ప్రకృతి గర్జిస్తే.. సునామీ ప్రళయం..

పంచభూతాలలో ప్రతి దానికి ప్రత్యేకత ఉంది. సకల జీవులకు దాహం వేస్తే నీరు తాగుతారు. ఆ నీరు ఉగ్రరూపం దాలిస్తే కల్లోలమే.  ఈ కల్లోలానికి కేరాఫ్ అడ్రస్ గా సునామీని చెప్పుకోవచ్చు. ప్రకృతీ వైపరీత్యంలో భాగమని చెప్పుకున్నా ఈ సునామీలకు కారణం ప్రజల చర్యలే అన్నది అంగీకరిచాల్సిన సత్యం. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈ సునామీ బారిన పడి తీవ్ర నష్టాన్ని రుచిచూసే  ఉన్నాయి.  సునామీలు ఊళ్లను, పట్టణాలను కూడా తుడిచిపెట్టేస్తుంటాయి. ఇవి చాలా అరుదే అయినా వీటి వల్ల కలిగే నష్టం మాత్రం  మాటల్లో వర్ణించలేనిది. ఈ సునామీల గురించి అవగాహన కలిగించే ఉద్దేశ్యంతో మొట్టమొదటిసారిగా జపాన్ దేశం ప్రపంచ సునామీ దినోత్సవాన్ని నిర్వహించింది. అసలింతకూ ఈ రోజు మొదలు పెట్టడం వెనుక కారణం ఏంటి? ప్రపంచ సునామీ దినోత్సవం రోజున ఏం చేస్తారు? వివరంగా తెలుసుకుంటే..

నిర్ణయం..

 డిసెంబర్ 22, 2015న ఐక్యరాజ్యసమితి తీర్మాణం ద్వారా ప్రతి ఏడాది నవంబర్ 5వ తేదీన ప్రపంచ సునామీ  దినోత్సపం జరుపుకోవాలని నిర్ణయించారు.  సునామీలు ప్రపంచంలో అత్యంత విశానకాన్ని కలిగించే  ప్రకృతి విపత్తులు. వీటికి ఎలాంటి సరిహద్దులు, నియమాలు అంటూ లేవు. తన ఉగ్రరూపంలో, ఉదృతంగా ప్రవహిస్తూ తనలో సమస్తాన్ని కలిపేసుకుంటూ సముద్రం సాగిపోవడమే సునామీ.  ఈ సునామీల వల్ల చాలావరకు నష్టం తీరప్రాంతాలకే పొంచి ఉంటుంది. ఇవి చాలా ప్రమాదకరమైనవి అయినా ఇవి వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ.

కారణాలు..

సునామీలు రావడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. వీటిలో భూమి బలంగా కదలడం అంటే భూకంపం, సముద్రంలో అగ్నిపర్వత పిస్పోటనాలు సంభవించడం మొదలైన కారణాల వల్ల నీరు చాలా దూరం ఉగ్రరూపంలో ప్రవహిస్తుంది. ఇలాంటి ప్రమాదాలను ముందుగానే గ్రహించి నష్టాన్నినివారించడానికి  ప్రయత్నాలు చేయడం, అందరికీ అవగాహాన కలిగించడం, సునామీ సంభవిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో  ప్రణాళికలు రచించడం ఈ ప్రపంచ సునామీ అవగాహనా దినోత్సవం ప్రత్యేకత.

చరిత్రలో ఏముంది?

గత 100సంవత్సరాల కాలాన్ని గమనిస్తే దాదాపు 58 సునామీలు సంభవించాయి. ఈ సునామీలలో సుమారు 2,60వేల మంది ప్రాణాలు కోల్పోయారు.  ఇది ప్రకృతి వైపరీత్యాల కంటే చాలా ఎక్కువ నష్టమని, ఇది అవగాహనా లోపం, నియంత్రిణా లోపమని అంటున్నారు.  ఈ 100 ఏళ్లలో సంభవించిన సునామీలలో 2004, డిసెంబర్ లో హిందూమహాసముద్రం సునామీలో అదిక మరణాలు సంభవించాయి.  ఇండోనేషియా, శ్రీలంక, బారతదేసం, థాయ్ లాండ్ సహా 14దేశాలలో సుమారు 2,27వేల మంది మరణించారు. ఆ తరువాత కేవలం మూడు వారాల తరువాత జపాన్లోని కోబ్ లో అతర్జాతీయ దేశాలు సమావేశమయ్యాయి. హ్యూగో ఫ్రేమ్ వర్క్ ఫర్ యాక్షన్ ను ఆమోదించాయి.  ఈ ఒప్పందమే విపత్తు ప్రమాదాలను తగ్గించే దిశగా రూపొందిన మొట్టమొదటి ప్రపంచ ఒప్పందం.

ప్రపంచంలో సునామీలు.. తేదీలు.. మరణాలు..

ప్యూర్టో రికోలో సునామీ..

ప్యూర్టో రికో పశ్చిమ తీరంలో భూకంపం,  సునామీ కారణంగా 118 మంది మరణించారు. ఇది 1918లో జరిగింది.

అలాస్కా సునామీ..

 కాలిఫోనియాలోని క్రెసెంట్ సిటీ వరకు అలస్కా సునామీ సంభవించింది. ఇది  110 మరణాలకు కారణమైంది. ఇది  1964లో జరిగింది.

2004 హిందూ మహాసముద్రం సునామీ..

 ఈ సునామీ సమయంలో హిందూ మహాసముద్రం సుమత్రాలో 65 నుండి 100 అడుగుల ఎత్తుకు చేరుకుంది.   ఇండోనేషియా నుండి తూర్పు ఆఫ్రికా వరకు 2లక్షల కంటే ఎక్కువ మరణాలకు కారణమైంది.

                                                  *నిశ్శబ్ద.