English | Telugu
'బిజినెస్ మేన్' కలెక్షన్ల సునామీ.. రీ-రిలీజ్ లో సరికొత్త రికార్డులు!
Updated : Aug 10, 2023
ఊహించినట్లుగానే రీ-రిలీజ్ లో 'బిజినెస్ మేన్' సినిమా సంచలన ఓపెనింగ్స్ రాబట్టింది. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ కలెక్షన్స్ పరంగా రూ.3.62 కోట్లతో 'ఖుషి', రూ.2.90 కోట్లతో 'సింహాద్రి' టాప్ లో ఉండగా.. ఇప్పుడు 'బిజినెస్ మేన్' ఏకంగా రూ.4.37 కోట్లతో సత్తా చాటింది.
మహేష్ పుట్టినరోజు(ఆగస్టు 9) సందర్భంగా 'బిజినెస్ మేన్' చిత్రాన్ని రీరిలీజ్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ చూసే ఈ సినిమా సంచలన వసూళ్లు రాబట్టడం ఖాయమనే అంచనాలు వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్లుగానే ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ వచ్చాయి. రీరిలీజ్ లో నైజాంలో ఇప్పటిదాకా ఖుషి, జల్సా, సింహాద్రి మాత్రమే కోటికి పైగా గ్రాస్ రాబట్టాయి. ఒక్క సినిమా కూడా రెండు కోట్ల మార్క్ ని అందుకోలేదు. అలాంటిది 'బిజినెస్ మేన్' ఏకంగా రూ.2.46 కోట్లు రాబట్టింది. ఇక ఆంధ్రాలో రూ.1.56 కోట్లు, సీడెడ్ లో రూ.35 లక్షలు రాబట్టగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొదటిరోజు రూ.4.37 కోట్ల గ్రాస్ సాధించింది.