English | Telugu

ఎట్టకేలకు ఓటీటీలోకి 'ఆదిపురుష్'

రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన చిత్రం 'ఆదిపురుష్'. ఓంరౌత్‌ దర్శకత్వంలో టి. సిరీస్ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాలతో జూన్ 16న పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. అయితే ఈ సినిమా అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇటీవల కాలంలో దాదాపు సినిమాలన్నీ నాలుగు వారాలకే ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. కానీ 'ఆదిపురుష్' మాత్రం ఎనిమిది వారాల తర్వాత సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఈరోజు(జూలై 11) నుంచి ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుండగా.. హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.

నెగటివ్ టాక్ తో కూడా వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.400 కోట్ల గ్రాస్ తో సత్తా చాటిన 'ఆదిపురుష్'.. ఓటీటీలో ఏస్థాయి ఆదరణ పొందుతుందో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.