English | Telugu
సిద్ధార్థ్ దర్శకుడితో సిద్ధు సినిమా.. ఇదెక్కడి కాంబోరా బై!
Updated : Aug 10, 2023
'డీజే టిల్లు'తో టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యాడు సిద్ధు జొన్నలగడ్డ. త్వరలో ఈ యంగ్ హీరో.. 'టిల్లు స్క్వేర్' తో పలకరించనున్నాడు. ఇదిలా ఉంటే, తాజాగా సిద్ధు ఓ కొత్త సినిమాని షురూ చేశాడు. సిద్ధార్థ్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ 'బొమ్మరిల్లు'తో దర్శకుడైన భాస్కర్ ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు. 'ఛత్రపతి', 'అత్తారింటికి దారేది' వంటి సంచలన చిత్రాలను నిర్మించిన బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
గురువారం (ఆగస్టు 10) శ్రీకారం జరుపుకున్న ఈ మూవీకి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా.. మరో అగ్ర నిర్మాత దిల్ రాజు కెమెరా క్విచ్ఛాన్ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ వెళ్ళనున్న ఈ మూవీ.. వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రాబోతోంది.
కాగా, భాస్కర్ శైలికి ఏ మాత్రం మ్యాచ్ కాని ట్రాక్ సిద్ధుది కావడంతో.. "ఇదెక్కడి కాంబోరా బై" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. సిద్ధార్థ్ తో మ్యాజిక్ చేసినట్లే.. సిద్ధు జొన్నలగడ్డతోనూ భాస్కర్ సంచలనం సృష్టిస్తాడేమో చూడాలి.