English | Telugu

'దసరా' బుకింగ్స్ కి సూపర్ రెస్పాన్స్.. నాని 100 కోట్ల క్లబ్ లో చేరతాడా!

టాలీవుడ్ టైర్-2 హీరోలలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా నేచురల్ స్టార్ నానికి పేరుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన సినిమాలకు చెప్పుకోదగ్గ కలెక్షన్లు వస్తుంటాయి. అయితే కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించడంలో మాత్రం ఆయన కాస్త వెనకబడిపోయాడు. ఆయనకున్న క్రేజ్ కి ఇంతవరకు రూ.50 కోట్ల షేర్ మార్క్ ని గానీ, రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ ని గానీ అందుకోకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే ఇప్పుడు 'దసరా'తో ఆ ఫీట్ ని సాధించి, తన బాక్సాఫీస్ స్టామినా చూపించేలా ఉన్నాడు.

నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'దసరా'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సినిమాపై మంచి అంచనాలు ఉండటం, పైగా ఆరోజు శ్రీరామ నవమి కావడంతో 'దసరా' ఫస్ట్ డే బుకింగ్స్ జోరు మీద ఉన్నాయి. చూస్తుంటే ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా ఇది నాని కెరీర్ లో మాత్రమే కాదు, టైర్-2 హీరోల సినిమాల్లోనే రికార్డు సృష్టించేలా ఉంది.

ఇప్పటిదాకా ఏ టైర్-2 హీరో సినిమా కూడా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.10 కోట్ల షేర్ మార్క్ ని అందుకోలేదు. 'లైగర్' మూవీ రూ.9.5 కోట్ల రేంజ్ లో షేర్ రాబట్టి టాప్ లో ఉంది. అయితే ఇప్పుడు దసరా బుకింగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మొదటి రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల షేర్ మార్క్ ని అందుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాని కెరీర్ లో తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా 'ఎంసీఏ'(మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రం రూ.7.5 కోట్ల రేంజ్ షేర్ రాబట్టి టాప్ లో ఉంది. ఇప్పుడు 'దసరా'తో రూ.10 కోట్ల షేర్ తో రికార్డు సృష్టిస్తాడేమో చూడాలి.

అలాగే సోలో హీరోగా నాని కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం కూడా 'ఎంసీఏ'నే కావడం విశేషం. ఈ చిత్రం రూ.40 కోట్లకు పైగా షేర్(రూ.70 కోట్లకు పైగా గ్రాస్) రాబట్టింది. ఇప్పుడు దసరా చిత్రానికి వస్తున్న బజ్ చూస్తుంటే రూ.50 కోట్ల షేర్(రూ.100 కోట్ల గ్రాస్) మార్క్ అందుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంచనాలను అందుకొని ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే అంతకుమించిన వసూళ్లు రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటిదాకా టైర్-2 హీరోల సినిమాలలో రూ.70 కోట్ల షేర్ తో 'గీత గోవిందం' టాప్ లో ఉంది. మరి ఇప్పుడు 'దసరా'తో నాని ఆ చిత్ర వసూళ్లను దాటేస్తాడేమో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.