English | Telugu
తొలి తెలుగు హీరో మహేష్ మాత్రమే.. ఫ్యాన్స్ అరుదైన గిఫ్ట్
Updated : Aug 10, 2023
స్టార్ హీరోలకు అభిమానులే బలం. అభిమాన కథానాయకుడి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదనే సంగతి అందరికీ తెలిసిందే. సాధారణంగా అగ్ర హీరోల పుట్టినరోజు సందర్భంగా రక్తదాన చేయటం, అన్నదానం, పళ్లు పంచటం వంటి పనులు చేసే అభిమానులను మనం చూసే ఉంటాం. అయితే తాము అందుకు పూర్తిగా భిన్నం అని అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్. ఎందుకంటే ఈసారి మహేష్ బర్త్ డే సందర్భంగా వారు తమ ఫేవరేట్ హీరోకి అరుదైన గిఫ్ట్‌ను అందించారు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా!.. నక్షత్ర మండలంలోని ఓ స్టార్‌కి మహేష్ బాబు అని పేరు పెట్టటమే కాదు..దాన్ని రిజిష్టర్ కూడా చేయించారు.
నిజంగా టాలీవుడ్ హీరో పేరుని ఓ నక్షత్రానికి పెట్టటం ఇదే తొలిసారి. మరి దీన్ని ఫ్యూచర్‌లో ఎవరెవరు ఫాలో అవుతారో చూడాలి మరి. సూపర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన ఈ పని నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. మహేష్ బాబు పేరు మీద నక్షత్రానికి పేరు పెట్టి రిజిష్టర్ చేయించిన ఫామ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఏడాది 48వ బర్త్ డే జరుపుకుంటోన్న మహేష్‌కి అభిమానులు, సినీ సెలబ్రిటీలు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాను నుంచి మహేష్ పుట్టినరోజు సందర్భంగా పాట విడుదలవుతుందని అందరూ భావించారు. కానీ.. అలాంటిదేమీ జరగలేదు. సింపుల్‌గా ఓ పోస్టర్‌ను మాత్రమే విడుదల చేశారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయబోతున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.