ప్రాణాలను తీసే COPD మీద అవగాహన కావాలిప్పుడు..
posted on Nov 15, 2023 @ 3:11PM
COPD అనే పదం విన్నప్పుడు చాలామంది మహిళలలో ఎదురయ్యే PCOD ని పొరపాటున ఇలా చదివారా ఏమైనా అనే సందేహం వస్తుంది. అయితే అది ఇది వేరు వేరు. ప్రతి సంవత్సరం నవంబర్ 14 ను ప్రపంచ COPD దినోత్సవంగా జరుపుకుంటున్నారు. COPD అనేది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది శ్వాస సంబంధ సమస్యల రుగ్మత. శ్వాస నాళాలు కుచించుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది శ్వాస సంబంధ సమస్యల కారణంగా మరణాలు సంభవిస్తాయి. ఎక్కువకాలం బ్రోన్కైటిస్ సమస్య కొనసాగడం, ఎంఫెసెమా వంటి రెండు శ్వాస సంబంధ వ్యాధులు COPD లో చేర్చబడ్డాయి. అసలు COPD ని ఎందుకంత ప్రమాదకరమైన సమస్యగా చెబుతున్నారు? దీని ప్రభావమెంత? దీని కారణాలు, దీని నివారణా మార్గాలేంటి? తెలుసుకుంటే..
COPD అనేది ప్రపంచంలో ఎక్కువ మొత్తం ప్రజల మరణాలకు కారణం అవుతున్న జబ్బులో మూడవది. ఈ సమస్యలో రోగనిర్థారణ ఎంత త్వరగా జరిగితే అంత తొందరగా చికిత్స తీసుకోగలుగుతారు. ఎక్కువ కాలం బ్రతకగలుగుతారు. అయితే గత ముప్పై సంవత్సరాల కాలాన్ని పరిశీలిస్తే COPD సమస్య ప్రభావం చాలా పెరిగింది. మరీ ఎక్కువగా గత 10 సంవత్సరాల నుండి COPD తీవ్రంగా ఉంది. కరోనా తరువాత ఇది ప్రాణాంతకంగా రూపొంతరం చెందింది.
మనిషి శ్వాసించాలంటే ఊపిరితిత్తులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే COPD సమస్యలో ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి. ఈ COPD లక్షణాలు కింది విధంగా ఉంటాయి.
COPD సమస్య ఉన్నవారిలో ఛాతీ నుండి కఫం, శ్లేష్మంతో కూడిన దగ్గు వస్తుంది.
ఛాతీ, ఊపిరితిత్తులలో తరచుగా ఇన్ఫెక్షన్ ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఛాతీ చాలా బిగుతుగా ఉంటుంది.
తుమ్ములు, ముక్కు కారడం, అలసట, బలహీనత వంటి సమస్యలు వేధిస్తుంటాయి.
ఊపిరి తీసుకునేటప్పుడు గురక వస్తుంటుంది.
సాధారణంగా జలుబు వస్తే రెండు మూడు రోజులలో తగ్గిపోతుంది. లేదంటే నాలుగైదు రోజులు వేధిస్తుంది. మెడిసిడ్ వాడితే తగ్గిపోతుంది. కానీ COPD సమస్యలో జలుబు దీర్ఘకాలంపాటు కొనసాగుతుంది. ఈ లక్షణాలు అన్నీ ఉన్నట్టైతే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఇది చాలామందిలో ధూమపానం, మద్యపానం కారణంగా వస్తుంటుంది. కాబట్టి ఈ అలవాట్లు ఉండే వదిలేయాలి.
*నిశ్శబ్ద.