తెలుగు దేశం పార్టీ @40

'శ్రామికుడి చమట చుక్కల్లో నుంచి.. కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి.. రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటి చుక్కల నుంచి.. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి అన్నార్ధుల ఆక్రందనలోనుంచి పుట్టింది ఈ తెలుగు దేశం' - ఇదీ నందమూరి తారక రామా రావు తొలిప్రసంగం  తెలుగుదేశం పార్టీ మరో మైలురాయిని దాటింది. తెలుగింటి ఇలవేలుపు నందమూరి తారకరామా రావు, తెలుగు వారి ఆత్మగౌరవ జెండాను ఎత్తిపట్టి, తెలుగు దేశం పార్టీని ప్రకటించి నేటికి (మార్చి 29) 39 ఏళ్ళు నిండాయి.  1982 మార్చి 29న ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎన్టీఆర్ పార్టీ పేరును ప్రకటించారు. టీడీపీ 40వ ఏట అడుగు పెట్టింది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో టీడీపీఎన్నో ఎన్నెన్నో చారిత్రక పరిణామాలకు సాక్షీభూతంగా నిలిచింది.  నిజానికి ఒక చారిత్రిక అవసరంగా ఆవిర్భవించిన తెలుగు దేశం పార్టీ చరిత్రనే సృష్టించింది.పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలలోనే,అధికారాన్ని కైవసం చేసుకుని ఓ చరిత్రను  తిరగ రాసింది. దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఇంత తక్కువ కాలంలో అధికారంలోకి వచ్చిన పార్టీ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.  అలాగని  నాలుగు పదులకు చేరుకున్న చరిత్రలో టీడీపీ ప్రస్థానం సాఫీగా సాగిందా అంటే, లేదు.ఎన్నోవిజయాలను సొంత చేసుకున్న పార్టీ మరెన్నో సంక్షోభాలను దాటుకుని ముందుకు సాగుతోంది. తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చినపార్టీ, రెండు సంవత్సరాలు తిరగకుండానే తొలి సంక్షోభాన్ని ఎదుర్కుంది. ఆ తర్వతా ఎన్నో అటుపోట్లను ఎదుర్కుంది. అయినా,లేచి నిలబడింది.నిలతొక్కుకుంది.మళ్ళీ మళ్ళీ జైత్ర యాత్రను కొనసాగించింది. పార్టీ ప్రస్థానంలో సగానికంటే ఎక్కువ కాలం,సుమారు 22 సంవత్సరాలు అధికారంలో కొనసాగింది.అందులో ఏడేళ్ళు ఎన్టీఅర్ ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు పర్యాయాలు, అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా మరో మారు,  మొత్తం కొంచెం అటూ ఇటుగా 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.ఇదొక రికార్డ్,ఇంతవరకు ఇంత సుదీర్ఘకాలం మరెవ్వరూ పాలించలేదు.  రాష్ట్రంలోసుదీర్ఘకాలం అధికారంలో ఉండడమే కాదు, కేంద్రంలోనూ టీడీపీ చక్రం తిప్పింది. 13వ లోక్ సభలో 29లోక్ సభ స్థానాలు సాధించి, లోక్ సభలో రెండో అతిపెద్ద పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. నేషనల్ ఫ్రంట్ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపింది. ఇక చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పారు.  ఎన్టీఅర్,’సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు’ అని ప్రకటించి ‘కిలో రెండు రూపాయలు బియ్యం’ వంటి అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. అంతేకాదు, అంతవరకు, ‘రాజకీయ అంటరానితనానికి’ గురైన బడుగు బలహీన వర్గాలను చేరదీసి, వారికి రాజకీయ  బిక్షను ప్రసాదించారు. ఈరోజు, ఉభయ తెలుగు రాష్ట్రాలలో కీలక పదవులలో ఉన్న అనేక మంది ఎన్టీఅర్ పుణ్యానే రాజకీయంగా ఎదిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేసింది ఎన్టీఅర్ , తెలుగుదేశం పార్టీ, ఇది దేశం ప్రత్యర్ధులు, కూడా నేటికీ కాదనలేని నిజం.అప్పుడే కాదు ఇప్పడు కూడా,   'సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు' అన్న పార్టీ మూల సిద్ధాంతాన్ని మరువకుండా, అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజలతో మమైకమైన పార్టీ ఏదైనా ఉందంటే అది, తెలుగు దేశం పార్టీ ఒక్కటే. మరోవైపు చద్రబాబు నాయుడు, ఎన్టీఅర్ ఆశయాలను ముందుకు తీసుకుపోతూనే, తమ దార్శనికతతో రాష్ట్రాభి వృద్ధికి బాటలు వేశారు.పరిపాలనా,ఆర్థిక సంస్కరణలతో సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళుగా, చేశారు. ఇటు ఐటీ రంగంలో అటు విద్యుత్, పరిశ్రమలు, చేతి వృత్తులు, ఇలా న్నిరంగాలలో సంస్కరణలు తెచ్చారు. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో   ఐటీ సావీ’గా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు, వ్యసాయ రంగాన్ని ఉపేక్షించారనే  అపవాదు నుంచి మాత్రం తప్పించుకోలేక పోయారు. నిజానికి,చంద్రబాబు వ్యవసాయ రంగాన్ని ఉపేక్షించారు అన్నదినిజం కాదు. ‘వ్యవసాయం దండగ’ అని ఆయన ఏనాడూ అనలేదు. అయినా  ప్రత్యర్ధులు ఆయన అనని ఆ మాటను ఆయన నోట్లో పెట్టి దుష్ప్రచారం చేశారు.అలా చంద్రబాబు రైతు వ్యతిరేకి అనే ముద్ర వేశారు. నిజానికి ఎన్టీఅర్ సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇస్తే, చంద్రబాబు అభివృద్ధికి కొత్త పుంతలు తొక్కించారు. ఐటీ సహా అనేక రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి, ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి గుర్తింపు మాత్రమే కాదు గౌరవం ఖ్యాతి కూడా తెచ్చారు. అనేక ప్రపంచ సంస్థలు హైదరాబాద్’లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి అంటే అందుకు చంద్రబాబు వేసిన విత్తే కారణం. హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్’గ పెట్టుబడుల డెస్టినేషన్’గా అభివృద్ధి చేసిన క్రెడిట్ చంద్రబాబుకే దక్కుతుంది. ఇదే విషయాన్ని, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి తారక రామ రావు పలు సందర్భాల్లో అంగీకరించారు.  అదలా ఉంటే మరోవంక తెలుగు దేశం ఆవిర్భావంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారి పోయింది. అంతవరకు రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్ పార్టీకి, ఎన్టీఅర్ చరిష్మా చెక్ పెట్టింది. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ కాంగ్రెస్ పతనానికి తెలుగు దేశం పార్టీనే బీజం వేసింది.కాంగ్రెస్’కు వ్యతిరేకంగా  యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో ఎన్టీఅర్ కీలక భూమికను పోషించారు.ఇందులో భాగంగా, 1989 (?)లో  వివిధ జాతీయప్రాతీయ పార్టీల నాయకుల,తొలి కాంక్లావే/సమావేశం హైదరాబాద్’లో ఎన్టీఅర్ అధ్యక్షతన జరిగింది. అలాగే, చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ... కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను ఏకం చేయడంలో కీలక పాత్రను పోషించారు. ఇక ఆ తర్వత ఏమి జరిగింది అనేది చరిత్ర.  

తీన్మార్ మల్లన్నతో కొండా కొత్త పార్టీ!  

తెలంగాణలో కొత్త పార్టీల సీజన్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించింది. పార్టీ ఏర్పాట్లలో ఆమె చాలా దూకుడుగా వెళుతున్నారు.  షర్మిల పార్టీతో పాటు మరికొన్ని కొత్త పార్టీలు వస్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. సంచలన కామెంట్లతో టీఆర్ఎస్ నాయకత్వానికి టెన్షన్ పుట్టిస్తున్న మంత్రి ఈటల రాజేందర్.. బీసీ అజెండాతో కొత్త పార్టీ పెట్టబోతున్నారనే చర్చ సాగుతోంది. పీసీసీ ఇవ్వకపోతే ఎంపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి సొంత పార్టీ పెడతారనే కొందరు చెబుతున్నారు. తన యూట్యాబ్ ఛానెల్ ద్వారా  కేసీఆర్ సర్కార్ ను ప్రశ్నిస్తూ ప్రజల్లో మంచి ఫాలోయింగ్ సంపాందించిన తీన్మార్ మల్లన్న కూడా కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.  తాజాగా కాంగ్రెస్ కు ఇటీవలే రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మరో బాంబ్ పేల్చారు. తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీ అవసరం ఎంతైనా ఉందని అన్నారు.  రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్రంలో మరో పార్టీ రావాలని చెప్పారు.కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యామ్నాయ పార్టీగా, బలమైన ప్రతిపక్షంగా ఉండలేకపోతోందన్నారు. దీని వల్లే చాలా మంది నాయకులు అమ్ముడు పోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం వివిధ పార్టీల నేతలతో మాట్లాడినట్లు తెలిపారు. బీజేపీలో చేరాలా?లేదా కొత్త పార్టీ పెట్టాలా? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలా? అనేది త్వరలో నిర్ణయించుకుంటానని విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.   కొండా కామెంట్లతో ఆయన కూడా కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రధాన పార్టీలకు చుక్కలు చూపించిన తీన్మార్ మల్లన్నతో కొండా టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. తీన్మార్ మల్లన్నతో పాటు టీజేఎస్ అధినేత, తెలంగాణ ఉద్యమ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ తోనూ ఆయన చర్చలు జరుపుతున్నారని సమాచారం. కోదండరామ్, తీన్మార్ మల్లన్నతో కలిసి కొత్త కూటమి పెట్టేందుకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సీరియస్ గానే వర్కవుట్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాన్యుడిగా పోటీ చేసి విజయం అంచు వరకు వెళ్లారు తీన్మార్ మల్లన్న.   ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత తీన్మార్ మల్లన్న క్రేజ్ మరింత పెరిగింది. కోదండరామ్ కూడా భారీగానే ఓట్లు సాధించారు. దీంతో ప్రశ్నించే గొంతుకలకు తెలంగాణ ప్రజల్లో ఆదరణ ఉందని భావిస్తున్న  కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ... వాళ్లతో కలిసి కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.  ఆదివారం తన  భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన తీన్మార్ మల్లన్న..  రాష్ట్రంలో 6 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. తీన్మార్ మల్లన్న పేరిట కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.  రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో కమిటీలు ఉంటాయని తీన్మార్ మల్లన్న వెల్లడించారు. తీన్మార్ మలన్న భవిష్యత్ కార్యాచరణతో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేయడమంటే కొత్త పార్టీ ఏర్పాటుకు అడుగులు పడుతున్నట్లేననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మీడియాతో మాట్లాడిన తీన్మార్ మల్లన్న... టీఆర్ఎస్ సర్కార్ పై యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. కేసీఆర్ ను గద్దే దింపేవరకు విశ్రమించబోనని చెప్పారు. సామాన్యుడు సీఎం సీటులో కూర్చోవడమే తన లక్ష్యమన్నారు. దీంతో తీన్మార్ మల్లన్న కేంద్రంగానే కొత్త పార్టీ రావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు టీఆర్ఎస్ నేతలపైనా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావు తనకు ఇష్టమైన నేతలు అన్నారు. తక్కువ మాట్లాడతారు... ఎక్కువ వింటారని చెప్పుకొచ్చారు. ఈటలను కలిసి మాట్లాడాలనుకుంటున్నానని, అపాయింట్‌మెంట్ కూడా అడిగానని కొండా చెప్పుకొచ్చారు. కేసీఆర్‌పై ఈటల ఒక్కోసారి అలుగుతారు.. మరోసారి దోస్తీ చేస్తున్నారని చెప్పారు. అది కనుక్కుందామనే... ఆయనతో భేటీకి ప్లాన్ చేసినట్టు చెప్పారు. నిజంగా బయటకు వచ్చేది ఉంటే వచ్చేయండని చెబుతానన్నారు. ఈటల సొంత పార్టీ ఏర్పాటు చేస్తే గొప్ప నాయకుడు అవుతాడని కొండా జోస్యం చెప్పారు. దీంతో మంత్రి ఈటెలతోనూ కొండా సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. తాను అనుకుంటన్న కూటమిలోకి ఈటల కూడా వస్తే.. మరింత పవర్ ఫుల్ అవుతుందనే యోచనలో కొండా ఉన్నారని చెబుతున్నారు.  

ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా

తెలంగాణలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తోంది. వారం రోజులుగా ఉదృతం అవుతోంది. తాజాగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సురభి వాణిదేవికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సామాజిక మాధ్య‌మం ద్వారా తెలిపారు. "టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు నా మనవి. నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయినందున గత కొన్ని రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు అవసరమైతే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను." అంటూ వాణిదేవి వెల్లడించారు.  ఇటీవలే హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా సురభి వాణిదేవి  విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె విస్తృతంగా తిరిగారు. సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కూడా సుదీర్ఘంగా నాలుగు రోజుల పాటు సాగింది. లెక్కింపు సందర్భంగా వాణిదేవీ కూడా కౌంటింగ్ హాల్ లో ఉన్నారు. ఇక ఎన్నికల కౌంటింగ్ లో పాల్గొన్న సిబ్బందిలో చాలా మందికి కరోనా సోకింది. రోజు రోజుకు వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో కౌంటింగ్ హాల్ కరోనా వ్యాప్తి చెందిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాణిదేవీ ఇటీవల శాసనమండలి సమావేశాలకు కూడా హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్సీలంతా కరోనా టెస్టులు చేయించుకున్నారు. 

రైతులకు ఏపీ మంత్రి క్షమాపణ

వరిసాగు ఉత్త సోమరిపోతు వ్యవహారం అంటూ ఏపీ హౌసింగ్ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  రైతు సంఘాలు మండిపడ్డాయి. ఏలూరులో రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టాయి. మంత్రి శ్రీరంగనాథరాజు వెంటనే రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. రైతుల ఆందోళనతో మంత్రి  వెనక్కి తగ్గారు మంత్రిశ్రీరంగనాథరాజు .  వరిసాగుపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, రైతులకు క్షమాపణలు చెబుతున్నానని శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు కౌలు రైతులకు అందడంలేదని, ఆ పథకాల ఫలాలను భూయజమానులే అనుభవిస్తున్నారని, రైతుబిడ్డను కావడంతో నిన్న అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. తాను తొందరపాటుతో ఈ వ్యాఖ్యలు చేశానని అంగీకరించారు. రైతులు ఎవరైనా బాధపడితే తనను క్షమించాలని కోరారు. రైతు సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ప్రకటన చేశారు. వరి ఒక సోమరిపోతు వ్యవసాయం’ అని మంత్రి రంగనాథ రాజు శనివారం వ్యాఖ్యానించారు. ‘సోమరి పోతు వ్యవసాయం ఏదైనా ఉందంటే అది వరి సాగే. రైతులు కష్టపడాల్సిన అవసరం లేదు. ఏఈగారు కాల్వలకు నీరు వదిలితే పొలంలోకి నీళ్లు వస్తున్నాయి. ఒరేయ్‌ బాబూ ఆకుమడి దున్ను... అంటే వచ్చి దున్నుతాడు. బస్తా విత్తనాలు పొలంలో పడేస్తే... ఇంతని డబ్బులు ఇస్తే విత్తనాలు, ఎరువులు చల్లుతున్నారు. ఊడ్పులకూ అంతే! బస్తాకు ఇంత అని ఇస్తే సరిపోతుంది’’ అని మంత్రి రంగనాథ రాజు వ్యాఖ్యానించారు. మంత్రి మాటలతో కిసాన్‌మేళాలో పాల్గొన్న రైతులు విస్తుపోయారు.

నదిలో ల్యాప్‌ట్యాప్, హార్డ్‌డిస్క్.. అంబానీ కేసులో కీలక మలుపు! 

మహారాష్ట్రలో  రాజకీయ ప్రకంపనలు రేపుతున్న, దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ముకేష్ అంబానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారి సజిన్ వాజేకు సంబంధించిన కీలక విషయాలు ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగులోనికి వచ్చాయి. ఈ కేసులో అరెస్టయిన ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే సమక్షంలో ఎన్ఐఏ ఆదివారంనాడు కీలక ఆధారాలను చేజిక్కించుకుంది. వాజేతో కలిసి ముంబై బాంద్రాలోని మిథి రీవర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్న ఎన్ఐఏ బృందం ఆయన ఇచ్చిన ఆధారాలతో గజ ఈతగాళ్లను రంగంలోకి దిగింది. నదిలోకి దిగిన ఈతగాళ్లు రెండు కంప్యూటర్ సీపీయూలు, ఒక ల్యాప్‌ట్యాప్, హార్డ్‌డిస్క్, ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఉన్న రెండు నెంబర్ ప్లేట్లు, ఇతర వస్తువులు వెలికితీశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అంబానీ నివాసమైన సౌత్ ముంబై హోమ్ 'ఆంటిలియా' సమీపంలో గత ఫిబ్రవరి 25న ఒక స్కార్ఫియో నిలిపి ఉండటం, అందులో 20 జెలిటెన్ స్టిక్‌లు, బెదరింపు లేఖ కనిపించడం సంచలనం సృష్టించింది. పేలుడు పదార్ధాలు నింపిన ఎస్‌యూవీ యజమాని మన్‌సుఖ్ హిరాన్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో మార్చి 13న వాజేను ఎన్ఐఏ అరెస్టు చేసింది. తన కారును దొంగిలించారంటూ ఫిబ్రవరి 17న ఫిర్యాదు చేసిన హిరాన్ మార్చి 5న థానేలోని క్రీక్‌లో విగతజీవుడై కనిపించాడు. తన భర్త గత నవంబర్‌లో ఎస్‌యూవీని వాజేకు ఇచ్చినట్టు మృతుని భార్య పేర్కొంది.  ఈ క్రమంలో క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ (సీఐయూ)‌లో అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న వాజేను ఎన్ఐఏ అరెస్టు చేసింది. వాజే ఉద్యోగంపై సస్పెన్షన్ వేటు పడింది. ఏప్రిల్ 3 వరకూ ఆయన కస్టడీలోనే ఉంటారు.  

పవన్ ప్రచారంపై బీజేపీలో టెన్షన్! వస్తారంటున్న రత్నప్రభ 

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగుతున్నారు, తమ అభ్యర్థిగా కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభను నిలబెడుతోంది బీజేపీ. అయితే తిరుపతి ఎన్నికల ప్రచారానికి తమ మిత్రపక్షమైన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వస్తారా రారా అన్న టెన్షన్ కమలనాధుల్లో కనిపిస్తోంది. అందుకే ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఏపీ పార్టీ ఇంచార్జ్ సునీల్ దియేదర్ తో పాటు అభ్యర్థి రత్నప్రభ.. హైదరాబాద్ వెళ్లి పవన్ కల్యాణ్ ను కలిశారు. బీజేపీ నేతలతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ప్రచారం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో తిరుపతిలో జనసేనాని ప్రచారం చేయకపోవచ్చనే చర్చ జరుగుతోంది.      తిరుపతిలో జనసేన పొత్తుపై క్లారిటీ ఇచ్చారు అభ్యర్థి రత్నప్రభ . బీజేపీకి జనసేన మద్దతు లేదన్న ప్రచారం సరికాదని  చెప్పారు. తన అభ్యర్థిత్వంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ 200 శాతం సంతృప్తిగా ఉన్నారన్నారు. ప్రచారానికి ఆయన్ను ఆహ్వానిస్తే తప్పకుండా వస్తానని హామీ ఇచ్చినట్లు రత్వప్రభ తెలిపారు.  తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో తనను గెలిపిస్తే రాష్ట్రం తరఫున పార్లమెంట్‌లో గట్టి స్వరం వినిపిస్తానని రత్నప్రభ అన్నారు. ఇన్నాళ్లకు మాతృభూమికి సేవ చేసే అవకాశం తన ముందుందని చెప్పారు. పనిచేయడంలోనే తనకు అమితానందం ఉంటుందన్నారు.  తిరుపతిలో మీడియాతో మాట్లాడిన రత్నప్రభ.. జగన్ విషయంలో తనపై జరుగుతున్న ప్రచారంపైనా స్పందించారు.గతంలో సీఎం జగన్‌ను తాను ప్రశంసించిన ట్వీట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తున్నారని రత్నప్రభ చెప్పారు. మంచిపని చేస్తే ప్రశంసించానని.. అంతమాత్రాన మద్దతు ఇచ్చినట్లు కాదని స్పష్టం చేశారు. డబ్బుకు ఓటెయ్యాలో.. నీతి నిజాయతీకో ప్రజలు తేల్చుకోవాలన్నారు రత్నప్రభ. తిరుపతి కోసమే కాకుండా రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తానన్నారు. 

మండల స్థాయిలో మల్లన్న కమిటీలు.. తీన్మార్ పార్టీ ఖాయమేనా?

తీన్మార్ మల్లన్న... తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడో సంచలనం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో నల్గొండ స్థానంలో పోటీ చేసిన తీన్మార్ మల్లన్న... ప్రధాన పార్టీలకు చుక్కలు చూపించారు. సామాన్యుడిగా పోటీ చేసి విజయం అంచు వరకు వెళ్లారు. తెలంగాణ ఉద్యమ సారథి ప్రోఫెసర్ కోదండరామ్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత తీన్మార్ మల్లన్న క్రేజ్ మరింత పెరిగింది. తెలంగాణ భవిష్యత్ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారబోతున్నారనే చర్చ జరుగుతోంది. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టబోతున్నారని, నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నారనే ప్రచారం సాగుతోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పోటీ విషయంలో తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు తీన్మార్ మల్లన్న. తాను సాగర్ లో పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం కాచవానిగూడెంలో తన అనుచరులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు తీన్మార్ మల్లన్న. సభకు భారీగా హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. రాష్ట్రంలో 6 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. తీన్మార్ మల్లన్న పేరిట కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.  రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో కమిటీలు ఉంటాయని తీన్మార్ మల్లన్న వెల్లడించారు.  తీన్మార్ మలన్న భవిష్యత్ కార్యాచరణతో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేయడమంటే కొత్త పార్టీ ఏర్పాటుకు పునాదులు పడుతున్నట్లేననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి కొత్త పార్టీ ప్రకటన లేకున్నా.. పాదయాత్ర తర్వాత పార్టీ ఏర్పాటు ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు, పాదయాత్రలో తనకు ఎదురయ్యే పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలను అనుగుణంగా తీన్మార్ మల్లన్న నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఏది ఏమైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో తీన్మార్ మల్లన్న పార్టీ రావడం ఖాయమంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మీడియాతో మాట్లాడిన తీన్మార్ మల్లన్న... టీఆర్ఎస్ సర్కార్ పై యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. కేసీఆర్ ను గద్దే దింపేవరకు విశ్రమించబోనని చెప్పారు. సామాన్యుడు సీఎం సీటులో కూర్చోవడమే తన లక్ష్యమన్నారు. తీన్మార్ మల్లన్న లక్ష్యం ప్రకారం.. సామాన్యుడు సీఎం సీటులో కూర్చొవాలంటే తనకంటూ పార్టీ ఉండటం కంపల్సరీ. ఆ దిశగానే తీన్మార్ మల్లన్న అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నర ఏండ్ల సమయం ఉండటంతో అప్పటివరకు తీన్మార్ మల్లన్న కమిటీలను బలోపేతం చేసే యోచనలో ఆయన ఉన్నట్లు కనిపిస్తోంది. 

కమలం కంట్లో  పీకే నలుసు 

కంట్లో నలుసు, పంటికింద రాయి, కాల్లో ముల్లు సామెత ఏదైనా, బీజేపీ, జనసేన మధ్య సాగుతున్న కీచులాట బంధానికి,  రెండు పార్టీల మధ్య నలుగుతున్న కయ్యాలమారి కాపురానికి చక్కగా అతికినట్టు సరిపోతాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో, అటు తిరుపతి లోక్ సభ స్థానానికి, ఇటు నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతన్న సమయంలో, రెండు పార్టీల నాయకులు ఒకరి నిజాయతీ, చిత్తశుద్ధిపై ఇంకొకరు అనుమానాలు వ్యక్తం చేయడం, మర్మగర్భ వ్యాఖ్యలు, విమర్శలు చేసుకోవడం ఒకెత్తు అనుకుంటే, ఇప్పడు ఆ దశను దాటి ఇప్పుడు ప్రత్యక్ష ఆరోపణలకు దిగుతున్నారు.  ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ చపలచిత్త నిర్ణయాలు తమ కొంప ముంచుతున్నాయని ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆఖరి క్షణంలో తెరాస అభ్యర్ధి, వాణీ దేవికి మద్దతు ప్రకటించడం కమల నాధులకు అసలు మింగుడు పడడం లేదు. తెలంగాణలో పవన్ కళ్యాణ్’కు పెద్దగా పట్టు లేకపోయినా, ఆఖరి క్షణంలో ఆయన తెరాసకు మద్దతు ప్రకటించడంతో తటస్థులు, అంతవరకూ బీజేపీ అభ్యర్ధి రామచంద్ర రావు గెలుపు పై విశ్వాసం ఉంచి, ఆయనకు ఓటు వేయడానికి సిద్దమైన వారు, మనసు మార్చుకోవడం జరిగిందని, బీజేపీ నాయకులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. అందుకే,నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంలో ఆఖరి క్షణంకు ఆయన నిర్ణయం కోసం వేచి చూసి, చివరకు భంగపడడం కంటే అయన కంటే ముందే కటీఫ్ చెప్పేస్తే, గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా పార్టీ పరవు అన్నా మిగులుతుందని కొందరు నేతలు పార్టీ అధినాయకత్వానికి సూచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.  అయితే, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం పవన్ తో  పొత్తు విషయంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా కొందరు నాయకులు  పవన్’తో పొత్తు కటీఫ్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని అంటున్నారు. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ఉభయ పార్టీల మధ్య ఒక స్పష్టమైన అవగాహాన కుదిరినందున, ఈ దశలో పొత్తును తమంతట తాముగా తుంచుకోవడం మంచి కాదని, కమల దళంలోని ఒక వర్గం గట్టిగా వాదిస్తోంది. సామాజిక  సమీకరణాల దృష్ట్యా కూడా పవన్’తో పొత్తు కొనసాగించడం ఉత్తమమని, అలాగే, పవన్ కళ్యాణ్ ఇప్పటికే బహిరంగంగా బీజేపీ అభ్యర్ధి, రత్న ప్రభకు మద్దతు ప్రకటించి నందున, అదే యథాతథ స్థితిని కొనసాగించడం మంచిదని కొందరు నేతలు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ఒక చోట స్నేహం, మరో చోట వైరం అంటే, బెంగాల్లో పొత్తు,కేరళలో కయ్యం అన్నట్లుగా సాగుతున్న కాంగ్రెస్, కమ్యూనిస్ట్ శతృ, మిత్ర బంధంలా నవ్వులు పాలవుతామని మరి కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ సందర్భంగా, గతంలో పార్టీ నేతగా ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కాయిన్ చేసిన, గల్లీలో  కుస్తీ, ఢిల్లీలో దోస్తీ’ స్లోగన్ను గుర్తు చేస్తున్నారు. అలాగే మంచో చెడో ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఒంటరిగా పోవడమే ఉత్తమమని ఉభయ రాష్ట్రాలలోని మెజారిటీ వర్గం అభిప్రాయ పడుతోంది. తెలుగు రాష్రాయ లలో పొత్తులు కలిసి రాలేదని, సుదీర్ఘ కాలం పాటు తెలుగు దేశంతో పొత్తు సాగించడం వలన తోక పార్టీ అన్న ముద్ర తప్ప ఇంకేమి మిగల లేదని పార్టీ సీనియర్ నేతలు సైతం ఒంటరి పోరువైపే మొగ్గు చూపుతున్నారు. సిద్ధాంత భావసారుప్యత లేని పార్టీలతో, ముఖ్యంగా ఎటు గాలి వేస్తే అటు పోయే పవనుడితో పొత్తు దీర్ఘకాలంగానే కాదు తాత్కాలికంగా వేస్ట్ అని సీనియర్ నేతలు తేల్చేస్తున్నారు.

తిరిగి టీఆర్ఎస్ లోకి కొండా?

తెలంగాణ రాష్ట్ర సమితీలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తప్పుకుని కేటీఆర్ కు ఆ బాధ్యతలు అప్పగిస్తారని గతంలో జోరుగా ప్రచారం జరిగింది. కేటీఆర్ పట్టాభిషేకానికి ముహుర్తం కూడా ఖరారైందని చర్చ సాగింది. టీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కొత్త వారికి ఇస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని కూడా కొందరు చెప్పారు. ఇటీవల కాలంలో ఈటల రాజేందర్ బాంబులు పేల్చుతున్నారు. టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇరుకున పెట్టేలా ఆయన కామెంట్లు ఉంటున్నారు. ఈటల కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం కూడా ఉంది. అదే సమయంలో ఈటలను కూల్ చేసేందుకు కేసీఆర్ ఆయనకు కీలక బాధ్యతలు ఇవ్వలాని చూస్తున్నారని కూడా టీఆర్ఎస్ వర్గాల్లోనే చర్చ జరిగింది. టీఆర్ఎస్ లో ఆసక్తికర పరిణామాలు జరుగుతుండగానే.. టీఆర్ఎస్ మాజీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావుపై ఆయన సంచలన కామెంట్లు చేశారు. ఈటల రాజేందర్, హరీశ్ రావు  తనకు ఇష్టమైన నేతలు అన్నారు కొండా. తక్కువ మాట్లాడతారు... ఎక్కువ వింటారని చెప్పుకొచ్చారు. కేసీఆర్, కేటీఆర్‌ తప్పుకుని టీఆర్ఎస్ నాయకత్వాన్ని హరీశ్ లేదా ఈటలకు ఇస్తే మళ్ళీ టీఆర్ఎస్‌లో చేరతానన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డియ  ఈటలను కలిసి మాట్లాడాలనుకుంటున్నానని, అపాయింట్‌మెంట్ కూడా అడిగానని కొండా చెప్పుకొచ్చారు. అయితే ఇంకా అవకాశం ఇవ్వలేదన్నారు. ఫ్లోన్ల ట్యాపింగ్ భయంతో టీఆర్ఎస్ పార్టీ వాళ్లు తనతో మాట్లాడటానికి భయపడతున్నారన్నారు. ఈటల గొప్ప వామపక్షవాది అని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌పై ఈటల ఒక్కోసారి అలుగుతారు.. మరోసారి దోస్తీ చేస్తున్నారని సుతిమెత్తగా చురకలు వేశారు. అది కనుక్కుందామనే... ఆయనతో భేటీకి ప్లాన్ చేసినట్టు చెప్పారు. నిజంగా బయటకు వచ్చేది ఉంటే వచ్చేయండని చెబుతానన్నారు. ఇంకోపక్క బీసీ, ముదిరాజ్‌లతో పార్టీ పెట్టమని.. ఈటలను కేసీఆర్ ప్రోత్సహించే అవకాశం ఉందన్నారు. ఈటల సొంత పార్టీ ఏర్పాటు చేస్తే గొప్ప నాయకుడు అవుతాడని కొండా జోస్యం చెప్పారు. ఆలస్యం చేస్తే.. సీఎం కేసీఆర్‌తో కలసి ఈటల కూడా డ్రామాలు ఆడుతున్నారనుకోవాల్సి వస్తోందన్నారు. 

నీలం చేతిలో అక్రమాల చిట్టా! కీలక పదవులు అందుకేనా? 

నీలం సాహ్నీ.. నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సలహాదారు.. రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్. కేవలం ఏడాదిన్నరలోనే మూడు అత్యంత కీలకమైన పదవులు నిర్వహించింది  మాజీ ఐఏఎస్ నీలం సాహ్నీ. ఇదే ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఆమెకే సీఎం జగన్ ఎందుకు కీలక పదవులు కట్టబెడుతున్నారన్నది అందరికి మిస్టరీగా మారింది. అయితే ఇందుకో లెక్కుంది అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.  1984 కేడర్ కు చెందిన నీలం సాహ్నీ.. 2019 నవంబర్ లో ఏపీ సీఎస్ గా నియమితులయ్యారు. ఎల్వీ సుబ్రమణ్యంను అర్ధాంతరంగా తప్పించి.. ఆయన స్థానంలో కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్న నీలం సాహ్నీని ఏరికోరి ఏపీకి తెచ్చుకున్నారు సీఎం జగన్. 2020 జూలైలోనే ఆమె పదవి కాలం ముగిసినా..  రెండు సార్లు ఎక్స్ టెన్షన్ ఇప్పించారు. అంటే జూలైలో సీఎస్ గా పదవి విరమణ చేయాల్సిన సాహ్నీ.. ఆరు నెలలు అదనంగా ఆ పోస్టులో ఉండి గత డిసెంబర్ లో పదవి విరమణ చేశారు. సీఎస్ గా రిటైర్ అయిన వెంటనే ఆమెను ఎస్ఈసీగా నియమిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి మార్చి 31 వరకు ఉండటంతో ఆమె వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే మూడు నెలలు ఎందుకు ఖాళీగా ఉంచాలని భావించారో ఏమో సీఎం జగన్... ఆమెను గత జనవరిలో  తన సలహదారుగా నియమించారు. రెండేళ్ల కాలపరిమితితో ఆమెకు ఆ పదవి కట్టబెట్టారు. నిజానికి ఎస్ఈసీగా నీలం సాహ్నీని నియమించాలని జగన్ ముందే నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఎస్ఈసీ పోస్టు కోసం గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లు చూస్తేనే ఇది అర్ధమైపోతుంది. కేంద్ర పంచాయతీ రాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్-2011 రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసుగా పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో ప్రస్తావించింది. ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలు తమ ఎస్‌ఈసీకి 65 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని విధించాయి. జగన్ సర్కార్.. నీలం సాహ్ని, శామ్యూల్, ప్రేమచంద్రారెడ్డి పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో శామ్యూల్, ప్రేమచంద్రారెడ్డి వయసు 67 ఏండ్లు. అంటే వీళ్లద్దరికి ఎలాగూ ఎస్ఈసీ పోస్టు రాదని తెలిసే.. నీలం సాహ్నీకి అనుకూలంగానే జగన్ సర్కార్ ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.  ఎస్ఈగా నీలం సాహ్నీని నియమించాలని నిర్ణయించాకా కూడా.. రెండు నెలల కోసం ఆమెను ముఖ్యమంత్రి సలహదారుగా నియమించడం అందరిని అశ్చర్యపరుస్తోంది. అంటే రెండు నెలలు కూడా నీలం సాహ్నీని ఖాళీగా ఉంచడం జగన్ కు ఇష్టం లేదనట్లుగా తెలుస్తోంది. దీనిపైనే ఇప్పుడు రాజకీయ ,ప్రభుత్వ వర్గాల్లో చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర సర్వీసుల నుంచి తీసుకొచ్చి నీలం సాహ్నీకి సీఎస్ బాధ్యతలు అప్పగించాకా.. ఆమె పూర్తిగా సీఎం జగన్ కు డమ్మీగా మారిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. సీఎస్ ను అడ్డుపెట్టుకుని జగన్ సర్కార్ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుందనే చర్చ జరుగుతోంది. రూల్స్ కు విరుద్ధంగా కూడా చాలా నిర్ణయాలు ఉన్నాయంటున్నారు. జగన్ ఏది చెబితే దానికి నీలం సాహ్నీ సై అనడటంతో .. భారీగా అవకతవకలు జరిగాయానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ బాగోతాలన్ని నీలం సాహ్నీకి తెలుసు కాబట్టే... ఆమెకు కీలక పదవులు కట్టబెట్టి సీఎం జగన్ తన గుప్పిట్లో ఉంచుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.  తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ శర్మ, డీజీపీగా అనురాగ్ శర్మ పని చేశారు. పదవి విరమణ చేయగానే ఈ ఇద్దరు బాస్ లను తన సలహాదారులుగా నియమించుకున్నారు సీఎం కేసీఆర్. కొన్ని ఏండ్లుగా వారిద్దరు ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి సర్కార్ ఏర్పాటు చేసిన కేసీఆర్.. తీసుకున్న నిర్ణయాలు, అక్రమ బాగోతాలన్ని ఈ ఇద్దరు అధికారులకు తెలుసంటున్నారు.అందుకే వాళ్లిద్దరిని కేసీఆర్ తన పేషీలో బంధీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ తరహాలోనే సీఎం జగన్ కూడా నీలం సాహ్నీకి కీలక పదవులు అప్పగిస్తూ.. తన బండారం బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకే ఆమె కీలక పోస్టులు కట్టబెడుతున్నారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. 

కారుకు గొర్రెలు అడ్డొచ్చాయని.. వైసీపీ మంత్రి తమ్ముడి దౌర్జన్యం

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల అరాచకాలు ఆగడం లేదు. ఎన్ని ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నా డోంట్ కేర్ అంటున్నారు వైసీపీ నేతలు. సామాన్యులపై తమ ప్రచారం చూపిస్తున్నారు. కర్నూల్ జిల్లాలో మంత్రి తమ్ముడి వీరంగం వేశాడు. చిప్పగిరి సమీపంలో  తన కారుకు గొర్రెలు అడ్డొచ్చాయంటూ గొర్రెల కాపరులపై దాడి చేశాడు. ‘నేను ఎవరో తెలుసా..? మంత్రి తమ్ముడిని. వైసీపీ మండల కన్వీనర్‌ వాహనం వస్తే అడ్డు తప్పుకోవాలి’ అని హూంకరించారు. దూషిస్తూ వారిపై చేయిచేసుకున్నారు. ఆయన అనుచరులు సైతం దాడికి పాల్పడ్డారు.  బాధితుల చెప్పిన వివరాల ప్రకారం  కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు వరుసకు తమ్ముడు, వైసీపీ చిప్పగిరి మండల కన్వీనర్‌ నారాయణ గుమ్మనూరు నుంచి ఆలూరుకు ఆరు వాహనాల్లో అనుచరులతో కలిసి వెళుతున్నారు. చిప్పగిరి-బంటనహాల్‌ గ్రామాల మధ్య గొర్రెలు అడ్డువచ్చాయి. వాటిని పక్కకు అదిలించలేదని గొర్రెల కాపరులు శివ, సుంకప్పపై నారాయణ, అతని అనుచరులు దాడి చేశారు. దీంతో గొర్రెల కాపరులు తమ వారికి సమాచారం ఇచ్చారు. బాధితుల బంధువులు కొండా రాము, కొండా పెద్దన్న, కొండా చిన్నపెద్దన్న, తలారి అంజినయ్య చిప్పగిరి సర్కిల్‌లో గుమ్మనూరు నారాయణ కోసం ఎదురు చూశారు. మంత్రి జయరాంను కలిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు చిప్పగిరికి రాగానే బాధితుల బంధువులు నిలదీశారు. తమ వారిని ఎందుకు కొట్టారంటూ ప్రశ్నించారు. మూగజీవాలు రోడ్డుపై అడ్డువస్తే కాపరులపై దాడి చేస్తారా? అని నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన నారాయణ వాహనం నుంచి దిగి వాళ్లపై దాడి చేశారు.  మంత్రి సోదరుడి దాడితో స్థానికంగా ఉద్రిక్తత తలెత్తింది. సుమారు 500 మంది చిప్పగిరి గ్రామస్థులు గుంతకల్లు-ఆలూరు సర్కిల్‌లో ధర్నాకు దిగారు.  దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. నారాయణ, వారి అనుచరులను అరెస్టు చేసే వరకు వెళ్లేదిలేదని గొర్రెల కాపరులు స్పష్టం చేశారు. కొంతమంది పోలీస్‌స్టేషన్‌ వద్ద, మరికొందరు రోడ్డుపై బైఠాయించారు. పార్టీలకతీతంగా గ్రామస్థులందరూ ఈ ఆందోళనలో పాల్గొన్నారు.  ఆలూరు సీఐ  భాస్కర్‌ చిప్పగిరికి చేరుకొని వారికి నచ్చజెప్పారు. తర్వాత స్థానికులు ఆందోళన విరమించారు. గొర్రెల కాపరులపై దాడి చేసిన శ్రీధర్‌తోపాటు మరో ఇద్దరిపై 341, 323, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దాడికి ప్రధాన కారకుడైన మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణను కేసు నుంచి తప్పించారన్న విమర్శలు వస్తున్నాయి.

అనారోగ్యంతో వైసీపీ ఎమ్మెల్యే మృతి

కడప జిల్లా  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల హైదరాబాద్‌లో చికిత్స పొంది కడపలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ పాల్గొన్నారు. మళ్లీ అనారోగ్యం బారిన పడిన ఎమ్మెల్యే కడపలోని అరుణాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, ఇంటర్‌ చదువుతున్న కుమారుడు, ఎంబీబీఎస్‌ నాలుగో ఏడాది చదువుతున్న కుమార్తె ఉన్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్‌ వెంకట సుబ్బయ్య కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య  స్వస్థలం బద్వేలు పురపాలక సంఘం పరిధిలోని మల్లెలవారిపల్లి. 1960లో జన్మించిన వెంకట సుబ్బయ్య ఆర్థోపెడిక్ సర్జన్‌గా ప్రజలకు సేవలందించారు. వైద్య వృత్తిని చేపట్టాలని కర్నూలు మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చేశారు. అనంతరం కామినేని, అపోలో ఆస్పత్రుల్లో కొంతకాలం పని చేశారు. ఈయన భార్య కూడా వైద్యురాలిగా ఉన్నారు. 2016లో ఆయన బద్వేల్‌ వైఎస్సార్‌సీపీ కో-ఆర్డినేటర్‌గా పనిచేశారు. 2019లో తొలిసారిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ ఓబులాపురం రాజశేఖర్‌పై 44 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి పట్ల వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు సంతాపం తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులతో పోన్ లో మాట్లాడారు. వారికి సంతాపం తెలిపారు, వైద్యుడిగా, ఎమ్మెల్యేగా వెంకట సుబ్బయ్య సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నియోజకవర్గ ప్రజల సందర్శనార్థం ఎమ్మెల్యే భౌతిక కాయాన్ని బద్వేలుకు తరలించారు. 

బెంగాల్, అస్సాంలో భారీ పోలింగ్.. ఈవీఎంలపై మమత డౌట్స్ 

నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభ ఎనికల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో,భాగంగా అస్సాం,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో శనివారం తొలి విడత పోలింగ్ జరింగింది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 స్థానాలకు గానూ, 30స్థానాలలో, అస్సాంలో 126 స్థానాలకు 47 స్థానాలకు తొలి విడతలో పోలింగ్ జరిగింది. రెండు రాష్ట్రాలలోనూ భారీ పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో 80 శాతానికి పైగా పోలింగ్ జరిగినట్లు సమాచారం. అలాగే, అస్సాంలో 77 శాతం పోలింగ్ నమోదైంది. అయితే  బెంగాల్లో 2016 పోలింగ్ పెర్సెంటేజ్’తో పోలిస్తేపెద్దగా మార్పు లేదు. అస్సాంలో గతంతో  పోలిస్తే పోలింగ్ స్వల్పంగా తగ్గిందని  అధికారులు తెలిపారు.అయితే, ఫైనల్ ఫిగర్స్ ఇంకా రావలసి ఉందని అందికారాలు శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తెలిపారు. మరో వంక బెంగాల్లో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. కేషియారిలో మంగళ్‌ సొరెన్‌ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. టీఎంసీ గూండాలే అతనిని చంపారని, ఆయన తమ మద్దతుదారుడని బీజేపీ ఆరోపించింది. కానీ టీఎంసీ ఈ ఆరోపణలను కొట్టిపడేసింది. కాగా - తూర్పు మిడ్నపూర్‌ జిల్లాలోని కాంతి దక్షిణ్‌ నియోజకవర్గంలో ఓ చోట ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు విధ్వంసానికి దిగారు.దంతన్‌ నియోజకవర్గంలోని మోహన్‌పూర్‌లో బూత్‌ల స్వాధీనానికి బీజేపీ, టీఎంసీ రెండూ ప్రయత్నించినపుడు చెలరేగిన ఘర్షణల్లో ఆరుగురు గాయపడ్డారు. మరోవంక ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, కేంద్ర బలగాల సాయంతో ఈవీఎంలను బీజేపీ తారుమారు చేస్తోందని ఆరోపించారు. బయటి రాష్ట్రాల నుంచి బీజేపీ గూండాలను, సంఘ వ్యతిరేక శక్తులను తెచ్చి ఓటర్లను బెదిరిస్తోందని, వారు గనక కనబడితే గరిటెలు, అట్లకాడలు, వంటపాత్రలు, రొట్టెల కర్రలతో చితక్కొట్టండని మమతా బెనర్జీ బెంగాలీ మహిళలకు పిలుపునిచ్చారు.  బెంగాల్‌ నుంచి కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించి 167 ఫిర్యాదులు, అసోంలో 582 ఫిర్యాదులు వచ్చాయని ఈసీ తెలిపింది. అసోంలో ఈవీఎంల మొరాయింపు, వీవీప్యాట్‌ల గల్లంతు లాంటి ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని ఈసీ తెలిపింది. బెంగాల్లో పోలింగ్ జరిగిన  30 నియోజక వర్గాలు, నక్సల్‌ ప్రభావ జంగల్‌మహల్‌ ప్రాంతంలోని సమస్యాత్మక నియోజక వర్గాలు కావడంతో, ఎన్నికల సంఘం కేంద్ర బలగాలను మోహరించిన విషయం తెలిసింద

యాదాద్రి టెంపులో కరోనా కలకలం 

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి ఆలయంలో కరోనా కలకలం రేపింది. ఆలయ ఉద్యోగులు, అర్చకుల్లో 30మందికి కరోనా సోకింది. శుక్రవారం చేసిన పరీక్షల్లో ఆరుగురిని కరోనా నిర్దారణ అయింది. దీంతో ఆలయ సిబ్బందికి మొత్తం పరీక్షలు చేశారు. అందులో 30 మందికి కరోనా సోకినట్లు తేలింది. గత వారమే వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఆలయ సిబ్బందికి వైరస్‌ సోకింది. దీంతో యాదాద్రి ఆలయంలో ఆర్జిత సేవలను నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రిలో దైవదర్శనాలకు మాత్రమే భక్తులకు అనుమతించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.  యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల్లో అధికారులు కరోనా నిబంధనలు పాటించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహోత్సవాల నిర్వహణ సమయంలో కరోనా నియమాలను ఏమాత్రం పాటించకపోవడం వల్లే ఆలయ సిబ్బందికి కరోనా సోకినట్లు విమర్శలు ఉన్నాయి. అలంకార సేవోత్సవాలు, స్వామి వారి విశేష వేడుకల్లో భౌతిక దూరం, మాస్క్‌లు ధరించకపోడం, శానిటైజేషన్‌ చేయకపోవడం కారణాలుగా తెలుస్తున్నాయి మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైంది తెలంగాణ సర్కార్. కఠిన చర్యలకు దిగింది.రానున్నది పండుగల సీజన్ కావడంతో బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల వాడకం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.  తెలంగాణ వ్యాప్తంగా మాస్కుల వినియోగం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం  ఆదేశాలు జారీచేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాల్లో, ప్రజారవాణా వాహనాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపింది. మాస్కులు ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టంలోని 51 నుండి 61 వరకు గల సెక్షన్ల కింద అదేవిధంగా ఐపీసీ 188తో పాటు ఇతర సెక్షన్ల కింద చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. మాస్క్‌ నిబంధన కచ్చితంగా అమలు అయ్యేలా చూడాలని జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.ఏప్రిల్ 10 వరకు రాష్ట్రంలో సామూహిక కార్యక్రమాలకు అనుమతి నిరాకరించింది.ర్యాలీలు, యాత్రలపైనా నిషేధం ప్రకటించింది. హోలీ, రంజాన్, ఉగాది, గుడ్ ఫ్రైడే, శ్రీరామనవమి వేడుకలపైనా ఆంక్షలు విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే 188 సెక్షన్ కింద చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఒకే కాలేజీలో 230 మందికి కరోనా.. రాజమండ్రిలో కలకలం

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పంజా విసురుతోంది. రాజమండ్రిలో విలయ తాండవం చేస్తేంది. ఒక కాలేజీలోనే 230 మందికి కరోనా సోకడం తీవ్ర కలకలం రేపుతోంది. తిరుమల కాలేజీ హాస్టల్‌లో శనివారం మరో 55 మందికి కరోనా సోకింది.దీంతో   కాలేజీ హాస్టల్‌లో 230కి  కరోనా కేసుల సంఖ్య చేరింది. మూడు రోజుల క్రితం ఏకంగా 175 మంది విద్యార్థులకు కరోనా సోకింది.  కరోనా సోకిన విద్యార్థులకు హాస్టల్లోనే చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాజమండ్రిలోని జూనియర్ కాలేజీ హాస్టల్‌లో 230 మందికి కరోనా పాజిటివ్ రావడం స్థానికులను కలవరానికి గురి చేస్తోంది.  ఆంధ్రప్రదేశ్ పై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. గత 24 గంటల్లో 42,696 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా... 947 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 180 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో విశాఖ జిల్లా (156), గుంటూరు జిల్లా (145) ఉన్నాయి. గత 24 గంటల్లో 377 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

సీఎం ఇల్లుల్లు తిరిగినా జానాదే విజయం!

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భువనగిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాజ‌కీయాల‌ను మ‌లుపు తిప్పే అవ‌కాశం నాగార్జున సాగ‌ర్ ప్ర‌జ‌ల‌కు వ‌చ్చింద‌న్నారు. టీఆర్ఎస్ అవినీతి పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మాదిరి డ‌బ్బుతో ఓట్ల‌ను పంచి ప్ర‌జాస్వామ్మాన్ని కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని మండిప‌డ్డారు. ఎమ్మెల్యేల‌ను గ్రామాల‌కు డ‌బ్బు సంచుల‌తో పంచి గెలిచేందుకు పావులు క‌దువుతున్నార‌ని ఆరోపించారు. బ్రోక‌ర్ పని చేసే వారికి టీఆర్ఎస్‌లో  టికెట్లు, ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతుంద‌న్నారు వెంకట్ రెడ్డి. న‌ల్గొండ జిల్లాలో అలాంటి వారే ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌జ‌ల‌ను కేసీఆర్ మోసం చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు.  డ‌బుల్ బెడ్ రూమ్, ద‌ళిత ముఖ్య‌మంత్రి, ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి అంటూ దొంగ‌మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చారని ఎంపీ వెంకట్ రెడ్డి మండిప‌డ్డారు.  అవినీతి ర‌హిత జానారెడ్డిపై టీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి జ‌న‌నేత‌గా జానారెడ్డి ఎదిగార‌ని  తెలిపారు. ఇక్క‌డ మంత్రులు, సీఎం వ‌చ్చి మకాం వేసిన జానారెడ్డి గెలుపును ఆపాలేర‌ని స్ప‌ష్టం చేశారు.  గ్రామాల నుంచి స‌ర్పంచ్ త‌ప్ప గ్రామ ప్ర‌జ‌లు ఎవ‌రు టీఆర్ఎస్‌లోకి వెళ్ల‌ట్లేదని యావ‌త్ నాగార్జున సాగ‌ర్ ప్ర‌జ‌లు జానారెడ్డికి మ‌ద్దతుగా నిలిచార‌ని తెలిపారు. జానారెడ్డి, తాను క‌లిసి కాంగ్రెస్ హ‌యంలో రూ. 2వేల కోట్ల‌తో ఎస్ఎల్బీసీ సొరంగం మార్గం 90 శాతం ప‌నులు పూర్తిచేస్తే ఏడేళ్లుగా టీఆర్ఎస్ స‌ర్కార్ మిగిలిన ప‌నుల‌కు నిధులు కేటాయించ‌ట్లేద‌ని కోమటిరెడ్డి ఆరోపించారు.  ఏఎన్ఆర్‌పీ వ‌ర‌ద కాలువ జానారెడ్డి చొర‌వ వ‌ల్లే జ‌రిగిందన్నారు. 

బీజేపీకి జనసేన ఝలక్?

తిరుపతి బరిలో బీజేపీ. జనసేన మద్దతుతో పోటీలో మాజీ ఐఏఎస్ రత్నప్రభ. అభ్యర్థిని ప్రకటించాక బీజేపీ పెద్దలంతా కలిసి హైదరాబాద్ వెళ్లి జనసేనానిని కలిశారు. గెలుపు వ్యూహంపై చర్చించామన్నారు. ఇంత వరకూ బాగానే ఉంది.. మరి అంతా కలిసి పని చేస్తారా? బీజేపీ విజయం కోసం జనసేన మనస్పూర్తిగా సహకరిస్తుందా? ఇదే ఇప్పుడు అనుమానాస్పదం.  తిరుపతి నుంచి ఎలాగైనా పోటీ చేయాలని జనసేన గట్టిగా ప్రకటించింది. ఉమ్మడి అభ్యర్థిపై మొదట చొరవ తీసుకున్నది పవన్ కల్యాణే. కొన్ని వారాల క్రితమే ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపారు. కేండిడేట్ సెలక్షన్ కోసం ఓ కమిటీని వేశారు. ఆ కమిటీలోనూ తామే పోటీ చేస్తామంటూ గాజుగ్లాసు గంటా పథంగా చెప్పింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేసిన జనసేనకు ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్కలన్నీ బయటకు తీసి మరీ కమిటీ ముందేసింది. తిరుపతిలో బీజేపీ కంటే తామే బలవంతులమని.. ఎంపీ టికెట్ తమకు ఇవ్వడమే న్యాయమని తేల్చి చెప్పింది. కానీ, లోలోపల ఏం జరిగిందో ఏమో గాని.. కమలం పార్టీనే ఎంపీ టికెట్ ఎగరేసుకుపోయింది. అయితే తిరుపతి సీటును జనసేన కావాలనే వదిలించుకుందనే చర్చ జరుగుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా బీజేపీ ఇమేజ్ ఫుల్‌గా డ్యామేజ్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆపార్టీతో దూరంగా ఉండటమే బెటరనే అభిప్రాయానికి జన సైనికులు వచ్చారంటున్నారు.  ఇప్పటికే తెలంగాణ బీజేపీతో తాడోపేడో తేల్చుకుంటున్నారు పవన్. వారి మధ్య మిత్రబేధం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకే పార్టీతో తెలంగాణలో ఒకలా, ఏపీలో మరోలా ఉండటం సాధ్యమా? ఇదే అనుమానం కమలనాథులకు కూడా వచ్చింది. తిరుపతిలో జనసేన సపోర్ట్ లేకుండా గెలిచే అవకాశమే లేదని ఆ పార్టీకి బాగా తెలుసు. అందుకే, పవన్ కల్యాణ్ మనసు మారకముందే ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు రత్నప్రభను వెంటేసుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, పురంధేశ్వరి తదితరులు పీకే ఇంట్లో వాలిపోయారు. మీ మద్దతు మాకేనంటూ.. ఇందులో తేడా వద్దంటూ.. మరోసారి మాట తీసుకున్నారు. అయితే.. ఆ మీటింగ్ తర్వాత.. ఫార్మాలిటీకి కూడా పవన్ కల్యాణ్ మాట్లాడలేదు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభను గెలిపించాలని పిలుపు ఇవ్వలేదు. అంటే, తిరుపతి విషయంలో జనసేన ఇంకా తీవ్ర మనస్తాపంతో ఉన్నట్టేగా అంటున్నారు విశ్లేషకులు.  తెలంగాణలో తమను చిన్న చూపు చూసిన బీజేపీకి గట్టి షాక్ ఇచ్చేందుకు జనసేన కత్తులు దూస్తోంది. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీకి పోటీగా జనసేన  నుంచి సైతం అభ్యర్థిని నిలపాలని ఆలోచిస్తోంది. సాగర్ బరిలో కమలనాథులు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో దింపి పొలిటికల్ ఎక్స్‌పర్మెంట్ చేయనుంది. అందుకు కౌంటర్‌గా జనసేన కూడా ఎస్టీ కేండిడేట్‌ను నాగార్జున సాగర్‌ నుంచి పోటీ చేయించాలని చూస్తోంది. ఇలా.. తెలంగాణలో కమలం వర్సెస్ జనసేన ఎపిసోడ్ రక్తికట్టబోతోంది. ఆ ప్రభావం తిరుపతి ఎంపీ ఎలక్షన్ల్స్‌పై ఎక్కడ పడుతుందోననే టెన్షన్ ఏపీ బీజేపీని వేధిస్తోంది.  పవన్ కల్యాణ్ ఆడుతున్న డబుల్ గేమ్‌ తిరుపతిలో బీజేపీ పుట్టి ముంచేలా కనిపిస్తోంది. జనసైనికుల మద్దతు లేకపోతే ఆ పార్టీకి తిరుపతిలో డిపాజిట్ రావడం కూడా కష్టమేనంటున్నారు. టీడీపీ, కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైసీపీకి అధికార బలం ఉంది. బీజేపీ కేండిడేట్ రత్నప్రభ రాజకీయాలకు కొత్త. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి జనసేనే దిక్కు. కానీ, జనసేనాని మాత్రం కమలనాథులపై అలక పూనడం ఆ పార్టీని కలవరానికి గురి చేస్తోంది. అందుకే, బీజేపీ రాష్ట్ర నేతలంతా కలిసి రాష్ట్రం దాటి వెళ్లి మరీ, పవన్ కల్యాణ్‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారంటున్నారు. అయితే జనసేనాని నుంచి నామమాత్ర స్పందనే రావడంతో.. కమలనాథుల మదిలో కలవరమే...

ఆరోగ్య కేంద్రాల పనితీరు పై సమీక్ష.

దేశంలో అందరికీ ఆరోగ్యం అన్న నినాదాలు వినిపిస్తూనే ఉంటాయి. ఏళ్ల తరబడి గ్రామీణ ప్రాంతాల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి  రాష్ట్ర ప్రభుత్వం  నిర్వహిస్తున్న ఆరోగ్య కేంద్రం లో మౌలిక సదుపాయాల కల్పన,  సాంకేతిక  పరిజ్ఞానం, నాణ్యమైన మందుల పంపిణీ,రవాణా సౌకర్యాలు, ఆరోగ్య  సిబ్బంది,  అత్యవసర  చికిత్స,, ప్రతి ఆరోగ్య కేంద్రానికి ఇద్దరు డాక్టర్లు, ఒక స్టాఫ్ నర్స్ ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన ముఖ్యంగా అత్యవసర సమయంలో అందించాల్సిన నాణ్యమైన సేవల పై దృష్టి పెట్టాలని ఉద్దేశంతో ఐ పి హెచ్ ఎస్ అంటే ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్  నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తున్నాయా లేదా అన్న అంశాన్ని పరిసీ లించేందుకు   ఒక అధ్యయనం జరిగింది.  ఆ అంశాలను ఇప్పుడు ఒక ఏ వి.చూద్దాం                                                                                                        ముందుగా చరిత్రాత్మకంగా అసలు ఆరోగ్య కేంద్రాలు  ఎప్పుడు ప్రారంభమయ్యాయి. అన్న అంశాలు చూద్దాం. చరిత్రాత్మకంగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అంశం 1978 లో ఐమా, ఆట, యు ఎస్ ఎస్ ఆర్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సు  తర్వాత ఆరోగ్య సంరక్షణ అంశం పై దృష్టి  పెట్టాల్సిన అవసరం పై ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఈ క్రమంలో భాగంగా సాధారణ ఆరోగ్య  సేవలు, దీని ద్వారా ప్రధమంగా ప్రజలకు  చేరువగా వైద్యం అందించాలన్నది ఈ పధకం ప్రధాన లక్ష్యం. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ప్రధానంగా నాలుగు  సూత్రాలపై ఆధారపడి పని చేస్తాయి. సమాన మైన పంపిణీ,, వివిధ  వర్గాలతో సమన్వయం. వివిధ వర్గాలు పాల్గొనేలా ప్రోత్సహించడం. సరైన సాంకేతిక విధానం, బొరె కమిటీ వంటి  సూత్రాలపై  ఆధారపడి ఉంటుంది. 1948 లో భారత దేశం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది అయితే 1978 తరువాత గాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల విస్తరణ సాధ్యం కాలేదు. 2005  సంవత్సరానికి భారత ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఆరోగ్య  మిషన్  ను ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో  మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రారంభించింది . అస్తవ్యస్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల  వ్యవస్థను  ఒకే పరిధిలోకి తెస్తూ గ్రామం, జిల్లా స్థాయిలో, ఆరోగ్య విధానాన్ని సమర్థంగా అమలు చేయడానికి కేంద్రం సిద్ధం అయింది. 2005 ఏప్రిల్ నుంచి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్  ద్వారా నాణ్యమైన ఆరోగ్యమే లక్ష్యంగా పని చేయడం ప్రారంభించింది.  ప్రత్యేకంగా 18 రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరును పర్యవేక్షించేందుకు డెమోగ్రాఫిక్ ఇండికేటర్స్ ద్వారా మౌలిక సదుపాయల కల్పన కల్పించేందుకు సిద్ధమయింది. రాజ కీయ కోణంలో భాగం గానే కేంద్ర ప్రభుత్వం. ప్రజా ఆరోగ్యం, పై దృస్తి పెట్టిందని. ఈ మేరకు  జి‌డి ఏ ను 2%3% నికి పెంచాలని ప్రయత్నం చేస్తోంది. అధికారులు ప్రజలకు జవాబు దారి తనం పెంచ డమే ఐ పి హెచ్ యెస్ ప్రధాన లక్ష్యం. మానవ శక్తి, సాంకేతికత, ద్వారా ఇండియన్  పబ్లిక్ హెల్త్ ప్రమాణాల ప్రకారం భారతీయ ప్రజల ఆరోగ్య ప్రమాణాలను పెంచే లక్ష్యం గా హెల్త్ వర్కర్లకు నైపుణ్యం అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేయాలని నిర్ణయించింది.                                                                 ప్రాథమిక ఆరోగ్య  కేంద్రం లక్ష్యం ఏమిటి ? వాటి అవసరం ఏ మేరకు గ్రామ ప్రజా ఆరోగ్య అవసరాలు తీర్చ వచ్చు. అన్న అంశాన్ని పరిశీలిద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఆరోగ్యం  ఒక తొలి అడుగు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. మొదటగా నిపుణులైన డాక్టర్ నిపుణులైన వారి ని సంప్రదించాల్సిన అవసరం కేవలం గ్రామ ప్రజలు మాత్రమే ఉంది. వివిధ రాష్ట్రంలో ప్రాథమిక  ఆరోగ్య కేంద్రాలు సేవలు చేస్తారు, గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ముఖ్యంగా ఉండాలి, అరకు వెలి లాంటి ప్రాంతాల లో నిత్యం టైఫాయిడ్, మలేరియా సమస్యతో బాధపడే వృ పట్ల సరైన వైద్యం అందం లేదని నిర్వాసితులు తమ గోడు వెళ్ళ పోసుకున్న కధనా ఇంకా చూస్తున్నాం. పై ప్రాంతానికి వాహన సదు పాయం లేదు పైగా అంబులెన్స్ వెళ్ళే దారి లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బన్ దులకు గురు అవుతూ ఉండడంతో తీర ఇబ్బందులు పడుతున్నారు. మరి ఏ ఇతర సదుపాయం లేక తీవ్ర  అనారోగ్యం తో బడా పడుతున్న వారు డోలి లో మోసుకు పోయి పరిస్థితులు ఉండడం  తో ఏళ్ళు గడుస్తున్నా గిరిజన గ్రామాల ప్రజల  వెతలు తీరడం అసాధ్యమా అన్న సందేహం కలుగుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లక్ష్యం ఏమిటో తెలుసు కుందాం,                                                                                                                   ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మూడు ఆంచెల విధానం ద్వారా  ఆరోగ్య సేవలు అందిస్తోంది. మూడు అంచేలా విధానం ద్వారా ఆరోగ్య వంత మైన సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నివసించే వివిధ సామాజిక వార్గాల ను  ఆరోగ్య  వంతు లు  గా తయారు చేసేందుకు ద్వారా ఆరోగ్య వంత మైన సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది. ముఖ్యంగా కమ్యూనిటీ హెల్త్ కేర్  సెంటర్ రెఫరల్ కేంద్రాలుగా పని చేస్తాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 30 పడకల ఆసుపత్రి, తాలూకా, జిల్లా   స్థాయిలో 100 పడకల ఆసుపత్రి పని చేస్తున్నారు.                                                                                                                                                       వాస్తవానికి  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వాలే.  సాధారణ అత్యవసర  కార్యక్రమం, సాధారణ సేవల కార్యక్రమం. కింద ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు వ్యక్తులకు, జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఒక వారధిగా తోడ్పడుతుందని.  కేంద్రం భావిస్తోంది. ప్రతి ఆరోగ్య కేంద్రం 20,000 మంది జనాభా ఉన్న కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలను  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ పరిధిలోకి తీసుకు రావడం వైద్య సదుపాయాలను సామాన్యులకు అందించాలన్నదే దీని లక్ష్యం. 30,000 జనబా ఉన్న సాధారణ ప్రాంతాలకు ఆరోగ్య కేంద్రాల ద్వారా ఆరు పడకల ఆసుపత్రి. ఆబ్సర్ వేషన్ పడక గదులు,  ఆసుపత్రుల ద్వారా ఆరోగ్యాన్ని అందించడంతో పాటు ఉపశమనం కలిగించే  పునరావాసం.కల్పించాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లక్ష్యం. వైద్య సేవల పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు వైద్య విద్య , పౌస్టిక ఆహారం పై అవగాహన, తల్లి పిల్లల ఆరోగ్యం, పిల్లలు బాలింతలకు సలహా సూచనలు, పిల్లలకు సకాలంలో టీకాలు వేయించాలి. వ్యాధి నువరణకు, గాయాలకు, ఆరోగ్య సమస్యలకు, చికిత్స, మురుగు నీతి పారుదల, పారిశుద్ధ్యం, తాగునీటి పంపిణీ వంటి  అంశాలు సేవలు అందించాలని. ఈ పథకం లక్ష్యం               భారత్ లో గ్రామీణ ఆరోగ్యం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుంది. మరి ఏ ఇతర విభాగం తోను సరి తూగని సంబంధం లేని ఆస్తిత్వాన్ని సాధించుకుంది. జానా లో ఏ విభాగానికి చెందిన శాఖగా మిగిలి పోయింది. గ్రామీణ ప్రాంతల్ ప్రజలు పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో భరించడం సాధ్యం కాదు. జనాభా 45% మంది  కి అది ఏ విభాగానికి చెందిన శాఖ గా మారిపోయింది. అధికారులు పేర్కొన్నారు. 20% మంది ప్రజలు  ఔట్   పేషెంట్, , సేవల కోసం , 45% మంది ప్రజలు ఇన్  పేషంట్ , సేవల కోసం ప్రభుత్వ సేవల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన. నాణ్యత లేని, మందుల ప,పిణీ, నాణ్యతలేని, వైద్య పరికరాలు . నాణ్యత ప్రమాణాలు ఉన్నప్పుడు అభివృద్ధి సాధ్యం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పని తీరును మదింపు చేయడానికి నిర్దేశించిన ఆ నియమ నిబంధనలు లక్ష్యాలు  ఏమిటో చూద్దాం.                                                                                            భారతీయ గ్రామీణ ఆరోగ్య పధకం ప్రమాణాలకు, నియమనిబందనలు నాణ్యమైన ఆరోగ్యం అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ భారత ప్రభుత్వ భారతీయ గ్రామీణ ఆరోగ్య పధకం కింద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వృద్ధికి మూడు లక్ష్యాలు నిర్దేశించుకుంది. మొదటిది ప్రాథమిక ఆరోగ్య లక్ష్యంగా పని చేస్తుంది.  గ్రామీణ ప్రజల ఆరోగ్యమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లక్ష్యం. రెండవది---అందరికీ ఆమోద యోగ్యమైన ఆరోగ్య రక్షణ కల్పించాలన్నది, కేంద్రం లక్ష్యం. బాధ్యతాయుతమైన సునిశితమైన ప్రజల అవసరాలను తీర్చడం. మనకు అందు బాటులో ఉన్న మౌలిక సదుపాయాలను దృష్టిలో  ఉంచుకుంటే కనీస పక్షంలో భవనం, కనీస  ఆరోగ్య సిబ్బంది, వైద్య  పరికరాలు, మందులు, ఇతర సౌకర్యాలు, వసతులు, ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాల నిర్వహణ సరిపోతాయి.  భారతీయ గ్రామీణ ఆరోగ్య పథకం యొక్క లక్ష్యం ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం తో పాటు, నాణ్యత తో కూడిన వైద్య సేవలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు పై సమీక్ష పరిశీలనే కాదు ప్రధ మిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేదా? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వైద్య సిబ్బంది ఉన్నారు లేదా ?అన్నది భారతీయ గ్రామీణ ఆరోగ్య పథకం నిబంధనలకు అనుగుణంగా వైద్య ప్రమాణాలు ఉన్నాయా లేదా అన్నది   ప్రశ్నార్థకంగా  మారింది.                                                                                                              భారతీయ గ్రామీణ ఆరోగ్య పధకం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నెల్లూరు జిల్లాలో 25% ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎంపిక చేశారు. అందులో ర్యాండమ్ గా 15 ఆరోగ్య కేంద్రం ను ఎంపిక చేశారు. ఈ ఆరోగ్య కేంద్రం పరిశీలన జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తో పాటు వైద్య అధికారులు నిర్దేశించిన ప్రశ్నా పాత్రల ఆధారంగా ఎస్ పి ఎస్ ఎస్ సాఫ్ట్ వేర్ ద్వారా డాటాను సమీకరించడం తో పాటు నెల్లూరు జిల్లా లోని వివిధ వర్గాల నుంచి  సేకరించిన సమాచారం ఆధారంగా  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు మదింపు చేసినట్లు  ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారు.    రెండు సంవత్సరాల పాటు అధికారులు, నిర్వహించిన పరిశీలన లో అసలు లోపల స్పష్టంగా బయట పడ్డాయి . ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పని తీరు అంచనాలకు మించి పని చేయడం లేదని మౌలిక సదుపాయాల కల్పన  పై దృష్టి పెట్ట లేదని  అర్ధం  అవుతోంది.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో    ఉండాల్సిన వైద్య సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు వేరు వేరు  రకాలు ఉన్నట్లు, ఆరోగ్య కేంద్రంలో ని ఆయుష్మాన్ భవ వైద్య అధికారులు సరిగా లేరని, వైద్య అధికారుల కొరత ఉందని తేల్చింది.ఏ ఏం ఓ లు 86.6% మాత్రమే ఉన్నారని, భారతీయ గ్రామీణ ఆరోగ్య పథకం  నిబంధనల ప్రకారం  ఫార్మాసిస్టులు 13.3% మాత్రమే  ఉన్నారు,  అన్ని ప్రాథమిక ఆరోగ్య  కేంద్రాల్లో నర్సుల అవసరం కాగా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక నర్సు  ఉన్నప్పటికీ 86.6% నర్సుల కొరత ఉందని ప్రిసీలకు ల బృందం గుర్తించింది. ప్రతి ఆరోగ్య కేంద్రం లో ఒక ఆరోగ్య కార్యకర్త ఉండాలి. అయితే అందులో 13.3% తక్కువ ఉన్నారన్న విష్యాన్ని పరిశీలక బృందం గుర్తించింది. 93.33% ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నాల్గవ తరగతి ఉద్యోగుల నేరుగా భర్తీ చేసిందని తెలిపారు. ఐ పి హెచ్ సి ప్రమాణాలకు అనుగుణంగా 24/7 ఘంటలు వైయ సిబ్బంది ఇద్దరు డాక్టర్లు అందు బాటులో ఉండాలి, లేదా ముగ్గురు  నర్సులు  ఉండాలి, ఒక ల్యాబ్  టెక్నీషియన్ ఉండాలి, 9, 183 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, 35,.8%  ల్యాబ్ టెక్నీషియన్స్ లేరు, 4,744 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మా సిస్ట్లు లేరు.  ఇవి ప్రాథమిక ఆరోగ్య  కేంద్రాల పై సమీక్షించింది. కనీస మౌలిక సదుపాయాలు లేని ప్రధామిక ఇబ్బంది  కొరత ఉన్నట్లు  ఐ పి హెచ్ ఎస్  పరిశీలనలో వెల్లడించారు.  గ్రామీణ ప్రాంత్సలలో ఇబ్బదులు పడుతున్న చోట్ల వైద్య ప్రమాణాలు  పాటించడం సాధ్యమేనా? దీని పై భారతీయ గ్రామీణ  పధకం కింద ఐ పి హెచ్ ఎస్ మిషన్ నెల్లూరు  లో  నిర్వహించిన సమీక్ష రేపోర్టు చూద్దాం.                                                                       నెల్లూరు లోని వివిధ వర్గాల నుండి  సేకరించిన సమాచారం ఆధారంగా నెల్లూరు జిల్లాలోని మూడు డివిజన్ లో ని గూడూరు, నెల్లూరు, కావలి . డివిజన్ లలో ని 25% ప్రాథమిక ఆరోగ్య  కేంద్రల ను ఎంపిక చేశారు. ప్రతి డివిజన్ నుంచి 5 ఆరోగ్య కేంద్రాల ఎంపిక చేసినట్లు అధికారుల బృందం పేర్కొంది. అందులో ర్యాండమ్ కింద 15 ఆరోగ్య కేంద్రాల  ఎంపిక చేశామన్నారు.  అందులో ఏ ఎస్ పెటా, మొహమ్మద్ పురం, వారి గోండా, పొదలకూరు, మహిమలూరు, కాగా గూడూరు డివిజన్ లో ఓజిలి, రామాపురం, కోటా, గిద్దలూరు, పెన్నా డు, కావాలి నుండి రామ తీర్ధం, మర్రిపాడు,  ఎల్లయ్య పాలెం, జల ఢంకి, మరియు యెస్ ఆర్ పురం, లో ఉన్న ఆరోగ్య కేంద్రాలను  ఎంపిక చేశారు. రెండు సంవత్సరాల పరిశీలన తర్వాత ఆగష్టు 2010 – జూన్ 2012 వరకు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య  అదికారి తోపాటు వై ద్య అధికారులతో సమీక్షించారు.                                                              ఐ పి హెచ్ సి నిబంధనల ప్రకారం 24/7 గంటల లో కనీసం 2 ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉండాలి. లేదా ముగ్గురు నర్సులు ఒక ల్యాబ్  టెక్నీషియన్  ఉన్నారా అంటే లేరని సమాచారం ఉంది. 9,183 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 35.8% ల్యాబ్ టెక్నీషియన్ ఉండాలి, 4,744 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 18.4% ఫార్మాసిస్టులు లు లేరు. అంటే  కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐ పి హెచ్ సి మిషన్ లో కొన్ని ఆసక్తికర అంశాలు తెలిసాయి. 100%  కేంద్రాల్లో ఒక్క డాక్టర్ మాత్రమే ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.   దేశంలో  ఉన్న ప్రధాన నగరాలు ఈ  పరిస్థితి ఉంటే ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉందో ఊహించడం  కష్టం. అసలు రాష్ట్రాలు ఏదో చూద్దాం.                                                                దేశం లో  త్వరిత గతిన అభివృద్ధి సా దిస్తున్న నగరాలు చెప్పుకోదగ్గది గుజరాత్, దేశ ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత ఇష్టమైన నగరాలు గుజరాత్ ఒకటి ఇక్కడ మొత్తం 600 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటే 100% అంటే 1392 కేంద్రాల్లో ఒక్క డాక్టర్ మాత్రమే ఉండడం ఆశ్చ్ర్యన్ని కలిగిస్తోంది. దక్షిణాది లోని మరో రాష్ట్రం కర్ణాటక 2,359 రాష్ట్రాల్లో 1,973 ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క డాక్టర్  మాత్రమే ఉండటం గమనార్హం. అంటే 83.6% మాత్రమే.  ద్దేశం లో ఒక డాక్టర్ తో నడుస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో   కర్ణాటక 5వ స్థానంలో ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. .  కేరళలో 83.6%     గుజరాత్ , సిక్కిం ,హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 84% ఒక్క  డాక్టర్ తోనే ఆరోగ్య కేంద్రాలు పని చేస్తున్నట్లు సమాచారం. సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో 84%87% మిజోరంలో చాలా తక్కువ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు  మాత్రమే పని చేస్తున్నాయని సమాచారం.                                                    దేశంలో ఉన్న ప్రాధమికా ఆరోగ్య  కేంద్రాల పని తీరులో మెరుగైన సేవలు అందిస్తున్న వాటిలో తమిళ నాడు, మహారాష్ట్రలు మాత్రమే అని భారతీయ గ్రామీణ ఆరోగ్య పథకం మిషన్ లెక్కలు కట్టింది. తమిళ్ నాడు లో 1,362 ప్రాధమికా ఆత్రోగ్య కేంద్రాలలో 14.4%మహారాష్ట్రలో 1, 814  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 23.8% తో ఒక్క డాక్టర్ మాత్రమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నడపడం విశేషం.దీనికి తోడు పబ్లిక్ హెల్త్ పరిశోధనలు సిల్వియా కర్పగం చెప్పిన సమాచారం ప్రకారం 61% ప్రాథమిక ఆరోగ్య  కేంద్రంలో  ఒక డాక్టర్ తో మాత్రమే నడుస్తున్నాయి ఆమె  తెలిపారు.                                     ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీరు పై విశ్లేషకుల అభిప్రాయం లేదా  వన్ టూ వన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ ద్వ్రా రా అభిప్రాయ సేకరణ జరగాలి. దేశంలో   6% ప్రజలకు తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలు అందించే  సామర్థ్యం కేవలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే . ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు నేరుగా సంప్రదించి వీలుంటుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే  నివారణ అవగాహన , చికిత్స, మరియు పునరావాసం ఆరోగ్య రక్షణ ఇవ్వగలరు ఆరోగ్య కేంద్రలే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్లక్ష్యం చేయడం అంటే ప్రైవేట్ రంగం లో  వైద్య  రంగాన్ని  విస్త్గ రించేందుకే అని సిల్వియా అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామీణ ప్రజల ఆరోగ్య అవసరాలు తీరుస్తాడు. కేవలం అత్యంత తీవ్ర అనారోగ్యం దీర్ఘకాలిక  అనారోగ్య సమస్యలకు జిల్లా ఏరియా ఆసుపత్రులు సౌకర్యం ఉన్న చోట్ల రోగులను పంపుతారు కొన్ని అంశాలు ఆర్ధిక నిధులు, కేటాయింపు ల తో కూడు కున్నందున ఆరోగ్య రక్షణ అంశం ఇందులో ఉన్నందున ప్రాథమిక ఆరోగ్య రంగం నూతన్ రూపు దిద్దుకోవాలని గ్రామీణులకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించాలని సామాన్యుడు కోరుకుంటున్నారు.  అయితే ప్రాథమిక  ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లకు రక్షణ  లేదు.  స్థానిక రాజకీయ నాయకుల జోక్యం ప్రధాన కారణాలుగా విశ్లేషించారు. అందుకే డాక్టర్లు పట్టణ పల్లె ప్రాంతాలకు వెళ్లేందుకు మొగ్గు చూపడం లేదని అనుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు టెలీ  మెడిసిన్ కు అనుసంధించని నిపుణులు సూచించారు. టెలీ మెడిసిన్ ను అనే సాధించడం సాధ్యం? అన్నది సందేహమే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంటే కరోనా రెండోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రాథమిక   ఆరోగ్య కేంద్రం లో సాంకేతిక పరిజ్ఞానం అందించడం. ఎంతో కీలకం అయితే నిధులు కేటాయించడం ఎంత ముఖ్యమో  పి హెచ్ సి ల నిర్వహణ చేయడం మౌలిక సదుపాయాల కల్పన అత్యవసరం.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రివేతీకరించాద్దని కోరుకుంటున్నాం.

ఏయూలో  65 మందికి కరోనా.. హాస్టల్స్ మూసివేత

ఆంధ్రప్రదేశ్ లో  కరోనా పంజా విసురుతోంది. తాజాగా విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. వర్సిటీకి చెందిన ఇంజినీరింగ్ కాలేజీలో 65 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ క్యాంపస్ లో మొత్తం 15 వందల మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు వచ్చిన పరీక్షల్లో 65 మందికి వైరస్ సోకింది. కరోనా సోకిన వారిని ఐసోలేషన్ కు తరలించారు వైద్యాధికారులు.  విద్యార్థులకు కరోనా సోకడంతో ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ లో హాస్టళ్లను మూసివేశారు. యూనివర్శిటీ పరిధిలోని పలు కాలేజీలు తమ విద్యార్థులకు ఆన్ లైన్ లో పాఠాలు బోధించాలని నిర్ణయించాయి. ఏయూ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, ఏయూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా, ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ విభాగాలు ఆఫ్ లైన్ నుంచి ఆన్ లైన్ బోధనకు మారాలని వర్సిటీ రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏయూలో కరోనాపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెంటనే స్పందించారు. జిల్లా ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సూర్యనారాయణను అడిగి ఏయూలో కరోనా వ్యాప్తి వివరాలు తెలుసుకున్నారు.వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలో నిత్యం 7 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని... పాడేరు, అరకు, కేజీహెచ్, అనకాపల్లి, నర్సీపట్నం, విమ్స్ ఆసుపత్రుల్లో కొవిడ్ వార్డులు ఏర్పాటు చేశామని, 1000 బెడ్లు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ పై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. కొత్త కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. గత 24 గంటల్లో 42,696 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా... 947 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 180 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో విశాఖ జిల్లా (156), గుంటూరు జిల్లా (145) ఉన్నాయి.