ఉమ్మితే ఇకపై ఫైన్..
posted on Apr 2, 2021 @ 1:56PM
కొంత మంది శుభ్రతతో సంబంధం ఉండదు. చుట్టూ జనాలు ఉన్న పట్టించుకోరు. నోట్లో పాన్ నములుతూ ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తుంటారు.. ఇకపై అలా ఉమ్మేస్తే ఫైన్. ఈ నిర్లక్ష్య ధోరణికి తప్పదు భారీ మూల్యం ఆనుతున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు.
కరోనా విజృంభిస్తున్న తరుణంతో పబ్లిక్ ప్లేసుల్లో.. కార్యాలయ ప్రాంగణాల్లో ఉమ్మితే చట్ట ప్రకారం మందలింపు ఉంటుందని జీహెచ్‌ఎంసీ అధికారులు అంటున్నారు. ముఖ్యంగా కార్యాలయ సిబ్బందికి జరిమానా విధించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ ఆదేశాలిచ్చారు. కొవిడ్ బారిన పడుతున్న అధికారులు, సిబ్బంది సంఖ్య పెరుగుతుండటంతో ఆయన గురువారం యంత్రాంగానికి మార్గదర్శకాలు జారీ చేశారు.
ఇది ఇలా ఉండగా కొవిడ్ నిబంధనలు తప్పకుండ పాటించాలని, జోనల్ కమిషన్లు, ఉపకమిషనర్లు, విభాగాధిపతులు కరోనా నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టంచేశారు. కార్యాలయం లోపల, బయట మాస్కు తప్పనిసరిగా ధరించాలి. డోర్స్ దగ్గర మాస్కు లేకుంటే ప్రవేశం లేదని సూచించే బోర్డులు తప్పనిసరని పెట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ తెలిపారు. వ్యక్తుల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండాలి. కార్యాలయాల్లోకి ఎక్కువ మందిని అనుమతించవద్ధని. ఆఫీసు లోపలికి వచ్చే వారి శరీర ఉష్ణోగ్రత చెక్ చేసిన తర్వాత అనుమతి ఇవ్వాలని. శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచాలని. తరచూ పరిసరాలను, తలుపుల హ్యాండిళ్లను శుభ్రం చేయించాలని. లిఫ్టులను సాధ్యమైనంత వరకు వాడకుండా, మెట్ల మార్గాన్ని ఎంచుకోవడం మంచిది. అత్యవసర దస్త్రాలనే నేరుగా సంతకాలకు, పరిశీలనకు తీసుకెల్లాలని. మిగిలినవన్నీ ఇ-ఆఫీసు ద్వారానే నడవాలి. శీతల యంత్రాలు, కూలర్ల వినియోగాన్ని తగ్గించడం మంచిదని’ కమిషనర్ సూచించారు.