English | Telugu

Peddi : సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చిన రామ్ చరణ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'పెద్ది'. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఆరోజు గ్లింప్స్ విడుదల చేయాలని భావించింది మూవీ టీం. కానీ, దానికి సంబంధించిన వర్క్ పూర్తి కాకపోవడంతో ఫస్ట్ లుక్ తో సరిపెట్టింది. దీంతో గ్లింప్స్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారికి సర్ ప్రైజ్ ఇస్తూ.. తాజాగా 'పెద్ది' గ్లింప్స్ కి ముహూర్తం ఖరారు చేసింది చిత్ర బృందం. (Peddi Glimpse)

ఉగాది సందర్భంగా 'పెద్ది' టీం బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. పెద్ది మూవీ గ్లింప్స్ ని శ్రీరామ నవమి కానుకగా ఏప్రిల్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. పోస్టర్ లో బరిలోకి దిగుతున్నట్టుగా జంప్ చేస్తున్న రామ్ చరణ్ స్టిల్ అదిరిపోయింది. ఫస్ట్ లుక్ తోనే మెగా ట్రీట్ ఇచ్చిన దర్శకుడు చరణ్.. ఇక గ్లింప్స్ తో అంతకుమించిన ట్రీట్ ఇవ్వబోతున్నాడని పోస్టర్ తోనే అర్థమవుతోంది.

మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న 'పెద్ది'లో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం, 2026 వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం