English | Telugu

దాస్ కా హిట్.. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!

'దాస్ కా ధమ్కీ'తో యంగ్ హీరో విశ్వక్ సేన్ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. విశ్వక్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచి అంచనాలతో మార్చి 22న విడుదలైంది. డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా విశ్వక్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. ఆ తరువాత కూడా అదే జోరుని కొనసాగిస్తున్న ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది.

'దాస్ కా ధమ్కీ' మూవీ ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ రూ.7.5 కోట్లు కాగా మొదటి రోజే సగానికి పైగా రాబట్టడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.4.08 కోట్ల షేర్, రెండో రోజు రూ.1.45 కోట్ల షేర్, మూడో రోజు రూ.1.33 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.1.54 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. రూ.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ.. నాలుగు రోజుల్లోనే రూ.8.37 కోట్ల షేర్ రాబట్టి సత్తా చాటింది.

తెలుగు రాష్ట్రాల వసూళ్లను పరిశీలిస్తే.. నైజాంలో రూ.2.69 కోట్ల షేర్(బిజినెస్ రూ.3 కోట్లు), సీడెడ్ లో రూ.91 లక్షల షేర్(బిజినెస్ రూ.1 కోట్లు), ఆంధ్రాలో రూ.2.75 కోట్ల షేర్(బిజినెస్ రూ.2.8 కోట్లు)గా ఉన్నాయి. రెస్టాఫ్ ఇండియా రూ.92 లక్షల షేర్, ఓవర్సీస్ లో రూ.1.10 కోట్ల షేర్ రాబట్టిన ఈ మూవీ.. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా రూ.8.37 కోట్ల షేర్ వసూలు చేసింది. ఐదో రోజు ఆదివారం కావడంతో మరో కోటిన్నరకు పైగా షేర్ రాబట్టి.. పది కోట్ల షేర్ క్లబ్ లో చేరే అవకాశముంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.