English | Telugu

నానికి షాకిచ్చిన రామ్ చరణ్.. వెనకడుగు వేస్తాడా..?

నానికి షాకిచ్చిన రామ్ చరణ్.. వెనకడుగు వేస్తాడా..?

 

'దసరా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రానున్న మూవీ 'ది ప్యారడైజ్'. నాని నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి మంచి స్పందన లభించింది. ఇక ఈ సినిమాని 2026 మార్చి 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'ప్యారడైజ్'తో పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటి, టాప్ స్టార్స్ లీగ్ లోకి వెళ్ళాలని నాని ఆశపడుతున్నాడు. అయితే ఇప్పుడు నానికి రామ్ చరణ్ రూపంలో బిగ్ షాక్ తగిలింది. (The Paradise)

 

రామ్ చరణ్ (Ram Charan) హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'పెద్ది' (Peddi). శ్రీరామ నవమి కానుకగా తాజాగా ఈ మూవీ గ్లింప్స్ ని విడుదల చేశారు. గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. 2026 మార్చి 27న పెద్దిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. అంటే 'ప్యారడైజ్' విడుదలైన మరుసటి రోజే 'పెద్ది' విడుదల కానుంది. ఇది నానికి బిగ్ షాక్ అని చెప్పవచ్చు.

 

'పెద్ది' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు తన గత చిత్రం 'గేమ్ ఛేంజర్'తో నిరాశపరిచిన చరణ్, ఈ సినిమాతో ఎలాగైనా సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో 'పెద్ది'కి పోటీగా తమ సినిమాని విడుదల చేసే సాహసం నాని చేయకపోవచ్చు. ఒకవేళ ధైర్యం చేసి రిలీజ్ చేసినా.. థియేటర్ల పరంగా, కలెక్షన్ల పరంగా తీవ్ర ప్రభావం ఎదుర్కోక తప్పదు. అసలే నాని 'ప్యారడైజ్'తో పాన్ ఇండియా కలలు కంటున్నాడు. అది నెరవేరాలంటే సోలో రిలీజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇవన్నీ ఆలోచించి నాని తన సినిమాని వాయిదా వేసుకుంటాడో లేక తన కంటెంట్ మీద నమ్మకంతో బరిలోకి దిగుతాడో చూడాలి.