English | Telugu
Peddi Glimpse : రామ్ చరణ్ అరాచకం.. బుచ్చిబాబు మామూలోడు కాదు!
Updated : Apr 6, 2025
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'పెద్ది' (Peddi). మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు శ్రీరామ నవమి కానుకగా పెద్ది మూవీ గ్లింప్స్ ని విడుదల చేశారు మేకర్స్. (Peddi Glimpse)
నిమిషం నిడివితో విడుదలైన 'పెద్ది' గ్లింప్స్ మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది. "పెద్ది పెద్ది" అని జనల అరుపుల లోనుంచి రామ్ చరణ్ పెద్దిగా ఎంట్రీ ఇచ్చాడు. "ఒకటే పని సేసేనాకి, ఒకేనాగ బతికే నాకి.. ఇంత పెద్ద బతుకెందుకు?. ఏదైనా ఈ నేల మీదున్నప్పుడే సేసేయాల. పుడతామా ఏంటి మళ్ళీ" అనే డైలాగ్ చెబుతూ చరణ్ ఎంట్రీ అదిరిపోయింది. కేవలం కొన్ని షాట్స్ తోనే పెద్ది ఎంత పవర్ ఫుల్లో చూపించారు. ఇక చివరిలో చరణ్ చేతికి మట్టి పూసుకొని, బ్యాట్ ని మీద కొట్టి, బాల్ ని బలంగా బాదే షాట్ గ్లింప్స్ కే హైలైట్ గా నిలిచింది. గ్లింప్స్ లో విజువల్స్, మ్యూజిక్ ప్రతిదీ కట్టిపడేశాయి. మొత్తానికి దర్శకుడు బుచ్చిబాబు ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడని గ్లింప్స్ తోనే అర్థమవుతోంది. ఇక ఈ మూవీని 2026, మార్చి 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. (Peddi First Shot)
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న 'పెద్ది'లో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది చరణ్ పుట్టినరోజు కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.