English | Telugu

పెద్ది మ్యూజిక్ డైరెక్టర్ రెండు కోట్లు కట్టాల్సిందే..ఫయాజ్ వసిఫుద్దీన్ కి అనుకూలం

లెజండ్రీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(Ar Rahman)కంపోజ్ చేసిన ఎన్నో హిట్ సాంగ్స్ ల్లో 'వీరారాజవీరా' (Veera Raja Veera)కూడా ఒకటి. ఈ సాంగ్ మద్రాస్ టాకీస్ పై మణిరత్నం(Manirathnam)దర్శకత్వంలో 2023 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2'(ponniyin selvan part 2)చిత్రంలోనిది. జయం రవి, శోభిత అక్కినేనిపై చిత్రీకరణ జరుపుకున్న ఈ సాంగ్ అన్ని భాషల్లోను విశేష ఆదరణ పొందింది.

ఈ 'వీరారాజవీరా’ సాంగ్ ట్యూన్ ని రెహమాన్ కాపీ కొట్టారని ఢిల్లీ హైకోర్టులో సింగర్ 'ఉస్తాద్ ఫయాజ్ వసిఫుద్దీన్ డగర్' కొంత కాలం క్రితం పిటీషన్ వెయ్యడం జరిగింది. తన పిటిషన్ లో చాలా స్పష్టంగా ఆ ట్యూన్ తన తండ్రి ఫయాజుదీన్ డగర్, మామ జాహిరుదీన్ డగర్ సంగీతాన్ని అందించిన 'శివస్తుతి' పాట నుంచి రెహమాన్ కాపీ కొట్టారని పేర్కొన్నాడు. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో తీర్పుని వెల్లడించింది. ఏఆర్ రెహమాన్, మద్రాస్ టాకీస్ సదరు పిటీషన్‌దారుడికి రెండు కోట్ల రూపాయలని చెల్లించాలని తన ఆదేశాల్లో పేర్కొంది.

రెహమాన్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో 'పెద్ది' చేస్తున్న విషయం తెలిసిందే. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ఇటీవల రిలీజవ్వగా, రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి మంచి పేరు వచ్చింది. పొన్నియిన్ సెల్వన్ సాంగ్ విషయంలో రెహమాన్ కి కోర్ట్ షాక్ ఇవ్వడంతో,పెద్ది విషయంలో ఇలాంటివి జరగకుండా ఉండాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .