
Peddi: 'పెద్ది' ఎడిట్ లాక్.. జూన్ 4 కాదు.. ముందుగానే బాక్సాఫీస్ విధ్వంసం!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అభిమానులకు అదిరిపోయే వార్త. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచింది. తాజాగా ఈ సినిమా ఎడిటింగ్ వర్క్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 'పెద్ది' సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. 1980ల నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ గ్రామీణ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో చరణ్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచగా.. తాజాగా సినిమా ఎడిటింగ్ లాక్ అయిందనే వార్త ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. ఏ సినిమాకైనా ఎడిటింగ్ పూర్తవ్వడం అనేది కీలకమైన ఘట్టం. 'పెద్ది' చిత్రానికి సంబంధించి డైరెక్టర్ బుచ్చిబాబు, ఎడిటర్ నవీన్ నూలి అవుట్‌పుట్ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా నిడివి, సీన్ల ఫ్లో అద్భుతంగా కుదిరిందని టాక్. ఇక కేవలం వీఎఫ్ఎక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని సమాచారం. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. చిత్ర యూనిట్ ప్రకటించిన ప్రకారం, జూన్ 4న 'పెద్ది' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అంతకంటే ఒకరోజు ముందు అంటే జూన్ 3న ఓవర్సీస్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భారీ స్థాయిలో ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సమ్మర్ ఎండింగ్లో చరణ్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం చరణ్ కెరీర్లోనే మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పక్కా లోకల్ కథను గ్లోబల్ స్థాయిలో ప్రెజెంట్ చేస్తున్న బుచ్చిబాబు, 'పెద్ది'తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. https://x.com/vriddhicinemas/status/2052277987257749764
May 07, 2026
Sukumar: సుకుమార్ కి కథ చెప్పడం రాదు.. ప్రముఖ హీరో షాకింగ్ కామెంట్స్
సుకుమార్(Sukumar)..ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్.. పాన్ ఇండియా డైరెక్టర్ అనే పేరే కాదు. పాన్ ఇండియా ప్రేక్షకులు సుకుమార్ సినిమా ఎప్పుడు సెల్యులాయిడ్ పై ఎంటర్ ఇస్తుందా అని ఎదురుచూసే పరిస్థితి. ఓవర్ నైట్ ఆ స్థాయిని సంపాదించుకోలేదు. రెండు దశాబ్డల కష్టం ఉంది. అసలు రోజులో రెండు గంటలు మాత్రమే నిద్రపోయి మిగతా సమయం మొత్తం సినిమా గురించే ఆలోచిస్తాడు. అందుకే పాన్ ఇండియా కట్ అవుట్ కి సూటయ్యాడు. వైవిధ్యమైన కథ, కథనానికి కూడా పెట్టింది పేరు. అలాంటి సుకుమార్ కి కథ చెప్పడం రాదని ఒక హీరో అంటున్నాడు. ఆ హీరో ఎవరో చూద్దాం జగపతి బాబు(Jagapathi Babu).. టాలీవుడ్ ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే గాని ఇలాంటి నటుడు పుట్టడు. ఈ నెల 8 న 'గోదారి గట్టుపైన’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రమోషన్లలో మాట్లాడుతు సుకుమార్ నాన్నకు ప్రేమతో కథ చెప్పడానికి తడబడ్డాడు. ‘రంగస్థలం’ కథని కూడా వివరించడానికి గంటన్నర యోగా చేసి వచ్చి, చివరికి ఒక్క నిమిషంలోనే ముగించాడు.అసలు సెట్ లో సీన్ పేపర్ ఇచ్చే వరకు నా క్యారక్టర్ తీవ్రత తెలియలేదు. సుకుమార్ కి ఒక కథని ఎగ్జైటింగ్‌గా నేరేట్ చేయడం అస్సలు రాదు. ఈ విషయాన్ని ఆయన కూడా ఒప్పుకుంటాడు. ఆయన ఏదో గందరగోళంగా చెబుతుంటే నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. కానీ, ఆయన మేకింగ్, విజన్ మీద నమ్మకం ఉంది. ఆయన ఏం తీస్తున్నారో ఆయనకి క్లారిటీ ఉంటుంది. అది చాలు. జగపతి బాబు పేర్కొన్నారు. Aslo read: VIjay: విజయ్ సిఎం అవ్వడు!. ప్రముఖ హీరో శపధం జగపతి బాబు చేసిన ఈ వ్యాఖ్యలు సుకుమార్‌ని విమర్శించడానికి చేసినవి కావు అని సరదాగా చేసినవని అప్పుడే పుట్టిన పసి పిల్లాడిని అడిగినా చెప్తాడు. ఎందుకంటే జగపతి బాబు అనే కట్ అవుట్ మంచి తనానికి, కల్మషం లేని మనసుకి ఫాంట్, షర్ట్ వేస్తే అది జగపతి బాబు. ప్రెజెంట్ సుకుమార్ సమర్పణలో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న రామ్ చరణ్ (Ram Charan)వన్ మాన్ షో 'పెద్ది'(Peddi)లో పవర్ ఫుల్ రోల్ లో జూన్ 4 న తన హవా చాటనున్నాడు.
May 07, 2026.webp)
Tollywood trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు హెడ్ లైన్స్
ఎండలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ సినీ తాజా న్యూస్ మాత్రం ఎప్పడు ఈ ముందు ఉంటాయి అనే రీతిలో ఎక్స్ క్లూజివ్ తెలుగు సినిమా న్యూస్ తమ సినీ పరిమళాల్ని మీ ముందు ఉంచాయి. అవేంటో చూద్దాం. 1. డ్రాగన్ కి జాయిన్ అయిన సంచలన దర్శకుడు దేవ కట్టా మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న 'డ్రాగన్' ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి సంచలన దర్శకుడు దేవకట్టా డైలాగ్ రైటర్ గా వర్క్ చేస్తున్నాడు. పవర్ ఫుల్ డైలాగ్స్ కి దేవకట్టా పెట్టింది పేరు. కమర్షియల్ ఫ్లేవర్ ఉంటూనే సూటిగా, సుతిమెత్తగా, సమాజంలోని అన్ని వర్గాలకి చేరువయ్యేలా దేవకట్టా డైలాగ్స్ ఉంటాయి. 'ప్రస్థానం', 'ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. అందుకే దేవకట్టాని ప్రశాంత్ నీల్ ఎంచుకున్నాడు. మహేష్, రాజమౌళి ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ వారణాసి కూడా దేవకట్టా డైలాగ్స్ అందిస్తున్న విషయం తెలిసిందే . 2. రజినీ, కమల్ బడ్జెట్ వైరల్ ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యంత ఖరీదైన మూవీ ఏదంటే రజినీ, కమల్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. పైగా 47 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనుండంతో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి.ఇప్పుడు ఈ చిత్రం బడ్జెట్ టాక్ ఆఫ్ ది డే గా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం సుమారు 600 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్టుగా తెలుస్తుంది. తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంతి ప్రస్తుత ఎంఎల్ ఏ ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నాడు. జైలర్ సిరీస్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడనే విషయం తెలిసిందే. 3. పెద్ది ఓవర్ సీస్ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ పెద్ది ఓవర్ సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మే 7రాత్రి 8 గంటలకి EST నుంచి ప్రారంభం కానున్నాయి ఆ తర్వాత 7 PM CST , 5 PM PST షోస్ స్టార్ట్ కానున్నాయి. EST , CST ,PST అంటే ఓవర్ సీస్ లో ఉన్న ఏరియాస్. ఈ మేరకు అధికారకంగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ తో ప్రకటించారు. రిలీజ్ కి దాదాపు నెల రోజుల ముందే టికెట్ కౌంటర్లు ఓపెన్ అవుతుండటం విశేషం. దీన్ని బట్టి పెద్ది కోసం ఫ్యాన్స్ ఎంత వెయిటింగ్ తో ఉన్నారో అర్ధమవుతుంది. పెద్ది ఓవర్ సీస్ పంపిణి సంస్థ ప్రత్యంగిర సినిమాస్. 4.జాన్వీకపూర్ పెళ్లి తిరుపతిలో అనే వార్తలపై స్పందించిన బోనీ కపూర్ జాన్వీ కపూర్ తన స్నేహితుడు శిఖర్ పహారియాతో కలిసి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందనే న్యూస్ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కొంత ముందైతే తమకి పెళ్లి ఇన్విటేషన్ వచ్చిన వాళ్లల్లా ఆ ఇద్దరి వివాహం తిరుపతిలో జరగబోతుందనే వార్తలని కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో జాన్వీ తండ్రి బోనీకపూర్ మాట్లాడుతు జాన్వీ పెళ్లి వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. జాన్వీ తన కెరీర్‌పైనే పూర్తి దృష్టి సారించింది. పెళ్లి గురించి ఇప్పుడే ఎటువంటి ప్రణాళికలు లేవని చెప్పుకొచ్చాడు.జాన్వీ నెక్స్ట్ మంత్ 4 న పెద్దితో రానున్న విషయం తెలిసిందే. 5. ఎల్లమ్మలో మృణాల్ ఠాకూర్ బలగం వేణు, దేవిశ్రీప్రసాద్ కాంబోలో ఎల్లమ్మ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ఫిక్స్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. గోల్డెన్ లెగ్ అనే టాగ్ లైన్ తో మృణాల్ వరుస విజయాల్ని సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎల్లమ్మలో మృణాల్ ఖాయమైతే కనుక మరింత క్రేజీ ప్రాజెక్ట్ గా మారడం ఖాయం. ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. ఎల్లమ్మని హిట్ చిత్రాల మేకర్ దిల్ రాజు నిర్మిస్తున్న నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 6.లెనిన్ నుంచి రిలీజైన భాగ్యశ్రీ బోర్సే లుక్ వైరల్ ఈ రోజు మోస్ట్ వాంటెడ్ అందాల ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే పుట్టినరోజు. ఈ సందర్భంగా అఖిల్ తో తాను చేస్తున్న లెనిన్ నుంచి మేకర్స్ భాగ్యశ్రీ లుక్ ఒకదాన్ని రిలీజ్ చేసారు. సదరు లుక్ లో ఒక స్టేజ్ నాటకంలో రాజు వేషాన్ని తలపిస్తు భాగ్యశ్రీ ప్రదర్శిస్తున్న ఆహార్యం, గంబీరమైన రూపం ఫ్యాన్స్, నెటిజన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. లెనిన్ లో భారతిగా కనిపించనుంది. 7.సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి మూవీ క్రేజీ అప్ డేట్.. విలన్ రేసులో ఆ ఇద్దరు సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబోలో మూవీ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుండగా ప్రతి నాయకుడి క్యారక్టర్ కి మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్, ధురంధర్ ఫేమ్ అక్షయ్ ఖన్నాపేర్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆ పేర్లు వైరల్ కావడంతో ఆ ఇద్దరిలో ఎవరైనా తమకి ఓకే అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబోకి దిల్ రాజు నిర్మాత అనే విషయం తెలిసిందే 8.నితిన్ , సితార ఎంటర్టైన్మెంట్స్ కొత్త చిత్రం స్టార్ట్ నితిన్, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ మూవీ పూజా కార్యక్రమాలతో ఈ రోజు అధికారికంగా ప్రారంభమైంది. నారి సిరిసవాడ, సోమశేఖర్ టి దర్శక ద్వయం తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నితిన్ ని వరుస పరాజయాల నుంచి విముక్తి కల్పిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. నితిన్ సరసన మిరాయ్ ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్ గా చేస్తుంది. కంటిన్యూ గా షూటింగ్ ని జరుపుకోనుంది. 99.బాలయ్య, కొరటాల శివ మూవీలో బాలీవుడ్ భామ గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, కొరటాల శివ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ ఖరారైన విషయం తెలిసిందే. హీరోయిన్ గా బాలీవుడ్ నటి విద్యాబాలన్ చేయబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. విద్యాబాలన్ ఇంతకు ముందే బాలయ్యతో ఎన్టీఆర్ కధానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో జతగా చేసి మెప్పించింది. ఇప్పుడు మళ్ళీ ముచ్చటగా మూడోసారి జతకడితే ఫ్యాన్స్ , ప్రేక్షకులకి అంతకంటే భాగ్యం మరొకటి ఉండదని చెప్పవచ్చు. మరి కొన్ని రోజులు అయితే గాని సదరు న్యూస్ పై ఫుల్ క్లారిటీ రాదు 10. మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుండి కీలక ప్రకటన మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుండి కీలక ప్రకటన వచ్చింది. సదరు ప్రకటనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటిలోను కళాకారులకు ప్రాతినిధ్యం వహించే ఏకైక గుర్తింపు పొందిన సంస్థ 'మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాత్రమే. కానీ కొంతమంది వ్యక్తులు మా పేరుని దుర్వినియోగం చేస్తు కళాకారుల నుండి చట్టవిరుద్ధంగా డబ్బు వసూలు చేయడానికి “AP MAA”, “MAA AP” మరియు ఇతర తప్పుదారి పట్టించే పేర్లని ఉపయోగిస్తున్నారు. వాటికి మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి సంబంధం లేదని సుదీర్ఘ నోట్ రిలీజ్ చేసింది.
May 06, 2026
Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లి తిరుపతిలో!.. బోనీ కపూర్ ఇచ్చిన సమాధానం ఇదే
ఎందుకో తెలియదు గాని జాన్వీ కపూర్(Janhvi Kapoor)తన స్నేహితుడు శిఖర్ పహారియాతో కలిసి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందనే న్యూస్ గత కొన్ని రోజుల నుంచి చాలా కాన్ఫిడెన్స్ గానే చక్కర్లు కొడుతుంది. కొంత ముందైతే తమకి పెళ్లి ఇన్విటేషన్ వచ్చిన వాళ్లల్లా ఆ ఇద్దరి వివాహం తిరుపతిలో జరగబోతుందనే వార్తలని కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో జాన్వీ తండ్రి బోనీకపూర్ చెప్పిన మాటలతో వాళ్ళు జాన్వీ పెళ్లి భోజనం తినాలని ఆశపడే వాళ్ళకి టైం పట్టేలా ఉంది. బోనీ కపూర్ కపూర్ మాట్లాడుతు జాన్వీ పెళ్లి వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. జాన్వీ తన కెరీర్‌పైనే పూర్తి దృష్టి సారించింది. పెళ్లి గురించి ఇప్పుడే ఎటువంటి ప్రణాళికలు లేవని చెప్పుకొచ్చాడు. దీంతో పెళ్లి రూమర్స్ సృషించ వాళ్ళకి 'బాగా చెప్పాడు కదా, అర్థమైందా, సరిపోయిందా అనే డైలాగ్స్ తో కూడిన మీమ్స్ ఎదురవుతున్నాయి. Also read: Peddi: పెద్ది అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్.. 8 PM EST,7 PM CST, 5 PM PST బోనీ కపూర్(Boney kapoor)చెప్పినట్టుగానే జాన్వీ పెద్ది(Peddi)తో బిజీగా ఉంది. దేవర తో అదరగొట్టిన జాన్వీ పెద్ది తో తన తల్లి అతిలోక సుందరి శ్రీదేవి స్థానంలో కూర్చోవాలని ఆశపడుతోంది. ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాలు చూస్తుంటే అచ్చాయమ్మా గా పెద్దిని తన అందంతో, చేష్టలతో మూడు చెరువుల నీళ్లు తాగించేలా ఉంది. దీంతో ఆటోమేటిక్ గా ప్రేక్షకులు తన అధీనంలో ఉండటం పక్కా. తన కోరిక నెరవేరడం పక్కా . పెద్ది జూన్ 4 న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. 7 thనుంచి ఓవర్ సీస్ బుకింగ్ స్టార్ట్ కానున్నాయి.
May 06, 2026.webp)
Peddi: పెద్ది అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్.. 8 PM EST,7 PM CST, 5 PM PST
రైరైరా.. రైరారా అని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)అనడమే కాదు అభిమానులు కూడా రైరైరా.. రైరారా అని అంటున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది.పెద్ది నుంచి అదిరిపోయే అప్ డేట్ ని మేకర్స్ వెల్లడి చేశారు. నార్త్ అమెరికాలో మే 7రాత్రి 8 గంటలకి ESTనుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి ఆ తర్వాత 7 PM CST , 5 PM PST కి షోస్ స్టార్ట్ కానున్నాయి. EST , CST ,PST అంటే ఓవర్ సీస్ లో ఉన్న ఏరియాస్. ఈ మేరకు అధికారకంగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ తో ప్రకటించారు అంటే రిలీజ్ కి దాదాపు నెల రోజుల ముందే టికెట్ కౌంటర్లు ఓపెన్ అవుతుండటం విశేషం. దీన్ని బట్టి పెద్ది కోసం ఫ్యాన్స్ ఎంత వెయిటింగ్ తో ఉన్నారో అర్ధమవుతుంది. ఎన్నో హిట్ చిత్రాలని ఓవర్ సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రముఖ పంపిణీ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ పెద్దిని రిలీజ్ చేస్తుంది. Also read: Palash Muchhal: ప్రముఖ సంగీత దర్శకుడిపై ఎస్ సి, ఎస్ టి కేసు.. ఫిర్యాదు చేరిన ప్రముఖ నటుడు వరల్డ్ వైడ్ గా జూన్ 4న థియేటర్లలోకి రానున్న పెద్ది, జూన్ 3న గ్రాండ్ ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా తన రచ్చ స్టార్ట్ చేయనుంది. 1980ల నాటి ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో సాగే పెద్ది లో చరణ్ కి ముక్కు తాడు వేసే అచ్చాయమ్మా గా జాన్వీ కపూర్ చేస్తుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గౌరీ నాయుడు గా నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు.జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక రోల్స్. ఏఆర్ రెహమాన్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని సాంగ్స్ సూపర్ హిట్స్ గా నిలవడంతో మిగతా సాంగ్స్ కోసం అందరు వెయిటింగ్. మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ తో కలుపుకొని వృద్ధి సినిమాస్ నిర్మిస్తుండగా బుచ్చిబాబు(Buchibabu)దర్శకుడు అనే విషయం తెలిసిందే.
May 06, 2026
Peddi: ‘పెద్ది’కి పోటీ లేదు.. పాన్ ఇండియాకు రామ్ చరణ్ పవరేంటో చూపించే టైం వచ్చింది!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi). జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అడ్వాంటేజ్‌ను సొంతం చేసుకోబోతోంది. ఈ ఏడాది జూన్ 4న ‘పెద్ది’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ రిలీజ్ డేట్ ‘పెద్ది’కి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది. తెలుగు రాష్ట్రాల్లో సోలోగా విడుదలవుతోంది. 'టాక్సిక్' పోస్ట్ పోన్ కావడంతో సౌత్ లో ఎటువంటి పోటీ లేదని చెప్పవచ్చు. ఇక నార్త్ ఇండియాలోనూ భారీ బాలీవుడ్ సినిమాల పోటీ లేకపోవడం రామ్ చరణ్‌కు కలిసి రానుంది. ఓపెనింగ్స్ పరంగా ‘పెద్ది’ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఓపెనింగ్స్ కి తగ్గట్టుగా పాజిటివ్ టాక్ తోడైతే.. రామ్ చరణ్ బాక్సాఫీస్ పవర్ పాన్ ఇండియా స్థాయిలో మోతమోగిపోవడం ఖాయం. చిత్ర ప్రమోషన్ల విషయంలో కూడా యూనిట్ చాలా పక్కాగా వ్యవహరిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హీరో హీరోయిన్లు స్వయంగా పాల్గొని సినిమాను ప్రమోట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్‌కు ఉన్న గ్లోబల్ ఇమేజ్, జాన్వీ కపూర్ క్రేజ్ ఈ సినిమాకు నార్త్ బెల్ట్‌లో మంచి మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇతర భాషల్లో కూడా ఆ సమయంలో భారీ రిలీజ్లు లేకపోవడంతో ‘పెద్ది’కి పాన్ ఇండియా రేసులో లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది. మొత్తానికి, బుచ్చిబాబు మార్కు ఎమోషనల్ కంటెంట్ గనుక ప్రేక్షకులకు కనెక్ట్ అయితే, ‘పెద్ది’ మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్‌గా నిలవడం ఖాయం. సరైన రిలీజ్ టైమింగ్, బలమైన ప్రమోషన్లతో మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు.
May 05, 2026పెద్ది గ్లోబల్ ప్రమోషన్స్.. సోషల్ మీడియాలో రామ్‌చరణ్ ఫ్యాన్స్ డిమాండ్!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటిన చరణ్, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రాబోతున్న 'పెద్ది' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో రామ్ చరణ్ అభిమానులు తాజాగా సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాను గ్లోబల్ స్థాయిలో ప్రమోట్ చేయాలని, మార్కెటింగ్ విషయంలో స్పీడ్ పెంచాలని మేకర్స్‌ను డిమాండ్ చేస్తున్నారు. రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని, షూటింగ్ దిశగా అడుగులు వేస్తోంది. అయితే, ఇతర అగ్ర హీరోల సినిమాలతో పోలిస్తే 'పెద్ది' ప్రమోషన్స్ చాలా నెమ్మదిగా ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లో రామ్ చరణ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పెద్ద ఎత్తున పబ్లిసిటీ ప్లాన్ చేయాలని వారు కోరుతున్నారు. ట్విట్టర్ (X) లో #PeddiMarketingBoost మరియు #GlobalPromotionForRC16 వంటి హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. అభిమానుల వాదన ప్రకారం, కేవలం తెలుగు లేదా సౌత్ ఇండియాకు మాత్రమే పరిమితం కాకుండా, ఈ సినిమాను పాన్-వరల్డ్ స్థాయిలో ప్రొజెక్ట్ చేయాలి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ మార్కెట్ వాల్యూ విపరీతంగా పెరిగింది, కాబట్టి ప్రచార చిత్రాలు, అప్డేట్స్ మరియు గ్లోబల్ ఈవెంట్స్ విషయంలో నిర్మాతలు మరింత చురుగ్గా వ్యవహరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సినిమా విజయంలో కంటెంట్ ఎంత ముఖ్యమో, దాన్ని ప్రేక్షకులకు చేరవేయడంలో ప్రమోషన్స్ కూడా అంతే కీలకం. రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్ సినిమాకు ప్రాపర్ మార్కెటింగ్ స్ట్రాటజీ అవసరమని చెప్పడంలో సందేహం లేదు. అభిమానుల ఈ ఆవేదనను గమనించి చిత్ర యూనిట్ రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమోషనల్ ప్లాన్స్‌తో ముందుకు వస్తుందో చూడాలి. 'పెద్ది' ప్రమోషన్స్ గనుక ఊపందుకుంటే, మెగా ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపు అవ్వడం ఖాయం.
May 04, 2026
Peddi vs jailer 2: వామ్మో మరి అంత రేటా.. వర్క్ అవుట్ అవుతుందా!
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)కి ఉన్న స్టార్ డమ్ ఇంచు కూడా తగ్గలేదంటూ నిరూపించిన చిత్రం జైలర్(Jailer). రజినీ వరుస పరాజయాలకి కూడా భారీ సైజులోనే గుమ్మడి కాయ కొట్టింది. అలాంటి ఈ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన జైలర్ 2 పై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. తెలుగునాట కూడా అదే క్రేజ్. ఇప్పుడు తెలుగు బిజినెస్ కి సంబంధించిన ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాకి నూతనోత్సాహాన్ని తీసుకొస్తుంది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం. రజినీ కాంత్ సినిమాలకి తెలుగులో మంచి మార్కెట్ ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల డబ్బింగ్ మరియు పంపిణీ హక్కుల కోసం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. మేకర్స్ జైలర్ సీక్వెల్ తెలుగు హక్కులని 60 కోట్లుగా నిర్ణయించారు. పార్ట్ 1 రెండు తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్ల గ్రాస్ సాధించడంతోనే 60 కోట్లుగా నిర్ణయించారు. కానీ ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే జైలర్ తర్వాత వచ్చిన రజినీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచాయి. కూలీ తెలుగు రైట్స్ మాత్రం 52 కోట్లకి అమ్మగా సుమారు 50 కోట్ల కలెక్షన్స్ దగ్గరే ఆగింది. also read: Janhvi Kapoor: అచ్చాయమ్మా ఇచ్చిపడేసింది.. వ్యూస్ కోసం అలాంటివి రాస్తారా మరి ఇప్పుడు జైలర్ 2 తెలుగు హక్కులని 60 కోట్లకి తీసుకుంటే అంత వసూలు చేస్తుందా అనే చర్చలు మొదలైనట్టుగా టాక్ . పైగా జూన్ 12 న థియేటర్స్ లోకి వచ్చే వారం ముందే చరణ్ జూన్ 4 న 'పెద్ది'తో వస్తున్నాడు. మరి పెద్దికి హిట్ టాక్ వస్తే జైలర్ 2 కి థియేటర్స్ దొరుకుతాయా అనే చర్చ కూడా మొదలైంది. సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్ నిర్మిస్తుండగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు అనే విషయం తెలిసిందే.
May 04, 2026
Janhvi Kapoor: అచ్చాయమ్మా ఇచ్చిపడేసింది.. వ్యూస్ కోసం అలాంటివి రాస్తారా
అతిలోక సుందరి తనయ జాన్వీకపూర్(Janhvi kapoor)జూన్ 4 న అచ్చాయమ్మాగా 'పెద్ది'(Peddi)ని ఎన్ని ముప్ప తిప్పలకి గురి చేసిందో తెలియబోతుంది. అభిమానులు అయితే పెద్దితో జాన్వీ అగ్ర హీరోయిన్ గా ఎదగడం పక్కా అనే నమ్మకంతో ఉన్నారు. రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం జాన్వీ కపూర్ మాట్లాడుతూ జీవితంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన తర్వాత ఆల్కహాల్ కి బానిస అయ్యానని చెప్పిందనే మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు ఈ విషయంపై జాన్వీ స్పందించింది. ఆ మాటలేంటో చూద్దాం. మద్యానికి సంబంధించిన వార్తలుని స్క్రీన్ షాట్ తీసి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి 'ఇలాంటి వార్తలు రాయడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా. క్లిక్ బైట్స్ కోసం ఎంతటి అబద్ధాలనైనా ప్రచారం చేస్తారా. నేను ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తాను. ఫిట్నెస్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటాను. కేవలం వ్యూస్ కోసం ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరచడం సరైంది కాదు. కనీస వాస్తవాలని తెలుసుకోకుండా ఇలాంటి క్లిక్ బైట్ వార్తలు రాయడం మానుకోవాలని పేర్కొంది. Also Read: Varanasi: వారణాసికి షాక్ ఇచ్చిన హైదరాబాద్ వాటర్ బోర్డు అధికారులు.. రద్దు తప్పదా! సెలబ్రిటీల గురించి వార్తలు రాసేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని, కేవలం సంచలనం కోసం అబద్ధాలను ప్రచారం చేయకూడదని నెటిజన్లు కూడా జాన్వీకి మద్దతు తెలుపుతున్నారు.
May 04, 2026
Peddi: పెద్ది మూవీ విడుదలకు అడ్డంకులు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రీసెంట్ గా విడుదలైన 'జెట్లీ' సినిమా ప్రదర్శనను కొన్ని స్క్రీన్స్ లో నిలిపివేయడం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. తాజాగా జరిగిన 'జెట్లీ' (JETLEE) మూవీ సక్సెస్ మీట్లో నిర్మాత చెర్రీ పాల్గొని, ఈ ఇష్యూపై స్పందించారు. 'పెద్ది' (Peddi) వంటి భారీ చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంతో ఈ సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుందనే దానిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వివాదానికి అసలు కారణం ఏమిటి? సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా పర్సెంటేజ్ బేసిస్‌లో సినిమాలు ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. అంటే టికెట్ ఆదాయంలో తమకు నిర్ణీత వాటా ఉండాలని వారి వాదన. అయితే, మే 1 నుంచి ఈ పద్ధతిని అమలు చేస్తేనే థియేటర్లు ఇస్తామని ఎగ్జిబిటర్లు భీష్మించుకోవడంతో సమస్య మొదలైంది. దీనివల్ల 'జెట్లీ' సినిమా విడుదల రోజు ఇబ్బందులు ఎదుర్కొంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సెంటేజ్ సిస్టమ్ కి ఒప్పుకోకపోతే.. మల్టీప్లెక్స్ లోనూ ప్రదర్శించబోమని కొందరు షాకిచ్చారు. నిర్మాత చెర్రీ వివరణ: హైదరాబాద్‌లో జరిగిన 'జెట్లీ' సక్సెస్ మీట్లో పాల్గొన్న చెర్రీ, ఈ సమస్యపై స్పష్టత ఇచ్చారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు ఏప్రిల్ 30 రాత్రి వరకు జరిగినా ఒక కొలిక్కి రాలేదని ఆయన తెలిపారు. "సింగిల్ స్క్రీన్లలో ఏవైనా సమస్యలు ఉంటే అక్కడే పరిష్కరించుకోవాలి కానీ, మల్టీప్లెక్స్ స్క్రీన్లను అడ్డుపెట్టుకుని ఒత్తిడి తీసుకురావడం సరికాదు" అని డిస్ట్రిబ్యూటర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ఆయన ప్రస్తావించారు. థియేటర్ల సమస్యను పరిష్కరించేందుకు మే 8న ఒక ముఖ్యమైన మీటింగ్ జరగబోతోందని ఆయన వెల్లడించారు. ఈ మీటింగ్‌లో ఇండస్ట్రీ పెద్దలందరూ కూర్చుని చర్చించి ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. 'పెద్ది' విడుదలపై ప్రభావం ఉంటుందా? రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం 'పెద్ది' జూన్ 4న విడుదల కానుంది. ఈ సినిమాపై కూడా ఈ వివాద ప్రభావం ఉంటుందా? అన్న ప్రశ్నకు చెర్రీ సమాధానమిస్తూ.. మే 8న ఫిల్మ్ ఛాంబర్లో ఒక కీలక సమావేశం జరగనుందని, అప్పుడు ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 'జెట్లీ' ప్రదర్శనలకు ఎగ్జిబిటర్లు అంగీకరించారని.. నిర్మాతలైనా, ఎగ్జిబిటర్లైనా ఒకే కుటుంబం వంటి వారని ఆయన పేర్కొన్నారు. సినీ పరిశ్రమ నిలబడాలంటే అటు నిర్మాతలు, ఇటు ఎగ్జిబిటర్లు సమన్వయంతో ముందుకు సాగాలి. 'జెట్లీ' వంటి చిన్న సినిమాల నుంచి 'పెద్ది' వంటి భారీ చిత్రాల వరకు అందరికీ థియేటర్ల మద్దతు అవసరం. మే 8న జరగబోయే చర్చలతో ఈ వివాదం ముగిసి, టాలీవుడ్ సాధారణ స్థితికి చేరుకుంటుందని అందరూ భావిస్తున్నారు.
May 02, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



