English | Telugu
పెద్ది 35 కోట్లు నిజమేనా!
Updated : Apr 1, 2025
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)అప్ కమింగ్ పాన్ ఇండియా మూవీ'పెద్ది'(Peddi).మార్చి 27న చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన టైటిల్,ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో 'పెద్ది'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఫస్ట్ గ్లింప్స్ కూడా శ్రీ రామనవమి(Sriramanavami)కానుకగా ఏప్రిల్ 6న విడుదల కాబోతుంది.దీంతో మెగా అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొని ఉంది.
ఇక 'పెద్ది' ఆడియో హక్కులని ప్రతిష్టాత్మక 'టీ సిరీస్' సొంతం చేసుకుంది.తెలుగుతో పాటు పాన్ ఇండియా లోని అన్ని భాషల హక్కుల్ని సదరు కంపెనీ కైవసం చేసుకుంది.ఇందుకు 35 కోట్ల భారీ మొత్తాన్ని మేకర్స్ కి చెల్లించిందనే వార్తలు వస్తున్నాయి.మరి ఇదే కనుక నిజమైతే తెలుగు సినిమాల్లో అత్యధిక ఆడియో రైట్స్ కి అమ్ముడైన చిత్రం 'పెద్ది' నే అని చెప్పుకోవచ్చు.
స్పోర్ట్స్ నేపథ్యంతో రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న'పెద్ది'లో అన్ని రాగాల ఆటలు ఆడే అట కూలీగా కనిపించబోతున్నాడు.ఈ మేరకు ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి.ఇది నిజమని ఫస్ట్ లుక్ పోస్టర్ తో రుజవయ్యింది.చరణ్ సరసన జాన్వీ కపూర్(Janhvi Kapoor)హీరోయిన్ గా చేస్తుండగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్,వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు(Buchibabu)దర్శకుడు కాగా ఏఆర్ రెహమాన్(Ar Rehman)సంగీతాన్ని అందిస్తున్నాడు.ఈ సంవత్సరమే థియేటర్స్ లోకి అడుగుపెట్టనుంది.