English | Telugu

'గుడుంబా శంకర్' రీ-రిలీజ్.. మరో 'ఆరెంజ్' అవుతుందా!

2004 లో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం 'గుడుంబా శంకర్'ని ఈ ఆగస్టు 31న రీరిలీజ్ చేస్తున్నట్లు తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ప్రకటించారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్ జంటగా వీరశంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'గుడుంబా శంకర్'. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించిన ఈ చిత్రం 2004 సెప్టెంబరు 10న విడుదలై పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. విజయాన్ని అందుకోనప్పటికీ ఈ సినిమాకి ఎందరో అభిమానులున్నారు. ముఖ్యంగా పాటలు, కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అందుకే హిట్ సినిమా కానప్పటికీ 'గుడుంబా శంకర్' రీరిలీజ్ పట్ల పవన్ అభిమానులు ఆసక్తిగానే ఉన్నారు.

నాగబాబు నిర్మించిన మరో చిత్రం 'ఆరెంజ్' ఇటీవల రీరిలీజ్ అయ్యి మంచి వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా హిట్ కానప్పటికీ, దానిని ఇష్టపడేవాళ్లు ఎందరో ఉన్నారు. అందుకే రీరిలీజ్ లో మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు 'గుడుంబా శంకర్' విషయంలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి.

ఇక 'గుడుంబా శంకర్' ద్వారా వచ్చే డబ్బులను జనసేన పార్టీకి ఫండ్ గా ఇస్తామని నాగబాబు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. "ఆగస్టు 31 మరియు సెప్టెంబర్ 1న.. 'గుడుంబా శంకర్'ని థియేటర్లలో తిరిగి విడుదల చేస్తున్నట్లు మేము సగర్వంగా ప్రకటిస్తున్నాము. 'జల్సా' మరియు 'ఆరెంజ్' టిక్కెట్ అమ్మకాల ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని ఎలాగైతే జనసేన పార్టీకి ఫండ్ గా ఇచ్చామో, అలాగే ఈ చిత్రం ద్వారా వచ్చిన ప్రతీ రూపాయిని జనసేన పార్టీ ఫండ్‌కి అంకితం చేయబడుతుంది" అని నాగబాబు పేర్కొన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.