ప్రధాని మోదీ కోసం వెయిట్ చేసిన పుతిన్

    ఇండియా-రష్యా సంబంధాలు ఎలా ఉంటాయో.. రెండు దేశాల మధ్య సహకారం ఏ స్థాయిలో ఉంటుందో.. ప్రపంచ దేశాలకు బాగా తెలుసు. దాన్ని మరింత బలంగా చాటేందుకు.. భారత ప్రధాని మోదీ, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మధ్య ఇంట్రస్టింగ్ మీటింగ్ ఒకటి జరిగింది. షాంఘై సహకార సదస్సు వేదిక నుంచి.. ప్రెసిడెంట్ పుతిన్, పీఎం మోడీ ఇద్దరూ.. ఒకే కారులో ప్రయాణించారు. SCO మీటింగ్ వేదిక నుంచి ద్వైపాక్షిక సమావేశం జరిగే హోటల్‌కి.. మోడీతో కలిసి వెళ్లాలనుకున్నారు పుతిన్.  అంతేకాదు.. ప్రధాని మోడీ వచ్చే దాకా.. పుతిన్ దాదాపు 10 నిమిషాల పాటు వెయిట్ చేశారు. తర్వాత ఇద్దరు నాయకులు కారులో ప్రయాణిస్తూ.. వివిధ అంశాలపై సంభాషించారు. ద్వైపాక్షిక సమావేశం జరిగే హోటల్ దగ్గరకు చేరుకున్న తర్వాత కూడా.. ఇద్దరు నేతలు మరో 45 నిమిషాల పాటు కారులోనే గడిపారు. దీని తర్వాతే.. పుతిన్, మోడీ పూర్తి స్థాయి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఇదొక.. గంటకు పైగా కొనసాగింది. అయితే మోడీ కోసం పుతిన్ వెయిట్ చేయడం, తన కారులోనే ఆయన్ని తీసుకెళ్లడమే అందరి అటెన్షన్‌ని గ్రాబ్ చేసింది. పైగా మోడీ, పుతిన్ ఇద్దరూ 45 నిమిషాల పాటు కారులో దేని గురించి చర్చించారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించాలనే దానిపై.. మోడీ ఏమైనా పుతిన్‌తో మాట్లాడి ఉంటారా? అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయ్. ఎందుకంటే.. ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. తమ దేశంలో ఉన్న తాజా పరిణామాలపై.. ప్రధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. శాంతియుత మార్గాల్లోనే.. సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని.. మరోసారి భారత్ వైఖరిని స్పష్టం చేశారు మోడీ. శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు.  అందువల్ల.. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించే అంశంపై.. మోడీ ఏమైనా మాట్లాడారా? ఆ 45 నిమిషాల భేటీలో.. ఈ అంశం కూడా చర్చకు వచ్చి ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే గనక జరిగితే.. యుద్ధం ముగించడంలో మోడీది కీలకపాత్రే కాబోతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. ఇక.. మోడీ, పుతిన్ ఒకే కారులో ప్రయాణించడం.. వాళ్లిద్దరి మధ్య ఉన్న స్నేహానికి, రాజకీయపరమైన సాన్నిహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఓ ప్రయాణం కాదు. భారత్-రష్యా మధ్య నెలకొన్న సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో చాటిచెప్పే.. బలమైన రాజకీయ ప్రకటనగా చెబుతున్నారు.  కారులో ప్రయాణించిన సమయంలోనే కాదు.. తర్వాత జరిగిన ద్వైపాక్షిక సమావేశంలోనూ.. ఇద్దరు నేతలు కీలక అంశాలపై చర్చించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు, ఇంధన రంగంలో సహకారం, వాణిజ్య సంబంధాల బలోపేతం లాంటి.. ఆర్థిక అంశాలపై చర్చించారు. అమెరికా విధించిన అదనపు సుంకాలు, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం గురించి కూడా వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం, సాంస్కృతిక సంబంధాలపైనా చర్చలు జరిగాయి. తమ మధ్య ఎప్పుడు ద్వైపాక్షిక చర్చలు జరిగినా.. లోతుగా, ఫలవంతంగా ఉంటాయని.. ప్రధాని మోడీ కూడా ట్వీట్ చేశారు.

సిద్దం సిద్దం అన్నారు... అసెంబ్లీకి వచ్చేందుకు సిద్దమా!

  సిద్ధం సిద్ధం అని నినాదాలు చేసిన వారికి ఓ సవాల్ విసురుతున్నాను. వైసీపీని సూటిగా అడుగుతున్నాను. అసెంబ్లీకి వచ్చేందుకు వైసీపీ సిద్ధమా ?అసెంబ్లీకి రండి  ఎవరిది అభివృద్ధో.. సంక్షేమం ఎవరు అందించగలరో చర్చకు నేను సిద్ధం. వైసిపి వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు నేను సిద్ధం. చర్చించడానికి వైసిపి సిద్ధమా అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీపై ఫైర్ అవుతూ సవాలు విసిరారు . అంతేకాదు పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికైపైనా చర్చకు సిద్ధం, బాబాయి హత్య పైనా చర్చకు సిద్ధం, దళిత డ్రైవర్ ను  డోర్ డెలివరీ చేసిన ఘటన  పైనా చర్చకు సిద్ధం ,కోడి కత్తి డ్రామా.. గులకరాయి డ్రామాల పైనా సిద్ధిమంటూ సవాల్ విసిరారు. ప్రజల సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్లు పంపిణీ ,బంగారు కుటుంబాలు ,తదితర కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా రాజంపేటకు వచ్చారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టిన  అనంతరం ఆయన ప్రజా వేదికపై నుంచి మాట్లాడుతూ వైసిపి పలు అంశాలపై చర్చించేందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.ఇందుకోసం వైసీపి వారు అసెంబ్లీ కి వచ్చి చర్చించాలన్నారు. ఏనాడు విశ్రాంతి తీసుకోలేదు     రాజకీయ జీవితంలో నేను ఏనాడూ విశ్రాంతి తీసుకోలేదు. పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలనేదే నా ఆశయంమని, ఎవరైనా పింఛను తీసుకోకున్నా వచ్చే నెల అందిస్తున్నామని పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపాలనేదే మా లక్ష్యంమని అన్నారు .అభివృద్ధి జరగాలి.. ఆదాయం పెరగాలి - ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తేనే మార్పులు వస్తాయిని పేర్కొన్నారు .రాయలసీమ ఇకనుంచి రాళ్ల సీమ కాదు, రతనాల సీమను చేస్తామన్నారు. 2014-19 మధ్య దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధిని చేసి చూపించామని,కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మళ్లీ స్వేచ్ఛ వచ్చిందన్నారు.మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కూడా ఎంతో విజ్ఞత  చూపించాన్నారు. *గత పాలకు రక్తం పాలించారు. గత పాలకులు రాయలసీమలో రక్తం పారించారని,మేం వచ్చాక రాయలసీమలో సాగునీరు పారిస్తున్నామని అన్నారు.కష్టాల్లో ఉన్న మామిడి రైతులను మేం ఆదుకున్నామని మామిడికాయలు రోడ్డుపై పోసి వైసీపీ నేతలు డ్రామాలు ఆడారని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేముందు పదిసార్లు ఆలోచించాలని,మహిళల ఆత్మగౌరవం దెబ్బతిస్తే కఠిన చర్యలు తప్పవని ఆడవాళ్ళు పై అఘాయిత్యాలకు పాల్పడితే అదే మీకు చివరి రోజని హెచ్చరించారు. *రాజంపేట మీదుగా కోడూరు కు నీళ్ళు కడప, రాజంపేట మీదుగా కోడూరుకు నీళ్లు తీసుకెళ్తామని, రాజంపేటలో వ్యవసాయం తగ్గి ఉద్యానపంటలు పెరిగాయని అన్నారు .రాజంపేటలో డెయిరీ, పశుసంపద బాగా పెరిగిందని అన్నారు. ఒంటిమిట్టను టిడిపి దత్తత తీసుకుందని, అనే కార్యక్రమాలు చేపడతామని, మా దృష్టిలో అభివృద్ధి వేరు రాజకీయాలు వేరని అన్నారు. *నదులు అను సంధానం  గంగానది నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వంశధార నుంచి గోదావరి, కృష్ణా, పెన్నా నదులు అనుసంధానం చేస్తామని తెలిపారు. మీరు ఆశీర్వదిస్తే చాలు కొండలనైనా పిండి చేస్తామని అన్నారు. *ప్రజల ఆరోగ్యం కోసం సంజీవిని సంజీవని పేరుతో ప్రాజెక్టు తెస్తున్నామని,ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టు తీసి కొలుస్తున్నారు. *అనర్హులకు పించన్లు సరైనదేనా! అవయవాలన్నీ సక్రమంగా ఉన్న వారికి కూడా గత ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ ఇచ్చిందని,అలాంటి వారికి వారికి పెన్షన్లు ఇవ్వడం సరైందేనా...? ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు కోరారు. అనర్హులకు పెన్షన్ తీసేయండని చెప్పే ధైర్యం ప్రజలకు రావాలని అన్నారు. వైసీపీ వాళ్ళు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుపడతారు, పోలవరం, అమరావతిని ఆపేస్తున్నారు. రోడ్లకు గుంతలు పెట్టారని అన్నారు. వాళ్ల కారుతోనే సింగయ్యను తొక్కించి చంపేశారని,తిరిగి మనపైనే నెపాన్ని నెడుతున్నారని,మామిడి రైతుల విషయంలోనూ డ్రామాలు ఆడారని అన్నారు. *సీమకు నీళ్ళిచ్చే దారి చూపిన ఎన్టీ ఆర్  రాయలసీమకు నీళ్లిచ్చే దారి చూపిన నాయకుడు ఎన్టీఆర్ అని,రాయలసీమకు నీళ్లు తెస్తామని,నిన్ననే కుప్పానికి నీళ్లు తీసుకెళ్లానని  భవిష్యత్తులో రాజంపేట, కోడూరుకు నీళ్లు తెస్తామని,రాయలసీమకు కరవు లేకుండా చేస్తామని బరోసా ఇచ్చారు. కరవు జిల్లా అనంతపురానికి కియా తెచ్చాని,ఇవాళ ఆ జిల్లా రూపు రేఖలు మారిపోయాయని అన్నారు. రాయలసీమకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తున్నాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందన్నారు. సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదని అన్నారు.నా బలం బలగం ప్రజలే అన్నారు. స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి చూపుతాం లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేస్తామని అన్నారు. *ఎన్నో వడిదుడుకులు ఎదుర్కొన్నా ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు సమైఖ్య రాష్ట్రంలో నేనే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పారు. 30 ఏళ్ల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని,అయినా పేదల సంక్షేమం కోసం పని చేస్తున్నాని,పేదల అభ్యున్నతి కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటానని అన్నారు. ఈ 30 ఏళ్ల కాలంలో సంపద సృష్టించి,సంక్షేమం చేయడమే నాకు తృప్తి కలిగిందన్నారు. అప్పులు చేసి బాగుపడ్డ వారు లేరని,అప్పు చేసి పప్పు కూడు తింటే... చిప్పే మిగులుతుందని అన్నారు.ఆదాయాన్ని పెంచిపేదలకు సంక్షేమం అందించాలి.. అదే నేను చేస్తున్నానన్నారు. ఐటీ, హైటెక్ సిటీ అంటే ఎగతాళి చేశారని,కానీ చాలా కుటుంబాలను ఆర్థికంగా ఎదిగేలా చేసింది ఐటీనే అని, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్లు విస్తరించడానికి కారణం ఐటీనే కారణమన్నారు.హైదరాబాద్ విశ్వనగరంగా మారిందని,బాగా అభివృద్ధి జరిగిందని అన్నారు. టీడీపీ ప్రభుత్వాలు చేసినవి గుర్తు పెట్టుకోండి.. అభివృద్ధి వైంకుఠపాళి కాకూడదని అన్నారు.  2019-24లో ప్రభుత్వం మారిందిని, రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కలిసి పోటీ చేశామని అన్నారు. ఎమ్మెల్యేలు తప్పు చేస్తే నిలదీయగలుగుతున్నారని ఇదీ మేం ఇచ్చిన స్వేచ్ఛ అని అన్నారు . రాజంపేట చంద్రబాబు పర్యటనలో అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి బిసి జనార్ధన్ ,రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి  జగన్మోహన్ రాజులతో పాటు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఇతర అధికారులు, అనధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

అమరావతిలో క్వాంటం కంప్యూటర్‌ ఏర్పాటుకు ఉత్తర్వులు

  అమరావతిలో క్వాంటం కంప్యూటర్ సెంటర్ (ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటింగ్‌ సెంటర్‌ ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే సీఆర్డీఏ 50 ఎకరాలు కేటయించింది. ప్రభుత్వ సంస్ధగా ఏక్యూసీసీ ఏర్పాటు కానుంది. వివిధ రంగాల్లో పరిశోధనలు, యూనివర్సిటీలు, స్టార్టప్‌లు, పరిశ్రమలు వినియోగించుకునేందుకు వీలుగా క్వాంటం వ్యాలీ సేవలందిస్తుంది. రెండు వేల చదరపు అడుగుల్లో 133 క్యూబిట్‌, 5కే గేట్స్‌ క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఐబీఎం సంస్థ ముందుకొచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది.  చదరపు అడుగుకు రూ.30 అద్దె చెల్లించే ప్రాతిపదికన రాయితీపై ఐబీఎం సంస్థకు కేటాయించింది. దీనికి బదులుగా నాలుగేళ్ల పాటు ఏడాదికి 365 గంటల ఉచిత కంప్యూటింగ్‌ టైమ్‌ను ఐబీఎం సంస్థ ప్రభుత్వానికి కేటాయించనుంది. ప్రభుత్వ సంస్థలు, విద్యపరమైన అంశాలకు గానూ ఈ కంప్యూటింగ్‌ టైమ్‌ను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విట్‌ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రూ.6కోట్ల వ్యయంతో బెంగళూరుకు చెందిన క్యూపై ఏఐ అనే స్టార్టప్‌ కంపెనీ మరో చిన్న క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటుచేయనుంది.అధునాతన కూలింగ్ వ్యవస్థ, నిరంతర విద్యుత్‌ సరఫరాను ప్రభుత్వం క్వాంటం వ్యాలీకి అందించనుంది. ఈ మేరకు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

కవితపై చర్యలకు సిద్ధమవుతున్న గులాబీ పార్టీ

  బీఆర్‌ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవితపై గులాబీ పార్టీ చర్యలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె పీఆర్వో నవీన్ కుమార్‌ను బీఆర్ఎస్ పార్టీ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలిగించినట్లు సమాచారం. అటు బీఆర్‌ఎస్ ఫాలోవర్ల కవిత ట్వీట్టర్, ఇన్‌స్టా అకౌంట్లను అన్‌ఫాలో కొడుతున్నారు. మరోవైపు  కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై చేసిన షాకింగ్ కామెంట్స్‌పై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది.  కవితకు కౌంటర్ ఇస్తూ.. బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హరీష్‌రావును ఆరడుగుల బుల్లెట్ అంటూ ట్వీట్ చేసింది. కవిత కామెంట్స్ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌‌కు బీఆర్ఎస్ నేతలు క్యూ కట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసీఆర్‌తో‌ కేటీఆర్, మధుసూదనాచారీ, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వరరరెడ్డి సమావేశమైనట్లు సమాచారం.    

కారుని ముంచుతున్న కాళేశ్వరం.. ఆంధ్రా రాగం అందుకున్న గులాబి దళం

లైఫ్ జాకెట్ గా పనికొస్తుందనేనా?  కాళేశ్వరం ప్రాజెక్టుపై పిసి ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ అసెంబ్లీ  సుదీర్ఘంగా చర్చించి ఆ ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాలు, అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ నిర్ణయం బీఆర్ఎస్ శిబిరంలో ఆందోళనకు కారణమైంది.  దీనిని బీజేపీ అవకాశంగా తీసుకుని తమ పుట్టి ముంచుతుందన్న ఆందోళన బీఆర్ఎస్ లో కనిపిస్తోంది.  ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాళేశ్వరంపై సీబీఐ విచారణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టా ల్సిందిగా పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మరీ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా  ధర్నాలు, రాస్తారోకోలు,  ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు.  కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి నదీ జలాలను ఆంధ్రప్రదేశ్‌కు మళ్లించడానికి కాంగ్రెస్, బిజెపి కుట్రగా ఆ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై రేవంత్ సర్కార్ సీబీఐ విచారణ నిర్ణయాన్ని అభివర్ణించారు. ఈ  కుట్ర ను తీవ్రంగా ప్రతిఘటించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికీ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధం ఏముంది?  కేటీఆర్ మాటలు, వ్యాఖ్యలు, ఆందోళనలకు పిలుపునివ్వడం ఇవన్నీ ఆయనలో, బీఆర్ఎస్ లో ఆందోళనకు, నిరాశకు తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   బీఆర్ఎస్ ఇబ్బందుల్లో పడిన ప్రతి సారీ ఆ పార్టీకి తెలంగాణ వాదం గుర్తుకువస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ పై విద్వేషం తన్నుకొస్తుంటుంది. మరీ ముఖ్యంగా గత ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత అయిన దానికీ కాని దానికీ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ నాయకత్వానికి ఒక అలవాటుగా మారిపోయింది. ఆంధ్ర సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడం ద్వారా తెలంగాణ ప్రజలకు చేరువ కావచ్చునన్నది వారి యోచనగా కనిపిస్తోంది.  

రాజకీయ జీవితంలో ఏనాడూ రెస్ట్ తీసుకోలేదు: సీఎం చంద్రబాబు

  రాజకీయ జీవితంలో తాను ఏనాడు రెస్ట్ తీసుకోలేదని సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మునక్కాయలవారిపల్లెలో దివ్యాంగురాలు యడవల్లి సుమిత్రమ్మ అనే మహిళకు పింఛను అందించారు.  అక్కడ విధుల్లో ఉన్న రజకులతో కాసేపు ముచ్చటించారు. పనిలో కష్టాలు, సౌకర్యాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎవరైనా పింఛను తీసుకోకున్నా తర్వాతి నెల అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి.. ఆదాయం పెరగాలని చెప్పారు. ప్రజలు ఆశీర్వదీస్తే తాను కొండలనైనా పిండి చేస్తానని ముఖ్యమంత్రి అన్నారు. నదుల అనుసంధానంతోనే రైతుల అభివృద్ధి సాధ్యం. గంగా నది నుంచి కావేరి నది వరకు అనుసంధానం జరగాలి అని ఆయన అన్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేందుకు సంజీవని ప్రాజెక్టు తీసకొస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆదాయం పెంచుకున్నప్పుడే జీవితాల్లో మార్పు సాధ్యమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మనకు అనేక కష్టాలు వచ్చాయి. 2014-19 మధ్య దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధిని చేసి చూపించాం. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మళ్లీ స్వేచ్ఛ వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కూడా ఎంతో విజ్ఞత చూపించారు. దేశాభివృద్ధికి ప్రధాని మోదీ అనేక సంస్కరణలు తెస్తున్నారు. దేశాభివృద్ధిలో మన రాష్ట్రం కీలక పాత్ర పోషించాలని సీఎం తెలిపారు

ఇంతదాకా వచ్చాకా బీఆర్ఎస్ ఉంటే ఏంత? పోతే ఎంత

అవినీతి అనకొండలు హరీష్ రావు, సంతోష్ కుమార్ కాళేశ్వరం అవినీతిలో హరీష్ పాత్ర కవిత సంచలనం తెలంగాణ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనీ, అందులో మాజీ మంత్రి హరీష్ రావు పాత్ర ఉందనీ కుంబడద్దలు కొట్టారు. వాళ్ల స్వార్థం కోసం అవినీతికి పాల్పడ్డారని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారు కనుకే రెండో టర్మ్ లో ఆయనను ఇరిగేషన్ మంత్రిగా తప్పించారని చెప్పిన కల్వకుంట్ల కవిత... హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్ వల్లనే  కేసీఆర్ కు అవినీతి మరకలు అంటాయని చెప్పారు.  తనపై కుట్రలు చేసినా సహించానన్న ఆమె.. ఇప్పుడు తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు వస్తుంటే తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.  అవినీతి అనకొండలైన హరీష్, సంతోష్ లపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న కవిత.. వారి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నారని ఆరోపించారు.  తాను ఎవరో ఆడిస్తే ఆడే బొమ్మను కాదన్న ఆమె.. సామాజిక మాధ్యమంలో తనపై హరీష్, సంతోష్ కు ఇష్టమొచ్చినట్లుగా రాతలు రాయిస్తున్నారని ఆరోపించిన ఆమె  కేసీఆర్ పైనే సీబీఐ కేసులుపెట్టే స్థాయికి వచ్చిన తరువాత ఇక బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ భావోద్వాగానికి లోనయ్యారు.  

ఆడుదాం ఆంధ్రా స్కాం.. మాజీ మంత్రి రోజా అరెస్టుకు ముహూర్తం ఖరారైందా?

వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆధారాలు లేని ఆరోపణలతో, అనుచిత వ్యాఖ్యలతో  రెచ్చిపోయిన మాజీ మంత్రి రోజ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. అధికారంలో ఉండగా చేసిన అక్రమాలకు, మరీ ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర కుంభకోణంలో ఆమె ప్రమేయం ఉందంటూ విజిలెన్స్ దర్యాప్తు తేల్చడంతో ఇప్పుడు ఇహనో అరెస్టు అన్న పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికారం అండతో మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రత్యర్థులపై  నిరాధార ఆరోపణలు చేసి నోరు పారేసుకున్న రోజాపై ఇప్పుడు ఆధారాలతో సహా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఆడుదాం ఆంధ్రా స్కాంపై దర్యాప్తు పూర్తయ్యింది. విజిలెన్స్ తన దర్యాప్తు నివేదికను డీజీపీకి అందజేయడం కూడా జరిగింది. దీనిపై సాప్ చైర్మన్ రవినాయుడు ఈ నెల 5వ తేదీ లోగా ఆడుదాం ఆంధ్ర కుంభకోణంలో ప్రమేయం ఉన్న వారందరిపై చర్య తీసుకుంటామని చెప్పారు.  ప్రభుత్వానికి ఇప్పటికే ఈ స్కాంకు సంబంధించి విజిలెన్స్ నివేదిక అందింది ఈ స్కాంలో ప్రమేయం ఉన్న వారందరిపై లింగ వివక్షకు   తావులేకుండా చర్యలు తీసుకుంటామని, ఈ నెల 5 లోగా అరెస్టులు ఉంటాయనీ  సాప్ చైర్మన్  రవినాయుడు చేసిన వ్యాఖ్యలతో రోజా అరెస్టునకు రంగం సిద్ధమైందా అన్న చర్చ జోరందుకుంది.   జగన్ హయాంలో ప్రభుత్వం రూ. 119 కోట్ల బడ్జెట్‌తో అమలు చేసిన ఆడుదాం ఆంధ్ర  కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉణ్న సంగతి తెలిసిందే.   బహుమతి డబ్బు పంపిణీలో దుర్వినియోగం,  నాసిరకం  స్పోర్ట్స్ కిట్‌ల పంపిణీపై పలువురు క్రీడాకారులు, క్రీడా సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి.  జాతీయ కబడ్డీ మాజీ ప్లేయర్ ఆర్డీ ప్రసాద్  ఆడుదాం ఆంధ్ర అక్రమాలు, కుంభకోణంపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.   ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మొత్తం అప్పటి మంత్రి రోజా, అప్పటి సాప్ చైర్మన్  పెత్తనం కిందే జరిగింది.   ఈ నేపథ్యంలోనేఆడుదాం ఆంధ్ర కుంభకోణంలో ప్రమేయం ఉన్న వారిని వారెంతటి వారైనా సెప్టెంబర్ 5 లోగా అరెస్టు చేస్తామంటూ శాప్ చైర్మన్ రవినాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా రోజా అరెస్టు తధ్యమన్న చర్చకూ తెరలేపాయి.  

ఎవరైతే మోసం చేస్తారో వారే గొప్ప నాయకులు : గడ్కరీ

  నేటి తరం రాజకీయలపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మోసం చేసే వారినే గొప్ప నాయకులుగా పరిణిస్తారని తెలిపారు. మహారాష్ట్ర  నాగ్‌పుర్‌లో అఖిల భారత మహానుభావ పరిషత్తు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ పలు అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడారు. అయితే ఏదైనా సాధించడానికి ఒక షార్ట్ కట్ ఉంటుందని, కానీ షార్ట్ కట్ వాడితే  అది మనల్ని షార్ట్‌గా కట్ చేస్తుందన్నారు. అందుకే నిజాయతీ, విశ్వసనీయత వంటి విలువలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.  దీర్ఘకాలిక విజయం ఎప్పుడూ నిజంపై ఆధారపడి ఉంటుంది. అంతిమంగా ధర్మమే  గెలుస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు’ అని గడ్కరీ పేర్కొన్నారు. తన దైనందిన జీవితంలో(రాజకీయాల్లో) నిజం మాట్లాడటం నిషేధమని వ్యాఖ్యానించారు. ‘నేను పనిచేసే రంగంలో మనస్ఫూర్తిగా మాట్లాడటం నిషధమని తెలిపారు. ఇటీవల గడ్కరీ మాట్లాడుతూ కోర్టు కేసుల వల్ల ప్రభుత్వం క్రమశిక్షణతో పనిచేస్తుందని, పరిపాలన అద్భుతంగా జరుగుతుందని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించే వారి కారణంగా రాజకీయ నాయకుల్లో క్రమశిక్షణ పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రులు చేయలేని పనులను న్యాయస్థానాలు చేయిస్తాయని గడ్కరీ తెలిపారు

రేవంత్ వ్యూహంతో మారిన జూబ్లీ సీన్!

సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో అనివార్యం అయిన జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నిక ముహూర్తం ఇంచుమించుగా ఖారారైంది. అందరూ అనుకుంటున్నట్లుగానే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, జూబ్లీ ఉప ఎన్నిక జరగ వచ్చని అన్నారు. అంటే అక్టోబర్ లేదా  నవంబర్ లో జూబ్లీ ఉపఎన్నిక జరగడం ఖాయంగా కనిపిస్తోంది.  ఉప ఎన్నిక ముహూర్తం విషయం పక్కన పెడితే..  జూబ్లీ ఉపఎన్నిక రోజు రోజుకు రంజుగా మారుతోంది. ఆసక్తిని పెంచుతోంది. కొత్త కోణాలు వచ్చి చేరుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ  జూబ్లీహిల్స్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ క్రికెటర్ ,మాజీ ఎంపీ అజారుద్దీన్  బరిలో దిగుతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది.అంతే కాదు..  ఆయన రాష్ట్ర నాయకుల ప్రమేయం లేకుండా  నేరుగా ఢిల్లీ నుంచే  టికెట్’ కన్ఫర్మ్  చేసుకున్నారనే  ప్రచారం కూడా జరిగింది.  అయితే.. కాంగ్రెస్ పార్టీ హటాత్తుగా అజారుద్దిన్ ను గవర్నర్ కోటాలో పెద్దల సభ (శాసనమండలి) కి పంపాలని నిర్ణయించింది.  ప్రొఫెసర్ కోదండ రామ్ తో పాటుగా అజారుద్దీన్ ను శాసన మండలికి సిఫార్సు చేస్తూ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. నిజానికి.. మాగంటి మరణ వార్త చెవిన పడిన క్షణం నుంచే, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అజారుద్దీన్  జూబ్లీ టికెట్ తనదే అని ప్రచారం చేసుకున్నారు. అయితే.. ఇప్పడు అజారుద్దీన్  టికెట్ రేసు నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. అదలా ఉంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పక్కా లెక్కలతోనే..  అజారుద్దీన్ ను రేసు నుంచి తప్పించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా అజారుద్దీన్  అభ్యర్ధిత్వం పట్ల అంత సుముఖంగా లేరనీ,  అందుకే  అజారుద్దీన్  తనకు తానుగా  జూబ్లీ అభ్యర్ధిగా ప్రకటించుకున్న సమయంలో  పీసీసీ చీఫ్  మహేష్ కుమార్ గౌడ్  గట్టి వార్నింగ్’ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తపరిచిన నేపధ్యంలోనే పీసీసీ చీఫ్ అజారుద్దీన్ ను గాంధీభవన్  కు  పిలిపించి మరీ క్లాసు తీసుకున్నారని అప్పట్లో పార్టీ వర్గాల్లో వినిపించింది.       అలాగే..  కాంగ్రెస్ పార్టీ అనధికార మిత్ర పక్షం ఎంఐఎం కూడా అజారుద్దీన్  అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. మరోవంక లక్షకు పైగా ముస్లిం ఓటర్లున్న జూబ్లీ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి గెలవాలంటే  ఎంఐఎం మద్దతు అనివార్యం.  అందులో అనుమానం లేదు. ఈ కారణంగానూ  అజరుద్దీన్  ను తప్పించి  గతంలో ఎంఐఎం టికెట్ పై పోటీ చేసిన బీసీ నాయకుడు నవీన్ యాదవ్  ను ముఖ్యమంత్రి రెంత్ రెడ్డి తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు. నిజానికి..  మొదటి నుంచి కూడా నవీన్ పేరు వినిపిస్తూనే వుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా నవీన్ వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరిగింది.  అలాగే  నవీన్ యాదవ్ ను బరిలో దించితే ఎంఐఎం మద్దతు పొందడమే కాకుండా, బీసీ ఛాంపియన్ గా ప్రొజెక్ట్ చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి మరో ప్లస్ పాయింట్ అవుతుందని, బీసీ నినాదానికి మరింత బలం చేకూరుతుందని  విశ్లేషకులు అంటున్నారు. అంతే కాకుండా.. బీజేపీ, హిందుత్వ రాజకీయాలను, హిందూ ఓటు బ్యాంక్  పోలరైజేషన్  ప్రయత్నాలను సమర్ధవంతంగా తిప్పికొట్ట వచ్చని రేవంత్ రెడ్డి  భిన్న కోణాల్లో లెక్కలు కట్టి, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు.  అయితే..  ఇప్పటికి కూడా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ మేయర్ బి.రామ్మోహన్, మైనారిటీ వర్గం నుంచి ఫహీం ఖురేషి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు  తెలుస్తోంది. అయితే..  చివరకు ఏమి జరుగుతుంది? హస్తం టికెట్ ఎవరి చేతికి చిక్కుతుంది?  అన్నది స్టిల్ ఏ పజిల్ .. ఇప్పటికీ ఎటూ తేలని ప్రశ్నేై!

రాజ్యాంగాన్ని కాపాడేందుకే పోటీ చేస్తున్న : జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి

  ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి  ఆయన ప్రచారంలో పాల్గోన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు తనకు ఏపార్టీలో సభ్యత్వం లేదని తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకే తాను ఉపరాష్ట్రపతిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. పౌరహక్కులు, సామాజిక న్యాయం కోసం పోరాడుతానని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతు కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రకటించామని తెలిపారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు అంత్యంత ప్రాధాన్యత ఉంది. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ల్లు రద్దు చేయాలనే ఎజెండాతో ఎన్డీయే అభ్యర్థిని పెట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. రాజ్యాంగాన్ని పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని బరిలోకి దింపింది. ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలపై ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. కానీ.. తెలుగువాడికి ఇప్పుడొక అవకాశం వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మాజీ సీఎంలు కేసీఆర్‌, జగన్‌, ఎంఐఎం అధ్యక్షుడు అక్బరుద్దీన్‌ ఒవైసీలకు విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయంగా ఉన్న భిన్నాభిప్రాయాలను పక్కనపెట్టి సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలి’’అని రేవంత్‌రెడ్డి తెలిపారు  

బీజేపీయే రైట్ అని తేలింది.. కేంద్ర మంత్రి బండి

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలపై తాము చేస్తున్న పోరాటం నేటికి ఫలించిందనీ, కాళేశ్వరంపై బీజేపీ వైఖరే సరైనదని రుజువైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాల్సిందే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించడాన్ని స్వాగతించిన బండి సంజయ్.. సోమవారం మీడియాతో మాట్లాడారు.  కాళేశ్వరం అవినీతిపై బీజేపీ తొలి నుంచీ సీబీఐ విచారణ కోరుతున్న సంగతిని గుర్తు చేశారు.  ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సీబీఐకి లేఖ పంపాలని ఆయన రేవంత్ ను కోరారు.  

కాళేశ్వరంపై రేవంత్ సేఫ్ గేమ్

  కాళేశ్వరంపై విచారణ సీబీఐకి అప్పగించిన రేవంత్ రెడ్డి సేఫ్ గేమ్ ఆడుతున్నారా అంటే… అవును అనే అంటున్నారు పరిశీలకులు…. ఎన్నికల సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికి అనుగుణంగానే అధికారంలోకి రాగానే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసి విచారణకు ఆదేశించారు.  కమిషన్ నివేదిక రాగానే ఆలస్యం చేయకుండా క్యాబినెట్ లో పెట్టి అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఆదివారం సెలవు దినం అయినా ఆఘమేఘాలపై అసెంబ్లీని సమావేశపరిచి కాళేశ్వరం ఘోష్ కమిషన్ నివేదికపై చర్చకు ఉపక్రమించారు. చర్చలో మంత్రులంతా మూకుమ్మడిగా విడివిడిగా బీఆర్ఎస్ పై దాడిచేసి ఉక్కిరి బిక్కిరి చేశారు.  అర్ధరాత్రి వరకు చర్చను నడిపి చివర్లో సీబీఐ విచారణకు ఆదేశించారు. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి ఆయన బాస్ రాహుల్ గాంధీ లు సీబీఐ అనేది కేంద్రం చేతిలో కీలుబొమ్మ అంటూ విమర్శలు చేశారు. అదే కీలుబొమ్మ అని విమర్శలు గుప్పించిన సంస్థకే కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ బాధ్యత అప్పగించిన రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారని పరిశీలకులు అంటున్నారు.   కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగిస్తే అంతుతేలుస్తామని బీజేపీ నేతలు ప్రకటనలు చేశారు.. బీజేపీ నేతల ప్రకటనలను అవకాశంగా తీసుకొని తను సేఫ్ గేమ్ ప్లాన్ అమల్లోకి తెచ్చారు. సీబీఐ విచారణలో అవకతవకలు గుర్తించి కేసీఆర్, హరీష్ లపై కేసులు నమోదు చేసి అరెస్టులకు దారితీస్తే తాను ఎవరినీ వేధించడం లేదని చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్పవచ్చు… అదే సమయంలో తాను అనుకున్నది సాఫీగా తన చేతులకు మట్టి అంటకుండా జరిగిపోతుందని రేవంత్ భావిస్తున్నారు.  ఒకవేళ విచారణ సమయంలో జాప్యం జరిగినా తాను ఆశించినది  జరగకపోయినా బీజేపీ- టీఆర్ఎస్ లు ఒకటేననే ఆయుధాన్ని బయటకు తీసి రెండు పార్టీలను ఎండగట్టే అవకాశం తనకు ఎలాగూ ఉంటుంది. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు రేవంత్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించారు. రాష్ట్రంలో తనపైన కాంగ్రెస్ పార్టీపైన బీఆర్ఎస్- బీజేపీ చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు కూడా ఈ విచారణ అంశం పనకివచ్చే  అవకాశముంది. ఎటుచూసినా బీజేపీ- బీఆర్ఎస్ లను ఇరుకున పెట్టే దిశగా రేవంత్ పావులు కదిపారు..

సీబీఐ విచారణట.. వింటున్నారా రాహుల్?.. కేటీఆర్

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు రాజకీయ వేడిని రగిలించింది. కాళేశ్వరం ప్రాజెక్టు లో అక్రమాలు, అవకతవకలు అవినీతి జరిగిందని తొలి నుంచీ ఆరోపిస్తున్న కాంగ్రెస్, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం (ఆగస్టు 31) అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కాగా ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రాణాలను ఫణంగా పెట్టి 14 ఏళ్ల నిర్విరామ పోరాటంతో తెలంగాణను సాధించిన కేసీఆర్ ను శిక్షిస్తారా? అంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడుతుంటే... కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు  కేటీఆర్ రాహుల్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. గతంలో రాహుల్ గాంధీ సీబీఐపై చేసిన విమర్శలను గుర్తు చేస్తూ.. ఏపీలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు అంటోంది.. దీనిపై మీ స్పందనేంటి అంటూ ప్రశ్నించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ వేదికగా..  మిస్టర్ రాహుల్ గాంధీ, తెలంగాణలో మీ  సీఎం కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించాలని నిర్ణయించారు.  ఆ విషయం మీకు తెలుసా? అంటూ ప్రశ్నించారు.  తంలో సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందనీ,  అవి ప్రతిపక్షాలను నాశనం చేసే సెల్స్ గా మారిపోయాయని రాహుల్ విమర్శించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. ఆప్పట్లో రాహుల్ ఈ మేరకు చేసిన ట్వీట్ ల స్క్రీన్ షాట్లను కూడా తన పోస్టుకు జోడించారు.  ఒకప్పుడు బీజేపీ చేతిలో కీలుబొమ్మలని విమర్శించిన దర్యాప్తు సంస్థలకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విచారణను ఎలా అప్పగిస్తుందని కేటీఆర్ నిలదీశారు. తమపై ఎన్ని కుట్రలు పన్నినా   తగ్గేదే లేదని పేర్కొన్నా ఆయన రాజకీయంగా, న్యాయపరంగా పోరాడతామన్నారు.   న్యాయవ్యవస్థపైనా, ప్రజలపైనా తమకు పూర్తి విశ్వాసముందన్న కేటీఆర్  స కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. 

కేసీఆర్, హరీష్ కు హైకోర్టులో చుక్కెదురు

కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ నిలిపివే యాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ అత్యవసర విచారణకు గానీ, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కానీ హైకోర్టు నిరాకరించింది.  జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న వారి విజ్ణప్తిని కూడా తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను సాధారణ కేసుల మాదిరిగానే విచారిస్తామని స్పష్టం చేసిన హైకోర్టు... మంగళవారం ఉదయం ఈ పిటిషన్ విచారణ చేపడతామని పేర్కొంది. అయితే  అప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మాత్రమే తదుపరి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది.  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపిస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం (ఆగస్టు 31) ప్రకటించిన సంగతి తెలిసిందే. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై సుదీర్ఘ చర్చ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర రాష్ట్రాల ప్రమేయం ఉన్నందున, సీబీఐ విచారణే సరైనదని ప్రభుత్వం అభిప్రాయపడింది. అసెంబ్లీ తీర్మానం చేసిన మరుసటి రోజే  అంటే సోమవారం (సెప్టెంబర్ 1)  కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

హైటెక్ నుంచి క్వాంటమ్ వ్యాలీ వరకూ చంద్రబాబు అద్భుత ప్రయాణం.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సెప్టెంబర్ 1 ఒక ప్రత్యేక మైన రోజు. ఆయన ఒక్కరికే కాదు.. ఆయనను అభిమానించే కోట్లాది మందికి కూడా ఇది చిరస్మరణీయమైన రోజు. ఎందుకంటే ఇది 30 ఏళ్ల కిందట ఆయన తొలి సారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఔను 1995 సెప్టెంబర్ 1న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు తొలి సారి ప్రమాణ స్వీకారం చేశారు.  ఆ తరువాత ఆయన మరో మూడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఆయన మొట్టమదటి సారి ముఖ్యమంత్రి అయిన రోజు మాత్రం ఎవరూ ఎప్పటికీ మరచిపోరు. ఇక ఆయన కుటుంబీకులకు అయితే ఈ రోజు మరింత ప్రత్యేకం. ఈ నేపథ్యంలోనే నారా చంద్రబాబునాయుడికి ఆయన కుమారుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఎమోషన్ అయ్యారు.  తన తండ్రి తొలి సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు అయిన సందర్భంగా ఆయనకు విషెస్ తెలుపుతూ.. తన మెంటార్, బాస్ అన్నీ నాన్నే అంటూ ఆయనకు విషెస్ తెలిపారు.  హైటెక్ నుంచి క్వాంటమ్ వాలీ వరకూ, బయోటెక్ ఆస్పిరేషన్ నుంచి డేటా ఆధారిత వ్యవస్థల వరకూ చంద్రబాబు అద్భుత ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.  తనకు రాజకీయాలలో ఓనమాలు దిద్దించి, వేలుపట్టుకుని నడిపించిన తండ్రి సాధించిన ఈ ఘనత మైలు రాయికంటే గొప్పదని లోకేష్ పేర్కొన్నారు. ఇంట్లో నాన్నా అని పిలుచుకునే చంద్రబాబును పని ప్రదేశంలో బాస్ అని పిలిచే అద్భుత అవకాశం, అదృష్టం తన సొంతమని తండ్రికి విషెస్ చెబుతూ సామాజిక మాధ్యవ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు.  

స్మిత సభర్వాల్ పై చట్టపరమైన చర్యలకు కాళేశ్వరం కమిషన్ సిఫారసు!

ఇటీవలే లాంగ్ లీవ్ లో వెళ్లిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ కు కాళేశ్వరం ఉచ్చు గట్టిగానే బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు కీలక బ్యారేజీల నిర్మాణ వ్యవహారంలో స్మితా సభర్వాల్ పాత్ర ఉందని కాళేశ్వరం అవకతవకలు, అక్రమాలు, అవినీతిపై విచారించిన పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. బ్యారేజీల వ్యవహారంలో స్మితా సభర్వాల్ తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది.   ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి  సిఫార్సు చేసింది. పీసీ ఘోష్ కమిషన్  నివేదికలో స్మితా సభర్వాల్ విచారణకు సంబంధించిన కీలక అంశాలను పొందుపరిచింది. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలను క్యాబినెట్ ముందు ఉంచారా? అన్న కమిషన్ ప్రశ్నించగా తొలుత  అవును అని బదులిచ్చిన ఆమె తరువాత కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ లో మాత్రం  తనకేమీ తెలియదని బుకాయించినట్లు నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇటీవల ఆరోగ్యకారణాలు చూపుతూ లాంగ్ లీవ్ పై వెళ్లడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  గత ప్రభుత్వంలో సీఎంవో లో అడిషనల్ కార్యదర్శిగా పని చేసిన స్మితా సభర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్టు సహా పలు కీలక ప్రాజెక్టులలో కీలకంగా వ్యవహరించారు.  ఇప్పుడు కమిషన్ నివేదికలో ఆమె తీరును తప్పుపడుతూ పీసీ కమిషన్ నివేదిక వెలుగులోకి వచ్చింది. దీంతో కాళేశ్వరం కమిషన్ నివేదిక అసెంబ్లీ ముందుకు రావడానికి ముందే ఆమె ఆరోగ్య కారణాలు చెబుతూ లాంగ్ లీవ్ లో వెళ్లారన్న చర్చ నడుస్తోంది. 

తెలంగాణలో వైద్య విద్య అభ్యసించాలంటే స్థానికత తప్పనిసరి.. సుప్రీం

వైద్య విద్యార్థుల స్థానికత అంశంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పని సరి అని పేర్కొంది. ఈ మేరకు గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పును పక్కన పెట్టేసింది.   సీజేఐ జస్టిస్ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణలో  వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థుల  స్థానికతపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.33 ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేసింది. తెలంగాణలో స్థానిక రిజర్వేషన్లు పొందాలంటే,  కనీసం 9వ తరగతి నుంచి 12 వరకు రాష్ట్రంలో చదవాల్సిందేనని సర్కార్ పెట్టిన నిబంధనను సమర్ధిస్తూనే..  గతేడాది ఇచ్చిన మినహా యింపుతో ప్రయోజనం పొందిన విద్యార్థులను మాత్రం అలాగే కొనసాగించాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.    

కాళేశ్వరంపై దర్యాప్తు సీబీఐకి.. అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలు, అవకతవకలపై  రాష్ట్ర కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం (ఆగస్టు 31) ప్రకటించారు. కాళేశ్వరంపై రాష్టర ప్రభుత్వం నియమించిన కమిషన్ నివేదికపై అసెంబ్లీలో ఆదివారం (ఆగస్టు 31) సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం సీఎం రేవంత్ కాళేశ్వరం అక్రమాలు, అవినీతి, అవకతవకల కేసు దర్యాప్తు బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్టు  ప్రకటించారు.   కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, డిజైన్, నిర్మాణంలో భారీ లోపాలు ఉన్నాయని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) గుర్తించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. దీనికి తోడు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సమర్పించిన నివేదికలు కూడా గత ప్రభుత్వ తప్పిదాలను,  అవకతవకలను ఎత్తిచూపాయన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సైతం తన నివేదికలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని ఏజెన్సీలను బాధ్యుల్ని చేసిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని కమిషన్ స్పష్టం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ తన నివేదికను జులై 31న ప్రభుత్వానికి సమర్పించగా, ఆగస్టు 4న రాష్ట్ర కేబినెట్ దానిని ఆమోదించింది. ఇక ఆదివారం (ఆగస్టు 31) సభలో ఈ నివేదికను ప్రవేశపెట్టిన తర్వాత, అన్ని పార్టీల అభిప్రాయాలను స్వీకరించి, చివరకు ఈ కేసును సీబీఐకి అప్పగించడమే సరైన మార్గమని ప్రభుత్వం భావించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్, ఎన్‌డీఎస్‌ఏ, ఇతర నివేదికల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక‌పై ఆదివారం అర్ధ‌రాత్రి వ‌ర‌కు సుమారు 9 గంట‌ల పాటు సుదీర్ఘంగా చ‌ర్చ సాగింది. ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తొలుత కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను  నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.   అనంతరం స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు స్థలాన్ని మార్చడం నుంచి మేడిగడ్డ స్పీయర్స్ కుంగిపోయిన పరిణామాల వరకూ,  జస్టిస్ ఘోష్ గారి నేతృత్వంలో విచారణ కమిషన్ నియామకం వరకు సమగ్రంగా సభకు తెలిపారు.