English | Telugu

పెళ్లిపై విజ‌య్ దేవ‌ర‌కొండ క్లారిటీ

టాలీవుడ్‌కి చెందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ హీరోస్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక‌రు. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన లేటెస్ట్ మూవీ ‘ఖుషి’. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కింది. సెప్టెంబర్ 1న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతోన్న ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి, అమ్మాయి మ‌ధ్య వ‌చ్చే మ‌న‌స్ప‌ర్ధ‌లు ఎలా ఉంటాయి.. వాటిని వారెలా అధిగ‌మించార‌నే కథాంశంతో ‘ఖుషి’ సినిమా రూపొందింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జ‌త‌గా స‌మంత న‌టించింది. ట్రైల‌ర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. దీంతో సినిమాపై ఉన్న అంచ‌నాలు మ‌రింతగా పెరిగాయి. ఈ నేప‌థ్యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడుతూ ప‌లు ప్ర‌శ్న‌ల‌పై రియాక్ట్ అయ్యారు. వాటిలో పెళ్లికి సంబంధించిన ప్ర‌శ్న కూడా ఉంది. దానిపై కూడా రౌడీ స్టార్ స్పందించారు.

ఇంత‌కీ పెళ్లి ఎప్ప‌డు చేసుకుంటార‌నే ప్ర‌శ్న‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ స్పందిస్తూ ‘‘ఒక‌ప్పుడు పెళ్లి గురించి మాట్లాడాలంటే కోపం వ‌చ్చేది. కానీ నేనే ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. నా స్నేహితులంద‌రూ పెళ్లి చేసుకుంటున్నారు. వారంద‌రినీ క‌లిసిన‌ప్పుడు మ్యారేజ్ త‌ర్వాత లైఫ్ గురించి మాట్లాడుకుంటాం. పెళ్లి త‌ర్వాత భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య చిన్న చిన్న గొడ‌వ‌లు వ‌స్తుంటాయి. అయితే వాటిని దాటి వెళ్లాలి. పెళ్లి జీవితాన్ని ఆస్వాదించాలి. వేరే వాళ్ల జీవితంలోని స‌మ‌స్య‌ల‌ను చూసి మ‌నం భ‌య‌ప‌డ‌కూడ‌దు. మ‌రో మూడేళ్ల‌లో క‌చ్చితంగా పెళ్లి చేసుకుంటాను’’ అని తెలిపారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న ప్రేమ‌లో ఉన్నారంటూ వార్త‌లు ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రౌడీ స్టార్ పెళ్లిపై చెప్పిన స‌మాధానం నెట్టింట వైర‌ల్ అవుతుంది. విజయ్ పెళ్లి చేసుకుంటానని చెప్పారు కానీ.. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటానా లేక ప్రేమ పెళ్లి చేసుకుంటానా అని మాత్రం చెప్పలేదు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .