ఈ ముగ్గురికి సహాయం చేయకపోవడమే మంచిది..!

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మనం కొందరికి ఎప్పుడూ సహాయం చేయకూడదని చెప్పాడు. చాణక్యుడి విధానం ప్రకారం మనం ఏ ముగ్గురికి సహాయం చేయకూడదు..? మీరు ఈ ముగ్గురికి సహాయం చేస్తే ఏమి జరుగుతుంది? తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త,దౌత్యవేత్తగా పేరుపొందాడు. ఆచార్య చాణక్యుడు రచించిన చాణక్య నీతిని అనుసరించడం ద్వారా ప్రజలు జీవితంలో విజయం సాధిస్తారు. ఎందుకంటే ఈ పాలసీల ద్వారా మీరు తప్పొప్పుల గురించి అవగాహన పొందుతారు. మీరు గందరగోళంగా ఉన్న అనేక సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. చాణక్యుడి తత్వశాస్త్రం ప్రకారం, ఇతరులకు సహాయం చేయడం మంచిది, కానీ చాలాసార్లు మనం కొంతమందికి సహాయం చేస్తాము. దీనివల్ల జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. చాణక్యుడి విధానం ప్రకారం మనం ఎలాంటి వారికి సహాయం చేయకూడదు? 1. మాదకద్రవ్యాలకు బానిసలు: ఆచార్య చాణక్యుడు ప్రకారం, మాదకద్రవ్యాల బానిసలకు మనం ఎప్పుడూ సహాయం చేయకూడదు. అలాంటి వారు మమ్మల్ని సహాయం అడిగితే తిరస్కరించడం మంచిది. ఎందుకంటే అలాంటి వారు ఎప్పుడూ మత్తులో ఉంటారు. అవన్నీ మరిచిపోయి డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తారు. ఈ వ్యక్తులు మత్తు కోసం ఎవరికైనా హాని చేయవచ్చు. అంతే కాదు, తాగిన వ్యక్తి మంచి,తప్పు అనే తేడాను గుర్తించలేడు, కాబట్టి అలాంటి వారికి సహాయం చేయకూడదు. వారికి సేవ చేయడం లేదా డబ్బు ఇవ్వడం ఎల్లప్పుడూ మీకు హాని చేస్తుంది. 2. చెడ్డ స్వభావం గల వ్యక్తి: చెడు స్వభావం గల వ్యక్తికి దూరంగా ఉండటం మంచిదని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడి సిద్ధాంతం ప్రకారం, నీచమైన,చెడు స్వభావం ఉన్న వ్యక్తికి ఎప్పుడూ సహాయం చేయకూడదు. అలాంటి వారికి సహాయం చేస్తే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. అలాంటి వారితో పరిచయం వల్ల ఒక వ్యక్తి సమాజంలో  కుటుంబంలో పదేపదే అవమానానికి గురవుతాడు. అందుకే అలాంటి వారికి ఎప్పుడూ దూరంగా ఉండాలి. 3. తృప్తి చెందని వ్యక్తి: జీవితంలో తృప్తి చెందని,ఎల్లప్పుడూ అసంతృప్తిగా ఉండేవారికి దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారికి మనం ఎంత మేలు చేసినా బాధపడటం తప్పు కాదు. అలాంటి వారి జీవితం ఎంత బాగున్నా వారు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. ఈ వ్యక్తులు ఇతరుల ఆనందానికి అసూయ చెందుతారు.ఇతరులను తిట్టుకుంటూ ఉంటారు. ఆవిధంగా అసూయ, దుఃఖం లేని వ్యక్తులకు కారణం లేకుండా దూరంగా ఉండటమే మనకు మంచిదని చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడు.  

మహాభారతం కురుక్షేత్ర యుద్ధం మాత్రమే కాదు.

మహాభారతం కురుక్షేత్ర యుద్ధం మాత్రమే కాదు. మహాభారతం నుంచి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. మహాభారతం నుండి ఎంచుకున్న జీవిత పాఠాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని అలవర్చుకుంటే జీవితంలో విజయం ఖాయం. మహాభారతానికి సంబంధించిన పాత్రలు, కథలు అందరికీ తెలుసు. హిందూ మతంపై ఈ పుస్తకం నుండి మనం చాలా నేర్చుకుంటాం. మీరు జీవితంలో విజయం సాధించాలనుకుంటే, ఈ విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఇది మీకు జీవితంలో విజయాన్ని ఇస్తుంది. మహాభారతం నుండి మనం ఏమి నేర్చుకోవాలో తెలుసుకుందాం. - చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలని మహాభారతం మనకు బోధిస్తుంది, జీవితంలో ఎప్పుడూ చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. చెడు సాంగత్యానికి దూరంగా ఉండకుండా ఒక వ్యక్తి కెరీర్ జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడు. మంచి స్నేహితుల ఎంపిక : జీవితంలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎల్లప్పుడూ కష్ట సమయాల్లో మీకు అండగా ఉంటారు. శ్రీకృష్ణుడు పాండవులను ఆదరించినట్లే. అదేవిధంగా, మంచి స్నేహితుడిని ఎంచుకోవడం ప్రతి క్లిష్ట పరిస్థితిలో మీకు సహాయం చేస్తుంది. జీవితం నుండి నేర్చుకోండి: మహాభారతంలో , అర్జునుడు తన గురువు నుండి మాత్రమే కాకుండా అన్ని అనుభవాల నుండి నేర్చుకున్నాడు. మన వైఫల్యాల నుండి మనం ఎప్పుడూ పాఠాలు నేర్చుకోవాలి. ఇది ఒక వ్యక్తిని చాలా దూరం చేస్తుంది. అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం: ఏదైనా గురించి అసంపూర్ణ జ్ఞానం కలిగి ఉండటం చాలా ప్రమాదకరం. జీవితంలో విజయం సాధించాలంటే, ఎల్లప్పుడూ విషయాల గురించి పూర్తి సమాచారాన్ని పొందాలి. చెడు అలవాట్లను వదిలించుకోండి: జీవితంలో విజయం సాధించాలంటే మనిషి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ చెడు అలవాట్లు మిమ్మల్ని జీవితంలో ముందుకు సాగనివ్వవు. సత్యానికి మద్దతు ఇవ్వండి: హిందూమతంలోని ప్రతి పుస్తకం సత్య మార్గంలో నడవమని బోధిస్తుంది. జీవితంలో విజయం సాధించాలంటే ఎప్పుడూ సత్యానికి మద్దతివ్వాలి. ఇది ఎల్లప్పుడూ ఒక వ్యక్తిని ఉన్నత స్థాయికి చేరేలా చేస్తుంది. మీ భావోద్వేగాలను నియంత్రించండి: జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మన భావోద్వేగాలను నియంత్రించుకోవాలని మహాభారతం మనకు బోధిస్తుంది. భావోద్వేగాలపై తీసుకున్న నిర్ణయం వ్యక్తిని బలహీనపరుస్తుంది.   

మీ బంధాన్ని బలపరిచే సూత్రాలేంటో తెలుసా?

కోటిఆశలతో కొత్త జీవితంలోకి అడుగేస్తాం. మరి ఆ వైవాహిక జీవితం కలకాలం సంతోషంగా ఉండాలంటే మొదట్లోనే ధ్రుడమైన పునాదులు నిర్మించుకోవడం చాలా అవసరం. అందుకు ఈ సూత్రాలు తప్పనిసరిగా పాటించాలి. అప్యాయత, అనురాగం ఉండాలి: ప్రేమ, ఆప్యాయతలను భాగస్వామిపై చూపించడం చాలా ముఖ్యం. కొందరు ప్రతిదానికి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుంటారు. అలాచేయడం మనకు నచ్చినా మీ భాగస్వామికి నచ్చకపోవచ్చు. చూసే వారికీ అది ఏదోలా ఎగతాళిగా ఉంటుంది. అందుకే ఇద్దరికీ నచ్చేట్లుగా మీ ఆనందక్షణాలను మీ మధ్యే ఉండేవిధంగా చూసుకోవాలి. అంతేకానీ నలుగురి మెప్పుకోసం ప్రయత్నాలు చేయకూడదు.   తొందరపాటు మంచిది కాదు: మొదట్లో మీకు సంబంధించి కొన్ని విషయాలను చెప్పేయాలని, లేదా భాగస్వామికి సంబంధించిన విషయాలన్నీ మీరు తెలసుకోవాలన్న కుతూహలం చూపించకూడదు. సహజంగానే ఆ బంధాన్ని వికసించేలా చేయండి. భాగస్వామి నిజంగా తన విషయాలను మనతో షేర్ చేసుకోవాలనుకున్నప్పుడే వినండి. కానీ చెప్పమని బలవంతం చేయకూడదు. ఆ మాత్రం రహస్యం ఉంటేనే..బంధం మనోహరంగా సాగుతుంది. పెళ్లికి ముందు మాటల్లోనే లేదా పెళ్లైన కొత్తల్లో కొందు భాగస్వామిని ఇంప్రెస్ చేసేందుకు ఏవేవో వాగ్దానాలు చేస్తుంటారు. తీరా వాటిని నిలబెట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. ఇలా చేయడం వల్ల భాగస్వామికి మన మీద అపనమ్మకం ఏర్పడుతుంది. అందుకే కచ్చితంగా మాట నిలబెట్టుకోగలం అనుకుంటేనే వాగ్దానాలు చేయండి. స్వేచ్చనివ్వండి: ప్రతినిమిషం భాగస్వామితోనే కలిసి సమయం గడపాలనుకోవడం సహజం. మరీ ముఖ్యంగా పెళ్లైన కొత్తలో అలాని వారికంటూ వ్యక్తిగత స్వేచ్ఛ, సమయం ఇవ్వకుండా ఉండటం సమంజసం కాదు. వాళ్లకూ స్నేహితులూ, ఆసక్తులూ, లక్ష్యాలు ఉంటాయి. వారు వ్యక్తిగతంగా ఎదిగితేనే కదా మన బంధమూ కూడా బలంగా ఉండేది.

ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా.. విరాళానికి మీ చెయ్యి ముందుకు రావాలి!

భారతదేశం నా మాతృ భూమి.. భారతీయులందరు నా సహోదరులు.. ఈ మాట చిన్నప్పటి నుండి కంఠస్థం చేసినదే. అయితే సగటు సాధారణ పౌరుడు ఇలాంటి ప్రతిజ్ఞలలోనూ, మేరా భారత్ మహాన్.. అనో..  భారత్ మాతా కీ జై.. అనో నినాదాలు ఇస్తూ పైపైకి దేశ భక్తి చాటుకుంటారు. దేశం కోసం ఎవరైనా సైనికులు వీర మరణం పొందితే ఇతనే నిజమైన సైనికుడు, దేశ భక్తుడు అంటూ కీర్తిస్తారు. తప్పితే సగటు పౌరుడు ఇంకేమీ చెయ్యలేడు. కానీ ప్రతి పౌరుడు దేశం మీద తమకున్న భక్తిని చాటుకోవడానికి, దేశానికి తనూ సహాయం చెయ్యడానికి ఫ్లాగ్ డే ఆప్ ఇండియా సరైన రోజు. అసలేంటీ ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా? దీని చరిత్ర ఏంటి? భారతదేశ పౌరులు దీని సందర్భంగా ఏం చెయ్యవచ్చు? వివరంగా తెలుసుకుంటే.. ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా.. భారత్ ను తమ ప్రాణాలను పణంగా పెట్టి సంరక్షిస్తున్న మన దేశ సూపర్ హీరోల సహాయార్థం ఈ ఫ్లాగ్ డే ఆప్ ఇండియాను జరుపుకుంటారు. దేశానికి సేవలు అందించే నౌకాదళం, వైమానిక దళం, భారత సైన్యంలోని సైనికుల కోసమే దీన్ని ప్రవేశపెట్టారు. ఈ మూడు శాఖలలోని సైనికులు దేశం కోసం పోరాడుతూ మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకోవడానికి, వారికి ఆర్థిక సహాయం చెయ్యడానికి  ఈరోజున భారత జండాతో పాటు ముదురు నీలం, లేత నీలం, ఎరుపు రంగులలో ఉన్న చిన్న జెండాలను అందజేస్తారు. వీటిని అందుకున్నవారు బదులుగా డబ్బును విరాళంగా ఇస్తారు. ఈ జెండాను దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తారు. ఈ డబ్బును సైనికుల కుటుంబాల కోసం వినియోగిస్తారు. చరిత్రలో ఏముంది?  ఇది 1949, ఆగస్టు 29న ప్రారంభమైంది. అప్పటి భారత రక్షణ మంత్రి ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన  జెండా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నిర్ణయం ప్రకారం జెండాలను పంపిణీ చేయడం ద్వారా నిధులు సేకరించి ఆ నిధులను  సైనికుల కుటుంబాలకు సహాయంగా ఇవ్వాలని నిర్ణయించబడింది. భారత్ పౌరులు ఏం చేయవచ్చు.. ఈ నిధుల సేకరణ ముఖ్యంగా వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలకు సాధారణ పౌరులు బాధ్యత వహించే దిశగా సాగుతుంది. అమర వీరులకు, యుద్ద బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి కూడా ఈ నిధులు సేకరిస్తారు. భారత పౌరులు దేశంలో సురక్షితంగా జీవించడానికి దేశ సరిహద్దులలో సైనికుల  ధైర్యసాహసాలే కారణమని తెలుసుకోవాలి. ఇందుకోసం వారి కుటుంబాల పట్ల బాధ్యతగా ఉండాలి. తమకు తోచినంత మెరుగైన విరాళాలు ఇవ్వాలి. దేశానికి సైనికులు సేవ చేస్తే.. వారి కుటుంబాలకు అండగా ఉండగలమనే భరోసాను భారత పౌరులే  ఇవ్వాలి.                                                         *నిశ్శబ్ద.  

సెల్ఫ్ లవ్ ఎందుకు ముఖ్యం?

  సెల్ఫ్ లవ్ అంటే తమను తాము ప్రేమించుకోవడం. ప్రేమ అనేది ప్రతీ మనిషికి అవసరం. చాలామంది ఇంట్లో వారు, స్నేహితులు, తెలిసిన వారు ఇలా అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇలా ఎంత చేసినా వారిలో ఏదో అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. దీనికి కారణం సెల్ప్ లవ్ లేకపోవడమే. తనను తాను ప్రేమించుకోలేని వ్యక్తి ఇతరుల అవసరాలు తీర్చి వారిని సంతోష పెట్టగడేమో కానీ వారి దృష్టిలో ఖచ్చితంగా చులకన భావానికి లోనవుతాడు. దీనిక్కారణం తనకంటూ ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చుకోకపోవడమే. అసలు  జీవితంలో సెల్ఫ్ లవ్ ప్రాముఖ్యత ఏంటి? సెల్ఫ్ లవ్ వైపు ఎలా వెళ్లాలి? సెల్ఫ్ లవ్ ప్రతి వ్యక్తికి ముఖ్యం. ఇదే వ్యక్తికి గుర్తింపునిస్తుంది.  ఇతరులు గౌరవించేలా చేస్తుంది. నిజానికి సెల్ఫ్ లవ్ కలిగిన వ్యక్తులు ఇతరులకు ప్రేమను అందించగలుగుతారు. ఇతరుల నుండి ప్రేమను, గౌరవాన్ని పొందగలుగుతారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోతే ఇతరులు మిమ్మల్ని ప్రేమిస్తారనే విషయాన్ని అస్సలు  అంగీకరించలేరు. నన్నెవరు ప్రేమిస్తారు? నన్నెవరు గౌరవిస్తారు?  అని తమను తాము చిన్నతనం చేసుకుంటారు. తమను తాము ప్రేమించుకునే వ్యక్తులు ఎప్పుడూ సంబంధాల విషయంలో నిజాయితీగా ఉండగలుగుతారు. ప్రేమ విలువను గుర్తించగలుగుతారు.  ఇతరులతో ప్రేమగా మాట్లాడగలుగుతారు. ఇవి  ప్రతి మనిషి జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. తమను తాము ప్రేమించుకోవడం ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలకు పునాది వేస్తుంది.  ఎందుకంటేఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, సెల్ఫ్ లవ్ మొదలైనవి ఒకదానితో ఒకటి ముడి పడి ఉంటాయి. మనల్ని మనం ప్రేమించడం నేర్చుకుంటే ఇతరులతో బంధాలకు విలువ ఇవ్వడంలోనూ, ఇతరులను అర్థం చేసుకోవడంలోనూ ఎలాంటి పొరపాట్లు చేయరు. దీనివల్ల బంధాలు దృఢంగా ఉంటాయి. సెల్ఫ్ లవ్ అనేది తన గురించి తాను కేర్ తీసుకోవడంలోభాగం. ఇతరులేమన్నారు, ఇతరులు ఏమంటున్నారు? ఏమనుకుంటారు అని ఆలోచిస్తూ వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతూ ఉంటే  వ్యక్తి ఒత్తిడికి లోనవుతారు. అదే తమను తాము ప్రేమించుకుంటే స్వతంత్ర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. తమకు మంచి ఏది? చెడు ఏది? అనే విషయాలను గుర్తించి మంచిని తీసుకుని చెడును వదిలి ముందుకు సాగుతారు. అన్నింటికంటే ముఖ్యంగా స్వీయ ప్రేమ కలిగినవారు నిజాయితీగా ఉంటారు. ఇతరులతో కూడా అంతే నిజాయితీగా ఉండగలుగుతారు.  ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు నిజాయితీని పాటిస్తారు.  ఇది లేకపోతే వ్యక్తులలో నటన, అబద్దాలు ఆడటం, బ్యాలెన్సింగ్ లేకపోవడం జరుగుతుంది.                                             *నిశ్శబ్ద.  

పిల్లలతో తల్లిదండ్రుల సంభాషణ ఎందుకంత ముఖ్యం.

నేటి బాలలే రేపటి పౌరులు అని అంటారు. పిల్లల గురించి ఎవరైనా ఏదైనా వాక్యం చెప్పమంటే మొదట ఇదే చెబుతారు. ఆ తరువాత పిల్లల్లో దేవుడుంటాడని కూడా చెబుతారు. పిల్లలు పుట్టినప్పుడు చాలా అపురూపంగా చూసుకుంటాం. ఏడుస్తుంటే ఆకలేస్తుందేమో అని కంగారు పడతాం.  స్థోమతను బట్టి మంచి మంచి బట్టలు వేసి వారిని చూసి మురిసిపోతాం. బొమ్మలు కొనివ్వడం నుండి అడిగిన దానికల్లా తల ఊపుతాం. వారిని అంత ప్రేమగా పెంచి.. మూడు నాలుగేళ్లు నిండగానే ఇక వారి గురించి అంతగా పట్టించుకోవడం మానేస్తాం. చాలా మంది ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు అయితే తమ పిల్లలకు అన్నీ ఇస్తున్నాం, అన్నీ సమకూరుస్తున్నాం, లోటు చేయడం లేదు కదా అని అనుకుంటారు. కానీ అది చాలా తప్పని, వారికి అడిగిందల్లా ఇవ్వడం కాదు ప్రేమను పంచాలని, పసి మనసుల్లో బరువు దించాలని, వారితో మాట్లాడాలని పిల్లల మీద పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, కౌన్సెలింగ్ నిపుణులు చెబుతున్నారు. పిల్లలతో తల్లిదండ్రుల అనుబంధం ఎలా ఉండాలి?  పిల్లలకు కావాల్సిందేమిటి? పిల్లలతో సంభాషణ ఎందుకంత ముఖ్యం?  వంటి  విషయాల గురించి చర్చించేందుకు, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య బంధాన్ని దృఢంగా మార్చేందుకు ప్రతి ఏడాది డిసెంబర్ 5 వ తేదీన పిల్లలతో సంభాషణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని ప్రకారం పిల్లలతో తల్లిదండ్రులకు ఉండాల్సిన అనుబంధం గురించి మరింత అవగాహన కల్పిస్తారు. బిజీ జీవితాలు గడిపే తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా చేతులారా వైఫల్యాలకు గురిచేస్తారో వారికర్థమయ్యేలా చెప్పడం, పిల్లల విషయంలో వారు ఎలా ఉండాలో తెలియజేయడం, వారి మనసు పొరల్లో ఉన్న సందేహాలు, భయాలు, అపోహలను నివృత్తి చేయడం ఈరోజు ఉద్దేశం. పిల్లలతో ఎందుకు మాట్లాడాలి? తల్లిదండ్రులు పిల్లలను గొప్పగా పెంచాలని అనుకుంటారు. అందుకోసమే బోలెడంత డబ్బు ఖర్చు చేస్తారు. నిజానికి పిల్లలకోసం డబ్బు ఖర్చు చేయడం కాదు, వారితో మాట్లాడితే పిల్లలు జీవితంలో విజయం సాధిస్తారు. ఉత్తమ పౌరులుగా  మారుతారు. ఎందుకంటే సంభాషణలోనే వారి భవిష్యత్తు నిర్మాణమవుతుంది. పిల్లలతో మాట్లాడే తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య అనుబంధం చాలా దగ్గరగా, స్నేహభావంతో ఉంటుంది. పిల్లలు కొన్ని విషయాలు తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడతారు. కొన్ని చెబితే ఏమనుకుంటారో అని సందేహంతో ఉంటారు. కొన్ని విషయాలు అడిగితే తల్లిదండ్రులు కోపం చేసుకుంటారేమో అని చెప్పలేరు. తల్లిదండ్రులు ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం. వాళ్లు రక్తం పంచుకుపుట్టిన పిల్లలు. వారికంటే బయటి ప్రపంచం, డబ్బు, విలాసాలు ఏవీ ముఖ్యం కాదు.  అందుకే వారితో మాట్లాడుతుంటే తల్లిదండ్రులే తమకు గొప్ప స్నేహితులు అని భావిస్తారు. పిల్లలతో ఏం మాట్లాడాలి? పిల్లలతో ఏం మాట్లాడాలనే డైలమా చాలామంది తల్లిదండ్రులలో ఉంటుంది. అయితే పిల్లతో మాట్లాడటానికి వారిలో పరిణితి పెంచడానికి, వారిని ఆలోచించేలా చెయ్యడానికి చాలా అంశాలున్నాయి. పిల్లలు ఇంట్లో,  స్కూల్ నుండి రాగానే, స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు. చాలా  సందర్బాలలో బోలెడు అనుభవాలు ఎదుర్కొంటూ ఉంటారు. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వారు ఏ విషయాల మీద ఎక్కువ ఆసక్తిగా ఉన్నారో గమనించాలి. వాటి గురించి పిల్లలతో మాట్లాడాలి. అందులో తప్పొప్పులు వారితో చర్చించాలి. దీనివల్ల పిల్లలో ఆలోచనా సామర్థ్యం, అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది.  చాలామంది తల్లిదండ్రులు  పిల్లలు స్కల్ నుండి పిల్లలు ఇంటికి రాగానే.. ఈరోజు స్కూల్లో ఏం జరిగింది అని అడుగుతారు. పిల్లలు కూడా చాలావరకు అల్లరి చేయడం స్కూల్లో పనిష్మెంట్ కు గురికావడం జరుగుతూ ఉంటుంది. ఈ  విషయం చెప్పేటప్పుడు పిల్లలు నిరాశగా, బాధగా ఉంటారు. అదే ఈ ప్రశ్న కాకుండా వేరే ప్రశ్నలు అడిగితే పిల్లలు సంతోషిస్తారు. ఎంతో ఉత్సాహాంతో తల్లిదండ్రులతో మాట్లాడతారు. ఈరోజు స్కూల్లో ఏ పని బాగా చేశావనో..  క్లాసులో జరిగిన సరదా సంఘటన ఏంటనో.. అడగాలి. ఇవే కాకుండా.. ఏ సబ్జెక్ట్ కష్టంగా అనిపించిందని, మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఎలా ఉందని కూడా అడగచ్చు. వీటి వల్ల పిల్లలు సంతోషంగా సమాధానాలు ఇస్తారు. పిల్లలను నొప్పించిన సంఘటనలు ఏవైనా ఉన్నా నోరువిప్పి చెబుతారు.  దానివల్ల పిల్లలకు ఏ విషయాన్ని దాపరికం లేకుండా చెప్పడం అలవాటు  అవుతుంది. స్నేహితుల గురించి, స్నేహితులతో జరిగే సంఘటనల గురించి వారితో సాన్నిత్యం, గొడవలు మొదలైనవన్నీ అడగాలి. ఎవరు బాగా స్నేహంగా ఉంటారో, వారు ఎలా చదువుతారో, వారు ఎలాంటి వారో అడిగి తెలుసుకుంటూ ఉంటే స్నేహం వల్ల పిల్లలు తప్పు దారిలో వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడవచ్చు. పిల్లలు తప్పు చేస్తే ఎప్పుడూ దండించకూడదు. వాటికి తగిన ఉదాహరణలు చెబుతూ వారు చేస్తున్న తప్పుల వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వివరించాలి. అంతే..  పిల్లలు ఆ తరువాత ఎప్పుడూ తప్పు చెయ్యలేరు. దగ్గర కూర్చుని చెప్పే మాటలు మనసును తాకుతాయి. అదే కోపంగా చెప్పేమాటలు వారి అహాన్ని దెబ్బ కొడతాయి. అందుకే కోపంతో ఎప్పుడూ ఏదీ చెప్పకూడదు. అది భయాన్ని పెంచుతుందే కానీ వారి మనసును మార్చదు.                                          *నిశ్శబ్ద.  

కాలుష్యపు కోరలను తుంచివేయాలి!

కాలుష్యం ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన అతిపెద్ద సమస్య. సరిగ్గా గమనిస్తే మనిషి పూర్తీగా కాలుష్యపు వలయంలో నివసిస్తున్నాడు. అందమైన ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణం, గాలిలో నాణ్యత అనేవి మచ్చుకైనా కనిపించవు. పట్టణీకరణ అభివృద్ది చెందేకొద్దీ వాతావణ కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో మొబైల్, ఒక్కొక్కరికి ఒక్కో బైక్, అదనంగా అందరూ కలసి బయటకు వెళ్లడానికి కారు.. ఇలా చెబుతూ పోతే వాహనాల రద్దీ కారణంగా వాతావరణం కలుషితం అవుతోంది. ఇక వ్యాపారాల కారణంగా ఏర్పడిన ఫ్యాక్టరీలు.. వాటి నుండి వెలువడే పొగ కారణంగా గణనీయంగా గాలి కాలుష్యం, ఫ్యాక్టరీ వ్యర్థాల కారణంగా నీటి కాలుష్యం కూడా జరుగుతోంది. కనీసం మనిషి చేతుల్లో నియంత్రించగలిగిన వాటిని కూడా నియంత్రించకుండా చాలావరకు ప్రజలే వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నారు. వీటన్నింటి గురించి చర్చించి వాతావరణ కాలుష్య కాలుష్యాన్ని తగ్గించే దిశగా అడుగులు వేయాలని ప్రతి ఏటా డిసెంబర్ 2వ తారీఖున ప్రపంచ వాతావరణ కాలుష్య నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ రోజు చరిత్ర, దీని ప్రాధాన్యత, ప్రజల భాద్యత మొదలైన విషయాలు తెలుసుకుంటే.. పర్యావరణ కాలుష్యం  ప్రజల ఆరోగ్యం,  భూమిపై దాని ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ఈ కారణంగా ఈ భూమితో పాటు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు.  ప్రపంచాన్ని కబళిస్తున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది  ప్లాస్టిక్ కాలుష్యం. నేల నాణ్యతను దిగజార్చడం నుండి సముద్ర జీవులను చంపడం వరకు ప్లాస్టిక్ కాలుష్యం దారుణంగా ఉంటుంది. ఇది  త్వరలోనే ప్రజల ఉనికికి కూడా శాపంగా మారే ప్రమాదం ఉంది. ఐక్యరాజ్యసమితి (UN), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), గ్రీన్‌పీస్  సహా ఇతర అంతర్జాతీయ సంస్థలు కాలుష్యాన్ని నియంత్రించడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను కోరుతున్నాయి. అయితే బాధ్యత మన ప్రభుత్వాలపై మాత్రమే  ఉందని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ప్రభుత్వాలు, ప్రతినిధులు మాత్రమే ముందుకు వచ్చి చేస్తే పరిష్కారమయ్యే సమస్య కాదు ఇది.  పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేయడానికి  ప్రజలే  ముందుకు రావాలి. పరిశోధనలు  వివిధ సర్వేల ఆధారంగా, వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తోందని అంచనా వేయబడింది, అయితే ఇది తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలో ఉన్నవారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. వాస్తవానికి, ఇటీవలి సంవత్సరాలలో వాయు కాలుష్యం కారణంగా మరణాల రేటు బాగా పెరిగింది. వాతావరణంలోని మార్పులే కాకుండా కరోనా వంటి దారుణమైన దాడుల తర్వాత చాలామంది ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోయింది. ఈ కారణంగా ప్రజలు చిన్న చిన్న సమస్యలకే మరణాలకు లోనవుతున్నారు. ఎక్కువశాతం మంది శ్వాస సంబంధ సమస్యలతోనే మరణిస్తున్నారు. దీని కారణంగా, WHO భారతదేశం, బంగ్లాదేశ్, ఖతార్, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్,మంగోలియా వంటి కొన్ని దేశాలకు కఠినమైన గాలి నాణ్యత నిబంధనలను విధించింది. మనలో చాలా మందికి మనం తీసుకోగల నివారణ చర్యల గురించి తెలుసు,కానీ వాటిని పాటించము. సమస్య మనది కాదులే అనే నిర్లక్ష్యం చాలామందిలో ఉంటుంది. మొక్కలను నాటడం, సరైన స్థలంలో చెత్తను వేయడం, ప్లాస్టిక్ వస్తువులను రీసైక్లింగ్ చేయడం, పర్యావరణానికి హాని కలిగించని వస్తువులను ఉపయోగించడం. పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశ్యంతో ప్రకృతి సంపదను పెరిగేలా చేయడం ప్రజల చేతుల్లోనే ఉంది. కానీ దీన్ని పాటించేవారు తక్కువ. తెలిసిన వారికే కాదు.. తెలియని వారికి అజ్ఞానంలో  ఉన్నవారికి కూడా  జ్ఞానోదయం చేయాలి. కాలుష్యం  వల్ల ఎదురయ్యే  ప్రాణాంతక పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, పరిస్థితి  తీవ్రతను తెలియజేయాలి. అంతేకాకుండా  వీటిని ఇంటి నుండే ప్రారంభించాలి. కాబట్టి మీరు మీ పిల్లలు,  యువ తరానికి స్థిరమైన భవిష్యత్తును సృష్టించాలనుకుంటే, వాతావరణాన్ని కాపాడే విషయంలో ఎలాంటి జాప్యం చేయకూడదు. ఇతరులు చేయట్లేదు మనమెందుకు చేయాలనే వాదాన్ని పక్కన పెట్టి  మీకు మీరుగా వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి, ప్రకృతి సంపదను పెంచడానికి కృషి చేయాలి. ఇలా చేస్తే సగటు పౌరుడిగా సమాజం కోసం తమ వంతు కృషి చేసినట్టే.                                                    *నిశ్శబ్ద.  

ఇలాంటి వారితో స్నేహం చేస్తే మీ కెరీర్ నాశనమే..

ప్రతిమనిషి జీవితంలో బంధాలు, అనుబంధాలతో పాటు కెరీర్ గురించి కూడా శ్రద్ద పెడతాడు. నిజానికి బంధాలు అనుబంధాలు అనేవి కాలంతో పాటూ కొత్తగా కూడా పుడతాయి. కానీ కెరీర్ అనేది చాలా ముఖ్యం. ఏ వయసులో చెయ్యాల్సిన పని ఆ వయసులో చెయ్యకపోతే జీవితం అస్తవ్యస్తమవుతుంది. చదువు..  ఉద్యోగం.. ఈ రెండూ జీవితంలో ఎంత బాగా బ్రతకగలం అనే విషయాన్ని నిర్ణయిస్తాయి. ఇవి రెండూ బాగుండాలన్నా ఆ తరువాత జీవితం సజావుగా సాగాలన్నా జీవితంలో నమ్మకమైన మనుషులతో స్నేహం అవసరం. ఎందుకంటే జీవితంలో అన్ని విషయాలను స్నేహితులతో పంచుకుంటారు. ఎలాంటి వారితో స్నేహం చేయకూడదో ఆచార్య చాణక్యుడు  నొక్కి చెప్పాడు. చాణక్యనీతిలో ఎవరిని నమ్మకూడదని చెప్పాడంటే.. ఆయుధాలు ఉపయోగించే వ్యక్తులను అస్సలు నమ్మకూడదు. కత్తులు, పిస్టల్, ఇతర ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నవారు ఎక్కువ కోపం స్వభావం కలిగినవారై ఉంటారు. వీరికి కోపం వస్తే కొన్నిసార్లు ముందు వెనుక ఆలోచించకుండా ప్రమాదం తలపెడతారు. అందుకే ఆయుధాలు ఉన్నవారితో దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. బలవంతులతో స్నేహం ఎప్పటికైనా ముప్పేనని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే బలవంతులు తమ స్వార్థం కోసం మనుషుల్ని ఉపయోగించుకుంటారు. అది పెద్ద తప్పేం కాదనే వాదనలో ఉంటారు. వారి కారణంగా జీవితంలో ముఖ్యమైన కాలాన్ని నాశనం చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. బలవంతులు అంటే డబ్బు మదం కలిగినవారు. చెడు అలవాట్లున్న ఆడవారిని నమ్మడం కూడా ఇబ్బందులలో అడుగేసినట్టేనట. తమ సంతోషం కోసం, సుఖాల కోసం, అవసరాల కోసం భర్తను, పిల్లల్ని, కుటుంబాన్ని వదిలేసే మహిళలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనిషిలో ఎలాంటి ఆలోచనలున్నాయో, వారు ఎప్పుడేం చేస్తారో తెలియనప్పుడు వారితో ఉండటం అస్సలు మంచిది కాదు. ఇలాంటి ఆడవాళ్లు బాగా నాటకీయంగా ఉంటారు. హింస ప్రవృత్తి కలిగిన వారికి దూరంగా ఉంటే చాలా మంచిది. హింసను చూసి ఆనందపడేవారు చివరికి మిమ్మల్ని కూడా హింసిస్తూ పైశాచికానందం పొందే అవకాశం లేకపోలేదు. ఇతరుల మీద అసూయను, ఇతరుల ఎదుగుదలను చూసి ఎప్పుడూ కుళ్లుకునేవారితో స్నేహం కూడా మంచిది కాదు. అలాంటి వారు ఇతరులు ఎదిగితే చూడలేరు. స్నేహమనే పేరున్నా సరే.. మీరు ఎదిగినా కూడా ఓర్చుకోలేరు.                                          *నిశ్శబ్ద.

ప్రశాంతమైన జీవితానికి పది సూత్రాలు..

ఈకాలంలో డబ్బు అయితే ఈజీగా సంపాదించగలుగుతున్నారు కానీ ప్రశాంతతను సంపాదించుకోలేకపోతున్నారు. ప్రశాంతత లేనిదే సంతోషాలుండవు.  ఒకవేళ జీవితంలో సంతోష క్షణాలు వచ్చినా అవి దీర్ఘకాలం ఉండవు. సంతోషాలు జీవితంలో ఉన్నా వాటిని అనుభూతి చెందలేరు. అందుకే ఎవరు చూసినా జీవితంలో ప్రశాంతత కరువైందని అంటూ ఉంటారు. కానీ ప్రశాంతత కావాలంటే జీవితంలో కొన్ని మార్పులు, కొన్ని నిజాలు, కొంత అవగాహన చాలా ముఖ్యం. ప్రశాంతమైన జీవితం సొంతం కావాలంటే ఈ కింది పది సూత్రాలను తూ.చా తప్పకుండా పాటించాలి.  అప్పుడు ప్రశాంతత కరువైందిరా బాబూ.. అని గోడు వెళ్లబోసుకోనక్కర్లేదు. ఇంతకీ ఆ సూత్రాలేంటో చూస్తే.. నేనేదీ ప్లానింగ్ చేసుకోను, దాని వల్ల ఒత్తిడి పెరుగుతుంది అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ నిజానికి నేటికాలంలో వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని, చిన్న చిన్న సంతోషాలను బ్యాలెన్స్ చేసుకోవాలంటే ప్లానింగ్ ముఖ్యం. ఉదయం నుండి రాత్రి వరకు ఆఫీసు పని నుండి ఇంట్లో పనుల వరకు.. ప్రణాళికా బద్దంగా పూర్తీ చేస్తుంది ఎప్పటి పని అప్పుడు కంప్లీట్ అయిపోయి మిగిలిన కొద్దో గొప్పో సమయం మీద ప్రభావం ఉండదు.  లోతుగా చేసే శ్వాస వ్యాయామాలు ఒత్తిడి  మీద మంత్రంలా పనిచేస్తాయి. ప్రతిరోజూ వీటిని ఫాలో అవుతుంటే చాలు ఏ పని చేయాలన్నా కంగారు, హడావిడి లేకుండా చెయ్యగలుగుతారు. శ్వాస వ్యాయామాల పుణ్యం  మంచి ప్రశాంతత చేకూరుతుంది. కేవలం శ్వాస వ్యాయామాలే కాదు శారీరక వ్యాయామాలు కూడా అవసరం. శారీరక వ్యాయామం వల్ల శరీరంలో ఎండార్పిన్ విడుదల అవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.  ఇప్పట్లో శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలు ఏమీ లేవు, దీని కారణంగా చాలా తొందరగా శరీరాలు బలహీనం అవుతున్నాయి. హార్మోన్ల స్థితిలో మార్పు,  అవయవాల సామర్థ్యం తగ్గడం జరుగుతున్నాయి. అందుకే ప్రతిరోజూ కనీసం 30 నుండి 60 నిమిషాల వ్యాయామం చెయ్యాలి. ధ్యానం మనిషిని అంతర్గతంగా రిపేర్ చేస్తుంది. మనసు నుండి శరీర అవయవాల వరకు ధ్యానం చేకూర్చే మేలు అంతా ఇంతా కాదు. గుండె ఆరోగ్యం, మానసిక ఒత్తిడి మొదలైన వాటిపై ప్రభావవంతంగా ఉంటుంది. మనసును నియంత్రిస్తుంది. తద్వారా ప్రశాంతత చేకూరుస్తుంది. మనిషి ప్రశాంతతలో నిద్ర కూడా కీలకమైనది. చక్కని నిద్ర మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.  ప్రతిరోజూ కనీసం 7-8 గంటల మంచి నిద్ర బోలెడు రోగాలను దూరం చేస్తుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. చాలామంది ఒత్తిడిగా ఉన్నప్పుడు, పనులు చకచకా జరగాలన్నా కాఫీ, టీ తాగి చురుగ్గా మారతారు. కానీ ఇవి తాత్కాలికంగా ఒత్తిడిని తగ్గిచ్చినట్టు అనిపిస్తాయి కానీ వీటిలో కెఫిన్ మానసిక సమస్యలు పెంచుతుంది. కాఫీ టీ బదులు, లెమన్ టీ, గ్రీన్ టీ, అల్లం, మరీ ముఖ్యంగా హెర్బల్ టీలు ప్రశాంతతను చేకూరుస్తాయి. చాలామంది ఎమోషన్ గా ఉంటుంటారు. కానీ ఎమోషన్స్ పెంచుకోవడం జీవితంలో దుఃఖానికి కారణం అవుతుంది. ఆర్థిక నష్టాలు అయినా, వ్యక్తిగత విషయాలు అయినా నిరాశ పరిస్తే వాటిని ఒక అనుభవంగా తీసుకోవాలి. ఇలాంటి వారు దాదాపుగా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. ఆఫీస్ లో ఎంతో బాగా పనిచేస్తున్నాం కానీ గుర్తింపు లేదు, ఇంట్లో అందరి విషయంలో బాధ్యతగా ఉంటున్నాం కానీ గౌరవించరు. అందరికీ సాయం చేస్తుంటారు కానీ ఎవరూ పొగడరు. అందరితో మంచిగా ప్రేమగా ఉంటాం కానీ ఎవరూ మనల్ని తిరిగి అలా ట్రీట్ చేయరు. చాలామంది జీవితాల్లో జరిగేవి ఇవి.  జీవితం గురించి  అర్థం చేసుకునేవారు వీటిని పట్టించుకోరు. ఇతరుల నుండి ఏమీ ఆశించరు. కానీ కొందరు మాత్రం ప్రతి పని నుండి గుర్తింపో, ఆర్థిక లాభమో ఆశిస్తారు. ఇలాంటి వారే ప్రశాంతతకు దూరం అవుతారు. ఆఫీసు పనులు, ఇంటి పనులు, ఇతర బాధ్యతలు అన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని అనుకుంటున్నారా? ఎప్పుడూ పనులు, బాధ్యతలే కాదు. విశ్రాంతి కూడా కావాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలి. ఇంకా ఎక్కువ ప్రశాంతత కావాలంటే ఒంటరిగా ఎక్కడికైనా ప్రయాణం చేస్తుండాలి. అది మానసికంగా చాలా మంచి ఊరట ఇస్తుంది. వంట, సంగీతం వినడం, డ్యాన్స్, పుస్తకాలు చదవడం, ఆర్ట్స్, విభిన్న కళలుంటే వాటిని కంటిన్యూ చేయడం. కొత్త విషయాలు నేర్చుకోవడం ఇలా ఏదో ఒక అదనపు వ్యాపకం ఉండాలి. ఇవి ఒత్తిడి తగ్గించి ఉల్లాసాన్ని పెంచుతాయి.                                 *నిశ్శబ్ద.  

నమ్మకం విజయానికి తొలి అడుగు అంటారెందుకు?

మనిషికి జీవితంలో నమ్మకమనేది ఎంతో ముఖ్యం. అది మనిషి జీవితాన్ని ఎప్పుడూ మెరుగ్గా ఉండేలా, ధైర్యంతో నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఓ చిన్న కథ అదే చెబుతుంది….. పూర్వం ఒక రాజు వుండేవాడు. అతని భార్య గొప్ప అందగత్తె.  ఆమెను చాలా ప్రేమతో చూసుకునేవాడు. ఆమెకు ఎక్కడ లేని నగలను దేశ విదేశాల నుంచి తీసుకువచ్చే వాడు. అరేబియా నుంచి నగల వర్తకులు నేరుగా ఆమె భవనానికి వచ్చి నగలు అమ్మేవారు. ఇలా 25 సంవత్సరాలు గడిచాయి. ఆమె అందం తగ్గింది. రాజు మరో భార్యను చేసుకున్నాడు. క్రమక్రమంగా ఆమె దగ్గరికి రావటం తగ్గించాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. పెద్దభార్య భర్త తనదగ్గరకి తిరిగి రాకపోతాడా అని ఎదురు చూస్తుండేది. ఆ రాజ్యంలో జరుగుతున్న విశయలు ఏమీ తెలియని ఒక అరేబియా వర్తకుడు రాజ్యానికి వచ్చాడు. అతడు తన దగ్గరవున్న అత్యంత ఖరీదైన నగను పెద్ద రాణికి అమ్మడానికి సరాసరి ఆమె భవనానికి వచ్చాడు. ఆ నగను ఆమెకు చూపించాడు. ఆ రాణి ఆ నగ పనితనానికి ముచ్చటపడి కొనాలని ఆసక్తి చూపి, భర్త నిరాదరణ గుర్తుకువచ్చి మానివేసింది.  ఆమె అనాసక్తిని అరేబియా వర్తకుడు మరొక విధంగా తలచి "అమ్మా, ఈ హారానికయ్యే సొమ్మును నాకు వెంటనే ఇవ్వవలసిన అవసరం లేదు. నేను వర్తకం నిమిత్తం మరిన్ని దేశాలు తిరగవలసివస్తుంది. సంవత్సరం తరువాత నేను మీ రాజ్యానికి తిరిగివస్తాను. అప్పుడు నాకు సొమ్ము ఇవ్వవచ్చు" అన్నాడు.  రాణి ఇంకా తటపటాయిస్తూండగా ఆమె కొడుకైన యువరాజు ఆ హారాన్ని తీసుకొని, తల్లి మెడలో అలంకరించాడు. వర్తకుడు ఆనందంతో వెళ్ళిపోయాడు. వర్తకుడు వెళ్ళిపోయిన తర్వాత కొడుకు తల్లితో "ఎందుకమ్మా అంత ఆలోచిస్తున్నావు? సంవత్సరం లోపల ఏమైనా జరగవచ్చు. నాన్నగారు మనసు మారి మళ్లీ నీ దగ్గరకు రావచ్చు, రాజ్యాధికారం అంటే విరక్తి కలిగి నన్నే రాజుగా ప్రకటించవచ్చు. పిన్ని ఆరోగ్యానికి భంగం కలిగి రాజు నిన్నే ఆదరించవచ్చు, రాజు దురదృష్టం కొద్దీ మరణిస్తే నేనే యువరాజును కాబట్టి రాజ్యాధికారం నాకే రావచ్చు. నాన్నగారు అనారోగ్యానికి లోనైనా నాకే రాజ్యాధికారం రావచ్చు. సంవత్సరంలోపు ఏమైనా జరగవచ్చు, నేను పొరుగు రాజ్యాన్ని జయించి రాజును కావచ్చు. గుర్రం ఎగరవచ్చు, కుక్కలు సింహాలను ఎదిరించవచ్చు. సంవత్సరంలో ఈ నగల వ్యాపారి మరణించవచ్చు, ఒక సంవత్సరం తరువాత మన దగ్గరడబ్బు లేకపోతే నగ నచ్చలేదని తిరిగి అతనికే ఇచ్చేయవచ్చు. సంవత్సరం తరువాత మనదే రాజ్యం అన్న నమ్మకాన్ని పెంచుకో అమ్మా మనకి మంచి జరుగుతుంది అన్నాడు.  వర్తకుడు తిరిగివచ్చేగడువు మూడు రోజులలోకి వచ్చింది. పెద్దరాణి ఆందోళన పడసాగింది. యువరాజు ధైర్యంగా ఉన్నాడు. పరిస్థితులలో ఏ మార్పు లేదు. రెండు రోజులలోకి వచ్చింది గడువు, పెద్దరాణి నగను వర్తకుడికి ఇచ్చేయడానికి సిద్ధపడింది ఇంతలో పిడుగులాంటి వార్త. రాజుగారిని హఠాత్తుగా కొంతమంది దొంగలు బంధించటం జరిగింది. యువరాజు ధైర్యంగా అడవికి వెళ్ళి, ఆ దొంగలను బంధించి, రాజును విడిపించాడు. రాజుగారు సంతోషించి యువరాజుకు రాజ్యం అప్పగించడానికి సిద్ధపడ్డాడు. గడువు చివరిరోజు యువరాజుకి రాజుగా పట్టాభిషేకం జరుగుతున్నది. ఆ సమయానికి అక్కడికి వచ్చిన అరేబియా వర్తకుడిని యువరాజు సాదరంగా ఆహ్వానించి, అతనికి నగకి ఇవ్వలసిన దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చి ఉచితరీతిన సత్కరించి పంపాడు. ఏ పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని పొగొట్టుకోకూడదు. నమ్మకమనే విశ్వాసాన్ని మించిన శక్తి లేదు. భవిష్యత్తు మనదేనన్న నమ్మకంతో జీవించాలి. పైన చెప్పుకున్న కథ అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఏ పరిస్థితులలో అయినా నమ్మకం, ధైర్యం కలిగి ఉన్నపుడే మనం జీవితంలో ఏదైనా సాధించగలిగేది. ఆ విషయం ఎప్పటికీ మరచిపోకూడాది.                                       ◆నిశ్శబ్ద.

కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగితే ఎలాంటి  లాభాలో తెలుసా!

కొబ్బరినీరు ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం అనుకోవచ్చు. ఈ సహజసిద్దమైన నీటిలో ఎలక్ట్రోలైట్లు, పొటాషియం, కాల్షియం, అమైనో ఆమ్లాలు,  యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్ లు, విటమిన్-బి కాంప్లెక్స్ లు, విటమిన్-సి ఇలా చాలా పోషకాలు ఉంటాయి. అనారోగ్యం చేసినప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు, ఎండ కారణంగా అలసిపోయినప్పుడు, వయసు పెరుగుతున్నా యవ్వనంగా ఉండాలని ఇలా చాలా కారణాలుగా కొబ్బరి నీరు తాగుతారు. చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు అందరూ ఇష్టపడే కొబ్బరి నీరు అమృతంతో సమానమనడంలో సందేహం లేదు. లేత కొబ్బరి  బొండాంలో ఉండే కొబ్బరి నీరు కాస్త ఉప్పగా ఉంటుంది. ఈ నీరు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది. కొబ్బెర పట్టిన కొబ్బరి బొండాంలో నీరు తియ్యగా ఉంటుంది. ఇందులో కేలరీలు కాసింత ఎక్కువ ఉన్నా ఇవి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. అయితే కొబ్బరి నీరు తాగే సమయాన్ని బట్టి దాన్నుండి కలిగే ప్రయోజనాలు కూడా మారతాయి. ఏ సమయంలో తాగితే ఎలాంటి లాభాలు ఉంటాయంటే.. ఉదయాన్నే పరగడుపున.. ఆరోగ్యం మీద స్పృహ ఉన్న చాలామంది ఉదయాన్నే లేత కొబ్బరి బొండాం నీటిని తాగుతారు. అధిక వేడి శరీరం ఉన్నవారికి ఇది భలే ఉపయోగపుడుతుంది. ఎందుకంటే పరగడుపున కొబ్బరినీరు తాగితే శరీరంలో అధిక ఉష్టోగ్రత తగ్గిస్తుంది. భోజనం తరువాత.. భోజనం తరువాత కొబ్బరి బోండాం తాగేవారు తక్కువే. అయితే భోజనం చేసిన కొద్దిసేపటి తరువాత కొబ్బరి బోండాం నీరు తాగితే ఆహారం జీర్ణం కావడానికి చాలా సహాయపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువ ఉంటాయి కాబట్టి జీర్ణం కావడం సులువే.  కడుపు ఉబ్బరం సమస్యతో ఇబ్బంది పడేవారు ఇలా భోజనం తరువాత కొబ్బరినీరు ట్రై చేయవచ్చు. నిద్రపోయే ముందు.. రాత్రి పడుకునేముందు పాలు తాగే వారు అధికం. కానీ పడుకునే ముందు కొబ్బరినీరు తాగితే మానసిక సమస్యలు చాలా దూరం ఉంటాయి. ఆందోళన, ఒత్తిడి లాంటి సమస్యలు తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి శరీరంలో టాక్సిన్ లు తొలగిస్తుంది. వ్యాయామం తరువాత.. అధికంగా వ్యాయామం చేసేవారు, ఆటగాళ్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ల కొరత ఏర్పడుతుంది. అలాంటి సందర్బాలలో కొబ్బరి నీరు తాగడం వల్ల కోల్పోయిన  ఎలక్ట్రోలైట్లు భర్తీ అవుతాయి. ఆటలోనూ, వ్యాయామంలోనూ అలసిన శరీరానికి ఇది ఓదార్పును ఇస్తుంది. శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.  తల్లి పాలలో లాక్టిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది. ఇదే పదార్థం కొబ్బరినీళ్లలో కూడా ఉంటుంది. దీని కారణంగా కొబ్బరినీరు తాగితే మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. మద్యం తాగాలని అనిపించినప్పుడు.. మద్యం తాగే అలవాటున్న చాలామంది తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటారు. కొందరు మద్యం మానేయాలని ప్రయత్నించినా అందులో సఫలం కాలేరు. అయితే మద్యం తాగాలని అనిపించినప్పుడల్లా కొబ్బరినీరు తాగాలి. మద్యానికి బానిసైనవారు మద్యం తాగకపోతే తల తిరిగడం, తలనొప్పి, వికారం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. కొబ్బరినీరు ఈ లక్షణాలు తగ్గిస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్లను కూడా భర్తీ చేస్తుంది.                                                         *నిశ్శబ్ద.

ఉపన్యాసకులు ఎలా ఉండాలి?

ఓ సభ నిండా శ్రోతలు ఉన్నప్పుడు వారి ముందు మాట్లాడటం, వారిని మెప్పించేలా మాట్లాడటం ఒక గొప్ప కళ. నేటి కాలంలో ఇలా మాట్లాడేవారు చాలా అరుదు. ఒకసారి చరిత్రలోకి చూస్తే…….. చికాగోలో ఉపన్యాసం ఇవ్వటానికి వెళ్ళినప్పుడు స్వామి వివేకానంద ఎవరో ఎవరికీ తెలియదు. ఆయనకు సమయం ఇచ్చేందుకే ఎవ్వరూ ఇష్టపడలేదు. అయిష్టంగా, మొక్కుబడిగా సమయం కేటాయించారు. ఐతే ఆరంభ వాక్యాలతోనే వివేకానంద అక్కడి ప్రజల మనస్సులను గెలుచుకున్నారు. సంక్లిష్టమైన, మతపరమైన ఉపన్యాసాల నడుమ శ్రోతలను "సోదరసోదరీమణులు" గా సంబోధించటంతోటే శ్రోతల పైమెట్టునున్న వాడిలా కాక, వారిలో తానూ ఒకడైపోయాడు. విశ్వవేదికపై వివేకానందుడు ఓ శక్తిగా అవిర్భవించాడు. ఉపన్యాసాలిచ్చేవారు గమనించాల్సిన అంశం ఇది. వీలైనంత త్వరగా ఎదురుగా ఉన్న శ్రోతలతో సంబంధం ఏర్పరచుకోవాలి. శ్రోతల కన్నా తాను ఒక మెట్టు పైనున్న వాడిలా కాక తానూ శ్రోతలలో ఒకడన్న భావనను శ్రోతలకు కలిగిస్తే తోటే ఉపన్యాసకుడు. సగం విజయం సాధించినట్టే. ఆధునిక సమాజంలో 'వాజ్ పేయి' ఉపన్యాసాలంటే, సభల పేరు చెప్తే ఆమడ దూరం పారిపోయేవారు కూడా సభలకు పరుగెత్తి వస్తారు. ఇతర రాజకీయనాయకులంతా ఓ వైపు, ఉపన్యాసాలలో వాజ్ పేయి ఒక్కడూ ఓ వైపు. గమనిస్తే, వాజ్ పేయి ఉపన్యాసాలలో ఏ నాడూ తాను ఓ మెట్టు పైనున్నాడన్న భావన శ్రోతలకు కలగనివ్వడు. పైగా చమత్కార పూరితమైన సంభాషణలతో సభను అలరిస్తాడు. మామూలుగా మనం మాట్లాడే పదాలనే విరిచి పలకటం, వాటిని పలుకుతున్నప్పుడు తానూ ఆనందం అనుభవిస్తూ పలకటం, వల్ల వాజ్ పేయి మామూలు మాటలు కూడా సభలో ప్రేక్షకులను ఉర్రూతలూపుతాయి. పైగా, తన ఉపన్యాసంలో సమకాలీన సంఘటనలను, ప్రాంతీయఘటనలను వ్యంగ్యంగా ప్రస్తావించటంతో వాజ్ పేయి ఉపన్యాసాలు ప్రేక్షకులను అలరిస్తాయి. వాజ్ పేయి తరువాత శ్రోతలను అంతగా అలరించేవి అబ్దుల్ కలామ్ ఉపన్యాసాలు. వాజ్ పేయి ధోరణికి, వాక్ శైలికి పూర్తిగా భిన్నమైంది అబ్దుల్ కలాం ధోరణి. అయితే ఇద్దరిలో మనం గమనించాల్సిన అంశం, వారు వీలైనంతగా శ్రోతలకు దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తారు. శాస్త్రవేత్తగా తన ఇమేజీని వాడుకుంటూ, ప్రతి ఒక్కరికీ మంచిని బోధించాలన్న నిజాయితీని ప్రదర్శిస్తూ, అబ్దుల్ కలామ్ శ్రోతలను స్ఫూర్తిమంతం చేయగలుగుతున్నాడు. గమనిస్తే రాజకీయ సంబంధిత ఉపన్యాసాలిస్తున్నప్పుడు అబ్దుల్ కలామ్ వ్యవహారశైలి మొక్కుబడిగా ఉంటుంది. అదే పిల్లల నడుమ, విద్యార్థుల నడుమ ఆయన చైతన్యంతో ఉట్టిపడుతూ, చైతన్యాన్ని కలిగిస్తాడు.  దీన్ని బట్టి గ్రహించాల్సిందేమిటంటే, ఉపన్యాసకుడు తనకు ఏ అంశాలపై పట్టు ఉందో, ఏ అంశంపై తాను శక్తిమంతంగా మాట్లాడగలడో తెలుసుకొని ఉండాలి. లేకపోతే వేదికనెక్కి అభాసుపాలు కాక తప్పదు. ప్రస్తుతం మన నాయకులనేకులకు తాము మాట్లాడాల్సిన అంశాలపై పట్టు ఉండదు. ఏదో రొటీన్ గా, మొక్కుబడిగా మాట్లాడతారు. దాంతో సభలంటేనే విసుగు పుడుతుంది. సాహిత్య సభలు కూడా ఇలాగే తయారయ్యాయి. సాహిత్యసభలు తమ పూర్వవైభవాన్ని కోల్పోవటం వెనుక ఉపన్యాసకులలో నిజాయితీ లోపించటం ప్రధానకారణం. పొగడ్తలతో ఒకరినొకరు ఆకాశానికి ఎత్తేయటం, ఏ సభకు ఆ సభలోని వ్యక్తే కాళిదాసుకు పెద్దన్న అన్నట్టు మాట్లాడటం సర్వసాధారణమై పోయింది. విమర్శలు భరించే సహనం లేకపోవటంతో పొగడ్తలే దివ్యౌషధంగా మారాయి. దాంతో సాహిత్యసభలు విలువను కోల్పోయి పరిహాసాస్పదం అయ్యాయి. సభల్లో మాట్లాడేటప్పుడు ఉపన్యాసకుడు ముందుగా తాను మాట్లాడే అంశం గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఉండటం తప్పనిసరి, చమత్కారపూరిత సంభాషణ లేకున్నా, విభిన్నభావాలు ప్రదర్శించలేకున్నా, శ్రోతల దృష్టిని నిజాయితీగా, విజ్ఞానవంతంగా ఉండే ఉపన్యాసకుడు ఆకర్షించగలుగుతాడు. ఇలాంటి ఉపన్యాసకులే ప్రజల మనసుల్లో కూడా అంతో ఇంతో గుర్తుగా నిలిచిపోతారు.                                       ◆నిశ్శబ్ద.

ప్రాణాలను తీసే COPD మీద అవగాహన కావాలిప్పుడు..

COPD అనే పదం విన్నప్పుడు చాలామంది మహిళలలో ఎదురయ్యే PCOD ని పొరపాటున ఇలా చదివారా ఏమైనా అనే సందేహం వస్తుంది. అయితే అది ఇది వేరు వేరు. ప్రతి సంవత్సరం నవంబర్ 14 ను ప్రపంచ COPD దినోత్సవంగా జరుపుకుంటున్నారు.   COPD అనేది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది శ్వాస సంబంధ సమస్యల రుగ్మత. శ్వాస నాళాలు కుచించుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది శ్వాస సంబంధ సమస్యల కారణంగా మరణాలు సంభవిస్తాయి. ఎక్కువకాలం బ్రోన్కైటిస్ సమస్య కొనసాగడం, ఎంఫెసెమా వంటి రెండు శ్వాస సంబంధ వ్యాధులు  COPD లో చేర్చబడ్డాయి. అసలు COPD ని ఎందుకంత ప్రమాదకరమైన సమస్యగా చెబుతున్నారు? దీని ప్రభావమెంత? దీని కారణాలు, దీని నివారణా మార్గాలేంటి? తెలుసుకుంటే.. COPD అనేది ప్రపంచంలో ఎక్కువ మొత్తం  ప్రజల మరణాలకు కారణం అవుతున్న జబ్బులో మూడవది.  ఈ సమస్యలో రోగనిర్థారణ ఎంత త్వరగా జరిగితే అంత  తొందరగా చికిత్స తీసుకోగలుగుతారు.  ఎక్కువ కాలం బ్రతకగలుగుతారు.  అయితే గత ముప్పై సంవత్సరాల కాలాన్ని పరిశీలిస్తే COPD సమస్య ప్రభావం చాలా పెరిగింది. మరీ ఎక్కువగా గత 10 సంవత్సరాల నుండి COPD తీవ్రంగా ఉంది. కరోనా తరువాత ఇది ప్రాణాంతకంగా రూపొంతరం చెందింది. మనిషి శ్వాసించాలంటే ఊపిరితిత్తులు ప్రధాన పాత్ర పోషిస్తాయి.  అయితే COPD సమస్యలో ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి. ఈ COPD లక్షణాలు కింది విధంగా ఉంటాయి. COPD సమస్య ఉన్నవారిలో ఛాతీ నుండి కఫం, శ్లేష్మంతో కూడిన దగ్గు వస్తుంది. ఛాతీ, ఊపిరితిత్తులలో తరచుగా ఇన్ఫెక్షన్ ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఛాతీ చాలా బిగుతుగా ఉంటుంది. తుమ్ములు, ముక్కు కారడం, అలసట, బలహీనత వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఊపిరి తీసుకునేటప్పుడు గురక  వస్తుంటుంది. సాధారణంగా జలుబు వస్తే రెండు మూడు రోజులలో తగ్గిపోతుంది. లేదంటే నాలుగైదు రోజులు వేధిస్తుంది. మెడిసిడ్ వాడితే తగ్గిపోతుంది. కానీ COPD సమస్యలో జలుబు దీర్ఘకాలంపాటు కొనసాగుతుంది. ఈ లక్షణాలు అన్నీ ఉన్నట్టైతే  ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఇది చాలామందిలో ధూమపానం, మద్యపానం కారణంగా వస్తుంటుంది. కాబట్టి ఈ అలవాట్లు ఉండే వదిలేయాలి.                                                        *నిశ్శబ్ద.  

ఆర్గ్యూ జరిగేటప్పుడు ఏడవకూడదు అనుకుని కూడా ఏడ్చేస్తుంటారా? ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు..!

ఏడవడం  ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చేసే పనే.. అయితే ఎప్పుడు ఏడుస్తున్నాం, ఎందుకు ఏడుస్తున్నాం అనేది మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు ఇతరులతో ఏదైనా వాదిస్తున్నప్పుడో.. గొడవ పడుతున్నప్పుడో అప్రయత్నంగా ఏడ్చేస్తుంటాం. మనిషిలో ఎమోషన్ స్థాయి పెరిగినప్పుడు ఎంత కంట్రోల్ చేసుకుందాం అన్నా కొన్ని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేరు. అదే ఏడుపుగా బయటకు వస్తూంటుంది. అయితే ఇలా ఏడ్చిన తరువాత.. అయ్యో ఎందుకు ఏడ్చాము అని ఎవరిని వారు అనుకుంటూంటారు. కొన్ని సార్లు తమని తాము నిందించుకునే వారు కూడా ఉంటారు. అయితే కింది చిట్కాలతో ఎలాంటి సిట్యుయేషన్ లో అయినా ఏడుపును నియంత్రించుకోవచ్చు. కారణం.. ఎవరితో అయినా వాదిస్తున్నప్పుడు, గొడవ పడుతున్నప్పుడు ఏడుపు వస్తుంటే అసలు ఏడుపు ఎందుకు వస్తోంది అని ఆలోచించాలి. దాని కారణం అర్థం అయ్యాక అసలు ఏడవాలని అనుకున్నా కూడ ఏడుపు రాదు. అంతేకాదు.. అలా ఏడవడానికి బదులుగా ఇతరులతో లాజిక్ గా మాట్లాడతారు. డైవర్ట్ కావాలి.. ఆర్గ్యూ చేసుకున్నప్పుడు  ఏడుపు వస్తుంటే దాన్ని బయటపడనివ్వకుండా డైవర్ట్ కావాలి.  ఇందుకోసం పిడికిలి బిగించడం, లోతుగా శ్వాస తీసుకోవడం,  గట్టిగా కళ్లు మూసుకోవడం వంటి చర్యల ద్వారా కోపాన్ని డైవర్ట్ చేయాలి. సైలెంట్.. గొడవ లేదా వాదన జరుగుతున్నప్పుడు ఏడుపు వచ్చినా దాన్ని అణుచుకోవాలన్నా, ఎదుటివారితో లాజిక్ గా మాట్లాడాలన్నా సింపుల్ గా కాసేపు సైలెంట్ గా ఉండటం మంచిది. దీని వల్ల విషయాన్ని బాగా అర్థం చేసుకుని  లాజిక్ గా వాదించి మీరే కరెక్ట్ అనిపించుకోవచ్చు.                                               *నిశ్శబ్ద.

కార్తీక మాసం ఎందుకంత విశిష్టమైనది!

తెలుగు క్యాలెండర్  ప్రకారం ఏడాదిలో ఉన్న 12మాసాలలో కార్తీక మాసం చాలా విశిష్టమైనది. ఆశ్వయుజ మాస  అమావాస్య నాడు వచ్చే దీపావళి మరుసటిరోజు నుండి కార్తీకమాసం మొదలవుతుంది.  ఇది తెలుగు క్యాలెండర్ లో ఎెనిమిదవ నెల. కార్తీకమాసంలో చాలామంది శివాలయ దర్శనం, దీపాలు వెలిగించడం, దైవభక్తిలో గడపడం చేస్తారు. అయితే కార్తీకమాసంలో కేవలం ఇవే ప్రధానం కాదు. కార్తీకమాసం ఎందుకంత గొప్పది? ఈ మాసం ప్రత్యేకత ఏమిటి? పురాణాలలో కార్తీకమాసం గురించి ఏం చెప్పబడింది? కార్తీకమాసంలో ఏ పూజ మంచిది?  వివరంగా తెలుసుకుంటే.. హిందూ క్యాలెండర్ లో కార్తీకమాసం చాలా విశిష్టమైనది. ఈ మాసం  విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసం అంతా స్నానం, దానం, ధ్యానం, పూజలు మొదలైనవాటితో చాలా భక్తిపూర్వకంగా గడిచిపోతుంది. ఈ మాసం పుణ్యఫలాలను ఇస్తుందని సాక్షాత్తూ ఆ విష్టు భవనానుడే చెప్పినట్టు పురాణాలు చెబుతున్నాయి. అన్ని మాసాలలోకి కార్తీక మాసం చాలా శ్రేష్టమైనదని బ్రహ్మ దేవుడు కూడా చెప్పినట్టు పురాణ కథలున్నాయి.  ఇకపోతే కార్తీకమాసంలో ఎవరైనా తీర్థయాత్రలు చెయ్యాలని అనుకుంటే దానికి నారాయణ తీర్థం లేదా బదరికాశ్రమం చాలా ఉత్తమమైనదని పండితులు, పురాణ కథనాలు చెబుతున్నాయి. కార్తీక మాసం గురించి పురాణ గ్రంథాలలో ..  "న కార్తీకసమో మాసో న కృతేన్ సమం యుగం   న వేదం సదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమం" అని ఉంది. అంటే.. కార్తీకమాసం లాంటి మాసం లేదు, సత్యయుగం లాంటి శకం లేదు, వేదాల వంటి గ్రంథాలు లేవు, గంగ వంటి తీర్థం లేదు అని అర్థం.  కార్తీక మాసంలో దేవుడి అంశ బలపడుతుంది. ఈ మాసంలో విష్టుభగవానుడిని తులసితో పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందవచ్చు.  ఈ మాసంలో జ్ఞానం, లక్ష్మీ కటాక్షం కూడా పొందవచ్చు. కేవలం ఈ పూజలు మాత్రమే కాకుండా గంగాస్నానం, దీపదానం, యజ్ఞం, దానధర్మాలు చేయడం వంటివి చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. నదీ స్నానం.. దీపాలు వదలడం వెనుక కారణం.. కార్తీక మాసంలో స్నానానికి పెద్ద  పీట వేస్తారు. పారే నీటిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగుతాయని, పుణ్యం ప్రాప్తిస్తుందని అంటారు. అయితే నదీ స్నానం వెనుక ఉన్న ముఖ్య కారణం చూస్తే.. "శ్రేష్ఠో దేవాన మధుసూదన్ తీర్థ నారాయణాఖ్యాం హి త్రితాయాం దుర్లభం కలౌ ।"  అని స్కాంద పురాణంలో ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకం ప్రకారం శ్రీమహావిష్ణువు నెలకొని ఉండే విష్టుతీర్థం లాగా కార్తీకమాసం కూడా  గొప్పది అని అర్థం. ఇంకొక కారణం చూస్తే..  కార్తీక పూర్ణిమ రోజున మహదేవుడు లేదా పరమేశ్వరుడు త్రిపురాసుడు అనే రాక్షసుడిని సంహరించాడు. విష్ణుమూర్తి కూడా మత్స్య అవతారం ఎత్తాడు.  కార్తీకమాసం అంతా విష్ణువు మత్స్య అవతారంలో నీటిలో నివసిస్తాడు. అలాంటి పవిత్రమైన సమయంలో ఉదయాన్నే నీటిలో స్నానం చేయడం, నీటిలో దీపాలు వదిలడం చేస్తే పాపాలు తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీకమాసంలో గంగాస్నానం చేయడానికి దేవతలే భూలోకానికి వస్తారని కూడా అంటారు. అందుకే పారే నీటిలో స్నానం చేయడం పుణ్యప్రదం.                                                  *నిశ్శబ్ద.

పిల్లలు హోం వర్క్ చేయడానికి అయిష్టంగా ఉంటారా? ఇలా చేస్తే..

చిన్నపిల్లలకు స్కూలుకు వెళ్లడమన్నా, ట్యూషన్లకు వెళ్ళడమన్నా, హోం వర్క్ చెయ్యడమన్నా అస్సలు ఇష్టముండదు. పిల్లలు ఎప్పుడూ ఆడుకోవడానికి, కార్టూన్స్ చూడడానికి ఇష్టపడతారు. కానీ పిల్లలను స్కూలుకు పంపడం మొదలుపెట్టిన తరువాత వారు ప్రాథమిక పాఠశాలకు వెళ్లేవరకు కూడా తల్లిదండ్రులు పిల్లలతో హోం వర్క్ చేయించాల్సి ఉంటుంది.  కానీ పిల్లలు హోం వర్క్ చేయడానికి ససేమీరా ఒప్పుకోరు. మొండి చేస్తారు. అలాకాకుండా పిల్లలు హ్యాపీగా హోం వర్క్ చేయాలంటే ఈ కింది టిప్స్ పాటించాలి.. పిల్లలకు హోంవర్క్‌ని సులభతరం చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. చదువుకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచాలి. పిల్లలు చదువుకునే ప్రదేశంలో ప్రశాంతత,  తగినంత వెలుతురు ఉండాలి. పిల్లల దృష్టిని మరల్చేది ఏమీ ఉండకూడదు. పిల్లలకి పెన్ను, కాగితం, రిఫరెన్స్ మెటీరియల్ ఉండాలి. కేవలం చదువులకే ప్రత్యేక స్థానం కల్పించడం వల్ల పిల్లల ఏకాగ్రత, ఉత్పాదకత రెండూ పెరుగుతాయి.  పిల్లలకు సమయ నిర్వహణ నేర్పాలి..  పిల్లలకు సమయ నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను నేర్పాలి. ఉదాహరణకు టైమర్‌ను 25 నిమిషాలు సెట్ చేసి, ఆపై చిన్న విరామం తీసుకోమనాలి. పోమోడోరో టెక్నిక్ అని పిలిచే ఈ టెక్నిక్ ఉత్పాదకతను పెంచుతుంది.  మానసిక అలసటను తగ్గిస్తుంది. చిన్న చిన్న బ్రేక్ ల వల్ల పిల్లలకు విసుగు రాదు. ఇది మాత్రమే కాకుండా  పిల్లల చదువులో వారికి సహాయం చేయడానికి పుస్తకాలు లేదా విద్యా వెబ్‌సైట్‌ల వంటి వాటిని  యాక్సెస్ చేయడానికి వారిని అనుమతించాలి. ఎక్కువ వనరులు అందుబాటులో ఉంటే పిల్లలు స్వతంత్రంగా పనిని పూర్తి చేయడం సులభం అవుతుంది. తల్లిదండ్రులు తమ దృష్టిని గ్రేడ్‌ల  మీద కాకుండా పిల్లల చదువు మీదనే ఉంచాలి. గ్రేడ్లు, ర్యాంకులు పిల్లలమీద ఒత్తిడి కలిగిస్తాయి.  ప్రశ్నలు అడగడానికి, విషయాలను లోతుగా అన్వేషించడానికి,  వాటిని  పూర్తిగా అర్థం చేసుకోవడానికి  పిల్లలను ప్రోత్సహించాలి.  జ్ఞానం,  వ్యక్తిగత అభివృద్ధి   ప్రధాన లక్ష్యాలుగా ఉండాలి. మైక్రోమేనేజింగ్‌ను నివారించాలి..  పిల్లల హోంవర్క్‌ను మైక్రోమేనేజింగ్ పద్ధతిలో నిర్వహించకూడదు. చాలామంది  దీనివల్ల  నిరాశ,  ప్రతిఘటనకు లోనవుతారు. దీనికి బదులుగా పిల్లలకు హోంవర్క్ చేయడంలో  మద్దతు ఇవ్వడం,  మార్గదర్శకత్వం అందించండం చేయాలి. దీనివల్ల   పిల్లవాడు తన స్వంత పనులను  సులువుగా పూర్తీ చేస్తాడు.                                                         *నిశ్శబ్ద  

ఈ వ్యక్తులతో స్నేహం చేయండి, వారు చాలా దయగలవారు!

మంచి హృదయం ఉన్న వ్యక్తులు అని చెప్పినప్పుడు, మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వారి కరుణ, నిజాయితీ, వినయం. ఒక్క మాటలో చెప్పాలంటే, వీరు ఇతరుల కంటే మృదువైన,  సున్నితమైన లక్షణాలను కలిగి ఉన్నారని చెప్పడం తప్పు కాదు. అలాంటి మంచి మనసున్న వారిని ఎలా గుర్తించాలి అని మీరు ఒక సారి ఒక ప్రశ్న అడగవచ్చు. కొంతమంది చాలా కూల్‌గా ఉంటారు. మరికొందరు చాలా వినయంగా ఉంటారు.  కానీ ఇతరులపై కనికరం చూపే వారు చాలా అరుదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూపుతున్న కనికరాన్ని కూడా అనుమానించేవాళ్లు ఉన్నారు. నేటి ప్రపంచంలో జరుగుతున్న మోసాల కారణంగా ప్రజలు తమ చుట్టూ ఉన్న వ్యక్తులను అంత సులభంగా విశ్వసించడం లేదని అర్థం. కొన్ని రాశిచక్రాల వ్యక్తులు మొదటి నుండి అత్యంత అందమైన హృదయాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. మీరు స్నేహం చేయడానికి మంచి వ్యక్తి కోసం చూస్తున్నట్లయితే, ఈ మూడు రాశులను ముందుగా పరిగణించవచ్చు. 1. కర్కాటకం: కర్కాటకం చంద్రునిచే పాలించబడుతుంది, అంటే ఇది ఒక వ్యక్తి యొక్క భావోద్వేగాలను నియంత్రిస్తుంది. మరొక వ్యక్తి ముందు వారు తమ భావాలను ఎలా వ్యక్తం చేస్తారో వారి హృదయాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు. దానితో పాటు, ఇది ఈ రాశిచక్రాన్ని చాలా భావోద్వేగ గుర్తుగా చేస్తుంది. ఈ సంకేతం యొక్క వ్యక్తులు గొప్ప సున్నితత్వం కలిగి ఉంటారు, వారు ప్రతిదీ హృదయపూర్వకంగా తీసుకుంటారు. వారు తమ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోవాలని.. వారి కోసం తమ సమయాన్ని వెచ్చించాలని కోరుకుంటారు. వారు చాలా సానుభూతి కలిగి ఉంటారుజ వారి అవసరాల కంటే ఇతరుల అవసరాలకు విలువ ఇస్తారు. 2. కన్య: బాహ్యంగా, కన్యలు ఆచరణాత్మక, విమర్శనాత్మక, విరక్త జీవులు. ఈ రాశి వారి మనసులోని భావాలపై చాలా ఆధారపడి ఉంటుంది. కన్య రాశి వారు రహస్యంగా చాలా సెన్సిటివ్, మృదుహృదయం కలిగి ఉంటారని చాలా మందికి తెలియదు. అతని గురించి విమర్శలు ప్రియమైనవారి నుండి,  తిరస్కరణ భయం నుండి వస్తాయి. వారు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.  వారు ఎల్లప్పుడూ వారి నిజాయితీ మరియు సహాయానికి అంకితమై ఉంటారు. 3. మీనం: మీనం రాశి వారు చాలా సున్నితమైన జీవులు. నిజానికి, అవి రాశిచక్రం యొక్క అత్యంత సున్నితమైన సంకేతాలలో ఒకటి. వారు దయ, నిస్వార్థ,  సానుభూతి గలవారు. అతను తన దయ,  దాతృత్వానికి కూడా ప్రసిద్ది చెందారు, ఎల్లప్పుడూ అవసరమైన వారి కోసం చూస్తున్నాడు. అతని మనసు, హృదయం చాలా అందంగా ఉన్నాయి. ఈ మూడు రాశుల వారికి మంచి హృదయం ఉన్నందున, ఇతర రాశుల వారికి మంచి హృదయం లేదని కాదు. అన్ని రాశుల కంటే ఈ మూడు రాశులు హృదయాన్ని తాకుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

తప్పు చేసినవారిని తిట్టడం మంచిదేనా?

జరిగిపోయిన తప్పుల కన్నా, వాటి తాలూకు జ్ఞాపకాలే మనల్ని చాలా నిరాశకు గురిచేస్తాయి. నిస్సత్తువను ఆవహింపజేస్తాయి. ఎవరెవరు ఏమేమనుకుంటున్నారో? అనే ఆలోచనలు ఆందోళనకు గురిచేస్తాయి. కానీ ప్రపంచానికి మన పొరపాట్లను పట్టించుకునే తీరిక ఉండదు. ఒకవేళ ఆ క్షణాలకు అది చర్చనీయాంశమైనా, మరుక్షణం లోకం మనల్నీ, మన తప్పులనూ మరచిపోతుంది. వారి నిందలతో మనం నిరాశకు గురి కావలసిన అవసరం లేదు. 'అవును! తప్పు జరిగిపోయింది దాన్ని దిద్దుకునే అవకాశం కూడా నాకే ఉంది' అని మనకు మనమే ధైర్యం నూరిపోసుకోవాలి.  నీకు నీవే తోడూనీడ! తప్పుకు తలదించుకోవలసిన పని లేదు. తలబిరుసుగా, అహంకారంగా తప్పిదాన్ని సమర్థించు కోవడమూ సరి కాదు. కానీ తప్పు ఎందుకు జరిగిందో విశ్లేషించుకొని, సమీక్షించుకొని సవరించుకోవాలి. అలా కాకుండా బేలగా విలవిల లాడిపోతే మనల్ని ఎవరూ కాపాడలేరు. అందుకే ఆంగ్ల మేధావి మార్క్ ట్వెయిన్ 'మనం తప్పిదాల అనుభవం నుంచి అది నేర్పిన విజ్ఞతను మాత్రమే స్వీకరించాలి. లేకపోతే మనం వేడిపొయ్యి మీద కూర్చోబోయిన పిల్లిలా అయిపోతాం. ఆ పిల్లి భవిష్యత్తులో వేడిపొయ్యి మీద కూర్చోవడం అటుంచి, భయంతో ఆరిన పొయ్యి మీద కూడా కూర్చోదు' అంటారు. పొరపాట్లు జరుగుతాయేమో, నిందలు పడాల్సి వస్తుందేమోనన్న అపోహలతో అసలు ప్రయత్నమే మానుకుంటే మనం ఎందుకూ కొరగాకుండా పోతాం!   మన సహచరుల్లో, సహోద్యోగుల్లో, మన కుటుంబసభ్యుల్లో కానీ ఎవరి వల్లనైనా పొరపాట్లు జరిగితే వాటిని భూతద్దంలో చూస్తూ రాద్దాంతం చేయకూడదు. ఆ వ్యక్తి అపరాధభావంతో కుమిలిపోయేలా ప్రవర్తించకూడదు. ముద్దాయిలా బోను ఎక్కించి, నిందలు, ప్రశ్నలు గుప్పించ కూడదు. ఆ వ్యక్తి స్థానంలో మనం ఉండి ఆలోచించాలి. సంయమనంతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా నాయకుడిగా నలుగురినీ ముందుకు నడిపించాల్సిన వ్యక్తి, తండ్రిగా తన వారికి మార్గదర్శకత్వం వహించి తను ముందు నడవాల్సిన వ్యక్తి తన వారి తప్పులను సహృదయంతో మన్నించగలగాలి. మాటతో కన్నా మౌనంతో వారి మనస్సును మార్చగలగాలి. తాము పొరపాట్లు చేస్తే శ్రీరాముడు ఒక మాట అంటాడని కాకుండా, అన్నయ్య తనే మనస్సులో బాధపడుతూ తమతో మాట్లాడకుండా ఉంటాడేమోనని ఆ తమ్ముళ్ళు ఆలోచించేవాళ్ళట. అంత విశాలహృదయం రఘురాముడిది. అలా తమ వెంట నడిచే వారి తప్పులను సహృదయంతో సరిదిద్దగలిగి ఉండాలి. ఎదుటివ్యక్తి చేసిన పొరపాటును నలుగురి ముందూ ఎత్తి చూపి, విమర్శిస్తే అతని పరిస్థితి మరింత దిగజార్చినవాళ్ళమవుతాము. వారు తమ తప్పును సవరించుకోవడం వదిలేసి, ఆ అవమానంతో మరింత కుంగిపోతారు. ఇలా మనతో కలసి పనిచేసే వారి తప్పిదాలను పరుషవాక్యాలతో చెణకుతూ ఉత్తమ ఫలితాలను రాబట్టలేం.                                           *నిశ్శబ్ద.

ప్రకృతి గర్జిస్తే.. సునామీ ప్రళయం..

పంచభూతాలలో ప్రతి దానికి ప్రత్యేకత ఉంది. సకల జీవులకు దాహం వేస్తే నీరు తాగుతారు. ఆ నీరు ఉగ్రరూపం దాలిస్తే కల్లోలమే.  ఈ కల్లోలానికి కేరాఫ్ అడ్రస్ గా సునామీని చెప్పుకోవచ్చు. ప్రకృతీ వైపరీత్యంలో భాగమని చెప్పుకున్నా ఈ సునామీలకు కారణం ప్రజల చర్యలే అన్నది అంగీకరిచాల్సిన సత్యం. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈ సునామీ బారిన పడి తీవ్ర నష్టాన్ని రుచిచూసే  ఉన్నాయి.  సునామీలు ఊళ్లను, పట్టణాలను కూడా తుడిచిపెట్టేస్తుంటాయి. ఇవి చాలా అరుదే అయినా వీటి వల్ల కలిగే నష్టం మాత్రం  మాటల్లో వర్ణించలేనిది. ఈ సునామీల గురించి అవగాహన కలిగించే ఉద్దేశ్యంతో మొట్టమొదటిసారిగా జపాన్ దేశం ప్రపంచ సునామీ దినోత్సవాన్ని నిర్వహించింది. అసలింతకూ ఈ రోజు మొదలు పెట్టడం వెనుక కారణం ఏంటి? ప్రపంచ సునామీ దినోత్సవం రోజున ఏం చేస్తారు? వివరంగా తెలుసుకుంటే.. నిర్ణయం..  డిసెంబర్ 22, 2015న ఐక్యరాజ్యసమితి తీర్మాణం ద్వారా ప్రతి ఏడాది నవంబర్ 5వ తేదీన ప్రపంచ సునామీ  దినోత్సపం జరుపుకోవాలని నిర్ణయించారు.  సునామీలు ప్రపంచంలో అత్యంత విశానకాన్ని కలిగించే  ప్రకృతి విపత్తులు. వీటికి ఎలాంటి సరిహద్దులు, నియమాలు అంటూ లేవు. తన ఉగ్రరూపంలో, ఉదృతంగా ప్రవహిస్తూ తనలో సమస్తాన్ని కలిపేసుకుంటూ సముద్రం సాగిపోవడమే సునామీ.  ఈ సునామీల వల్ల చాలావరకు నష్టం తీరప్రాంతాలకే పొంచి ఉంటుంది. ఇవి చాలా ప్రమాదకరమైనవి అయినా ఇవి వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ. కారణాలు.. సునామీలు రావడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. వీటిలో భూమి బలంగా కదలడం అంటే భూకంపం, సముద్రంలో అగ్నిపర్వత పిస్పోటనాలు సంభవించడం మొదలైన కారణాల వల్ల నీరు చాలా దూరం ఉగ్రరూపంలో ప్రవహిస్తుంది. ఇలాంటి ప్రమాదాలను ముందుగానే గ్రహించి నష్టాన్నినివారించడానికి  ప్రయత్నాలు చేయడం, అందరికీ అవగాహాన కలిగించడం, సునామీ సంభవిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో  ప్రణాళికలు రచించడం ఈ ప్రపంచ సునామీ అవగాహనా దినోత్సవం ప్రత్యేకత. చరిత్రలో ఏముంది? గత 100సంవత్సరాల కాలాన్ని గమనిస్తే దాదాపు 58 సునామీలు సంభవించాయి. ఈ సునామీలలో సుమారు 2,60వేల మంది ప్రాణాలు కోల్పోయారు.  ఇది ప్రకృతి వైపరీత్యాల కంటే చాలా ఎక్కువ నష్టమని, ఇది అవగాహనా లోపం, నియంత్రిణా లోపమని అంటున్నారు.  ఈ 100 ఏళ్లలో సంభవించిన సునామీలలో 2004, డిసెంబర్ లో హిందూమహాసముద్రం సునామీలో అదిక మరణాలు సంభవించాయి.  ఇండోనేషియా, శ్రీలంక, బారతదేసం, థాయ్ లాండ్ సహా 14దేశాలలో సుమారు 2,27వేల మంది మరణించారు. ఆ తరువాత కేవలం మూడు వారాల తరువాత జపాన్లోని కోబ్ లో అతర్జాతీయ దేశాలు సమావేశమయ్యాయి. హ్యూగో ఫ్రేమ్ వర్క్ ఫర్ యాక్షన్ ను ఆమోదించాయి.  ఈ ఒప్పందమే విపత్తు ప్రమాదాలను తగ్గించే దిశగా రూపొందిన మొట్టమొదటి ప్రపంచ ఒప్పందం. ప్రపంచంలో సునామీలు.. తేదీలు.. మరణాలు.. ప్యూర్టో రికోలో సునామీ.. ప్యూర్టో రికో పశ్చిమ తీరంలో భూకంపం,  సునామీ కారణంగా 118 మంది మరణించారు. ఇది 1918లో జరిగింది. అలాస్కా సునామీ..  కాలిఫోనియాలోని క్రెసెంట్ సిటీ వరకు అలస్కా సునామీ సంభవించింది. ఇది  110 మరణాలకు కారణమైంది. ఇది  1964లో జరిగింది. 2004 హిందూ మహాసముద్రం సునామీ..  ఈ సునామీ సమయంలో హిందూ మహాసముద్రం సుమత్రాలో 65 నుండి 100 అడుగుల ఎత్తుకు చేరుకుంది.   ఇండోనేషియా నుండి తూర్పు ఆఫ్రికా వరకు 2లక్షల కంటే ఎక్కువ మరణాలకు కారణమైంది.                                                   *నిశ్శబ్ద.