English | Telugu

రూ.100 కోట్ల డైరెక్ట‌ర్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ..!

నంద‌మూరి అభిమానులు బాల‌కృష్ణ, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తుంటారు. అయితే వారు ఈ మ‌ధ్య కాలంలో మ‌రో వార్త కోసం అంత‌కు మించిన ఆతృత‌తో వెయిట్ చేస్తున్నారు. ఆ వార్త ఏంట‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. నంద‌మూరి ఫ్యామిలీ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌బోతున్న నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం. రెండు, మూడేళ్ల నుంచి ఇదిగో మోక్ష‌జ్ఞ ఎంట్రీ.. అదుగో అప్పుడే అంటూ వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. బాల‌కృష్ణ సైతం మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంద‌ని అంటున్నారు కానీ.. ఎప్పుడ‌నేది క‌చ్చితంగా చెప్ప‌లేక‌పోతున్నారు. ఆ మ‌ధ్య బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ సైతం స‌న్న‌గా మారిన లుక్ నెట్టింట వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి మీడియా స‌ర్కిల్స్‌లో వైర‌ల్ అవుతోంది. ఓ సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడితో ఈ నంద‌మూరి వార‌సుడి సినిమా ఉంటుందని. ఇంత‌కీ ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు.. శ్రీకాంత్ ఓదెల‌. ఈ ఏడాది నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన పాన్ ఇండియా మూవీ ‘ద‌స‌రా’కి శ్రీకాంత్ ఓదెల‌నే డైరెక్ట‌ర్‌. అదే స్టైల్లో రా అండ్ ర‌స్టిక్‌గా మోక్ష‌జ్ఞ‌తో సినిమా చేస్తార‌నే టాక్ అయితే న‌డుస్తోంది. కానీ.. తొలి సినిమాలో నంద‌మూరి క‌థానాయ‌కుడు అంత రా అండ్ ర‌స్టిక్‌గా న‌టిస్తాడా? అనేది కూడా ఆలోచించాల్సిన అంశ‌మే.

మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ మూవీని ఎవ‌రు డైరెక్ట్ చేస్తారా? అనే దానిపై బోయ‌పాటి శ్రీను, క్రిస్‌, అనీల్ రావిపూడి స‌హా ప‌లువురు డైరెక్ట‌ర్స్ పేర్లు వినిపించాయి. తాజాగా ఈ లిస్టులో శ్రీకాంత్ ఓదెల పేరు చేరింది. ఈ సస్పెన్స్‌కి తెర పడాలంటే అభిమానులు, ప్రేక్షకులు కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే మరి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.