బెంగాల్, అస్సాంలో భారీ పోలింగ్.. ఈవీఎంలపై మమత డౌట్స్
posted on Mar 28, 2021 9:06AM
నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభ ఎనికల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో,భాగంగా అస్సాం,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో శనివారం తొలి విడత పోలింగ్ జరింగింది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 స్థానాలకు గానూ, 30స్థానాలలో, అస్సాంలో 126 స్థానాలకు 47 స్థానాలకు తొలి విడతలో పోలింగ్ జరిగింది. రెండు రాష్ట్రాలలోనూ భారీ పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో 80 శాతానికి పైగా పోలింగ్ జరిగినట్లు సమాచారం. అలాగే, అస్సాంలో 77 శాతం పోలింగ్ నమోదైంది. అయితే బెంగాల్లో 2016 పోలింగ్ పెర్సెంటేజ్’తో పోలిస్తేపెద్దగా మార్పు లేదు. అస్సాంలో గతంతో పోలిస్తే పోలింగ్ స్వల్పంగా తగ్గిందని అధికారులు తెలిపారు.అయితే, ఫైనల్ ఫిగర్స్ ఇంకా రావలసి ఉందని అందికారాలు శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తెలిపారు.
మరో వంక బెంగాల్లో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. కేషియారిలో మంగళ్ సొరెన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. టీఎంసీ గూండాలే అతనిని చంపారని, ఆయన తమ మద్దతుదారుడని బీజేపీ ఆరోపించింది. కానీ టీఎంసీ ఈ ఆరోపణలను కొట్టిపడేసింది. కాగా - తూర్పు మిడ్నపూర్ జిల్లాలోని కాంతి దక్షిణ్ నియోజకవర్గంలో ఓ చోట ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు విధ్వంసానికి దిగారు.దంతన్ నియోజకవర్గంలోని మోహన్‌పూర్‌లో బూత్‌ల స్వాధీనానికి బీజేపీ, టీఎంసీ రెండూ ప్రయత్నించినపుడు చెలరేగిన ఘర్షణల్లో ఆరుగురు గాయపడ్డారు.
మరోవంక ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, కేంద్ర బలగాల సాయంతో ఈవీఎంలను బీజేపీ తారుమారు చేస్తోందని ఆరోపించారు. బయటి రాష్ట్రాల నుంచి బీజేపీ గూండాలను, సంఘ వ్యతిరేక శక్తులను తెచ్చి ఓటర్లను బెదిరిస్తోందని, వారు గనక కనబడితే గరిటెలు, అట్లకాడలు, వంటపాత్రలు, రొట్టెల కర్రలతో చితక్కొట్టండని మమతా బెనర్జీ బెంగాలీ మహిళలకు పిలుపునిచ్చారు.
బెంగాల్ నుంచి కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 167 ఫిర్యాదులు, అసోంలో 582 ఫిర్యాదులు వచ్చాయని ఈసీ తెలిపింది. అసోంలో ఈవీఎంల మొరాయింపు, వీవీప్యాట్‌ల గల్లంతు లాంటి ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఈసీ తెలిపింది. బెంగాల్లో పోలింగ్ జరిగిన 30 నియోజక వర్గాలు, నక్సల్ ప్రభావ జంగల్‌మహల్ ప్రాంతంలోని సమస్యాత్మక నియోజక వర్గాలు కావడంతో, ఎన్నికల సంఘం కేంద్ర బలగాలను మోహరించిన విషయం తెలిసింద