English | Telugu

జ‌ర్న‌లిస్ట్ గా పూజా హెగ్డే?

క్రేజీ ప్రాజెక్ట్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తున్న క‌థానాయిక‌ల్లో `బుట్ట‌బొమ్మ‌` పూజా హెగ్డే ఒక‌రు. `రాధే శ్యామ్`, `ఆచార్య‌`, `బీస్ట్` (త‌మిళ్), `భాయీజాన్` (హిందీ), `స‌ర్క‌స్` (హిందీ).. ఇలా ప్ర‌స్తుతం ఐదు బిగ్ టికెట్ ఫిల్మ్స్ లో నాయిక‌గా న‌టిస్తోంది పూజ‌. ఇదిలా ఉంటే.. త్వ‌ర‌లో ఈ టాలెంటెడ్ బ్యూటీ.. కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ కి జంట‌గా న‌టించ‌బోతోంద‌ని ప్ర‌చారం సాగుతున్న సంగ‌తి తెలిసిందే. `తొలిప్రేమ‌` ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించ‌నున్న బైలింగ్వ‌ల్ మూవీ కోస‌మే ధ‌నుష్ కి జోడీగా పూజ ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే.. విద్యావ్య‌వ‌స్థ‌లోని లోపాల‌పై పోరాటం చేసే ఓ యువ‌కుడి క‌థ‌గా ఈ సినిమా తెర‌కెక్క‌నుందని, ఇందులో పూజా హెగ్డే జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని బ‌జ్. అంతేకాదు.. క‌థానాయ‌కుడి పాత్ర‌కి దీటుగా ఉండే ప‌వ‌ర్ పుల్ రోల్ ఇద‌ని వినికిడి. మ‌రి.. ఈ క‌థ‌నాల్లో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, ఈ ఏడాది చివ‌ర‌లో లేదా వ‌చ్చే సంవ‌త్స‌రం ఆరంభంలో ధ‌నుష్ - వెంకీ అట్లూరి సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని స‌మాచారం. అంత‌కంటే ముందే.. శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేష‌న్ మూవీని ప‌ట్టాలెక్కించ‌నున్నాడు ధ‌నుష్.