రామ్ చరణ్ చేతికి అల్లు అర్జున్ భారీ ప్రాజెక్ట్!
రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా కమిటై ఉన్నాడు చరణ్. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులతో చరణ్ సినిమాలు చేసే అవకాశముందని వార్తలు వినిపించాయి. ఆ వార్తలను నిజం చేస్తూ.. ముందుగా సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ లాక్ అయినట్లు తెలుస్తోంది.