English | Telugu

అల్లు అర్జున్ 20 ఏళ్ళ సినీ ప్రస్థానం.. తగ్గేదేలే!

హీరోగా పరిచయమైన తొలి చిత్రంతోనే శతదినోత్సవ హీరోగా పేరు తెచ్చుకున్నవారు అరుదుగా ఉంటారు. వారిలో అల్లు అర్జున్ ఒకరు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన 'గంగోత్రి' సినిమాతో అల్లు అర్జున్ సినీరంగ ప్రవేశం చేశారు. అల్లు అరవింద్, సి.అశ్వినీదత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది దర్శకుడిగా రాఘవేంద్రరావుకి వందో చిత్రం కావడం విశేషం. 2003, మార్చి 28న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడటానికి థియేటర్లకు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలన్నీ విశేష ఆదరణ పొందాయి. 'వల్లంకి పిట్ట', 'నువ్వు నేను కలిసుంటేనే', 'ఒకతోటలో' పాటలు ఎంతగానో అలరించాయి. ఈ చిత్రం 50కి పైగా కేంద్రాల్లో వంద రోజులు ఆడి ఘన విజయం సాధించింది. బెస్ట్ డెబ్యూ హీరోగా బన్నీ నంది అవార్డు అందుకోవడం విశేషం. అలా 'గంగోత్రి'తో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ సినీ ప్రస్థానం నేటితో 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

అల్లు అర్జున్ హీరోగా నటించిన మొదటి సినిమా ఘన విజయం సాధించింది. నటుడిగా కూడా మంచి పేరు వచ్చింది. కానీ ఆయన లుక్స్ పై కొందరు విమర్శలు చేశారు. ఇతను హీరోనా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారికి తన రెండో సినిమాతోనే సమాధానం చెప్పారు అల్లు అర్జున్. రెండో సినిమా 'ఆర్య'లో తన లుక్స్ తో అందరినీ ఫిదా చేశారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి ఇక అల్లు అర్జున్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. సినిమా సినిమాకి ఎదుగుతూ వచ్చారు. ఆయన యాక్టింగ్, స్టైల్, డ్యాన్స్ కి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. 'ఆర్య', 'బన్నీ', 'దేశముదురు' వంటి సినిమాలతో స్టైలిష్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 'వేదం', 'రుద్రమదేవి' వంటి సినిమాలు ఆయనలోని నటుడిని ఆవిష్కరించాయి. 'జులాయి', 'రేసుగుర్రం', 'సరైనోడు', 'అల వైకుంఠపురములో' ఇలా సినిమా సినిమాకి మార్కెట్ పెంచుకుంటూ ఐకాన్ స్టార్ గా ఎదిగారు. 'పుష్ప'తో తగ్గేదేలే అంటూ పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న 'పుష్ప-2' కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి సినిమాకి లుక్స్ పరంగా విమర్శలు ఎదుర్కొని ఆ తర్వాత స్టైలిష్ ఐకాన్ గా పేరు తెచ్చుకోవడం అంత సులభం కాదు. ఆ పరంగా చూస్తే అల్లు అర్జున్ 20 ఏళ్ళ సినీ ప్రయాణం స్ఫూర్తి అని చెప్పొచ్చు. పైగా ఈ జనరేషన్ లో స్టార్ హీరోలలో విజయాల శాతం ఎక్కువగా ఉన్న స్టార్ అల్లు అర్జున్ అనడంలో సందేహం లేదు. మిగతా స్టార్లతో పోలిస్తే ఆయన కెరీర్ లో ఫ్లాప్ సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. మరి ముందు ముందు బన్నీ ఇంకెంత ఉన్నత స్థాయికి వెళ్తాడో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.