English | Telugu

దేవర,పుష్ప 2 రికార్డుని క్రాస్ చేసిన పెద్ది..అసలు నిజం ఇదే  

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)ప్రస్తుతం బుచ్చిబాబు సానా(Buchibabu Sana)దర్శకత్వంలో'పెద్ది'(Peddi)అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ నిన్న ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చెయ్యగా అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇప్పుడు ఈ మూవీ గ్లింప్స్ రిలీజైన 24 గంటల్లోనే 36 .05 మిలియన్ల వ్యూస్ ని సాధించి సరికొత్త రికార్డుని నెలకొల్పింది.దీంతో ఇప్పటి వరకు అత్యధిక వ్యూస్ జాబితాలో ఉన్న దేవర 26 .17 మిలియన్లు, పుష్ప 2 20 .45 మిలియన్ల వ్యూస్ రికార్డుని 'పెద్ది' దాటేసాడని అభిమానులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.పెద్ది గ్లింప్స్ కి వస్తున్న రెస్పాన్స్ కి తనతో పాటు చిత్ర బృందం మొత్తం ఎంతో ఆనందపడుతుందని చరణ్ తెలిపాడు.

చరణ్ సరసన జాన్వీ కపూర్ జత కడుతున్న 'పెద్ది'లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(SivarajKUmar)తో పాటు జగపతిబాబు,దివ్యేంద్రు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహ్మాన్(Ar rehman)మ్యూజిక్ అని అందిస్తుండగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ చరణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుంది.2026 మార్చి 27చరణ్ బర్త్ డే కానుకగా పెద్ది ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం