు, ఓ బ్ర‌హ్మాండ‌మైన సినిమాను లోకేష్ సిద్ధం చేస్తున్నారంటూ హింట్ ఇచ్చేశారు. ఇందులో గౌత‌మ్ మీన‌న్ చేస్తున్న పాత్ర గురించి చెప్ప‌మంటే మాత్రం స‌స్పెన్స్ అంటున్నారు. అప్‌డేట్ ఇవ్వ‌మ‌ని బ‌య‌ట మిమ్మ‌ల్ని అభిమానులు కొట్టినా కొడ‌తారు. అయినా చెప్ప‌కండీఅని స్ట్రిక్ట్ కండిష‌న్ వేశార‌ట లోకేష్ క‌న‌గ‌రాజ్‌. ఈ విష‌యాన్ని గౌత‌మ్ మీన‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. లియో షూటింగ్ త్వ‌ర‌లోనే చెన్నై షెడ్యూల్ స్టార్ట్ చేసుకుంటుంద‌ని, అందులో కూడా తాను న‌టిస్తాన‌ని మాత్రం అన్నారు. అక్టోబ‌ర్ 19న లియో మూవీని విడుద‌ల చేయాల‌న్న‌ది లోకేష్ ప్లాన్‌. ఈ సినిమాలో మ‌ల‌యాళ న‌టుడు ఫాహ‌ద్ ఫాజిల్ యాక్ట్ చేస్తార‌ని స‌మాచారం. చాన్నాళ్ల త‌ర్వాత విజ‌య్ స‌ర‌స‌న త్రిష న‌టిస్తున్న సినిమా ఇది. త్రిష‌కు ఈ ఏడాది రాంగీ విడుద‌లైంది. పొన్నియిన్ సెల్వ‌న్‌2, లియో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. విజ‌య్‌కి ఈ ఏడాది విడుద‌ల‌వుతున్న రెండో సినిమా లియో.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.