అంకెలతో మాయాజాలం.. సుడోకు పుట్టుక,చరిత్ర తెలుసా..

ఆడుకోవడం అందరికీ ఇష్టం అయితే ఓ వయసు దాటిన తరువాత పిల్లల్లా ఆడుకోలేం. అయితేనేం ఆడుకోవాల్సినవి ఆడుకోవచ్చు. చక్కగా నెంబర్స్ తో కాలక్షేపం చేయచ్చు. సాధారణంగా దినపత్రికలు,  సండే స్పెషల్ బుక్స్ లో నెంబర్స్ తో మ్యాజిక్ చేసే సుడోకు చూసే ఉంటారు. కొందరికి ఈ సుడోకు పూర్తీ చేయడం ఎంతో ఇష్టం. 1నుండి 9 అంకెలను నిలువుగానూ, అడ్డుగానూ ఎటు కూడినా 9 వచ్చేలా, అంకెలు ఏ వరుసలోనూ రిపీట్ కాకుండా  ఉండటం దీని విశిష్టత. ఇది మెదడును చురుగ్గా మారుస్తుంది. తెలివితేటలు పెంచుతుంది. పిల్లలలో చదువుపట్ల ఏకాగ్రతను పెంచుతుంది. ఇలా ఎన్నో ఉపయోగాలున్న సుడోకుకు ఓ రోజును కేటాయించారు. ఈ రోజున సుడోకు గురించి చర్చిస్తారు.  అయితే ఈ సుడోకు ఎప్పుడు ఎక్కడ పుట్టింది? దీని వెనుక చరిత్ర ఏంటి?  పూర్తీగా తెలుసుకుంటే.. 1892లో ఫ్రెంచ్ వార్తాపత్రిక "La Siecle" సుడోకుకు సమానమైన గేమ్‌ను ముద్రించింది, అందులో ప్రతి అడ్డు వరుస,  నిలువు వరుస అన్ని నిర్దేశిత సంఖ్యలను కలిగి ఉండాలి, కానీ సుడోకులా కాకుండా, ఇది 9 కంటే ఎక్కువ సంఖ్యలను కలిగి ఉంటుంది. ఇందులో ఎన్నో గణితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ చెయ్యాల్సి ఉంటుంది.  ఇవి ఎంతో తర్కంతో కూడుకుని ఉంటాయి. ఆ తరువాతి సంవత్సరాల్లో ఇతర ఫ్రెంచ్ పేపర్‌లు ఇలాంటి గేమ్‌లతో ట్రెండ్‌ను వ్యాప్తి చేశాయి. కానీ ఏదీ సుడోకుతో సమానంగా లేదు.  మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో ఆ గేమ్‌ల ప్రజాదరణ క్షీణించింది. 1979లో  ఇండియానా ఆర్కిటెక్ట్ హోవార్డ్ గార్న్స్ "డెల్ మ్యాగజైన్"లో తన స్వంత ఆవిష్కరణ  ద్వారా పజిల్ ను రూపొందించారు. దీన్ని అప్పటిలో "నెంబర్ ప్లేస్" అని పిలిచారు. దాన్నే ఇప్పుడు  సుడోకు అని పిలుస్తున్నారు. అయితే గార్న్స్ తన కనుగొన్న ఆవిష్కరణ అంతర్జాతీయ సంచలనంగా మారడాన్ని చూడకుండానే కన్నుమూశారు.  మిలియన్ల మంది  సుడోకు ఆడే ఆటగాళ్ళతో  మొదటిసారి సుడోకు అనే పేరును పొందింది. 1997లో, హాంకాంగ్ న్యాయమూర్తి వేన్ గౌల్డ్ ప్రత్యేకమైన సుడోకు పజిల్‌లతో కూడిన కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను కనుగొన్నారు. అతను UKలోని వార్తాపత్రికలకు రోజువారీ పజిల్ ఫీచర్‌గా గేమ్‌ను అందించాడు. దీని వల్ల  తొందరలోనే సుడోకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక ఇప్పుడు సుడోకు స్మార్ట్‌ఫోన్ యాప్‌లలో తక్షణమే అందుబాటులో ఉంది.  పేపర్లు మరియు మ్యాగజైన్‌లలో విస్తృతంగా అచ్చవుతోంది. 2013లో వరల్డ్ పజిల్ ఫెడరేషన్ సెప్టెంబరు 9ని అధికారిక అంతర్జాతీయ సుడోకు దినోత్సవంగా ప్రకటించింది.  అప్పటి నుండి  దీనిని జరుపుకుంటున్నారు. బ్రిటీష్ TV స్టేషన్ “ఛానల్ 4” తన టెలిటెక్స్ట్‌లో రోజువారీ సుడోకు పజిల్‌ను చేర్చడం 2005 నుండి ప్రారంభించింది.  ప్రోగ్రామ్ గైడ్ “రేడియో టైమ్స్” వారానికోసారి, 16x16 గ్రిడ్ లతో “సూపర్ సుడోకు”ను ప్రారంభించింది. 2006లో సుడోకు అనే అంశం పై నెంబర్లను చేర్చడం, వరుసలు కూర్చడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ  పీటర్ లెవీ ఒక పాటను క్రియేట్ చేశారు. ఆస్ట్రేలియాలో మిలియన్ డాలర్ల డ్రగ్ ట్రయల్ పన్నెండు మంది జ్యూరీలలో ఐదుగురు సాక్ష్యాలను వినడానికి బదులుగా సుడోకు ఆడుతున్నట్లు కనుగొన్నారు. అప్పుడు ఈ ట్రయల్ రద్దు చేశారు. ఇది 2008లో జరిగింది. 2013లో వరల్డ్ పజిల్ ఫెడరేషన్ సెప్టెంబరు 9ని అంతర్జాతీయ సుడోకు దినోత్సవ వార్షిక తేదీగా నిర్ణయించింది.  ఇందులో  బోలెడు రౌండ్లతో కూడిన ఆన్‌లైన్ పోటీలను నిర్వహిస్తోంది.                                                  *నిశ్శబ్ద.  

శ్రీకృష్ణుడి జీవితం నుండి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకుని ఆచరిస్తే విజేతలు అవుతారు..

ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం ఎనిమిదవ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు.  కృష్ణుడు కేవలం పురాణాల్లోని ఒక పాత్ర, దశావతారాలలోని ఒక దైవం మాత్రమే కాదు. అయన  ఒక తత్వవేత్త, ఎడతెగని కర్మయోగి, తెలివైన వ్యక్తి ,  భవిష్యత్తు గురించి తెలిసినవాడు. కృష్ణుడి గురించి తెలిసిన వారు ఆయనను మార్గదర్శి అని కూడా అంటారు. ఆయన ఆలోచనలు  బోధనలు ఒకకాలానికి సంబంధించినవి కాదు.  ఇవొక నిరంతర ప్రవాహిని లాంటివి. యుగాలు మారినా ఆ వాక్యాలలో శక్తి, అందులో ఉన్న నిజం ఏమాత్రం మారలేదు.  జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా ఎదగాలంటే శ్రీకృష్ణుడి జీవితం నుండి ఈ కింది విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. వాటి గురించి ఆలోచించాలి. వాటిని జీవితంలో ఆచరించాలి. అప్పుడే మనిషి జీవితంలో విజేత అవుతాడు. ప్రతికూల పరిస్థితులలో కూడా పట్టు వదలకూడదు. కృష్ణుడు భగవంతుని స్వరూపం అయినా ఆయన తన జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఎన్నో గండాలనుండి ప్రాణాలు కాపాడుకున్నాడు. రేపల్లెనుండి కంసుడి వరకు ఎన్నో చోట్ల నిందలు, ప్రమాదాలు మోశాడు. కానీ వాటిని అధిగమించాడు. అలాంటి పట్టుదల అందరికీ ఉండాలి. మహాభారతాన్ని తరచి చూస్తే కృష్ణుడు  ఎప్పుడూ శాంతి కోసం పరితపించాడు. కానీ కౌరవ పౌండవుల యుద్దం అనివార్యం అయింది.  కృష్ణుడు అర్జునుడితో ఒకసారి చెబుతాడు. శాంతి కోసం ప్రయత్నించాలి, ఎన్నో ప్రయత్నాలు చేయాలి. ఏనీ సఫలం కాకపోతే చివరి అవకాశంగా మాత్రమే యుద్దాన్ని ఎంచుకోవాలని. ఇదే అందరి జీవితాలకు వర్తిస్తుంది. సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప గొడవలు పడటం, శత్రువులుగా మారడం వల్ల ఎప్పుడూ ఎవరూ ప్రశాంతతను పొందలేరు. గీతోపదేశం తెలుసుకున్న ప్రతి మనిషి తమ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు రావడం చూస్తారు. మనిషి ఐదుక్రియలు, జ్ఞానేంద్రియాలతో సహా మనస్సు ను కూడా జయించాలంటే సాత్వికాహారాన్ని తినాలని చెబుతాడు.  ఇది మనిషికి ధీర్ఘాయువును ఇస్తుంది. ఆరోగ్యం చేకూరుస్తుంది. శరీరం మనసు రెండు స్వచ్చంగా ఉంటాయి. కాబ్టటి సాత్వికాహారం అందరూ తీసుకోవాలి. కృష్ణుడు పాండవులకు మద్దతు ఇచ్చినా కౌరవులకు వ్యతిరేకి మాత్రం కాదు. కృష్ణుడు-జాంబవతులకు పుట్టిన కుమారుడు   సాంబుడు, కౌరవ రాజు అయిన దుర్యోధనుడి కూతురు లక్ష్మణ ను వివాహం చేసుకున్నాడు. దీన్నిబట్టి చూస్తే బంధువుల మధ్య విభేదాలు ఉండవచ్చేమో కానీ బంధాలను మాత్రం తెంచుకోకూడదు. శ్రీకృష్ణుడికి 16వేలా 100 మంది భార్యలు అని అందరూ బుగ్గలు నొక్కుకుంటారు. వీరందరిని నరకాసురుని బారి నుండి రక్షించాడు, వారికి ముక్తి కలిగించడం కోసం భార్యలనే అర్హతను ఇచ్చాడు తప్ప వారందరితో కృష్ణుడు ఎప్పుడూ శారీరక సంబంధం పెట్టుకోలేదు. పైపెచ్చు కృష్ణుడి భార్యలు అనే గౌరవాన్ని వారికి అందేలా చేశాడు. త్రేతాయుగంలో రావణుడిని అంతం అయినా, ద్వాపర యుగంలో కౌరవుల అంతం అయనా ఆడదాన్ని అవమానించినందువల్ల జరిగిన అనర్థాలే అవన్నీ. కాబట్టి ఆడవారిని గౌరవించాలి. వారిని అవమానిస్తే తిరిగి అనుభవించే సమయం వస్తుంది.                                                 *నిశ్శబ్ద.

సర్వేపల్లి రాధాకృష్ణన్.. ఈ విలువైన ఆలోచనలు జీవితానికి సరైన మార్గాన్ని చూపుతాయి!

ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న జరుపుకుంటారు. ఈ రోజు దేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కి అంకితం చేయబడింది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబరు 5, 1888న తమిళనాడులోని చిత్తూరు జిల్లాలోని తిరుటని గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిన్నప్పటి నుంచి మతపరమైన ఆసక్తి ఉన్న వ్యక్తి. అతను మతపరమైన పనిలో లోతైన ఆసక్తిని కలిగి ఉన్నారు. మద్రాసు క్రిస్టియన్ కళాశాల నుండి అత్యున్నత విద్యను అభ్యసించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిన్నతనం నుండి చదవడం, రాయడం పట్ల మక్కువ కలిగి ఉన్నారు. వివేకానంద ఆలోచనలచే బాగా ప్రభావితమయ్యారు. ఆయన పుట్టిన రోజున ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆయన ఆలోచనలు నేటికీ సంబంధించినవి. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఆలోచనలను అనుసరించడం ద్వారా ఏ వ్యక్తి అయినా తన జీవితంలో విజయం సాధించగలడు. రండి, ఆయన అమూల్యమైన ఆలోచనలను తెలుసుకుందాం. రాధాకృష్ణన్  విలువైన ఆలోచనలు: 1.కాలక్రమానుసారం వయస్సు లేదా యవ్వనంతో సంబంధం లేదు. మనం భావించేంత చిన్నవారం లేదా పెద్దవాళ్లం. మన గురించి మనం ఏమనుకుంటున్నాం అనేది ముఖ్యం. 2. ఒక మనిషి రాక్షసుడిగా మారితే అది అతని ఓటమి, ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి అయితే అది అతని అద్భుతం. మనిషి మనిషిగా మారితే అది అతని విజయం. 3. సనాతన ధర్మం కేవలం విశ్వాసం కాదు. ఇది తర్కం, అంతర్గత స్వరం కలయిక, ఇది కేవలం అనుభవించవచ్చు, నిర్వచించబడదు. 4. ఒక వ్యక్తి యొక్క చేతన శక్తుల వెనుక ఆత్మ ఎలా ఉంటుందో, అలాగే పరమాత్మ ఈ విశ్వం యొక్క అన్ని కార్యకలాపాల వెనుక అనంతమైన ఆధారం. 5.దేవుడు మనందరిలో జీవిస్తున్నాడు, అనుభూతి చెందుతాడు. కాలక్రమేణా అతని లక్షణాలు, జ్ఞానం, అందం, ప్రేమ మనలో ప్రతి ఒక్కరిలో వెల్లడవుతాయి. 6.పుస్తక పఠనం మనకు ఏకాంతాన్ని అలవాటు చేస్తుంది. నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. 7. విభిన్న సంస్కృతుల మధ్య వారధిని నిర్మించడానికి పుస్తకాలు సాధనం. 8. మీరు దేనిని విశ్వసిస్తారు. ప్రార్థిస్తారు. మీరు ఖచ్చితంగా దాన్ని పొందుతారు. 9. వ్యక్తి (విద్యార్థి) ఊహాత్మకంగా అలాగే ఆరోగ్యంగా, నమ్మకంగా ఉండాలి. ఇది అతని లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం సుగమం చేస్తుంది. 10.జీవితాన్ని దుర్మార్గంగా చూడటం,  ప్రపంచాన్ని గందరగోళంగా చూడటం తప్పు.

ఉపాధ్యాయ దినోత్సవం.. జ్ఞానప్రదాతకు నీరాజనం..

ఉపాధ్యాయుడు  జ్ఞాన జ్యోతిని వెలిగించి మూర్ఖత్వపు పొరను తొలగిస్తాడు.  నేటికాలం పాఠశాలలో ఉపాధ్యాయులు అయినా, ఒకప్పుడు గురుకులాలలో విధ్యను బోధించే గురువులు అయినా, మంచి చెడులు చెప్పే తల్లిదండ్లులు, అవ్వతాతలు, ఆత్మీయులు, ఆప్తులు అందరూ గురుసమానులే.  అయితే పాఠశాలలో విద్యను బోధించిన ఉపాద్యాయుల గౌరవార్థం ఉపాద్యాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన జరుపుకుంటారు.  ఇదే రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్  జన్మదినం కూడా. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసిన కృషికి, ఆయన సాధించిన  విజయాలకు గుర్తుగా  ప్రతి సంవత్సరం భారతదేశమంతటా  జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోబడుతుంది. సెప్టెంబరు 5, 1888న జన్మించిన డాక్టర్ రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా పనిచేశారు.  ఈయన స్వయానా  పండితుడు, తత్వవేత్త,  భారతరత్న అవార్డు గ్రహీత కూడా.  నిరుపేద తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రాధాకృష్ణన్ తన విద్యాభ్యాసమంతా స్కాలర్‌షిప్‌ల ద్వారానే పూర్తి చేశారు.  తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని సాధించాడు. 1917లో 'ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్' అనే పుస్తకాన్ని రచించాడు.  1931 నుండి 1936 వరకు ఆంధ్రా విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలర్‌గా,  1939లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU) వైస్-ఛాన్సలర్‌గా కూడా పనిచేశాడు. అసలు  ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నారు? మొదటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈయన  సమకాలీన భారతదేశంలోని ప్రముఖ రచయితలలో ఒకరు.  సైద్ధాంతిక, వేదాంత, నైతిక, బోధనాత్మక, మతపరమైన, జ్ఞానోదయం కలిగించే విషయాల నుండి ప్రారంభించి విభిన్న విషయాలపై గణనీయమైన కృషి చేసాడు. ఆయన ఎన్నో ప్రాముఖ్యత కలిగిన,  గుర్తింపు పొందిన పత్రికలలో లెక్కలేనన్ని వ్యాసాలను వ్రాసాడు. భారతదేశంలో మొదటి ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5, 1962న ఆయన 77వ జన్మదినమైన రోజున జరుపుకున్నారు.  ఈయన  ఎడిఫికేషన్  న్యాయవాది,  విశిష్ట దూత, విద్యావేత్త  అన్నింటికంటే గొప్ప ఉపాధ్యాయుడు. డాక్టర్ రాధాకృష్ణన్ 1962లో భారత రాష్ట్రపతి అయ్యాడు. ఆయన  స్నేహితులు,  విద్యార్థులు కొందరు ఆయనను సంప్రదించి  సెప్టెంబర్ 5న తన పుట్టినరోజును జరుపుకోవడానికి అనుమతించమని అభ్యర్థించారు. దీనికి ఆయన స్పందిస్తూ, "నా పుట్టినరోజును నిష్కపటంగా పాటించే బదులు, సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా పరిశీలిస్తే అది నాకు గర్వకారణం." అని చెప్పారు. దీంతో సెప్టెంబర్  5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. రాధాకృష్ణన్ గారి అభ్యర్థన  ఉపాధ్యాయుల పట్ల ఆయనకున్న  ఆప్యాయతను, ఆ వృత్తి మీద ఆయనకున్న అంకితభావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. అప్పటి నుండి భారతదేశం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఒక దేశం  భవిష్యత్తు  ఆ దేశంలో పిల్లల చేతుల్లో ఉంటుంది. అలాంటి పిల్లలను  మార్గదర్శకులుగా భారతదేశ విధిని రూపొందించే భవిష్యత్తు నాయకులుగా ఉపాధ్యాయులు మాత్రమే తయారుచేయగలరు . జీవితంలో ఉపాధ్యాయులు పోషించే సవాళ్లు, కష్టాలు,  ప్రత్యేక పాత్రలను గుర్తించడానికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ప్రైమరీ స్కూల్స్, మిడిల్ స్కూల్స్,  సెకండరీ స్కూల్స్‌లో పనిచేస్తున్న ఉత్తమ  ఉపాధ్యాయులకు  ఈ అవార్డులు అందించబడతాయి.  ఇక వివిధ పాఠశాలలో కూడా ఉపాద్యాయుల  గౌరవార్థం సభలు, సన్మానాలు, విద్యార్థులు చెప్పే కృతజ్ఞతల వేడుకలతో  ప్రతి పాఠశాల ప్రతి కళాశాల  కళకళలాడిపోతుంది. ప్రతి ఒక్కరూ తమ ఉన్నతి కోసం జ్ఞానాన్ని ప్రసాదించిన గురువుకు  కృతజ్ఞతలు చెప్పడం వారి కనీస కర్తవ్యంగా భావించాలి.                                                           *నిశ్శబ్ద.

భయాల స్వరూపాన్ని తెలిపే విశ్లేషణ!!

మనిషిని పిరికివాడిగా చేసేది, లక్ష్యాలకు దూరం చేసేది భయమే. మన భయాలు అర్థరహితం అని చెప్పేందుకు ఓ ప్రయోగం ఉంది. ఓ తరగతిలో టీచర్ చేసిన ప్రయోగం అది. కుర్చీల్లో కూర్చున్న విద్యార్థులను అందరినీ లేచి ఓ వైపు వచ్చి నిలబడమన్నాడు. ఆపై అందరినీ మరో వైపు కు పొమ్మన్నాడు. అడ్డుగా ఉన్న కుర్చీలను దాటుకుంటూ, ఆ వైపు చేరారు విద్యార్థులు. మళ్లీ ఈ వైపు రమ్మన్నాడు టీచర్. అయితే ఈ సారి విద్యార్థుల కళ్లకు గంతలు కట్టాడు. ఆపై నిశ్శబ్దంగా, గదిలో ఉన్న కుర్చీలు తీయించేశాడు. ఇప్పుడు మరో వైపు రమ్మన్నాడు. ఒక్క విద్యార్థి కూడా కదలలేదు. "దారిలో కుర్చీలు, బల్లలు అడ్డుగా ఉన్నాయి. కళ్లకు గంతలు కట్టారు. వాటిని దాటుతూ ఆ వైపు రావటం కష్టం" అన్నారు. చివరికి ఓ విద్యార్థి ధైర్యంగా ముందుకు వచ్చాడు. తడబడుతూ, లేని టేబిళ్ల కోసం వెతుకుతూ అడుగులు వేయటం ఆరంభించాడు. అతడి వల్ల మరి కొందరు ముందుకు వచ్చారు. అయితే, చేతికి ఏమీ తగలకపోవటంతో సందిగ్ధంలో పడి సగంలో ఆగిపోయారు. అన్ని సందిగ్ధాలను మించి, లేని అడ్డంకులను దాటుకుంటూ, అడ్డేమీ లేదని నిర్ధారించుకుంటూ ఒక విద్యార్థి గమ్యం చేరాడు. ఇదీ మనలో నాటుకుపోయిన భయాల స్వరూపం! అక్కడెమీ లేకున్నా లేని అనుమానాలతో ఏదో ఉందని తమని తాము మభ్యపెట్టుకునే వారు చాలామంది. మనం ఏదైనా పని సాధించాలనుకోగానే ముందుగా సందేహాలు ముసురు కుంటాయి. ఆపై అడ్డంకులు గుర్తుకు వస్తాయి. దారిలోని అవరోధాలను స్మరిస్తాం. దాంతో అడుగు ముందుకు వేయం. ఆలోచన ఉంటుంది కానీ అది ఆచరణలోకి రాదు. ఒకవేళ ఆచరణ ఆరంభించినా, మొదటి ప్రతి బంధకంలోనే వెనక్కు తిరుగుతాం. ఎవరైతే ఆలోచనను ఆచరణలో పెట్టటమే కాదు, ప్రతిబంధకాలన్నీ ఊహాత్మకమైనవే తప్ప నిజమైనవి కావు అని గ్రహించి గమ్యం వైపు సాగిపోతారో, వారు తమ గమ్యం చేరుతారు లక్ష్యాన్ని సాధిస్తారు. అందుకే మన పూర్వికులు మనుషులను మూడు రకాలుగా వర్గీకరించారు. 'ఆరంభించరు నీచమానవులు' అన్నారు.. ఎవరైతే ఏదైనా పని చేయాలనుకోగానే, రకరకాల అవరోధాలను ఊహించి, అడ్డంకులను చూసి భయపడుతూ పని ఆరంభించనే ఆరంభించరో వారు అధమస్థాయి మానవులు. ప్రగల్భాలు పలుకుతూ, తాము చేయగల పనులు సాధించగల గొప్ప లక్ష్యాల గురించి మాటలు మాట్లాడతారు తప్ప చేతల దగ్గరకు వచ్చేసరికి అడుగు ముందుకు పడదు. తాము అడుగు ముందుకు వేయకపోవటమే కాదు ఇతరులనూ అడుగు ముందుకు వేయనీయరు వీరు. అందుకే వీరు నీచమానవులయ్యారు. ఇక్కడ 'నీచం' అంటే 'చెడు' అని కాదు. 'నీచులు' అంటే నేరస్థులు, హంతకులు, మోసగాళ్లు కారు. వారి కన్నా తక్కువస్థాయి వారు వీరు. ఎందుకంటే ప్రతివ్యక్తికీ కర్తవ్యపాలన తప్పని సరిగా పాటించవలసిన ధర్మం అని భగవంతుడు నిర్దేశించాడు. అది సాధించదగ్గదా, అందుబాటులో ఉన్నదా అన్నది కాదు ముఖ్యం. కర్తవ్య నిర్వహణ ముఖ్యం. అటువంటి కర్తవ్యనిర్వహణను విస్మరించే వారంతా నీచులే. వారు ధనవంతులు కావచ్చు, విజ్ఞానవంతులు కావచ్చు. నాయకులు కావచ్చు. ఇంకెవరైనా కావచ్చు. స్వధర్మాన్ని పాటించకుండా, కర్తవ్యనిర్వహణను విస్మరిస్తే వారు నీచులే అవుతారు. ఇలా మనుషుల్లో మొదటి రకం వారు నీచులుగా గుర్తించబడ్డారు.                                     ◆నిశ్శబ్ద.

ఈ రెండు తప్పులు చేస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు!

ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదోకటి సాధించాలనే లక్ష్యం పెట్టుకుంటాడు. కానీ వారు  చేసే కొన్ని తప్పులు విజయానికి అడ్డుపడతాయి. చాణక్యుడు తెలిపిన  ఆ తప్పులు ఏంటి..? మీ లక్ష్యాలను సాధించడంలో మీరు చేయకూడని ఆ రెండు తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితం అన్నాక సమస్యలు సర్వసాధారణం. ముఖ్యంగా ఒకలక్ష్యంతో ముందుకు సాగుతున్న వ్యక్తి ఎన్నో సమస్యలను ఎదుర్కొవలసి ఉంటుంది. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మన లక్ష్యం ఎంత పెద్దది అయితే...అన్ని ఎక్కువ సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుందని పేర్కొన్నారు. తన లక్ష్యాన్ని సాధించే మార్గంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి..తన జీవితంలో ఏదో ఒక రోజు గొప్ప విజయాన్ని సాధిస్తాడు. మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే దృఢ సంకల్పం, కఠోర శ్రమ అవసరం. వీటితోపాటు కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ద పెట్టాలి. మనం తీసుకునే చిన్న నిర్ణయం పెద్ద మార్పునకు కారణం అవుతుంది. ఆచార్య చాణక్యుడు చెబుతూ..మన లక్ష్యాలను సాధించేందుకు కొన్ని తప్పులు చేయకూడదని తెలిపారు. అవి ఏంటో చూద్దాం. 1. లక్ష్యం గురించి ఎవరికీ చెప్పవద్దు మనం విజయం సాధించాలంటే దానికి కృషి, ప్రణాళిక, సమయపాలన చాలా అవసరం. ఇవే కాదు విజయం సాధించడానికి చాణక్య ఒక ప్రత్యేక సమాచారాన్ని అందించాడు. జీవితంలో విజయం సాధించాలంటే మన లక్ష్యం గురించి ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే శత్రువు ఎల్లప్పుడూ మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. అలాంటప్పుడు, మన లక్ష్య సాధన గురించి మనం బయటకు చెప్పినప్పుడు.. వారు మన లక్ష్యాన్ని నాశనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ శత్రువు మీ లక్ష్యం గురించి తెలుసుకుంటే,మీకు సమస్యలను లేదా అడ్డంకులు కలిగించవచ్చు. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు తీసుకున్న ప్రణాళికలు,నిర్ణయాల గురించి ఎక్కడా ప్రస్తావించకూడదు. లక్ష్యం సాధించే వరకు రహస్యంగా ఉంచాలని చాణక్యుడు చెప్పాడు. 2. లక్ష్యం నుండి వెనక్కి తగ్గకూడదు  లక్ష్య సాధన కోసం శ్రమించే వ్యక్తిని చాణక్యుడు సింహంతో పోల్చాడు. సింహం తన వేటను చూసి వెనక్కి తగ్గనట్లేదు. ఒక లక్ష్యాన్ని సాధించాలనుకునే వ్యక్తి ఆ దిశగానే అడుగులు వేయాలి తప్ప..వెనక్కు తగ్గకూడదు.  ఎలాంటి పరిస్థితులు ఎదురైనా లక్ష్యం నుంచి వెనక్కి తగ్గకూడదన్నది చాణక్యుడి మాట. చాణక్యుడు ప్రకారం, ఎవరైతే తన పాలసీలో ఈ రెండు అంశాలకు ఎక్కువ శ్రద్ధ వహిస్తారో, ఆ వ్యక్తి తన లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తాడు. 

మనుషుల్లో దేవుడు కావాలంటే.. మీరు ఇలా ఉండాలి..

కొన్ని సార్లు ముఖ పరిచయం కూడా లేనివారు మనకి సహాయం చేస్తే ఆ సమయంలో దేవుడిలా వచ్చి సాయం చేసారు అంటాం. వాళ్ళు చేసేది చిన్నదే అయినా ఆ సందర్భంలో చాలా ఊరట ఇస్తుంది.   బస్ లో అవసరమైన చిల్లర ఇవ్వడం కూడా కావచ్చు,  వృద్ధురాలిని రోడ్డు దాటించడం, ఇంటర్వ్యూకి లేటవుతుందని కంగారుపడుతున్న వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం ఇలాంటివి ఎన్నో రోజువారి జీవితంలో చిన్నవి అనుకుని ఒకరు చేస్తే అది ఆ సమయంలో  ఎదుటివారి  జీవితంలో సంతోషాన్ని నింపవచ్చు. ఏమీ ఆశించకుండా  ఇలా సాయం చేసేవాళ్ళను దేవుడితో సమానంగా పోలుస్తాం.  మనుషుల్లో దేవుడని స్తుతిస్తాం. కేవలం ఇలా  అనుకోవడమే కాకుండా ఇలా మనుషుల్లో కనిపించే దేవుళ్లను తలచుకుంటూ, వారికి కృతజ్ఞతలు  చెప్పుకోవడానికి ఒక ప్రత్యేకమైన రోజును విదేశీయులు ఏర్పాటు చేసుకున్నారు. మంచి ఎవరు చెప్పినా వినాలి అన్న చందాన, మనుషులలో దేవుళ్లను స్మరించుకోవడానికి ఏ దేశాల వారైనా అర్హులే. ఇది కేవలం ఇతరులను తాము తలచుకోవడమే కాదు, తమ మంచితనంతో, మానవత్వపు హృదయంతో అందరూ తమ గురించి గొప్పగా చెప్పుకునే దిశగా ప్రతి ఒక్కరూ జీవించవచ్చు.    ప్రతి సంవత్సరం ఆగస్టు 22వ తేదీని "బీ యాన్ ఏంజెల్ డే " గా జరుపుకుంటారు. వేరొకరికి మంచి చేయాలనే పాజిటివ్ థింకింగ్ పెంచడమే ఈ రోజు ఉద్దేశం. ఇతరులకు మంచి చేయాలని సంకల్పించే ఈ రోజుకి ఒక చరిత్ర కూడా ఉంది. ఏ దేశమయినా, ఏ మతమైనా దేవుడు తప్పనిసరి. ప్రతి మతంలోనూ కొందరు శక్తివంతమైన వ్యక్తులుంటారు. వీరు స్వయానా ఆ దేవుడి ఆశీర్వాదం పొందినవారిగా గుర్తింపబడతారు. వీరిని దైవాంశ సంభూతులుగానూ, దేవదూతలుగానూ సంభోధిస్తారు.  దేవుడి ఆదేశాల మేరకు మనుషులకి సహాయం చేయడానికి మానవ జన్మ ఎత్తారని చెబుతుంటారు.  విదేశీయుల నమ్మిక ప్రకారం రెక్కలతో ఆకాశంలో ఎగురుతున్న దేవదూత వారికి ఎంతో మంచి చేస్తుందని నమ్ముతారు.  మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మన్లతో పోరాడుతున్నప్పుడు బ్రిటిష్ ఫ్రెంచ్ దళాలు అక్కడ దేవదూతల్ని చూసినట్టు చెప్పేవారు.   రెవరెండ్ జేన్ హోవర్డ్ ఫెల్డ్ మెన్ అనే మహిళ దేవదూతలు ఉన్నారని చాలా బలంగా నమ్మేది. దేవదూతలు తనను ప్రభావితం చేశారని ఆమె స్వయంగా చెప్పింది.  ఇందుకోసమే ఆమె 27 సంవత్సరాల క్రితం ప్రజలు చేసే చిన్న చిన్న సహాయాలను  ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరూ దేవదూతలుగా మారవచ్చనే అర్థం ప్రపంచానికి చాటి చెబుతూ ఈ రోజును మొదలుపెట్టింది. ఇన్నాళ్లు దీనికి పెద్ద ప్రాముఖ్యం లేదు కానీ  సోషల్ మీడియా ప్రభావం కారణంగా దీని గురించి ప్రజలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎంతోమంది ఈ రోజుకు ప్రాముఖ్యం ఇస్తున్నారు.   కొన్ని సమయాల్లో మనం చేసే చిన్న సాయం ఎదుటివారి మూడ్ ని మార్చేయవచ్చు. వాళ్ళకి మనుషుల్లో ఇంకా మానవత్వం ఉంది అనే నమ్మకాన్ని కలిగించవచ్చు. ఒక్కోసారి డబ్బు సాయం చేయలేకపోయినా కష్టాల్లో ఉన్న వారికి చిన్న ఓదార్పు,  మనస్ఫూర్తిగా ఒక నవ్వు కూడా ఎంతో ధైర్యం ఇస్తుంది. మనం చేస్తే తిరిగి వాళ్ళు చేస్తారని ఆశించకుండా చేసే సహాయం  మనిషి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో హ్యాపీ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ రోజు ఏం చేయొచ్చంటే.. ఈరోజు వేరొకరికి సహాయం చేయడమే కాదు. చాలా రోజులుగా వేరొకరి మీద ఉన్న కోపాన్ని మరిచిపోవడం, వాళ్లు చేసిన తప్పులను క్షమించేయడం కూడా చేయొచ్చు.  అది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తుంది. అలాగే మనకి రోజువారి పనుల్లో సహాయం చేసే ఎంతోమందికి ఒక చిన్న థాంక్స్ చెప్పొచ్చు. అది వాళ్ళలో మీ పట్ల మంచి అభిప్రాయాన్ని పెంచడంతో పాటు, వాళ్ళు మీ కోసం చేసే పనులు మరింత ప్రేమగా చేస్తారు. కేవలం బయటివారికే కాదు.. ఇంట్లో  పిల్లలకి హోంవర్క్ లో హెల్ప్ చేయడం,  లేదా భాగస్వామికి నవ్వుతూ ఒక గులాబీ పువ్వు ఇవ్వడం ఇద్దరి మద్యా ఉన్న చిన్న చిన్న అపార్థాలను కూడా తొలగిస్తుంది. ఇరుగు పొరుగు వారి విషయంలో ఇగోకు పోవడం, గొడవ పడటం ఆపి  వారిని మనసారా పలకరించవచ్చు. మీకు సమయం ఉంటే దగ్గరలో ఉన్న అనాధాశ్రమంలో ఉన్న పిల్లల్ని కలిసి కాస్త టైం స్పెండ్ చేయొచ్చు. ఇవన్నీ చేయలేకపోయినా కనీసం ఒక మొక్కని నాటొచ్చు. మీరు నాటే మొక్క ఎప్పుడూ మీకు అనుబంధమై ఉంటుంది. సరిగ్గా గమనిస్తే అది కూడా మీతో సంభాషిస్తున్నట్టే ఉంటుంది.  ఇది చాలు కదా. ఒక మనిషిని మనిషిగా ఉంచడానికి. వేరొకరి దృష్టిలో  గొప్ప వ్యక్తిగా ఉంచడానికి.

మీరు విజయవంతమైన వ్యక్తి కావాలంటే ఈ లక్షణాలు మీలో ఉండాలి!

భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ప్రతి సలహా మానవ జీవితానికి ఉపయోగపడుతుంది. జీవితంలో విజయం సాధించాలనుకునేవాళ్లు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలని శ్రీకృష్ణుడు చెప్పాడు. భగవద్గీత ప్రకారం విజయం సాధించాలంటే ఏయే విషయాలను గుర్తుంచుకోవాలి..? శ్రీమద్ భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంథాలలో ఒకటి. ఈ గీతలో శ్రీకృష్ణుని బోధనలు వివరించాయి. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన కొన్ని ఉపదేశాలను భగవద్గీతలో ప్రస్తావించారు. గీతలో ఇవ్వబడిన బోధనలు నేటికీ ఉన్నాయి. భగవద్గీతలో పేర్కొన్న సూత్రాలను మన జీవితంలో అలవర్చుకున్నట్లయితే ఎంతో పురోగతిని సాధించవచ్చు. శ్రీమద్ భగవద్గీతలో, శ్రీ కృష్ణుడు విజయం సాధించేందుకు  అనేక మార్గాలను పేర్కొన్నాడు. భగవద్గీత ప్రకారం, మనం కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే తప్పకుండా అందులో విజయం సాధించవచ్చు. ఆ భగవద్గీత బోధనలు చూద్దాం.. పని మీద నమ్మకం ఉండాలి: శ్రీమద్ భగవద్గీత ప్రకారం, ఫలాన్ని ఆశించకుండా పని చేసేవాడు జీవితంలో విజయం సాధిస్తాడు.  ఉద్యోగంలో విజయం సాధించాలంటే, మీ పనులపై దృష్టి పెట్టాలి. తన మనస్సులో తన చర్యలతో పాటు ఇతర ఆలోచనలను తెచ్చేవాడు తన లక్ష్యాలను ఎప్పటికీ సాధించలేడు. పనిలో ఎటువంటి సందేహం ఉండకూడదు: భగవద్గీత ప్రకారం, ఒక వ్యక్తి తన చర్యలను ఎప్పుడూ అనుమానించకూడదు. ఈవిధంగా చేయడం వల్ల ఆ వ్యక్తి తన నాశనాన్ని తానే కోరుకుంటాడు. మీరు విజయం సాధించాలనుకుంటే,మీరు చేపట్టిన పనిని ఎలాంటి సందేహం లేకుండా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయండి. అప్పుడే మీరు విజయపథంలో మందుకు దూసుకెళ్లుతారు. మనసు అదుపులో ఉండనివ్వండి: ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే మనసుపై నియంత్రణ చాలా ముఖ్యం అని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పాడు. పని చేస్తున్నప్పుడు, మీ మనస్సు ప్రశాంతంగా  ఉండాలి. కోపం తెలివిని నాశనం చేస్తుంది. అది పనిని పాడు చేస్తుంది. కాబట్టి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అతిగా అనుబంధం ఉండకూడదు: భగవద్గీత ప్రకారం, ఒక మనిషి తన ఆస్తిలో దేనితోనూ అతిగా అనుబంధించకూడదు. ఈ అనుబంధమే మనిషి కష్టాలకు, వైఫల్యాలకు దారి తీస్తుంది. మితిమీరిన అనుబంధం ఒక వ్యక్తిలో కోపం, విచారం యొక్క భావాలను సృష్టిస్తుంది. ఈ కారణంతో వారు తమ పనిపై  మనస్సును కేంద్రీకరించలేరు. అందుకే మనిషి మితిమీరిన అనుబంధానికి దూరంగా ఉండాలి. భయాన్ని వదిలించుకోండి: శ్రీ కృష్ణుడి ప్రకారం, ఏదైనా పనిలో విజయం సాధించాలంటే, ముందుగా మనలోని భయాన్ని పోగొట్టుకోవాలి. ఈ పాఠాన్ని చెబుతూ, శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధంలో భయం లేకుండా పోరాడమని చెప్పాడు. శ్రీకృష్ణుడు అర్జునుడి గురించి ఇలా చెప్పాడు. ఓ అర్జునా... యుద్ధంలో మరణిస్తే స్వర్గం, గెలిస్తే భూరాజ్యం  లభిస్తుంది. కాబట్టి మీ మనసులోని భయాన్ని వదిలించుకుని ముందుకు సాగుతే విజయం మీదే అవుతుంది.

పెద్దలంటే భారం కాదు బాధ్యతని చాటి చెప్పే సీనియర్ సిటిజన్స్ డే!

వృద్ధాప్యం.. ప్రతి మనిషికి తప్పని దశ.  మనిషికి అంతిమ దశ కూడా ఇదే.. ఇక జీవితం ముగింపుకు వచ్చిందని, వృద్దులు కాటికి కాళ్ళు చాపుకున్నవారని చాలామంది అర్థం చేసుకుంటూ ఉంటారు.  బాల్యం, కౌమరం, యవ్వనం, నడివయసు ఎలాంటివో వృద్ధాప్యం కూడా అలాంటిదే. కానీ వృద్ధులను చాలామంది చిన్న చూపు చూస్తుంటారు, శక్తి కోల్పోయి, బిడ్డల మీద ఆధారపడే  నిస్సహాయులుగా ఎంతోమంది వృద్దులు ఈ సమాజంలో బ్రతుకు  వెళ్లదీస్తున్నారు. తమ జీవితాన్ని త్యాగం చేసి బిడ్డలకు జీవితాన్నిచ్చిన వృద్ధుల గురించి ఈ సమాజం, ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి  పెద్దవారి కోసం, వారి బాగోగుల గురించి చర్చించేందుకు ఒక ప్రత్యేక రోజు ఉండటం నిజంగా సంతోషించాల్సిన విషయం.    ప్రపంచ వ్యాప్తంగా సీనియర్ సిటిజన్స్ డే ప్రతి సంవత్సరం ఆగస్టు 21వ తేదీన జరుపుకుంటారు. ఈ సీనియర్ సిటిజన్స్ డే ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక చరిత్ర ఏంటి  తెలుసుకుంటే.. వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే ని మొదటి సారి 1988లో జరుపుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ఆగస్టు  21ని  సీనియర్ సిటిజన్స్ డే గా అధికారికంగా ప్రకటించారు.  జీవితాంతం తన వారి కోసం జీవించి, చివరి దశలో కూడా తమ అనుభవాలు,  జ్ఞానంతో మంచి భవిష్యత్తును ముందు తరాలకు  అందించే వృద్ధులు సురక్షితంగా, గౌరవంగా బ్రతకడానికి కావలసిన పరిస్థితులు ఉండాలని రోనాల్డ్ రీగన్ కోరుకున్నారు.  కానీ జీవితంలో పసిబిడ్డగా మొదలుపెట్టి కౌమారం, యవ్వనం, నడివయసు నుండి పండిపోయిన వయసులో నిండైన అనుభవాలు, జ్ఞానం సంపాదించిన ప్రతి మనిషి తన జీవితంలో ఉద్యోగ బాధ్యతల నుండి రిటైర్మెంట్ అయితే తీసుకోగలుగుతున్నాడు.  కానీ  ఆ అవసాన దశలో ఆ వ్యక్తి జీవితం నిజంగానే విశ్రాంతిగా ఉంటోందా? ఈ ప్రశ్న వేసుకుంటే చుట్టూ ఎంతో మంది వృద్ధుల జీవితాలు సమాధానాలుగా కనిపిస్తాయి. ఇప్పటికీ చాలా మంది పెద్దవారు రిటైర్మెంట్ తర్వాత  మనవళ్ళను , మనవరాళ్ళను చూసుకోవడంలోనూ, లేదా ఉద్యోగస్థులైన పిల్లల బాగోగులు చూసుకుంటూ గడిపేస్తున్నారు. ఇక ఆడవారైతే ఉద్యోగం నుండి విశ్రాంతి లభించినా ఇంటి పనులతో క్షణం విశ్రాంతి లేకుండా జీవిస్తున్నారు. మరికొందరు పిల్లల ప్రేమాభిమానాలు దొరకక ఓల్డ్ ఏజ్ హోముల్లో ఉండాల్సి వస్తుంది. ఇంకొందరు పెద్దవారు తమ పిల్లలు పట్టించుకోక వదిలేస్తే, పొట్టకూటి కోసం  శక్తికి మించిన పనులు చేసుకుంటూ బ్రతుకు వెళ్లదీస్తున్నారు. దగ్గరగా ఉన్నప్పుడు చాలామందికి పెద్దల విలువ తెలియదు. వారు చేజారిపొక ముందే పిల్లలు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పెద్దవాళ్ళు, తమ పిల్లల కోసం చేసే పనుల్ని భారంగా కాక బాధ్యతలా పంచుకుంటారు. మరి పిల్లలు వారికి అవసరమైన సమయంలో నిజంగానే  చేతిని అందిస్తున్నారా?. అని ప్రశ్నించుకోవలసిన సమయమిది. వృద్ధాప్యం తెచ్చిన నిస్సహాయత వాళ్ళని మన దృష్టిలో నిరుపయోగంగా మార్చేస్తుంది. వారి పనులు కష్టంగా మారిపోతుంటాయి. కానీ వృద్ధులు, పిల్లలు ఒకలాంటి వారేనని అంటారు.  చిన్నతనంలో  అమ్మానాన్న పిల్లలకు చేసే పనుల్లో ఎక్కడా విసుగు ఉండదు. పైగా ఆ పనులు చేయడంలో సంతృప్తిని అనుభవిస్తారు. అదేవిధంగా పెద్దలకోసం ఏదైనా పని చేస్తే అది పిల్లల బాధ్యత అనే విషయం గుర్తించాలి.   చాలమంది పెద్దలు పిల్లల దగ్గర   సహాయం తీసుకోవడానికి మొహమాటపడుతుంటారు. ఇక పెళ్ళి చేసి అత్తారింటికి పంపిన కూతురు నుండి తమ కష్టం చెప్పడానికి కూడా ధైర్యం చేయరు. కానీ కూతుళ్ళు అయినా, కొడుకులు అయినా తల్లిదండ్రుల గురించి, అలాగే అత్తమామల గురించి కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ  "మేమున్నాం. మీకేం కాదు" అనే భరోసా ఇవ్వగలగాలి.  కనీసం ఒక్కరోజు లేదా కనీసం ఒక్క గంట వాళ్ళతో మనసారా నవ్వుతూ మాట్లాడాలి. అది  తల్లితండ్రులు కావచ్చు. లేదా దగ్గర వ్యక్తులు అయిన తాతా, బామ్మలు కావచ్చు. ఖాళీ సమయంలో నెలకి ఒక్కసారయినా వాళ్ళతో మనసు పంచుకోవడం అలవాటు చేసుకోవాలి.  వాళ్ళు కుటుంబ బాధ్యతల్లో పడి చేయలేకపోయిన పనులు చేయడానికి  సహాయం చెయ్యచ్చు. హాబీగా చేయాలనుకుని, నేర్చుకోవాలని కుదరక ఆగిపోయిన పనులు ఈ వృద్దాప్యంలో నేర్చుకోవడానికి సపోర్ట్ చెయ్యడం  వారి వృద్ధాప్య కాలం సజావుగా గడిచిపోవడానికి సహకరిస్తుంది.  అసలు ఈ సీనియర్ సిటిజన్స్ డే ఉద్దేశం  వృద్దులకు  ఉన్న హక్కుల గురించి అవగాహన కలిగించడం. వారు తమ చివరి రోజుల్లో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి  ప్రభుత్వం ఇస్తున్న వనరులు గురించి తెలిసేలా చేయడం. పిల్లల కోసం జీవితంలో ఎన్నో వదులుకుని పిల్లల్ని పెద్ద చేసిన  తల్లితండ్రులు వృద్దాప్యంలో అదే పిల్లల కారణంగా బాధపడకుండా ఉండేలా చేయడం. ఈ విషయాలను వృద్దులకు తెలియజేయడమే కాదు, ప్రతి ఇంట్లో వృద్ధుల గురించి ఆ కుటుంబం వారు ఆలోచించి, వారిని సంతోషంగా ఉంచాలి. ఒకప్పుడు వారి సమయాన్ని లాక్కున్న పిల్లలు, తిరిగి వారికోసం సమయాన్ని కేటాయించాలి. అప్పుడే వృద్ధుల జీవితం భారంగా కాకుండా అనుభవాల ఫలాలను మోస్తున్న నిండు పండ్ల చెట్టులా అందరికీ ఫలాలను అందిస్తుంది.                                           *నిశ్శబ్ద.

విజయవంతమైన వ్యాపారవేత్త కావాలంటే ఈ లక్షణాలు ఉండాలి..!

ఆచార్య చాణక్య ప్రముఖ దౌత్యవేత్త, విజయవంతమైన ఆర్థికవేత్త. తన జీవిత అనుభవాల నుంచి చాణక్యుడి విధానాన్ని రూపొందించాడు. దీనిలో మీకు మెరుగైన జీవితం, విజయాన్ని సాధించడానికి కొన్ని నియమాలు పేర్కొన్నారు. దీని వల్ల మీరు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. ఆచార్య చాణక్యుడి ఈ సూత్రాలను అనుసరించి ఎంతో మంది ప్రపంచంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని నేడు విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా కొనసాగుతున్నారు.  మీరు కూడా విజయవంతమైన వ్యాపారవేత్త కావాలనుకుంటే, ఆచార్య చాణక్య చెప్పిన ఈ విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. 1. విజయం కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవాలి: ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా, మీరు మీ వ్యాపారంలో విజయం సాధించాలంటే, మొదట మీరు రిస్క్ తీసుకునే ధైర్యం కలిగి ఉండాలని గుర్తుంచుకోండి. వ్యాపారంలో హెచ్చు తగ్గులు సర్వసాధారణం. అటువంటి పరిస్థితిలో, మీరు ఈ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే, మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. 2. ఎక్కడైనా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి: ఆచార్య చాణక్య  వ్యాపారాన్ని లోతుగా అధ్యయనం చేశాడు. ఈ అధ్యయనం ఆధారంగా... వ్యాపారానికి సంబంధించిన కొన్ని లక్షణాలను ప్రజలకు నేర్పించే ప్రయత్నం చేశాడు. మంచి వ్యాపారవేత్త ప్రపంచంలోని ఏ మూలలోనైనా వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆచార్య చాణక్య చెప్పారు. అతను లొకేషన్ ఎంపికపై పని చేసే సాహసం చేయకూడదు. ఏ ప్రదేశమైనా పనిచేసి జయిస్తాడన్న ఆశ ఉండాలి. అలాంటి వ్యవస్థాపకులు తమ పనిలో ఎల్లప్పుడూ విజయం సాధిస్తారు. 3. ప్రవర్తన చాలా ముఖ్యం: వ్యాపారవేత్తకు ప్రవర్తన చాలా ముఖ్యమైనది. ఒక వ్యక్తి మంచి ప్రవర్తన కలిగి ఉంటే.. వ్యాపార రంగంలో త్వరగా విజయం సాధిస్తాడు. ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు మాటలు నియంత్రణలో ఉండాలి. ఎదుటివారు చెప్పేవిషయాలను అర్థం చేసుకోవాలి. అనంతరం తదుపరి నిర్ణయం తీసుకోవాలి. విషయాలు విని అర్థం చేసుకున్న తర్వాత స్పందించే వ్యక్తి ఖచ్చితంగా తాను చేస్తున్న వ్యాపారంలో విజయం సాధిస్తాడు.  అందుకే విజయవంతమైన వ్యాపారవేత్తగా ఉండటానికి ప్రసంగంలో మధురంగా ఉండటం.. ప్రసంగాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పైన పేర్కొన్న లక్షణాలను కలిగి ఉన్న ఏ వ్యవస్థాపకుడు లేదా వ్యాపారవేత్త తప్పనిసరిగా అతని పరిశ్రమ లేదా వ్యాపారంలో అభివృద్ధిని పొందుతారు. మీరు కూడా విజయవంతమైన వ్యవస్థాపకులు కావాలనుకుంటే, ఈ లక్షణాలన్నింటినీ మీలో నింపుకోండి.

భార్యాభర్తల బంధాన్ని బిందాస్ గా మార్చే బ్యూటిఫుల్ డే..

ప్రేమ మన తెలుగు సినిమాల్లో, కథల్లో ఎంతో అందంగా చిత్రించబడుతూ ఉంటుంది. ఆ ప్రేమకి సరైన భాష్యం ఇద్దరు వ్యక్తులు ఒక్కటిగా మారడం. మనకి  వాలెంటైన్స్ డే గురించి తెలుసు. ప్రేమికుల ఆరాటం కూడా తెలుసు. ఆ ప్రేమ ఘాడతను వర్ణించడానికి మాటలు చాలవు. కానీ ఈ ప్రేమ ఒకటైనా మనుషులు మాత్రం సమాజం దృష్టిలో వేరుగానే ఉంటారు. ఈ ఇద్దరూ ఒకటైతే ఆవిష్కారమయ్యేదే దాంపత్య బంధం. భార్యాభర్తలను కపుల్స్ అని పిలవడం పరిపాటి. భార్యాభర్తలకు పెళ్లిరోజు తప్ప ఇంకేమీ ఉండవా? ఎందుకుండవ్? భార్యాభర్తలకోసం ప్రతి యేడు ఒక ప్రత్యేకమైన రోజుంది. అదే కపుల్స్ డే. బహుశా దీని గురించి తెలిసినవారు చాలా తక్కువ.  అంతెందుకు  భాగస్వామి గురించి కూడా పూర్తిగా తెలియని వారున్నారంటే ఆశ్చర్యం లేదు. ఆగస్టు 18వ తేదీని నేషనల్ కపుల్ డేగా జరుపుకుంటారు.  చాలా సార్లు  భాగస్వామి పుట్టినరోజు కానీ, పెళ్ళిరోజు కానీ మర్చిపోయి ఉండొచ్చు. బహుశా అది వారికి అంతో ఇంతో బాధను కలిగించి ఉండొచ్చు. ఆ బాధ మొత్తం మాయం చేయడానికి కపుల్ డే బెస్ట్ ఆప్షన్. ఈ ఒక్కసారికి ఈరోజుని మర్చిపోకుండా మీ భాగస్వామికి సర్ప్రైజ్ ఇవ్వండి, మీరే ప్రపంచంగా జీవించే మీ భాగస్వామికి మర్చిపోలేని అనుభూతిని మిగల్చండి.  ఒకప్పటి కంటే భారతదేశంలో ఒకరినొకరు ఇష్టపడి చేసుకునే పెళ్ళిళ్ళు ఎక్కువయ్యాయి. అలాగే పెద్దలు కుదిర్చిన వివాహాల్లో కూడా పెళ్ళి తర్వాత ఒకరి కోసం ఒకరు చేసుకునే అడ్జస్ట్మెంట్లు, బాధ్యతలు పంచుకోవడంతో బంధమే కాదు ఇద్దరి మధ్య ప్రేమ కూడా మరింత పటిష్టం అవుతుంది. మగవారు కూడా నేటి పరిస్థితులకి తగినట్టు మారుతూ ఉండడంతో చాలా జంటలు సంతోషంగా, సంతృప్తిగా జీవిస్తున్నారు. మగవాడిని తల్లి తరువాత తల్లిగా చూసుకునే గొప్ప వ్యక్తి భార్యే.. కపుల్ డే రోజు భాగస్వామిని ఈరోజు బయటికి తీసుకెళ్ళి సంతోషపెట్టాలని ప్రతి భర్తకు ఉంటుంది. కానీ అది కదరచ్చు,  కుదరకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో  ఇంట్లోనే వారికోసం స్పెషల్ సర్ప్రైజ్ ఏర్పాటు చేయడం మగమహారాజుల చేతుల్లో పని. భార్యను సంతోషపెట్టడానికి ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆడవారి సంతోషం ఎప్పుడూ చిన్న చిన్న విషయాలలోనే ఉంటుంది. ఎప్పుడూ ఆఫీస్ వర్క్ తో మీరు, ఇంట్లో పనితో మీ భార్య బిజీగా ఉంటే తనకోసం ఈ ఒక్కరోజు వంట చేయండి. వంట చేయడం రాకపోతే కనీసం నవ్వుతూ కబుర్లు చెబుతూ ఆమెకి వంటలో సహాయం చేయండి. ఇద్దరూ కలిసి వంటగదిలో చేసే వంట మంచి రొమాంటిక్ మీల్ గా మారిపోతుంది.  ఒక మంచి మూవీకి తీసుకువెళ్ళండి. కుదరకపోతే పిల్లలు పడుకున్నాక మీ భాగస్వామితో ఇంట్లోనే మంచి రొమాంటిక్ మూవీ చూడండి. అదీ కుదరకపోతే కనీసం తనతో కాసేపు సరదాగా కబుర్లు చెప్పండి. లేదా తన మాటల్ని శ్రద్ధగా వినండి. ఆ కొన్ని క్షణాల కబుర్లు చాలు. తన కలల ప్రపంచం మీ ముందుంటుంది. లేదా వారి ఆలోచనల లోతు తెలుస్తుంది.  ప్రేమ ఒక దివ్యౌషధంలాంటిది. ప్రేమగా మాట్లాడే ఒక్క మాట ఇరువురిలోనూ ఒక రోజంతా ఉత్సాహంగా గడిపే శక్తిని ఇస్తుంది. ఒక చిన్న హగ్ శరీరంలో ఆక్సిటోసిన్ స్థాయిలు పెంచడంతో పాటు, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. పెళ్ళైన వ్యక్తులపై చేసిన ఒక పరిశోధనలో వాస్కులర్ వ్యాధి వచ్చే అవకాశం 12%తక్కువగా ఉంది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా చేసిన ఒక పరిశోధనలో ప్రేమించిన వ్యక్తి కళ్ళలోకి చూస్తున్నప్పుడు ఇద్దరి హార్ట్ రేట్ ఒకే విధంగా ఉన్నట్టు తేలింది. ప్రేమించడం, ప్రేమను పంచుకోవడం వల్ల బంధం బలపడటమే కాదు, ఆరోగ్యం లాభాలు కూడా ఉన్నాయి మరి. ఇన్ని లాభాలు తెచ్చిన మీ భాగస్వామి తో ఈ కపుల్ డేని పైన చేపుకున్నట్టే కాదు, మీదైన శైలిలో, మీ కొత్త ఆలోచనలతో కూడా జరుపుకోవచ్చు. బంధాన్ని బిందాస్ గా మార్చుకోవచ్చు.                                             *నిశ్శబ్ద.

మనిషి ఆలోచనను తట్టి లేపే దాదాజీ కొండదేవ్ అనుభవం!

భారతదేశంలో ఛత్రపతి శివాజీ పరిపాలిస్తున్న కాలంలో  ఒక సంఘటన జరిగింది. శివాజీకి శస్త్ర విద్య గురువు, సమర్థుడైన సలహాదారు, శ్రేయోభిలాషి అయిన దాదాజీ కొండదేవ్ కు సంబంధించిన ఈ సంఘటన ఆయన ఎంత గొప్ప వారో, మనిషి ఆత్మసాక్షి ఎలా ఉండాలో తెలియజేస్తుంది. ఈ కారణంగానే. శివాజీ ఆయనను ఎంతో గౌరవించేవాడు. ఒక రోజు దాదాజీ కొండదేవ్ ఉద్యానం పక్క నుంచి వెళుతుండగా కాయలతో నిండి ఉన్న మామిడిచెట్టు కనిపించింది. ఆయన దృష్టి ఆ చెట్టు మీద పడింది. కొన్ని కాయలు కోసుకుంటే బాగుండుననే ఆలోచన వచ్చింది. అలాగే మామిడికాయలు కొన్ని కోసుకుని, చేత పట్టుకుని ఇంటికి వెళ్ళాడు. కాయలు భార్య చేతికిచ్చాడు. మామిడికాయలు తీసుకుంటూ "ఇవి ఎవరిచ్చారు?" అని భార్య అడిగింది. "రాజోద్యానంలో నుండి కోసుకుని వచ్చాను” అని ఆయన చెప్పాడు. వెంటనే భార్య, "అనుమతి తీసుకున్నారా?" అని అడిగింది. అప్పటిదాకా చాలా సాధారణంగా ఉన్న దాదాజీ కొండదేవ్ ఆలోచనలో పడ్డాడు , ఆ వెంటనే కొద్దిగా కంగారుపడి, “లేదు” అని చెప్పాడు. "అయితే ఇది దొంగతనం చేసినట్టు కాదా?" అని భార్య అంది. దాదా కొండదేవ్ కు తన పొరపాటు తెలిసివచ్చింది. ",నిజమే నేను ఎవరినీ అడగకుండా, నాకు అందుబాటులో ఉన్నాయని తోటలో కాయలు కోసుకొచ్చాను ఇది తప్పే" అనుకున్నాడు. ఏమి చెయ్యాలో అర్థం కాక  భార్యనే సలహా అడిగాడు. “దొంగతనానికి ఉపయోగించే చేతిని ఖండించి వేసుకోవడమే మార్గం. అప్పుడు ఇలాంటి పొరపాటు మరోసారి జరగదు" అని ఆమె సలహా ఇచ్చింది. ఇది విన్నవెంటనే దాదాజీ కొండదేవ్ తన ఒర నుండి కత్తిని లాగాడు. తన చేతిని ఖండించుకోబోయాడు. అంతలో భార్య తన భర్త చేతిని పట్టుకుని "ఈ రోజు నుండి ఈ చేతులు మీవి కాదు. ఇవి దేశానికి సంబంధించినవి. వీటిని దేశశ్రేయస్సు కోసమే ఉపయోగించాలి" అని చెప్పింది.  “కానీ ఈ చేతులు నేరం చేసినట్లు అందరికి తెలియాలి కదా! ఎలా?" అని దాదాజీ కొండదేవ్ అడిగాడు. "అందుకు మీ చొక్కా చేతులను ఖండించవచ్చు. అలా ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు" అని ఆమె చెప్పింది. దాదాజీ కొండదేవ్ అలాగే చేశాడు. మరునాడు ఆయన చేతులు లేని చొక్కా ధరించి దర్బారుకు వెళ్ళాడు. అది చూసి అందరూ పరిహాసం చేశారు. అసలు కారణం తెలుసుకొన్న తరువాత సభికులంతా ఎంతో ప్రభావితమయ్యారు. అప్పటి నుండీ దాదాజీ కొండదేవ్ తన జీవితంలో ఎన్నడూ చేతులున్న చొక్కాలను ధరించలేదు. సమాజానికి చెందిన సంపదను దాని విలువ చెల్లించకుండా సొంత పనుల కోసం వాడుకోకూడదు. అలా వినియోగించుకుంటే అది దేశం పట్ల, సమాజం పట్ల క్షమించరాని నేరం అవుతుంది. దాదాజీ కొండదేవ్ అనుభవం ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే మనిషికి చేసిన పని పట్ల ఆత్మసాక్షి అనేది ఉంటుంది. దాన్ని అందరూ గుర్తెరగాలి.                                         *నిశ్శబ్ద.

చాణక్యుడు చెప్పిన మాట.. ఈ అయిదు లక్షణాలు ఉన్న వ్యక్తులకు తిరుగు లేదు..

ఒక వ్యక్తి  జీవితం ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది. వీటన్నిటినీ జాగ్రత్తగా డీల్ చేస్తూ జీవితంలో గొప్పగా ఎదగడం అనేది కత్తిసాము లాంటిది. గొప్ప పండితుడు, ఉపాధ్యాయుడు,  నైపుణ్యం కలిగిన దౌత్యవేత్త ఆచార్య చాణక్యుడు. ఈయన తన నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అన్ని అంశాల గురించి ప్రస్తావించారు. ఆచార్య చాణక్యుడు చెప్పిన విధానాలు నేటికీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. ఆయన విధానాలు ప్రజలకు సరైన మార్గాన్ని చూపుతాయి. చాలా సార్లు మనం  ఒక పని చేయడానికి  మన సర్వ శక్తి సామర్థ్యాలు వినియోగిస్తాం. కానీ ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా అందులో విజయం సాధించలేకపోతున్నాం. ఆచార్య చాణక్య ప్రకారం, వైఫల్యం వెనుక వ్యక్తి స్వయం తప్పిదాలు ఉన్నాయి.   ఆచార్య చాణక్యుడు  తన నీతిలో ఇలాంటి ఎన్నో  విషయాలు  చెప్పాడు, వాటిని అనుసరించడం ద్వారా  వ్యక్తి తన వైఫల్యాన్ని  సులభంగా  మార్చుకోవచ్చు. తన ప్రయత్నాన్ని విజయంగా మార్చుకోవచ్చు. మనిషి ఒక ప్రయత్నంలో సక్సెస్ కావాలంటే ఈ అయిదు లక్షణాలు మనిషిలో ఉండాలి. అవేంటంటే.. ఆత్మ విశ్వాసం.. మనిషి జీవితంలో ఆత్మవిశ్వాసం అతి పెద్ద ఆస్తి. ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులు ఏ పనిలోనూ విఫలం చెందరు. చాణక్యుడి ప్రకారం, ఆత్మవిశ్వాసం ఒక వ్యక్తిని అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగిస్తుంది.  కష్టం.. కష్టపడి పనిచేసే వ్యక్తులు ఎప్పుడూ విఫలం కాలేరు. ఒక రోజు కాకపోయినా మరొక రోజు కష్టపడి పని చేసిన ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు, కాబట్టి కష్టం లేకుండా  జీవితాన్ని ఎప్పుడూ మోసం చేసుకోకూడదు.  కష్టపడి పనిచేయడమే విజయానికి ప్రధాన మంత్రం. జ్ఞానం.. మనిషి జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదించినా అది  ఎప్పుడూ వృధా కాదు, అది పుస్తక జ్ఞానం అయినా లేదా ఏదైనా పని చేయడం ద్వారా పొందిన అనుభవ జ్ఞానం అయినా. ఏదో ఒక రోజు,  ఈ అనుభవం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తెలివైన వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఓడిపోడు. డబ్బు.. జీవితంలో మంచి, చెడు అని రెండు సమయాలు, సందర్భాలు వస్తాయి,  పోతాయి. చాలామంది డబ్బుకు మనిషి అధిక ప్రాధాన్యత ఇవ్వకూడదు అని అంటారు. కానీ నేటి కాలంలో బ్రతకాలి అంటే డబ్బు ఎప్పుడూ అవసరం. అందుకే జీవితంలో విజయం సాధించడానికి మనిషి  దగ్గర కూడా డబ్బు ఉండాలి.  అప్రమత్తత జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించాలంటే అప్రమత్తత చాలా ముఖ్యం.  ఎక్కడ నివసించినా,  ఏ పని చేసినా, ఆ ప్రాంతాలను ఓ  కంట కనిపెడుతూ   ఉండాలి. నిశ్శబ్దంగా ఉంటూనే విషయాలన్నీ వింటూ ఉండాలి. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే వ్యక్తి  వైఫల్యాన్ని పొందడం తక్కువ.   ఈ అయిదు లక్షణాలు ఉన్న వ్యక్తి ఏ పనిలో అయినా విజయం సాధించగలడు.                                 *నిశ్శబ్ద.

స్వాతంత్య్రదినోత్సవ వేడుకలో కొత్త ఘట్టం.. ఈ యేడు ఎర్రకోటలో  వేడుక ఇలా  సాగుతుంది..

ఈ దేశం, ఈ నేలా, ఈ ప్రజలు.. పొరుగు దేశాల వారిని ఆదరించినందుకు, ఆశ్రయం ఇచ్చినందుకు.. గొప్పవారిగా కాక, బానిసలనే బిరుదుకు జారిపడ్డారు. సస్యశ్యామలమైన భారతాన్ని చూసి ఎందరికో కన్ను కుట్టింది. మహమ్మదీయులు, పర్షియన్లు, బ్రిటీషు వారు.. ఇలా భారతాన్ని దోచుకోవడానికి ఉపాధి పేరుతో వచ్చి దేశాన్ని దొచుకున్నవారు ఎందరో. వీరిలో బ్రిటీషు పాలకులు దేశాన్ని తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. భారతీయులను తమ బానిసలుగా మార్చుకున్నారు. వీరి పాలన నుండి దేశానికి విముక్తి తీసుకురావడానికి ఎందరో తమ జీవితాలను కోల్పోయారు, ప్రాణాలను సైతం బలిపెట్టారు. వయసుతో సంబంధం లేకుండా.. స్త్రీ, పురుష బేదాల్లేకుండా దేశ  స్వాతంత్య్రం కోసం పోరాడారు. ఈ  పోరాటం అవిరామంగా సాగిన ప్రక్రియ. ఇందులో దేశం యావత్తు ఒక్కటైంది.  భారతావని విముక్తికై ఘోషించింది. రక్తం చిందిన పోరాటాలు. మౌనం, అహింస, సత్యం, ధర్మం మార్గాలలో ట్టెలిపిన నిరసనలు కూడా ఉన్నాయి. మౌనంగా ఉన్నవాడు బలహీనుడు కాదని, అతనే బలవంతుడని భారత పోరాటం నిరూపించింది.  ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. భారతదేశానికి స్వాతంత్య్రం లభించి నేటికి సరిగ్గా 76 సంవత్సరాలు. 1947, ఆగస్టు 14 వ తేదీ, గురువారం అర్ధరాత్రి భారతదేశం కొత్త శకంలోకి ప్రవేశించింది. ఇన్నేళ్ళు ప్రతి యేడూ స్వాతంత్య్ర సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటిలానే ఈ యేడు కూడా ఢిల్లీలోని ఎర్రకోట స్వాతంత్ర్య వేడుకలకు ఎంతో అందంగా ముస్తాబయింది. ఇప్పటికే అక్కడ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇన్నేళ్లు ఒక ఎత్తైతే ఈ ఏడు చాలా ప్రత్యేకత సంతరించుకుంది. దీనికి కారణం  ప్రధాని వెంట నడిచే ఇద్దరు మహిళా అధికారులు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పెద్ద సంఖ్యలో అతిథులను ఆహ్వానించారు. ఈ సమయంలో, ఇద్దరు మహిళలు ఈయన వెంట నడుస్తారు. జాతీయ జెండాను ఆవిష్కరించడంలో ప్రధానమంత్రికి వీరిద్దరూ సహకరిస్తారు. ఈ ఇద్దరు మహిళల పేర్లు మేజర్ నికితా నాయర్, మేజర్ జాస్మిన్ కౌర్. ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించడంలో వీరు ప్రధానికి సహకరిస్తారు. ఇది ఎలైట్ 8711 ఫీల్డ్ బ్యాటరీ (సెరిమోనియల్)  గ్యాలెంట్ గన్నర్లచే 21 గన్ సెల్యూట్‌తో సమకాలీకరించబడుతుంది. సెరిమోనియల్ బ్యాటరీకి లెఫ్టినెంట్ కల్నల్ వికాస్ కుమార్ నాయకత్వం వహిస్తారు. గన్ పొజిషన్ ఆఫీసర్‌గా నాయబ్ సుబేదార్ (ఏఐజీ) అనూప్ సింగ్ ఉంటారు. ఎర్రకోటలో జరిగే వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా దాదాపు 1,800 మందిని ఆహ్వానించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న 'జన్ భగీదారి'కి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ విశిష్ట అతిథులు 660 కంటే ఎక్కువ  గ్రామాలకు చెందిన వారు. వీరిలో  400 మందికి పైగా సర్పంచ్‌లు, రైతు ఉత్పత్తిదారుల సంస్థ పథానికి సంబంధించి 250 మంది, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన,  ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజనకు చెందిన 50-50 మంది వ్యక్తులు పాల్గొంటారు. 50-50 మంది ఖాదీ కార్మికులు, సరిహద్దు రోడ్ల నిర్మాణం, అమృత్ సరోవర్,  హర్ ఘర్ జల్ యోజనతో సంబంధం ఉన్న వ్యక్తులు, అలాగే 50-50 మంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, నర్సులు,  మత్స్యకారులు కూడా ఈ ప్రత్యేక అతిథులలో ఉన్నారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విశిష్ట అతిథులలో కొందరు నేషనల్ వార్ మెమోరియల్‌ని సందర్శించి, ఢిల్లీలో ఉన్న సమయంలో రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్‌ను కలవనున్నారు. అన్ని అధికారిక ఆహ్వానాలు ఆహ్వాన పోర్టల్ (www.aamantran.mod.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో పంపబడ్డాయి. పోర్టల్ ద్వారా 17,000 ఇ-ఇన్విటేషన్ కార్డ్‌లు జారీ చేయబడ్డాయి. ఎర్రకోటకు చేరుకున్న ప్రధానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, రక్షణ కార్యదర్శి గిరిధర్ ఆరామ్నే స్వాగతం పలుకుతారు. డిఫెన్స్ సెక్రటరీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC) ఢిల్లీ ఏరియా, లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ని ప్రధానికి పరిచయం చేస్తారు. దీని తర్వాత GOC ప్రధాని నరేంద్ర మోదీని సెల్యూటింగ్ బేస్‌కు తీసుకువెళుతుంది. ఇక్కడ ఉమ్మడి ఇంటర్ సర్వీసెస్,  ఢిల్లీ పోలీస్ గార్డు ప్రధానమంత్రికి సెల్యూట్ చేస్తారు. దీని తర్వాత ప్రధాని గార్డ్ ఆఫ్ ఆనర్‌ను తనిఖీ చేస్తారు. గార్డ్ ఆఫ్ హానర్‌ను పరిశీలించిన తర్వాత, ప్రధాని ఎర్రకోట ప్రాకారం వైపు వెళతారు. ఆయనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి స్వాగతం పలుకుతారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో ఇద్దరు మహిళలు కీలకంగా ప్రధాని మోడీ వెంట ఉంటూ ఓ కొత్త ఘట్టాన్ని ఆవిష్కరించబోతున్నారు. *నిశ్శబ్ద.

అవాక్కు చేసి చమక్కులు సృష్టించిన కాలం!!

సాంకేతికత ఈ ప్రపంచాన్ని మొత్తం పెద్ద మార్పులోకి తీసుకెళ్లింది. ఎక్కడి ఆదిమానవుడి కాలం ఎక్కడి 5జీ నెట్వర్క్ కాలం. ఉన్నచోటు నుండి కాస్త అంటే ఒక అయిదు ఆరు సంవత్సరాలు వెనక్కు తిరిగి చూస్తే పెద్ద వింతేమీ కాదు అన్నట్టు అనిపించవచ్చు కానీ ఒక్కసారి మన బాల్యానికి, ఇప్పటికి చోటు చేసుకున్న మార్పులు, ఆ మార్పులలో తళుక్కుమన్న మెరుపులు అన్నీ పరిశీలించుకుంటే ఔరా అనిపిస్తుంది. ఇక మరీ ముఖ్యంగా గత పదేళ్లలో జరిగిన మార్పులు అనుహ్యమైనవి. ఒకటి రెండు కాదు ఎన్నెన్నో అద్భుతాలు. వస్తువుల వీరవిహారం!! చిన్ని తెర మీద బొమ్మలు కదులుతూ, శబ్దాన్ని వినిపిస్తూ అందరికీ అద్భుతం కలిగిచింది టీవీ. ఈ టీవీ తెచ్చిన సందడి అంతా ఇంతా కాదు. రెండు మూడు దశాబ్దాల క్రితం టీవీ ఊరికొక్కటో రెండో ఇళ్లలో ఉండేది. మిస్టర్ పెళ్ళాం సినిమాలో అందరూ కట్టకట్టుకుని టీవీ ఉన్న ఇంటికి వచ్చేసినట్టు పిల్లా, జల్లా, ముసలి, ముతకా, కుర్రకారు, మహిళామణులు అందరూ కలసి వనభోజనాలు చేసినంత సంబరంగా చిత్రలహరి పాటలు, సప్తగిరి ఛానెల్ లో సినిమాలు చూసేవాళ్ళు. ఇప్పుడు ఇంటింటికి టీవీ వచ్చి పడ్డాక, దానిలో ఉన్న అపురూపం ఏదో తగ్గిపోయింది. అది కూడా క్రమంగా మార్పులు చెందుతూ స్మార్ట్ టీవీ దశకు వచ్చింది.  సంచలన తరంగం!! ఇదేంటి అని అందరికీ అనిపించవచ్చు. అదే అదే అద్భుతం అని చెప్పుకున్న టీవీ ని కూడా తన్ని మొదటి స్థానం ఆక్రమించిన అరచేతి మాయాజాలం మొబైల్ ఫోన్. నిజానికి కేవలం పదే పది సంవత్సరాల కాలంలో ఈ మొబైల్ రంగంలో వచ్చిన మార్పులు గమనిస్తే ముక్కుమీద వేలేసుకుంటాం. చిన్ని కీప్యాడ్ మొబైల్ ఇంట్లో ఒకే ఒకటి, ఇంకా పక్కింటోళ్లు, ఎదురింటోళ్ల చుట్టాలకు కూడా అదే దిక్కు. అదొక్కటి ఉంటే ఆహా అదే పెద్ద విలాసవంతమైన జీవితం అనుకున్న రోజుల్ని తన్ని తగలేసి ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చేతుల్లోనూ మొబైల్స్. అందునా స్మార్ట్ ఫోన్స్ బీభత్సం మాములుగా లేదు. కొందరు ఈ స్మార్ట్ ఫోన్స్ పుణ్యమా అని ఇంట్లో కూర్చునే డబ్బులు సంపాదిస్తున్నారు. అన్ని రకాల సామాజిక మద్యమాలకు అనుసంధానకర్తగా పెద్దరికం తెచ్చిపెట్టుకున్న అరచేతి బుల్లిపిట్ట మన స్మార్ట్ ఫోన్. వాహనాల వీక్షణం!! ఇంట్లో సైకిల్ ఉంటే అదే గొప్పగా అనుకున్న రోజుల నుండి ఎన్నెన్నో రకాల ఫోర్ వీలర్స్ వచ్చి తగలడ్డాయ్ ఇప్పుడు. బెకార్ గా తిరిగే అబ్బాయి చేతిలో తప్పనిసరిగా బైక్, స్మార్ట్ ఫోన్ ఉండనే ఉంటాయి. అవి కూడా సదరు సినిమాల్లో హీరోలు స్టంట్ లు చేసే కంపెనీలు అయి ఉంటాయి. ఇంటర్ పాసయితే అది, ర్యాంక్ వస్తే ఇది అని పిల్లలు అడగడం కొన్నిచోట్ల కనబడితే పెద్దలే లంచాలు ఆఫర్ చేసేస్తున్నారు. వాటిని ప్రేమగా బహుమతులు అనేస్తారు. అందమా అందమా…అమ్మో అందమా!! అవన్నీ ఒక ఎత్తు అయితే బ్యూటీ ట్రెండ్ మరొక ఎత్తు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాత ట్రెండ్ కు కాసింత నూతనత్వాన్ని, తమదైన సొబగులను అద్ది రెచ్చిపోతున్నారు ఫ్యాషన్ డైజైనర్స్. వాటి ఫలితమే అమ్మాయిలు అందంతో తళుక్కుమని అబ్బురపరుస్తున్నారు. ఈ కోవలో ఒకటి కాదు రెండు కాదు అమ్మాయిలు అంగాంగం ధరించే ఎన్నో వస్తువులు వచ్చి పడ్డాయి. ఇందులో మేకప్ మాయాజాలం గురించి ఎంత చెప్పినా తక్కువే.  ఇంకా ఇంకా!! సంకేతికంగా జరిగిన అభివృద్ధి మొత్తం మానవ జీవితాన్ని సులువు చేసిందని చెప్పవచ్చు. ఇంటిలో ఎన్నో రకాల పనులు సులువుగా జరిగిపోతున్నాయి, రోజులు, నెలల తరబడి సాగాల్సిన పనులు గంటలు, నిమిషాలలో అయిపోతున్నాయి. గ్రాఫిక్స్, విజువల్స్ పరంపరలో సినిమాల మ్యాజిక్ మరొక ఎత్తు. ఆరోగ్యం, విద్య, వైజ్ఞానికం, సమాచారాలు వినియోగాలు, ఒకటా రెండా?? అందరినీ అవాక్కు చేసి చమక్కులు సృష్టించింది కాలం, కాలంతో పాటు ఎన్నో……                                                                                    ◆వెంకటేష్ పువ్వాడ.  

భారత స్వాతంత్ర్య పోరాటానికి ఉగ్గు పోసింది ఈ ఉద్యమమే!

భారతదేశం ఈరోజు ఎంత స్వేచ్చగా ఉందో మాటల్లో వర్ణించలేనిది. బ్రిటీష్ పాలకుల చేతుల్లో నలిగిన భారతదేశం ఎలా ఉండేదో ఆ కాలంలో జీవించి, ఆనాటి పరిస్థితులు అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తాయి. నాటి పౌరులు తమ పరిస్థితులకు అక్షరరూపం ఇచ్చినా, నాటి పరిస్థితులకు దృశ్యరూపం ఇస్తూ సినిమాలు, డాక్యుమెంటరీలు రూపొందించినా అదంతా ఖచ్చితంగా నాటి భారతం అనుభవించిన క్షోభ కంటే తక్కువే.  తెల్లదొరల పాలన నుండి భారతదేశానికి  విముక్తి తీసుకురావడంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎందరో తమ ప్రాణాలు  త్యాగం చేశారు. ఈ భారతదేశ పోరాటాల్లో ప్రథమంగా చెప్పుకోగలిగింది క్విట్ ఇండియా ఉద్యమం. భారత స్వాతంత్య్రమే ధ్యేయంగా సాగిన  ఈ ఉద్యమం 81ఏళ్ళ కిందట ఇదే నెలలో, ఇదే తేదీన ఊపిరిపోసుకుంది. అంటే క్విట్ ఇండియా ఉద్యమం పురుడుపోసుకుని ఈ ఏడాది ఆగష్టు 8వ తేదీకి 81ఏళ్ళు. ఈ సందర్భంగా ఈ ఉద్యమ విశేషాలు, ఈ ఉద్యమం సాగిన తీరు తదితర వివరాలు తెలుసుకుంటే..  1942సంవత్సరం, ఆగష్టు 8వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది.  ఈ ఉద్యమానికి అప్పటి బొంబాయిలోని ఆగస్టు క్రాంతి మైదానం కేంద్రకమైంది(ఇదే ఇప్పటి ముంబై). భారత జాతీయ కాంగ్రేస్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం ప్రారంభించబడింది.  ఈ ఉద్యమాన్ని క్విట్ ఇండియా ఉద్యమం అనే కాకుండా ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారు.  ఈ ఉద్యమంలోనే జాతిపిత గాంధీజీ  "డూ ఆర్ డై" నినాదాన్ని ఇచ్చారు. 'సాధించు లేదా మరణించు' అనే ఈ నినాదంతో  గాంధీజీ మార్గనిర్దేశకత్వంలో శాలనోల్లంఘన యాత్ర సాగింది.  భారతీయుల నిరసనను అడ్డుకోవడానికి బ్రిటీష్ ప్రభుత్వం ఆపరేషన్ జీరో అవర్ ప్రారంభించింది. ఎంతో మంది కాంగ్రేస్ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కాంగ్రేస్ కార్యాలయాలపై దాడులు చేయించింది. నివేదికల ప్రకారం దాదాపు లక్షమంది అరెస్ట్ చేయబడ్డారు. వీరందరూ చాలాకాలం పాటు ఖైదు చేయబడ్డారు. సుమారు 1000మంది మరణించారు. ఈ ఉద్యమంలో 2500మందికి పైగా గాయపడ్డారు.   ఉద్యమంలో కీలక సభ్యులైన గాంధీజీ, జవహార్ లాల్ నెహ్రూలను కూడా జైలులో పెట్టారు. ఇలా ఈ ఉద్యమాన్ని అణిచివేశారు. అయితే దీని తరువాత స్వాతంత్ర్యపోరాట ప్రక్రియను వేగవంతం చేయడంలో ఈ క్విట్ ఇండియా  ఉద్యమం చాలా కీలక పాత్ర పోషించింది. బ్రిటీషువారికి భారతదేశం మీద ఉన్న పట్టును బలహీనపరచడంలోనూ, వలసవాదవిదానాల పైన తీసుకోవలసిన నిర్ణయాలను, చేసుకోవలసిన మార్పుచేర్పుల అవసరాన్ని ఇది తేలతెల్లం చేసింది. 1945లో రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత రాజకీయంగా డీకోలనైజేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో భారతదేశ యోధుల పోరాటం మరింత ఊపందుకుంది.క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లే మార్పులు తక్షణమే తీసుకురాలేదు. అయినప్పటికీ, ఇది భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఈ ఉద్యమం స్వాతంత్య్రానికి అనుకూలంగా భారతీయ ప్రజాభిప్రాయాన్ని పెంచడానికి దోహదపడింది.  భారతీయ ప్రజలు తమ స్వేచ్ఛను సాధించడానికి నిశ్చయించుకున్నారని బ్రిటీష్ వారికి బలంగా నొక్కి వక్కాణించింది. ఈ ఉద్యమంలోనే  భారతదేశ స్వాతంత్ర్యంలో కీలక పాత్ర పోషించే కొత్త తరం నాయకులు ఆవిర్భవించారు. జాతీయ ఐక్యతా భావాన్ని కూడా ఈ ఉద్యమం ద్వారా పెంపొందించగలిగారు. మహిళలు కూడా.. క్విట్ ఇండియా ఉద్యమంలో ఎందరో  మహిళలు కీలక పాత్ర పోషించారు. అపారమైన ధైర్యాన్ని,  నాయకత్వాన్ని ప్రదర్శించారు. అహింసా యుద్దమనే కారణం ఈ  ఉద్యమంలో ఎంతో మంది మహిళలు చురుకుగా పాల్గొనడానేలా చేసింది.  సరోజినీ నాయుడు, సంగం లక్ష్మీబాయి, దుర్గాభాయ్ దేశ్ ముఖ్ లాంటి మహా వీర వనితల స్పూర్తితో, వారి నాయకత్వం కింద ఎందరో మహిళలు ఈ ఉద్యమంలో అపర చంఢికలై  కదం తొక్కారు. ఈ ఉద్యమలోనే విద్య, సంస్కృతి ప్రాధాన్యతను దేశం యావత్తు గుర్తించింది. ఈ కాలంలో దేశంలో ఎన్నో చోట్ల విద్యాసంస్థలు, సాంస్కృతిక కేంద్రాలు స్థాపించబడ్డాయి. ఇలా క్విట్ ఇండియా ఉద్యమం భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ఊపందుకోవడానికి గొప్ప ఉత్ప్రేరకంగా పనిచేసింది.  అలాగే విద్య,సంస్కృతి ప్రాధాన్యతను గుర్తించేలా చేసింది.  మొత్తం దేశ పౌరులను ఏకం చేసింది.                                                            *నిశ్శబ్ద.

స్నేహబంధం కలకాలం నిలవాలంటే.. ఈ నాలుగు పొరపాట్లు చేయొద్దు..

ఆగస్ట్ నెల వచ్చిందంటే స్నేహితులంతా యమా ఖుషీ అయిపోతారు. ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి. ఏడాదిలో మిగిలిపోయిన 364 రోజులు ఒక లెక్క, ఈ ఒక్క రోజు ఒక లెక్క. 364 రోజుల్లో తం జీవితాల్లో జరిగిన సంఘటనలు, స్నేహితులు తమకిచ్చిన చేయూత, వారిచ్చిన ధైర్యం, అండ ఇవన్నీ ఫ్రెండ్షిప్ డే రోజు వొద్దన్నా గుర్తొస్తాయి. అంతేనా.. దోస్త్ మేరా దోస్త్.. అని పాటలు పాడకపోయినా అంతే రేంజ్ లో బంధాన్ని వ్యక్తం చేసుకుంటారు. నిజానికి స్నేహం గురించి మాత్రమే కాదు.. ఏ దినోత్సవానికి ప్రత్యేక రోజును కేటాయించి  దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అని స్నేహం గురించి పాటలతో ప్రపంచానికి చెప్పినట్టు, స్నేహితుల దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పేమీ లేదు..  సమాజంలోని ప్రతి వ్యక్తి ఏదో ఒక సంబంధానికి కట్టుబడి ఉంటాడు. పుట్టినప్పటి నుండి చాలా సంబంధాలు పిల్లలతో సంబంధం కలిగి ఉంటాయి. తాతలు, తల్లిదండ్రులు, తోబుట్టువులతో సహా అనేక సంబంధాలు కుటుంబం రూపంలో వ్యక్తిని చుట్టుముట్టాయి. అయినప్పటికీ కుటుంబంతో సంబంధం లేకుండా కలిగేది,  ఎల్లప్పుడూ  నిలిచి ఉండేది స్నేహం మాత్రమే.  ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవానికి అంకితం చేయబడింది.  గొప్ప స్నేహితుడు దొరికితే మాత్రం వారితో  స్నేహాన్ని  ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుకోవాకి.   ఎలాంటి గొడవలు జరగకూడదంటే ఈ కింది నాలుగు విషయాల్లో పొరపాట్లు చేయకండి.. స్నేహితులతో అబద్ధాలు చెప్పకండి.. స్నేహం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అందుకే స్నేహానికి మొదటి నియమం అబద్ధాలకు దూరం. స్నేహితుడికి ఎప్పుడూ అబద్ధం చెప్పకండి. ఎవరితోనైనా స్నేహం చేస్తున్నప్పుడు, మీ స్నేహం మధ్య ఎప్పుడూ అబద్ధం రానివ్వమని మీకు మీరే వాగ్దానం చేసుకోండి. సంబంధంలో అబద్ధాలు చెప్పినప్పుడు, స్నేహం చెడిపోతుంది. డబ్బు స్నేహానికి దూరంగా ఉండండి.. స్నేహం  సంబంధం నిస్వార్థంగా ఉండాలి. స్నేహితుడి నుండి ఎప్పుడూ ప్రయోజనం పొందవద్దు. మీకు ఆర్థిక సహాయం అవసరం కావచ్చు, కానీ స్నేహంలోకి డబ్బు తీసుకురావద్దు. ఎందుకంటే మీరు మీ అవసరాల కోసం స్నేహితుడిపై అతని డబ్బుపై ఆధారపడటం ప్రారంభించినప్పుడు, దాన్ని స్వార్థం అని వేలెత్తి చూపే అవకాశం ఉంటుంది. స్నేహం విచ్ఛిన్నమయ్యే అంచుకు రావచ్చు. దాపరికం వద్దు.. సాధారణంగా  తమ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని స్నేహితులు తమ స్నేహితులతో పంచుకుంటారు. కానీ  స్నేహితులు తమ విషయాలను  దాచడం ప్రారంభించినప్పుడు సంబంధంలో దూరం రావడం ప్రారంభమవుతుంది.  అదే విధంగా స్నేహితుల విషయాలను ఇతరులకు చెప్పడం కూడా బంధానికి బీటలు వస్తుంది.  సహాయం చేయడంలో వెనుకడుగు వేయవద్దు.. స్నేహమంటే అర్థం  దుఃఖంలోనూ,  ఆనందంలో మద్దతు ఇవ్వడం. స్నేహితుడికి  అత్యంత అవసరమైనప్పుడు సహాయం చేయకుండా ఎప్పుడూ వెనుకడుగు వేయకండి. కొన్నిసార్లు  సాధ్యమైన మేరకు   సహాయం చేస్తానని స్నేహితులకు మాట ఇచ్చి, ఆ తరువాత సహాయం చేయాల్సిన సమయంలో వెనకడుగు వేయకూడదు.  స్నేహితులకు సహాయం చేయడానికి  తగినంత మార్గాలు లేకపోయినా, స్నేహితులను మానసికంగా, ఒంటరిగా ఉండనివ్వవద్దు. ధైర్యం ఇవ్వడం ద్వారా స్నేహితులను కష్టసమయంలో దృఢంగా ఉంచేలా చేయొచ్చు.                                     *నిశ్శబ్ద.

ఇలా చేస్తే స్నేహం పదిలం.. పదిలం...

ఒకసారి ఇద్దరు స్నేహితులు చాలా దూరం కలసి ప్రయాణం చేయాల్సివచ్చింది. అడవులు, ఎడారులు, మైదానాలు, కొండలు, గుట్టలు... ఇలా వారి ప్రయాణం సాగింది. ఇద్దరూ ఎంతో ప్రాణస్నేహితులు. ఈ ప్రయాణంలో కాలక్షేపానికి ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. ఒకోసారి కొన్ని విషయాలపై ఇద్దరికి అభిప్రాయం కలవక తీవ్రస్థాయిలో వాదించుకునేవారు. ఆ వాదన కాస్తా కాసేపటికి విషయం నుంచి డైవర్ట్ అయ్యి వ్యక్తిగత విషయాలని విమర్శించే దాకా వెళ్ళేది. ఇలా జరిగినప్పుడల్లా అందులో ఒక స్నేహితుడు ఆ విషయాన్ని ఇసుకపై వేలితో రాసేవాడు. రాసిన కాసేపటికి తిరిగి తన స్నేహితుడితో మునుపటిలా ప్రేమగా మాట్లాడేవాడు. ఇలా వారి ప్రయాణం సాగిపోతోంది. స్నేహితుల్లో ఒక అతను ఇసుకపై వేలితో రాయటాన్ని గమనించిన మరో స్నేహితుడు ఏం రాస్తున్నావు? ఎందుకలా  రాస్తున్నావు అని అడిగితే ఇతను నవ్వేసి ఏం లేదు అని చెప్పేవాడు. ఒకసారి స్నేహితుల్లో  ఇలా రాసే వ్యక్తి ఓ ప్రమాదంలో పడతాడు. కొండ చివరి నుంచి లోయలోకి పడబోయే ఇతన్ని అతని స్నేహితుడు ఎంతో కష్టంగా రక్షిస్తాడు. ఆ క్రమంలో అతనికి ఎన్నో దెబ్బలు కూడా తగులుతాయి. ఓ క్షణం అతను కూడా లోయలోకి పడబోతాడు. అంటే తన ప్రాణాలని కూడా లెక్కచేయకుండా తన స్నేహితుడిని రక్షిస్తాడు. లోయలోకి పడబోతున్న అతని స్నేహితుడు ప్రాణాలు పణంగా పెట్టి రక్షించగానే, రక్షించబడ్డ వ్యక్తి వెంటనే చేసిన పని, తన స్నేహితుడికి ధన్యవాదాలు చెప్పి, వెంటనే పక్కనే వున్న రాతిపై చెక్కటం మొదలు పెట్టాడు. మరో వ్యక్తికి ఇతను ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. ఏంటా అని చూస్తే, తను చేసిన సహాయాన్ని ఆ రాయిపై రాయటం గమనించి ఆశ్చర్యపోయాడు. అంతా అయ్యాక విషయం ఏంటని అడుగుతాడు అతను తన స్నేహితుడిని. అప్పుడు ఆ స్నేహితుడు ఇలా చెబుతాడు. చిన్నప్పటి నుంచి మనిద్దరం ప్రాణ స్నేహితులం. కానీ ఎప్పుడు ఇలా కేవలం ఇద్దరమే ఇంత దూరం, ఇన్ని రకాల పరిస్థితులని, ప్రమాదాలని కలసి, దాటి ప్రయాణం చేయలేదు. మన ఈ ప్రయాణం గురించి తెలియగానే మా నాన్న నాకు ఓ మాట చెప్పారు. ఇంతవరకు మీరిద్దరు సరదాగా గడిపారు. కాబట్టి మీ మధ్య ఏ భేదాభిప్రాయాలు రాలేదు. ఒకరి కోసం ఒకరుగా ఉన్నారు. కానీ మీరు సాగించే ఈ ప్రయాణంలో మీరిద్దరే వుంటారు. పైగా ఎన్నో ప్రమాదాలు, ఒత్తిడులు. వీటి మధ్య ఎప్పుడైనా ఇద్దరి మధ్య తేడా వస్తే, నీ స్నేహితుడి వల్ల నీకు  బాధ కలిగితే ఆ విషయాన్ని వెంటనే మర్చిపో. అదే నీ స్నేహితుడు నీకు ఏ చిన్నపాటి సాయం చేసినా దానిని మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఈ విషయం నువ్వు మర్చిపోకుండా ఉండటానికి నీకు అతనిపై కోపం రాగానే ఆ విషయాన్ని ఇసుకలో రాయి. నీకు చేసిన సహాయాన్ని రాయిపై రాయి. ఇసుకలో రాసినది చెరిగిపోవటానికి ఎంత సమయం పడుతుందో అంత సమయంలో ఎదుటి వ్యక్తి నీకు చేసిన చెడుని మర్చిపో. రాతిపై రాత ఎంతకాలం నిలుస్తుందో అంత శాశ్వతంగా అతని మంచితనాన్ని గుర్తుపెట్టుకో. అదే "ఇసుకపై రాత, రాతిపై రాత " అని చెప్పాడు అతని తండ్రి. మనం చాలాసార్లు పైన చెప్పుకున్న దానికి రివర్స్ లో ఎదుటివ్యక్తి మనకు చేసిన మంచిని ఇసుకపై, అలాగే చెడుని రాతిపై రాసి పెట్టుకుంటాం. అంటే ఎవరివల్లనైనా బాధ కలిగితే  శాశ్వతంగా గుర్తు పెట్టుకుని, వారు చేసే మంచిని ఆ బాధ మధ్య మర్చిపోతాం. అందుకే చాలాసార్లు, చాలామందిపై ఆరోపణలు వుంటాయి. అదే వారు చేసే చిన్నచిన్న పొరపాట్లని వెంటనే మర్చిపోతూ,  వారి వలన మనకి కలిగే మంచిని ఎప్పుడూ గుర్తుచేసుకోగలిగితే ఏ బంధంలోనైనా భేదాభిప్రాయాలు రావు.  ఏ ఇద్దరు వ్యక్తులైనా కలసి ప్రయాణం చేయాలంటే ఈ సూత్రం తప్పక గుర్తుపెట్టుకోవాలి.   రమ ఇరగవరపు  

‘అవయవదాతా.. స్పూర్తీభవ..’  మానవత్వపు హృదయాలు మరిన్ని చిగురించాలి!!

అన్నదాతా  సుఖీభవ.. అనే మాటలు ఎన్నోచోట్ల ఎంతోమంది నోట వినే ఉంటారు. మరీ ముఖ్యంగా ఆకలితో నకనకలాడే కడుపు నింపినప్పుడు అన్నదాతా సఖీభవా.. అని దీవించడం పరిపాటి. అయితే ఇప్పుడు మరొక కొత్త నినాదం దేశం యావత్తు స్మరించాలి. అవయవదాతా స్పూర్తీభవ అని కొత్తగా కొనియాడాలి. అన్నం పెడితే.. ఆకలి తీరితే.. అది ఒక పూట, ఒకరోజు మనిషికి శక్తినిచ్చి ప్రాణం నిలబెడుతుంది. కానీ అవయవదానం చేస్తే పునర్జన్మను ప్రసాదించినట్టే. ఒకప్పుడు అవయవదానం చెయ్యాలంటే ఎంతో కష్టం ఉండేది. ఎన్నెన్నో అపోహలు కూడా ఉండేవి. అవయవదానం చేసినవారు నరకానికి పోతారనే నమ్మకం పలువురిని అలాంటి మహోన్నతమైన అదృష్టానికి దూరం చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దేశం అభివృద్ది చెందుతూ మనిషి ఆలోచనా తీరును కూడా మార్చేస్తోంది. దేశంలో పెరుగుతున్న అవయవదాన సంఘటనలు ఎంతోమందికి జీవితాల మీద కొత్త ఆశ కలిగిస్తోంది.  భారతదేశంలో 13వ అవయదాన వేడుకల సందర్భంగా వెలువడిన మరణ గణాంకాలు, అవయవదాన లెక్కలు, దీన్ని ప్రోత్సహించడానికి తీసుకొచ్చిన మార్పు చేర్పులు తెలుసుకుంటే.. అన్నం ఒక పూట కడుపు నింపితే అవయవదానం  ఒక జన్మాంతం ప్రాణాన్ని నిలబెడుతుంది. అందుకే అవయవదానం ఎంతో గొప్పదిగా పేర్కొనబడింది. పదేళ్ల కిందట అంటే 2013లో మన దేశంలో నమోదైన అవయవదానాలు 5000.  పదేళ్ళ తరువాత ప్రస్తుతం 2023లో ఈ సంఖ్య 15వేలకు చేరింది. అంటే 10ఏళ్ళలో మూడురెట్ల మెరుగుదల సాధ్యమైంది. అవయవదానం మీద అవగాహన పెంచడం వల్లనే ఈ గణాంకాల పెరుగుదలకు కారణమనే విషయం అందరూ ఒప్పుకుని తీరాలి.  భారతదేశంలో ప్రతి సంవత్సరం 95లక్షలమంది మరణిస్తున్నారు. వీరిలో కనీసం లక్ష మంది దాతలుగా నమోదైన వారున్నారు. అయినప్పటికీ అవయవాల వైఫల్యం కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారు. ప్రతి రోజూ 300మంది అవయాల వైఫల్యం కారణంగా మృతిచెందుతున్నారు. వీటన్నిటికి పరిష్కారం ఒకే ఒక్కటి. అదే అవయవదానాన్ని ప్రోత్సహించడం, అవయవదానం గురించి అవగాహాన పెంచడం. అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు గానూ ప్రభుత్వం చట్టంలో కూడా కొన్ని మార్పులు చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా అవయవదానం కోసం వ్యక్తి నిర్ణీత  వయసు 65సంవత్సరాలుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిమితిని తొలగించారు. ఇంకా అవయవదానం గురించి అవగాహన పెంచి, దీన్ని ప్రజలలో వ్యాప్తి చేయడానికి మరిన్ని సవరణలు, సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం సంసిద్దంగా ఉంది. దీని కారణంగా ప్రతి సంవత్సరం ఎంతో మందిని మృత్యువు నుండి బయటపడేయవచ్చు. భారతదేశంలో లివర్ ఫెయిల్, లివర్ క్యాన్సర్ కారణంగా ప్రతి ఏడూ 2లక్షల మంది మరణిస్తున్నారు. వీరిలో 10-15శాతం మందికి సకాలంలో కాలేయ మార్పిడి చేయడం ద్వారా రక్షించే అవకాశం  ఉంది.  ప్రతి ఏడూ 25 నుండి 30వేల మందికి కాలేయ మార్పిడి చేయాల్సి ఉండగా  కేవలం 1500 మందికి మాత్రమే మార్పిడి జరుగుతోంది. దీనంతటికీ కారణం అవయదానం కోసం ఎదురుచూసేవారికంటే అవయవదాతలు తక్కువగా ఉండటమే. ఇక గుండె మార్పిడి, కిడ్నీ మార్పిడి, కంటిమార్పిడి గురించి చెప్పుకోవడం వృథా.. అందుకే భారతదేశంలో అవయవదానాన్ని ప్రోత్సహించాలి. అవయవదానానికి ముందుకొచ్చినవారిని అవయవదాతా స్పూర్తీభవా.. అని కొనియాడాలి.                                                    *నిశ్శబ్ద.