జగన్ దెబ్బకు వ్యాపారులు పరార్..
posted on Apr 2, 2021 @ 3:28PM
వైసీపీ నేతల తీరుతో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలంటే కంపెనీలు భయపడుతున్నాయని . ఉన్న కంపెనీలు పరార్ అయి వెళ్లిపోతున్నాయని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ప్రజలు వైసీపీ పార్టీకి 22 మంది ఎంపీలను గెలిపిస్తే.. ఏపీకి ఏం ఒరగబెట్టారని ఆయన ప్రశ్నించారు. ఎప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ దేశంలో నిత్యం తప్పులు చేసిన ప్రభుత్వంగా పేరు పొంది. అనునిత్యం కోర్టులతో మొట్టికాయలు ఏ ప్రభుత్వం వేయించుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటిని అడిగే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. ఇకనైనా ప్రజలు వైసీపీకి ఓట్లు వేసి ఓట్లను దుర్వినియోగం చేసుకోవద్దని సుజనా చౌదరి అన్నారు.
ఇది ఇలా ఉండగా ఏపీకి హోదా పేరుతో కొన్నిపార్టీలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఉపఎన్నికలో బీజేపీని గెలిపిస్తే తిరుపతి అభివృద్ధి చెందుతుందని అన్నారు. విభజన చట్టంలో ఉన్నవాటితో పాటు లేనివి కూడా ఏపీకి కేంద్రం ఇచ్చిందన్నారు. ప్రత్యేక హోదాను వైసీపీ, టీడీపీలు రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నాయని ఆరోపించారు. పుదుచ్చేరికి హోదా ఇచ్చారంటూ బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.