నానికి షాకిచ్చిన రామ్ చరణ్.. వెనకడుగు వేస్తాడా..?
'దసరా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రానున్న మూవీ 'ది ప్యారడైజ్'. నాని నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి మంచి స్పందన లభించింది. ఇక ఈ సినిమాని 2026 మార్చి 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'ప్యారడైజ్'తో పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటి, టాప్ స్టార్స్ లీగ్ లోకి వెళ్ళాలని నాని ఆశపడుతున్నాడు. అయితే ఇప్పుడు నానికి రామ్ చరణ్ రూపంలో బిగ్ షాక్ తగిలింది.