English | Telugu

దసరా బరిలో టైగర్.. బాలయ్య, బోయపాటితో వార్!

మాస్ మహారాజా రవితేజ త్వరలో 'రావణాసుర' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇది విడుదలైన కొన్ని నెలలకే మరో చిత్రంతో అలరించనున్నాడు రవితేజ. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ లో రూపొందుతోన్న ఈ సినిమాకు వంశీ దర్శకుడు. స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్.

'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాన్ని దసరా కానుకగా 2023, అక్టోబర్ 20న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పటికే దసరా బరిలో రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం నిలిచింది. ఈ సినిమాని అక్టోబర్ 20 న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల అనౌన్స్ చేశారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కలయికలో రానున్న 'NBK 108'(వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని సైతం దసరాకే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే జరిగితే ఈ ఏడాది దసరాకు త్రిముఖ పోరు తప్పదు. మరి ఈ పోరులో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.